Cards
-
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో యజమానిగా మహిళే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో మహిళలనే ఇంటి యజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలను కార్డుల వెనుకభాగంలో ముద్రించాలని సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు (ఎఫ్డీసీ)లపై శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశంపై ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్తాన్, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించిన అధికారుల బృందం... తమ అధ్యయనానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచి్చంది.కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను సీఎంకు వివరించింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై అధికారులకు సీఎం పలు ఆదేశాలు, సూచనలు చేశారు. ప్రస్తుతమున్న రేషన్, ఆరోగ్యశ్రీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని సమాచారం ఆధారంగా కుటుంబాలను నిర్ధారించాలన్నారు. ఇతర రాష్ట్రాల కార్డు ల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలని, లోపాలను పరిష్కరించాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి సమాచారం సేకరించాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గం పరిధిలోని రెండు ప్రాంతాల్లో... ఎఫ్డీసీ కోసం సమాచార సేకరణ, వాటిల్లో ఏయే అంశాలు పొందుపరచడంతోపాటు మార్పుచేర్పుల వివరాలను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదరతో కూడిన మంత్రివర్గ ఉప సంఘానికి అందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. మంత్రివర్గ ఉప సంఘం సూచనల మేరకు అందు లో జత చేయాల్సిన లేదా తొలగించాల్సిన అంశాల సమగ్ర జాబితా రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రెండేసి ప్రాంతాలను (ఒక గ్రామీణ, ఒక పట్టణ) పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని వచ్చే నెల 3 నుంచి కుటుంబాల నిర్ధారణ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదర్, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి పాల్గొన్నారు. -
బాల.. భళా..! వరల్డ్ రికార్డు సాధించిన హన్విద్..
కరీంనగర్: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు భాస్కరరాజు మనవడు (నాలుగు నెలల బాలుడు) హన్విద్కృష్ణ వరల్డ్ రికార్డు సాధించాడు. 347 ఫ్లాష్ కార్డ్స్‌ను గుర్తించడంలో నోబుల్ వరల్డ్ రికార్డు సాధించినట్టు భాస్కరరాజు సోమవారం తెలిపాడు. బాలుడు ఫ్లాష్ కార్డ్స్ గుర్తించిన వీడియోను ఆన్లైన్లో నోబుల్ సంస్థకు పంపించగా, అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.ఇవి చదవండి: కూతురు ఎంపీ.. తండ్రి పెత్తనం -
త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు కొత్తగా కార్డులివ్వాలని నిర్ణయించింది. ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని యూనిక్ నంబర్‌తో కార్డులు ఇవ్వనుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఒక్కో సబ్ నంబర్ ఇస్తారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్‌కు లింక్ చేసి, స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేస్తారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు కసరత్తు చేస్తోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు కొందరు పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అంతేకాకుండా అనేకమంది తెల్ల రేషన్‌కార్డును ఆధారం చేసుకొనే ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీ అంశంపై ఆరోగ్యశ్రీ ట్రస్టు దృష్టిసారించింది. ఈ మేరకు లబ్దిదారుల గుర్తింపుపై మార్గదర్శకాలు రూపొందిస్తోంది. అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందరికీ వర్తింప చేయడం వల్ల అదనంగా రూ.400 కోట్ల భారం పడే అవకాశం ఉందని, ఇది పెద్ద భారం కాదన్న భావనలో సర్కారు ఉంది. మధ్యతరగతి ప్రజల్లో చాలామందికి, ఉద్యోగులకు, ఇతరులకు పలు పథకాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఆరోగ్య బీమాతో ఆరోగ్య సేవలు పొందుతున్న వారూ చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కార్డులతో అందరికీ సార్వజనీన ఆరోగ్య సేవలు అందించవచ్చని సర్కారు యోచిస్తోంది. వంద శస్త్రచికిత్సలు చేర్చే అవకాశం రాష్ట్రంలో 293 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, 198 ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే గత ఏడాది 809 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా రాష్ట్రంలో 1,310 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి అర్హులుగా 77.19 లక్షల మంది పేదలు ఉన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందకు వస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1,376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద 1,949 వ్యాధులకు వైద్యం అందుతోంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌లో ఈ రెండింటిలో ఉన్న వ్యాధులను కలిపి అమలు చేస్తున్నారు. వీటికి సుమారు మరో వంద శస్త్రచికిత్సలను చేర్చే అవకాశం ఉంది. ఒక్కో కుటుంబానికి 10 లక్షల కవరేజీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రం 2022లో ప్యాకేజీలను సవరించింది. గతంలో ఆరోగ్యశ్రీ కింద కవరేజీ రూ. 2 లక్షలు ఉండగా, ఆయుష్మాన్ భారత్ పథకం రావడంతో దాన్ని రూ. 5 లక్షలు చేశారు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రూ.10 లక్షలు చేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి ఈ పథకాల కింద ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది. దీనికి ప్యాకేజీ సొమ్ము కూడా పెంచితే ఏటా రూ.1,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈహెచ్ఎస్ పథకంపై తేలని నిర్ణయం ఈహెచ్ఎస్ పథకంపై ఉద్యోగులు కంట్రిబ్యూషన్ ఇస్తామని పేర్కొన్న సంగతి విదితమే. గత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) ఏర్పాటు చేసి అమలు చేయాలని నిర్ణయించింది. పథకం అమలుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా జమ చేయాలని పేర్కొన్నది. ఈ మేరకు తమ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశాయి. ఆసుపత్రుల్లో తమకు వైద్యం అందనందున ఈ ప్రక్రియకు ఉద్యోగులు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల బకాయిల చెల్లింపునకు ఏర్పాట్లు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయడంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. బ కాయిలు పేరుకుపోవడంతో పాటు ఆరో గ్యశ్రీ కింద ఆసుపత్రులకు ఇచ్చే ప్యాకేజీ సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నా యి. దీంతో ఆరోగ్యశ్రీ లబ్దిదారులు, ఈ హెచ్ఎస్ బాధితులు డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా తర్వాత అనారోగ్య సమస్యలు పెరగడంతో చాలామంది ప్రైవేట్ ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. ఉద్యోగులైతే రీయింబర్స్మెంట్ పద్ధతిలో ముందుగా డబ్బులు చెల్లించి వైద్యం పొందుతున్నా రు. అయితే బిల్లుల సొమ్ము మాత్రం పూ ర్తి స్థాయిలో రావడంలేదని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. పెద్దఎత్తున బిల్లులు పే రుకుపోవడం వల్లే తాము వైద్యం అందించలేకపోతున్నామని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు నెట్వర్క్ ఆసుపత్రుల లెక్క ప్రకా రం దాదాపు రూ.500 కోట్లు ఆరోగ్యశ్రీ నుంచి తమకు రావాల్సిన బిల్లుల బకా యిలు పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నాయి. మరోవైపు వివిధ వ్యాధులకు 2013లో నిర్ధారించిన ప్యాకేజీ ప్రకారమే ఆసుపత్రులకు సొమ్ము అందుతోంది. అంటే తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటివరకు ఒక్కసారి కూడా వ్యాధులు, చికిత్సలకు ప్యాకేజీ సవరణ జరగలేదు. ఈ రెండు కారణాల వల్ల తాము ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పథకాల కింద వైద్యం చేయలేకపోతున్నామని ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
ఎస్బీఐ కార్డ్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డుల దిగ్గజం ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సరీ్వసెస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 8 శాతం వృద్ధితో రూ. 549 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 509 కోట్లు ఆర్జించింది. పీఎస్‌యూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ప్రమోట్ చేసిన కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 3,656 కోట్ల నుంచి రూ. 4,742 కోట్లకు ఎగసింది. అయితే నిర్వహణ వ్యయాలు 23 శాతం పెరిగి రూ. 2,426 కోట్లకు చేరాయి. గత క్యూ3లో ఇవి రూ. 1,974 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 2.22% నుంచి 2.64 శాతానికి, నికర ఎన్పీఏలు 0.8% నుంచి 0.96 శాతానికి పెరిగాయి. దీంతో అనుకోని నష్టాలు, మొండి రుణాల వ్యయాలు రూ. 533 కోట్ల నుంచి రూ. 883 కోట్లకు పెరిగాయి. కాగా.. డిసెంబర్‌కల్లా కనీస మూలధన నిష్పత్తి 23.1 శాతంగా నమోదైంది. 2023 మార్చిలో 18.4 శాతం సీఏఆర్ సాధించింది. -
కేసీఆర్ అంటేనే గ్యారంటీ
సాక్షి, సిద్దిపేట: ‘మీ గ్యారంటీ కార్డులు తెలంగాణలో పనిచేయవు..కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష.. కేసీఆర్ అంటేనే గ్యారంటీ, వారంటీ’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నా రు. మంగళవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ, కుమ్మర మోడ్రన్ యాంత్రిక పరిశ్రమకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ 50 ఏళ్ల నుంచి చేయని అభివృద్ధి, ఇప్పుడు చేస్తామని గ్యారంటీ కార్డులు, బాండ్‌పేపర్లు రాసిస్తున్నార న్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాటలు చెప్పేవారయితే, చేతల్లో చూపేది, మాటతప్పని, మడమతిప్పని నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. సీఎం కేసీఆర్ బీసీలకు చేసే ఆర్థికసాయం పథకాన్ని కాపీ కొట్టారని, అది అప్పు రూపంలో మోదీ అందిస్తున్నారని విమర్శించారు. ఉద్యమస్ఫూర్తి, పోరా టస్ఫూర్తిని చాకలి ఐలమ్మ అందించిందన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన రూ.లక్ష కోట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు 71% ఫిట్మెంట్ ఇస్తోందన్నారు. త్వరలో సీఎం కొత్త పీఆర్సీ వేసి తీపికబురు చెబుతారన్నారు. అతి తక్కువ వేతనాలు ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్లో ఉన్నాయని, చూసేందుకు వెజ్ గవర్న మెంట్, కానీ చేసేందుకు నాన్‌వెజ్ గవర్నమెంట్ అంటూ బీజేపీ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్బీఐ కార్డ్స్ లాభం క్షీణత
ముంబై: క్రెడిట్ కార్డుల దిగ్గజం ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సరీ్వసెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 5 శాతం నీరసించి రూ. 593 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 627 కోట్లు ఆర్జించింది. ఇందుకు ప్రధానంగా వసూళ్లు తగ్గడం లాభాలను దెబ్బతీసింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,263 కోట్ల నుంచి రూ. 4,046 కోట్లకు జంప్‌చేసింది. వడ్డీ ఆదాయం రూ. 1,387 కోట్ల నుంచి రూ. 1,804 కోట్లకు బలపడింది. ఫీజు ఆదాయం సైతం రూ. 1,538 కోట్ల నుంచి రూ. 1,898 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.24 శాతం నుంచి 2.41 శాతానికి, నికర ఎన్పీఏలు 0.78 శాతం నుంచి 0.89 శాతానికి పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 22.9 శాతానికి చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ కార్డ్స్ షేరు బీఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 859 వద్ద ముగిసింది. -
కార్డు నెట్‌వర్క్‌ను ఎంచుకునేందుకు కస్టమర్‌కు ఆప్షన్
న్యూఢిల్లీ: బ్యాంకులు, బ్యాంక్‌యేతర సంస్థలు జారీ చేసే కార్డులకు సంబంధించి అదీకృత నెట్‌వర్క్‌లను ఎంచుకునే వెసులుబాటును కస్టమర్‌కు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించింది. ప్రస్తుతం కార్డ్ నెట్‌వర్క్‌లు, కార్డ్‌లు జారీ చేసే సంస్థల (బ్యాంకులు, నాన్–బ్యాంకులు) మధ్య ఉన్న ఒప్పందాలు.. కస్టమర్లకు తగినన్ని ఆప్షన్లను అందుబాటులో ఉంచేలా లేవని సర్క్యులర్ ముసాయిదాలో అభిప్రాయపడింది. కార్డును జారీ చేసేటప్పుడు గానీ లేదా ఆ తర్వాత గానీ అర్హత కలిగిన కస్టమర్లు.. బహుళ కార్డు నెట్‌వర్క్‌ల నుంచి ఏదో ఒకదాన్ని ఎంచుకునేందుకు అవకాశం కలి్పంచాలని పేర్కొంది. కార్డు ఇష్యూయర్లు ఒకటికి మించి నెట్‌వర్క్‌లతో కార్డులను జారీ చేయాలని తెలిపింది. సంబంధిత వర్గాలు ఆగస్టు 4 వరకు ఈ ముసాయిదా సర్క్యులర్‌పై ఆర్బీఐకి తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీసా, రూపే, మాస్టర్‌కార్డ్ మొదలైన కార్డ్ నెట్‌వర్క్‌లు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటితో భాగస్వామ్యం ద్వారా బ్యాంకులు, నాన్–బ్యాంకులు తమ డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులు మొదలైన వాటిని జారీ చేస్తున్నాయి. -
పత్తాలు ఆడి రోడ్డున పడుతున్నారు.. అయినా మానట్లేదు
జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. పోలీసులు కఠినచర్యలు చేపడుతున్నా జూదరుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. గతంలో జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యా పారి సుమారు రూ.3 కోట్ల ఆస్తులను అమ్మి, పేకాటకు పెట్టి నష్టాల ఊబిలో కూరుకుపోయా డు. మరో మద్యం వ్యాపారి సుమారు రూ.కోటి మేరకు ఆన్లైన్లో పేకాట ఆడి, అప్పులపాలయ్యాడు. కుటుంబసభ్యులు లబోదిబోమంటూ తమ ఆస్తులమ్మి తీర్చారు. జూదంతో జిల్లాలో ఎందరివో కాపురాలు కూలిపోయాయి. మూడేళ్లలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 2021లో పోలీసులు 207 కేసులు నమోదు చేసి, 295 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.32.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 2022లో 109 కేసులు నమోదు చేసి, 536 మందిని అరెస్టు చేశారు. రూ.16.91 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 20 కేసుల్లో 133 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3.16 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయినా పోలీసుల కళ్లుగప్పి నిత్యం జూదం కొనసాగుతుండటంతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. కొంతమంది పేకాట కోసం ఆస్తులు, బంగారం తాకట్టు పెడుతుండటంతో వారి బతుకులు తారుమారు అవుతున్నాయి. ఇళ్లు, మామిడితోటలే అడ్డాలు.. చాలా మంది పేకాటరాయుళ్లు ఇళ్లు, మామిడితోటలు, ఫామ్‌హౌస్‌లు, అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సీసీ కెమెరాలు, రోడ్ల వెంట ఇన్ఫార్మర్లను పెట్టుకొని, జూదం ఆడుతున్నారు. నెలకు సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల మేర సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో రెండంతస్తుల భవనాలను అద్దెకు తీసుకొని, కింది అంతస్తులో కుటుంబాలను అద్దెకు ఉంచుతూ రెండో అంతస్తులో జూదం నిర్వహిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వస్తున్న జూదరులు జగిత్యాల జిల్లాలోని పేకాట స్థావరాలకు ఇతర జి ల్లాల నుంచి కూడా జూదరులు పెద్ద ఎత్తున వస్తున్నారు. పోలీసులు కఠినచర్యలు తీసుకుంటున్నా వారు వెనుకడుగు వేయడం లేదు. పేకాడుతున్న సమయంలో పోలీసులు దాడులు చేస్తే చాలామంది జూదరులు వారి కళ్లుగప్పి, పారిపోతున్నారు. అడ్డుకట్ట పడేదెలా? జిల్లా వ్యాప్తంగా పేకాటను అడ్డుకునేందుకు పో లీసులు చర్యలు తీసుకుంటున్నా ఆగడం లేదు. జూదం ఆడేవారికి కోర్టులో కఠిన శిక్షలు లేకపోవడంతో చాలా మంది పట్టుబడినా తమ ప్రవర్తన మార్చుకోవడం లేదు. బయటకు వచ్చి, మళ్లీ పే కాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తెస్తే తప్ప జూదానికి అడ్డుకట్ట పడేలా లేదు. పేకాటపై ప్రత్యేక నిఘా జగిత్యాల జిల్లాలో పేకాటను అరికట్టేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. చాలా మందిపై కేసులు నమోదు చేస్తూ అరెస్టు చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో కఠినచర్యలు తీసుకుంటున్నాం. – ఎగ్గడి భాస్కర్, ఎస్పీ -
యూట్యూబర్ అదితి అగర్వాల్ సక్సెస్ జర్నీ..మీరు ఫిదా!
సాక్షి, ముంబై: ఇటీవలి కాలంలో దాదాపు ప్రతీ ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందిఅనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఔత్సాహిక టీనేజర్లు,యువభారతం తమ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు యూట్యూబ్‌ను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు వంటలు, చిట్కాలు, యోగాలు, కిచెన్ గార్డెనింగ్ దగ్గర్నించి, బిజినెస్, రాజకీయాలు ఇలా పలు కేటగిరీల్లో సక్సెస్ఫుల్ యూటూబర్లుగా లక్షలు, కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఢిల్లీకి చెందిన భువన్ బామ్ నుండి ముంబైకి చెందిన ప్రజక్తా కోలి వరకు అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. అలాంటి వారిలో ఒకరు యూట్యూబర్ అదితి అగర్వాల్. అద్దె ఇంట్లో మొదలు పెట్టిన ప్రయాణంలో ఇపుడు సొంత ఫ్లాట్‌తో పాటు దాదాపు 70 లక్షల మంది మద్దతుతో ఈ స్థాయికి చేరడం వెనుక ఏళ్ల కష్టం ఉంది. యూట్యూబ్‌లో క్రాఫ్టర్ అదితిగా దూసుకుపోతోందిఅదితి అగర్వాల్. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అదితి ప్రయాగ్‌రాజ్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో తన విద్యను పూర్తి చేశాక అలహాబాద్ యూనివర్శిటీ నుండి డిగ్రీని చేసింది. (చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్‌లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!) అదితి ప్రయాణం ఎలా మొదలైంది? ఒక విధంగా చెప్పాలంటే అదితి ప్రయాణం ఎనిమిదో తరగతిలో మొదలైంది. ఊహాత్మకంగా, ఆకర్షణీయంగా కార్డులు తయారు చేయడం అదితికి చాలా ఇష్టం. అలా ఎనిమిదో తరగతిలో ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఆమె ఓ కార్డును రూపొందించింది. అది చూసిన టీచర్లంతా ఫిదా అయిపోయారు. అక్కడనుంచి ప్రేరణకు తోడు 11వ తరగతిలో, అదితికి కార్డ్ ఆర్డర్ వచ్చింది. దానికి ప్రతిఫలంగా తొలి సంపాదనగా 300 రూపా యలుఆర్జించింది. ఇది ఇలా ఉండగా, అదితి తన 12వ తరగతిలో NIFT పరీక్షకు హాజరై 205 మార్కులు సాధించింది, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కళాశాలలో చేరలేదు. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) దీంతో తన స్పెషల్ ఇంట్రస్ట్ గిప్ట్స్, కార్డుల మేకింగ్‌లో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో సోషల్ మీడియాను ఉపయోగించుకుంది. 2015లో ఫేస్బుక్లో అదితి కార్డ్ జోన్ పేజీని ప్రారంభించింది. ఆ మరుసటి రోజే ఆమెకు 800 రూపాయల ఆర్డర్ వచ్చింది. తానే స్వయంగా కార్డులను డెలివరీ చేసింది. ఈ ప్రయాణం అంతఈజీగా ఏమీ సాగలేదు. కానీ పట్టువదలకుండా తన వంతు ప్రయత్నం చేస్తూ పోయింది అదితి. 2017లో తన యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. గ్రాడ్యుయేషన్ చేస్తూనే ప్రతిరోజూ ఆమె ఒక వీడియోను అప్లోడ్ చేసేది. సోదరి సాయంతో వీడియోలను రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. మదర్స్ డే , ఫాదర్స్ డే ఇలా ఏ అకేషన్‌ను వదులుకోలేదు. రకారకాల గిఫ్ట్స్, కార్డ్‌లను ఆన్లైన్లో విక్రయించడంతో అదితి వీడియోలను అప్లోడ్ చేసేది. అలా కార్డ్ మేకింగ్ వీడియోను వైరల్ అయింది. దాదాపు 2 లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. దీంతో మరింత పాపులారీటి పెరిగింది. ఫలితంగా 2018లో లక్షమార్క్‌ను దాటిన అదితి ఛానెల్ సబ్స్క్రైబర్లు 2020 నాటికి 2.60 లక్షలకు చేరుకుంది. ఈ సక్సెస్‌తో 30 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉన్న తన ఫ్యామిలీకి అదితి 2020లో లక్నోలో రెండు పడకగదుల ఫ్లాట్‌ని కొనుగోలు చేసింది. ఆమె తండ్రి ఒక ప్రైవేట్ ఉద్యోగి. ఈలోపు కరోనా రావడంతో 2021లో లక్నోకి మకాం మార్చింది. అదితి ఛానెల్‌పై కోవిడ్-19 ప్రభావం కరోనా సమయంలో, అదితి ఛానెల్ కంటెంట్‌కు ఆదరణ కాస్త తగ్గింది. దీంతో 2.60 లక్షల మంది సభ్యులు 2.54 లక్షలకు పడిపోయారు. ఈ సమయంలో కాస్త నిరాశ పడినా, ఆ తర్వాత అదితి తన తల్లి సపోర్ట్‌తో ప్రతిరోజూ వీడియోలు అప్లోడ్ చేయాలని నిర్ణయించుకుంది. చివరికి వీడియో ఒకటి వైరల్ కావడంతో కేవలం 15 రోజుల్లో సబ్స్క్రైబర్లు 10 లక్షల మంది చేరారు. ప్రస్తుతం అదితి యూట్యూబ్ ఛానెల్లో దాదాపు 7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లుండటం విశేషం. ఈ రోజు సంపాదన 6 అంకెలలో. అదితికి ఇన్‌స్టాగ్రామ్‌లో 5.9 లక్షల మంది, ఫేస్బుక్లో 2.90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. రేసు గుర్రంలా పరిగెట్టాల్సిందే యూట్యూబర్ కావాలనుకునే వారికి టిప్స్ ఇస్తూ..సక్సెస్ రావాలంటే లాంగ్ రేసు తప్పదని, చాలామందికి సడెన్‌గా సక్సెస్ వచ్చినా మాయమైపోతుందని, దాన్ని నిలుపు కోవడం ముఖ్యమని సూచిస్తుంది. అందుకే రేసు గుర్రంలా మారితే గొప్ప విజయాన్ని అందుకోలేమని చెబుతుంది అదితి. తనకు కూడా సక్సెస్ రావడానికి ఆరేళ్లు పట్టిందంటూ తన జర్నీని గుర్తు చేసుకుంది. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) YouTube ప్రశంసలు అనేక ఈవెంట్లకు ఆహ్వానం అదితి విజయాన్ని యూట్యూబ్ కూడా ప్రశంసించింది. DIY ఈవెంట్‌కి ఆహ్వానాన్ని అందుకుంది. ఇంకా మెటా అనేక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం వచ్చింది. -
డిజీలాకర్ అంటే? డైనమిక్ కేవైసీతో లాభాలేంటి?
భారత ఫిన్‌టెక్‌ను ఐదు విభాగాలుగా వేరు చూసి చూడొచ్చు. క్యూఆర్ కోడ్ తదితర చెల్లింపులు, బిల్లుల చెల్లింపులు, ఇతర అగ్రిగేటర్ సేవలు, బై నౌ, పే లేటర్ సహా రుణ సదుపాయం, రుణాలిచ్చే ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్‌లు, వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలు. ఈ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి సేవలు పొందాలంటే ప్రజలు గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి (కేవైసీ) ఉంటుంది. గత కొన్నేళ్ల కాలంలో కేవైసీ ప్రక్రియను ఫిన్‌టెక్ సంస్థలు ఎంతో సులభతరం చేశాయి. ఫిన్‌టెక్ సంస్థలు డిజీలాకర్‌లో ఉన్న డాక్యుమెంట్లను పొందే అవకాశం కల్పిస్తామని 2023-24 బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం నిజంగా ఒక పెద్ద మార్పు వంటిదే. డిజిటల్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా భారత ప్రభుత్వం దేశంలో ఫిన్‌టెక్ పరిశ్రమ వృద్ధికి ఎన్నో సదుపాయాలు కల్పించింది. ఆధార్, పీఎం జన్ ధన్ యోజన, వీడియో కేవైసీ, యూపీఐ వంటివి ఎన్నో చేపట్టింది. ఫలితంగా భారత ఫిన్‌టెక్ పరిశ్రమ 2025 నాటికి 1.3 ట్రిలియ్ డాలర్ల స్థాయికి చేరుకోనుంది. డిజీలాకర్ ప్రస్తుతం డిజీలాకర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన డాక్యుమెంట్ల డిజిటల్ కాపీలు స్టోర్ చేసుకునేందుకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయం ఇతర డాక్యుమెంట్లను సైతం డిజీలాకర్‌లో స్టోర్ చేసుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. వెబ్‌బ్రౌజర్, మొబైల్ యాప్ రూపంలో అందుబాటులో ఉన్న డిజీలాకర్‌ను డిజీయాత్ర యాప్‌పై ఐడెండిటీ వెరిఫికేషన్‌కు అనుమతిస్తున్నారు. దీంతో దేశీ విమానాశ్రయాల్లో కాంటాక్ట్‌లెస్ చెకిన్‌కు వీలు లభిస్తోంది. డైనమిక్ కేవైసీ డిజీలాకర్ సాయంతో కేవేసీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంతో కేవైసీ ప్రక్రియ క్రియాశీలంగా మారుతుంది. ఆధార్, పాన్ డేటా ఆధారంగా రిస్క్ సమీక్ష సాధ్యపడుతుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశంలో మరింత విస్తరిస్తుంది. రుణాల లభ్యతను పెంచుతుంది. భారత ఫిన్‌టెక్ పరిశ్రమ దీర్ఘకాల వృద్ధికి బడ్జెట్ ఎంతో ముందడుగు వేసింది సాంకేతిక, విజ్ఞాన ఆధారిత వృద్ధి ప్రాధాన్యతను బడ్జెట్ గుర్తించింది. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, నియంత్రణసంస్థలు కలిగి ఉండే పౌరుల డేటా విషయంలో ఏకీకృత పరిష్కారంపై దృష్టి సారించింది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ సహా ఇతర చర్యలు ఫిన్‌టెక్ పరిశ్రమ వృద్ధికి ఎంతో లబ్ధి కలిగిస్తాయి. క్రెడిట్ కార్డులు యూపీఐతో లింక్ చేయడానికి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కూడా ఆహ్వానించతగినది. -
Aasara Pension: అందని ఆసరా గుర్తింపు కార్డులు..!
ముషీరాబాద్ భోలక్‌పుర్‌కు చెందిన మహిళకు వితంతు పింఛన్ మంజూరైంది. కొత్తగా పింఛను మంజూరు కావడంతో గుర్తింపు కార్డు కోసం తహాసిల్ ఆఫీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఆశ్రయించింది. ఫించన్ మంజూరైంది కానీ.. కార్డు రాలేదంటూ నాలుగైదు రోజులుగా సమాధానం చెబుతూ వచ్చి... చివరకు కార్డు వచ్చింది... ఒంటరిగా రా ఇస్తానని చెబుతున్నాడని ఆరోపిసూ సదరు మహిళ కుటుంబ సభ్యులు, బస్తీ వాసులతో కలిసి తహసీల్దార్ సమక్షంలోనే సదరు సిబ్బందిని చితకబాదారు. ఈ ఘటనపై గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సాక్షి, హైదరాబాద్: కొత్త ఆసరా ఫించన్‌దారులకు గుర్తింపు కార్డులు అందని ద్రాక్షగా తయారయ్యాయి. ఆసరా పింఛన్లు మంజూరైనా..గుర్తింపు కార్డులు పంపిణీ నత్తలకు నడకనేర్పిస్తోంది. గత నెలలో నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల చేతులు మీదుగా ఫించను గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టినా... కనీసం 30 శాతం పూర్తి కాలేదు. కొందరికి కార్డు దక్కి మిగతా వారికి పంపిణీ కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో లబ్ధిదారులు తహాసిల్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ సంబంధిత సిబ్బందిచే ఛీత్కారాలు, వేధింపులకు గురవుతున్నారు. మహిళలకు వేధింపులే... ఆసరా పించన్ల విషయంలో వితంతు మహిళలు, ఒంటరి మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ఒక వైపు సిబ్బంది, మరోవైపు దళారులు మహిళల పేదరికం, అవసరాన్ని ఆసరా చేసుకొని వివిధ రకాలుగా వేధించడం పరిపాటిగా తయారైంది. గుర్తింపు కార్డులు అందని వారు తమకు ఫించన్ మంజూరు కాలేదన్న భయం... కొందరు సిబ్బంది.. దళారులకు కలిసి వచ్చే అవకాశంగా తయారైంది. తాము సహకరస్తామంటూ తమ నైజాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. కార్డుల పంపిణీ అంతంతే.. సరిగ్గా మూడేళ్ల నిరీక్షణ తర్వాత ఆఫ్‌లైన్ ఆసరా దరఖాస్తులకు, ఏడాది అనంతరం ఆన్లైన్ ఆసరా దరఖాస్తులకు మోక్షం లబించి కొత్త పింఛన్లు మంజూరైనా గుర్తింపు కార్డుల పంపిణీ అంతంత మాత్రంగా తయారైంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం మీద సుమారు 80,824 మంది ఆసరా పింఛన్లు మంజూరైనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 58,066 మంది వద్దులకు, 15,210 మంది వితంతులకు, 3,265 మంది వికలాంగులకు, 2,197 ఒంటరి మహిళలకు, ఇద్దరు బీడీ కార్మికులకు, 1,194 మంది కళాకారులకు, 892 యాలసిస్ బాధితులకు, ఆరుగురు ఫైలేరియా, ఇద్దరు చేనేత కార్మికులను అసరా పింఛన్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం వివిధ కేటగిరీ కింద 1.96 లక్షల మంది సరా పింఛన్లు పొందుతున్నారు. (క్లిక్ చేయండి: అనారోగ్యంతో అపోలోకు.. ఆరోగ్యంగా నిమ్స్‌కు..!) -
ఎస్బీఐ కార్డ్ లాభం 67 శాతం అప్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (ఎస్బీఐ కార్డ్) నికర లాభం 67 శాతం ఎగిసింది. రూ. 345 కోట్లకు పెరిగింది. రిటైల్, కార్పొరేట్ కస్టమర్లు గణనీయంగా వ్యయాలు చేయడం ఇందుకు దోహదపడినట్లు సంస్థ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం రూ. 206 కోట్లు. ఇక తాజా క్యూ2లో ఆదాయం 7 శాతం వృద్ధి చెంది రూ. 2,510 కోట్ల నుంచి రూ. 2,695 కోట్లకు పెరిగింది. ఫీజులు, సర్వీసుల విభాగాల నుంచి మరింత ఆదాయం రావడం ఇందుకు తోడ్పడినట్లు ఎస్బీఐ కార్డ్ తెలిపింది. సమీక్షాకాలంలో నిర్వహణ వ్యయాలు 25 శాతం పెరిగి రూ. 1,383 కోట్లకు చేరినట్లు వివరించింది. వ్యాపార పరిమాణం పెరగడం ఇందుకు కారణమైనట్లు ఎస్బీఐ కార్డ్ తెలిపింది. మొండిబాకీలు తదితర అంశాలకు సంబంధించిన వ్యయాలు రూ. 862 కోట్ల నుంచి రూ. 594 కోట్లకు దిగి వచ్చాయి. కొత్త ఖాతాల సంఖ్య 6,88,000 నుంచి 39 శాతం వృద్ధి చెంది 9,53,000కు చేరింది. సెప్టెంబర్ ఆఖరు నాటికి వినియోగంలో ఉన్న కార్డుల సంఖ్య 14 శాతం పెరిగి 1.26 కోట్లకు చేరినట్లు, ఈ విషయంలో తమ మార్కెట్ వాటా 19.4 శాతంగా ఉన్నట్లు ఎస్బీఐ కార్డ్ పేర్కొంది. బీఎస్ఈలో గురువారం ఎస్బీఐ కార్డ్ షేరు సుమారు 1 శాతం క్షీణించి రూ. 1,124 వద్ద క్లోజయ్యింది. -
క్రిప్టోకరెన్సీ దెబ్బకు వీటి ధరలు భారీగా పెరగనున్నాయా..!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. పలు క్రిప్టోకరెన్సీల విలువ ఆకాశమే హద్దుగా పెరుగుతూనే ఉంది. తాజాగా బిట్‌కాయిన్ 51 వేల డాలర్ల మార్క్‌ను దాటిపోయింది. బిట్‌కాయిన్ తరహాలోనే మరొక క్రిప్టోకరెన్సీ ఈథిరియం కూడా గణనీయంగా వృద్ధి చెందింది. తాజాగా ఈథిరియం విలువ 3907.61 డాలర్లకు చేరుకుంది. చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీలో భారత్ స్థానం ఎంతో తెలుసా...! తాజాగా ఈథిరియం విలువ పెరగడంతో పలు కంప్యూటర్లలో వాడే జీపీయూ(గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్) ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. మై డ్రైవర్స్ నివేదిక ప్రకారం చైనా లో ఎన్విడియా జీపీయూ ధరలు 18 శాతం పెరిగాయని వెల్లడించింది. సెప్టెంబర్‌లో ఎన్వీడియా జీపీయూ గ్రాఫిక్ కార్డుల కొనుగోళ్లు 50 శాతం తగ్గుతాయని పేర్కొంది. గతంలో ఈథిరియం విలువ తగ్గడంతో గ్రాఫిక్స్ కార్డు ధరలు గణనీయంగా తగ్గాయి. గత వారంలో ఈథిరియం విలువ 23 శాతం పైగా పెరిగింది. క్రిప్టోకరెన్సీ పెరుగుదలతో ఎన్విడియా గ్రాఫిక్స్ కార్డులు మాత్రమే కాకుండా ఏఎమ్‌డీ ఎక్స్ 6000 సిరీస్, గిగా బైట్ గ్రాఫిక్స్ కార్డు ధరలు కూడా పెరగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా వీటి ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీ గ్రాఫిక్స్ కార్డు ధరలు ఎలా నియంత్రిస్తుదంటే..! క్రిప్టోకరెన్సీ కంటికి కనిపించని ఒక డిజిటల్ కరెన్సీ. క్రిప్టోకరెన్సీ పూర్తిగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఉపయోగించి లావాదేవీలను జరుపుతుంటారు. క్రిప్టోకరెన్సీ మైనింగ్ చేయడం కోసం కంప్యూటర్లలో శక్తివంతమైన గ్రాఫిక్స్ కార్డులు కావాల్సి ఉంటుంది. గ్రాఫిక్స్ కార్డులనుపయోగించి సంక్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించవచ్చును. క్రిప్టోకరెన్సీ మైనింగ్ జరిపే వారితో ఈ గ్రాఫిక్స్ కార్డుల ధరలు గణనీయంగా పెరుగుతాయని టెక్నాలజీ నిపుణులు వెల్లడించారు. చదవండి: Elon Musk: శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ ఏదో తేల్చిచెప్పిన ఎలన్ మస్క్...! -
ప్రాపర్టీ కార్డుల పంపిణీ ప్రారంభించిన మోదీ
-
‘గ్రామీణ భారతంలో చారిత్రక ఘట్టం’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజలకు ప్రాపర్టీ కార్డులను అందించే స్వమిత్వ పథకం గ్రామీణ భారతాన్ని సమూలంగా మార్చే చారిత్రక ఘట్టం కానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వమిత్ర పథకాన్ని ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి లబ్ధిదారులతో ముచ్చటించారు. ప్రాపర్టీ కార్డుల ద్వారా లబ్ధిదారులకు తమ ఆస్తులపై బ్యాంకు రుణాలు పొందే వెసులుబాటు కలుగుతుంది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. దశాబ్దాలుగా గ్రామాల్లో నిరుపేదలు సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, తమ ప్రభుత్వం రెండు కోట్ల పక్కా ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందచేసిందని చెప్పుకొచ్చారు. కాగా స్వమిత్వ పథకం ద్వారా లక్ష మంది ఆస్తిదారులు తమ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఎస్ఎంఎస్ లింక్ ద్వారా తమ ప్రాపర్టీ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రాపర్టీ కార్డులను లబ్ధిదారులకు అందచేస్తాయని పేర్కొంది. చదవండి : అసెంబ్లీ ఎన్నికలు : మోదీ, షా కీలక భేటీ -
ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ.750–755
ముంబై: ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ కంపెనీ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రైస్‌బాండ్‌ను నిర్ణయించింది. వచ్చే నెల 2 నుంచి మొదలై 5 వ తేదీన ముగిసే ఈ ఐపీఓకు ప్రైస్‌బాండ్‌గా రూ.750–755ను నిర్ణయించామని ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ తెలిపింది. ఐపీఓలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)లో భాగం గా 13 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. మొత్తం మీద ఇష్యూ సైజు రూ.9,000 కోట్ల మేర ఉంటుందని అంచనా. కనీసం 19 షేర్లకు (మార్కెట్ లాట్)దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మార్చి 16న ఈ కంపెనీ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్టవుతుంది. ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రీమియమ్(జీఎమ్‌పీ) రూ.325/330 రేంజ్ లో ఉందని సమాచారం. ఫిబ్రవరి 18 వ తేదీ వరకూ ఎస్బీఐ షేర్లను హోల్డ్ చేసిన ఇన్వెస్టర్లు–రిటైల్ కేటగిరీలోనూ, షేర్ హోల్డర్ల కేటగిరీలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ ఉద్యోగులకు ఇష్యూ ధరలో రూ.75 డిస్కౌంట్ లభిస్తుంది. క్యూ3లో స్థూల మొండి బకాయిలు 2.47%గా ఉన్నాయని ఎస్బీఐ కార్డ్స్ సీఈఓ హర్దయాళ్ ప్రసాద్ తెలిపారు. -
ఏపీలో నేటి నుంచి కొత్త పెన్షన్ కార్డులు
-
వాలెంటైన్స్ డే రోజే ఆగ్నికి ఆహుతి
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరం ఢిల్లీని వరుస అగ్ని ప్రమాదాలు వణికిస్తున్నాయి. కరోల్ బాగ్ ట్రాజెడీని ఇంకా మరువకముందే మరో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. వాలెంటైన్స్ డే కార్డులు, ఇతర గిఫ్ట్ కార్డులను తయారు చేసే ఫ్యాక్టరీలో భారీ ఎత్తున గ్రీటింగ్ కార్డులు అగ్నికి ఆహుతి కావడం విషాదం. అదీ వాలెంటైన్స్ డే రోజు. వెస్ట్ ఢిల్లీలోని నరైనా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫ్యాక్టరీ పైఅంతస్థులో గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న 23 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేస్తున్నాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి వుంది. కాగా ఫిబ్రవరి 12వతేదీన కరోల్ బాగ్‌లోని అర్పిత్ ప్యాలెస్ హోటల్ దుర్ఘటన జరిగి 24 గంటలు గడవకముందే బుధవారం జరిగిన మరో అగ్ని ప్రమాదంలో సుమారు 250కిపైగా నిరుపేదల గుడిసెలు కాలి బూడిద కాగా, గురువారం మరో ప్రమాదంతో ఢిల్లీ నగరం నిద్ర లేచింది. #WATCH A medium category fire broke out at a paper card factory in Naraina Industrial Area, Phase I, early morning today; Total 23 fire tenders engaged in fire fighting operations, no casualties reported pic.twitter.com/l6wiOjfELO — ANI (@ANI) February 14, 2019 -
చెత్త కుప్పలో ‘చంద్రన్న బీమా’
గుంటూరు, తెనాలి రూరల్: ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చంద్రన్న బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టగా, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ‘చంద్రన్న’ పేరు జోడించి, పథకాన్ని తామే ప్రవేశపెట్టినట్టు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ గొప్పలు చెప్పుకున్నారు. అంత హడావిడి చేసిన ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు అందాల్సిన బీమా కార్డులు తెనాలి పట్టణంలో చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. స్థానికులు గుర్తించి 210 కార్డులను అధికారులకు అందించారు. వందల కార్డులు పట్టణ మారీసుపేట మఠం బజారులో మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలు ముందు రోడ్డు వెంబడి గార్బేజ్ కలెక్షన్ పాయింట్ ఉంది. చెత్త కుండీ వద్ద కొందరు కార్డులను ఏరుకుంటుండడాన్ని ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గమనించి, 210 కార్డులను అధికారులకు అందజేశాడు. అప్పటికే కొన్ని వందల కార్డులు గుర్తు తెలియని వారు తీసుకెళ్లారు. చంద్రన్న బీమాకు రూ.15 ప్రీమియం చెల్లించి కార్డు తీసుకోవాలి. 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి సహజ మరణమైతే రూ.2 లక్షలు, 51 నుంచి 60 ఏళ్ల లోపు వారికి రూ. 30 వేలు చెల్లిస్తారు. మరణించిన పాలసీ దారుడి కుటుంబానికి రూ.ఐదు వేలు తక్షణ సాయం కింద ఇస్తారు. ప్రమాదవశాత్తు మరణం, పూర్తి అంగవైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.2.50 లక్షలు చెల్లిస్తారు. కార్మికుల పిల్లలు 9, 10 తరగతులు, ఇంటర్, ఐటీఐ చదివే వారికి(ఇద్దరు పిల్లలకు)రూ. 1200 స్కాలర్షిప్ కింద ఇస్తారు. ఈ పథకానికి సంబంధించి ప్రజల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది. సాధికార సర్వే ఆధారంగా ప్రీమియంను రెండేళ్లు ప్రభుత్వమే చెల్లించింది. లబ్ధిదారుల నుంచి రూ.30 వసూలు చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. అయితే కార్డులు అంద జేసి డబ్బులు వసూలు చేయాలన్నారు. ఈ డబ్బు కట్టేందుకూ ప్రజలు ఆసక్తి కనబర్చకపోవడం, రెండేళ్లు పూర్తవడంతో మూడో ఏడాది ప్రభుత్వం ఉచితంగా అందరికీ ప్రీమియం చెల్లించింది. నిర్లక్ష్యానికి నిదర్శనం చంద్రన్న బీమా తమ పేరిట ఉందీ లేనిదీ ఇప్పటికీ తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. లబ్ధిదారులందరికీ కార్డులు పంపిణీ చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. పురపాలక సంఘంలో మెప్మా విభాగం ఆధ్వర్యంలో చంద్రన్న బీమా ప్రీమియం చెల్లింపులు(ప్రారంభంలో), కార్డుల అందజేత జరుగుతుంది. ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో మొక్కుబడిగా కొందరికి కార్డులను ప్రజాప్రతినిధులు చేత ఇప్పించి, మిగిలిన వాటి పంపిణీ బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. వారు కార్డులను అందజేయడంలో తాత్సారం చేయడం, పర్యవేక్షించుకోవాల్సిన మెప్మా సిబ్బంది పట్టనట్టు వ్యవహరించడంతో లబ్ధిదారులకు కార్డులు చేరలేదు. పట్టణంలో 90 శాతం మందికి కార్డులు అందలేదని తెలుస్తోంది. ఇప్పుడు చెత్త కుప్పలో కార్డులు దర్శనమివ్వడంపై ఆర్భాటంగా ప్రచారం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఏం సమాధానం చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు బీమా కార్డులు లబ్ధిదారులకు తప్పనిసరిగా అందించాలి. చెత్తకుప్పలో పడేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇందుకు సంబంధించిన బాధ్యులెవరో విచారించి కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు వ్యక్తుల వద్దకు ఎందుకు వెళ్లాయో విచారిస్తాం.కె.శకుంతల, మున్సిపల్ కమిషనర్ -
మంత్రి ఇలాకాలో జోరుగా పేకాట
సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు: పేకాట... కోతాట.. ఎక్కడ ఈ ఆటలు ఆడినా క్షణాల్లో పోలీసులు వాలిపోతారు. వీటిని నిర్వహించే వారితో పాటుగా ఈ జూదాలు ఆడే వారిని అరెస్టు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అసలు అరెస్టులే ఉండవు. కొవ్వూరు పట్టణం నడిబొడ్డులో జూదక్రీడ సాగుతున్నా అటువైపు పోలీసులు కన్నెత్తి చూడరు. ఎందుకు అనుకుంటున్నారా. అసలే మంత్రి గారి ఇలాకా... పైగా లక్షల్లో మామూళ్లు అందించి మరీ నిర్వహిస్తున్నారు. అసలే రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి ఈ జూదశాలకు బారులు తీరుతున్నారు. కొవ్వూరు మున్సిపాలిటీ కేంద్రం, డివిజన్ ప్రధాన పట్టణం. కొవ్వూరు పట్టణం నడిమధ్యలో ఈ జూదక్రీడ సాగుతోంది. వాస్తవానికి లిటరరీ క్లబ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ క్లబ్లో మొదట్లో ఉన్నతస్థాయి ఉద్యోగులతో ఎంతో ఆదర్శంగా నడిచేది. జడ్జీలు, ఆర్డీవో స్థాయి అధికారులు సభ్యులుగాఉండేవారు. రానురాను కొంత మంది రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లింది. క్లబ్‌కి వచ్చిన ఆదాయంతో కల్యాణ మండపం, జిమ్ వంటి వసతులు ఏర్పాటు చేశారు. క్లబ్ సభ్యత్వం కలిగిన వారి కుటుంబాలు కూడా ఇక్కడ వివిధ వేడుకలు నిర్వహించుకునేవారు. కళ్యాణ మండపం సభ్యులకు నామమాత్రపు రుసుముతోను ఇతరులకు నిర్దేశిత ధరలకు ఇస్తున్నారు. క్లబ్ జిమ్‌కు పరిమితమైంది. ఇక క్లబ్‌గా మార్పు గత సంవత్సర కాలంగా లిటరరీక్లబ్ పేకాటక్లబ్‌గా మారిపోయింది. నిర్దేశిత సమయంలో క్లబ్ సభ్యులు కొన్నిరకాలైన పేకాట ఆడుకోవచ్చునన్న కోర్టు తీర్పుని సాకుగా చూపిస్తూ క్లబ్ నడుపుతున్నారు. ఇక్కడకు 400 మీటర్ల దూరంలో ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ కార్యాలయం ఉంది. అంతే కాకుండా 500 మీటర్ల పరిధిలో శాంతిభద్రతల డీఎస్పీ కార్యాలయం, డివిజనల్ మేజిస్ట్రేట్ అయిన ఆర్డీవో కార్యాలయం ఉన్నాయి. అర కిలోమీటరు దూరంలో టౌన్ పోలీస్‌స్టేషన్, రూరల్ పోలీస్‌స్టేషన్, సీఐ కార్యాలయం ఉంది. అయినప్పటికీ పేకాట రాయుళ్లు తమ జూదక్రీడను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే పట్టణ ప్రజలు నిరంతరం తిరుగుతూ ఉండే ప్రదేశం.. పైగా రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నప్పటికీ ఈ జూదాన్ని నియంత్రించే నాథుడే లేకుండా పోయాడు. నిబంధనలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి వరకూ పేకాట నడుస్తోంది. కాసులే కీలకం ఈ క్లబ్లో గతంలో రూ.25 వేలు ఉండే సభ్యత్వాన్ని ఇప్పుడు రూ.లక్షకు పెంచారు. పెద్ద మొత్తంలో పోలీసులకు కాసులు ఇస్తూ వీరి పనికానిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి తోడు రాష్ట్ర మంత్రికి కూడా పెద్ద ఎత్తున ముడుపులు ఇస్తున్నట్లు చెబుతున్నారు. డివిజన్‌స్థాయి పోలీసులకు, స్థానిక నేతలకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. క్లబ్ నిర్వాహకులకు రూ.50 లక్షలకు పైగా నెలవారీ ఆదాయం వస్తున్నట్లు అంచనా. మంత్రి ప్రోద్భలంతోనే ఈ జూద ప్రక్రియను ప్రోత్సహిస్తున్నారని బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు సేవా కార్యక్రమాల పేరుతో కొంత సొమ్ము వెచ్చించి, క్లబ్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు బయటికి ప్రచారం చేసుకుంటున్నారు. 1100 అపరిష్కార వేదిక ఎటువంటి అవినీతి జరిగినా పరిష్కరించేందుకు 1100 ఎంతో దోహద పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు బాహాటంగానే ప్రకటించుకుంటున్నా ఈ లిటరరీ క్లబ్ బాగోతంపై ఫిర్యాదులు చేసినా కనీసం స్పందించిన పాపాన పోవడం లేదు. ఇది కేవలం ప్రకటనలకు మాత్రమే అనేది స్పష్టం అవుతోంది. ఇక 100 ఫోన్ చేసినా స్థానికంగా పోలీసులు స్పందించిన పాపాన పోవడం లేదు. పైగా ఈ క్లబ్లో పేకాట నిర్వహించుకునేందుకు అనుమతులు ఉన్నాయంటూ పోలీస్బాసులే సమాధానం చెబుతూ వెనకేసుకురావడం కొసమెరుపు. వాస్తవానికి అనుమతులు ఉంటే క్లబ్ మెంబర్లే ఉండాలి. అంతే కాకుండా కనీస నిబంధనలు అయిన సీసీ కెమేరాల పర్యవేక్షణలో నిర్వహించుకోవాలి. అటువంటి నిబంధనలే లేకుండా ఎక్కడివారైనా ఇక్కడ మాత్రం యథేశ్ఛగా పేకాట, జూదం ఆడుకునేందుకు కొవ్వూరు లిటరసీ క్లబ్ వేదికగా మారుతోంది. మళ్లీ తెరుచుకున్న జంగారెడ్డిగూడెం క్లబ్ జంగారెడ్డిగూడెం క్లబ్ మళ్లీ తెరుచుకుంది. సాక్షి కథనాలతో కొంతకాలం మూతపడిన క్లబ్‌లు మళ్లీ తెరుచుకుం టున్నాయి. ఉంగుటూరు నియోజకవర్గంలోని పేకాట క్లబ్‌లను మళ్లీ తెరిపించేందుకు ప్రజాప్రతినిధులు జిల్లా పోలీసు అధికారులపై వత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. తణుకు వేల్పూరులో ఐదు ప్రాంతాల్లో పేకాట క్లబ్‌లు నడుస్తుండగా, తాడేపల్లిగూడెం బ్రహ్మయ్యతోటలో పేకాట స్థావరం నడుస్తున్నట్లు సమాచారం. జిల్లాలో పేకాట క్లబ్‌లు, స్థావరాలు యథేశ్చగా సాగుతున్నా స్పెషల్ బ్రాంచి అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేకాట క్లబ్‌లను ఉక్కుపాదంతో అణిచివేయాలని భావిస్తున్న జిల్లా ఎస్పీకి సరైన సమాచారం అందడం లేదని తెలుస్తోంది. రమ్మీగేమ్కి అనుమతి ఉంది లిటరరీ క్లబ్ రిజిస్ట్రార్ క్లబ్. రమ్మీ గేమ్ ఆడుకోవడానికి అనుమతి ఉంది. క్లబ్లో 250 మంది వరకు సభ్యులున్నారు. రెగ్యులర్ రమ్మీ ఆడుతున్నారు. రమ్మీ అనేది స్కిల్ గేమ్. దీన్ని అడ్డుకునే అర్హత పోలీసులకు లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పేకాడుతున్నారనేది ఆవాస్తవం. ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు క్లబ్‌ని తనిఖీ చేశారు. నిర్దేశిత సమయాల్లో క్లబ్ సభ్యులు రమ్మీ ఆడుకునే అవకాశం ఉంది. –ఎస్.వెంకటేశ్వరరావు, డీఎస్పీ, కొవ్వూరు లీజుకి ఇచ్చి మరీ పేకాడిస్తున్నారు లిటరరీక్లబ్లో పేకాట సాగుతున్నా పట్టించుకునే నాథుల్లేరు. క్లబ్ కమిటీ పేకాట నిర్వహణకు లీజుకు ఇచ్చారు. ఆ సొమ్ము లీజుదారుడు క్లబ్‌కి చెల్లించే ఓప్పందం చేసుకున్నారు. సభ్యులు మాత్రమే రమ్మీ ఆడుకోవాలి. అయితే తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పేకాట కోసం తరలివస్తున్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. పేకాటకి వచ్చిన కార్లు పార్కింగ్తో జనం సైతం ఇబ్బందులు పడుతున్నారు.– పరిమి రాధాకృష్ణ, క్లబ్ మాజీ కార్యదర్శి, కొవ్వూరు -
కస్టమర్లకు షాక్: సర్వీస్ చార్జ్ బాదుడు?
-
కస్టమర్లకు షాక్: సర్వీస్ చార్జ్ బాదుడు?
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటికే కస్టమర్లను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్న బ్యాంకులు ఇపుడు వారినెత్తిన మరో బాంబు వేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. అతి త్వరలో ఏటీఎం లావాదేవీలు, చెక్కుల జారీ, డెబిట్ కార్డుల లావాదేవీలు తదితర లావాదేవీల పై సర్వీస్ ఛార్జి విధించాలనే సంచలన నిర్ణయం దిశగా కదులుతున్నాయి. ప్రధానంగా ఇకపై ఉచిత సేవలపైన కూడా పన్నులు కట్టాలన్న జీఎస్టీ నోటీసుల నేపథ్యంలో ఇకపై ఉచిత సేవలకు శుభం కార్డు వేయనున్నాయని తెలుస్తోంది. మే నెలలో దీనికి సంబంధించిన పూర్తి ఆదేశాలు రానున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఆయా బ్యాంకులు ఉచితంగా అందించిన సేవలకు కూడా.. సర్వీస్ ఛార్జీ వసూలు చేసినట్లు పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఎస్టీ) ఈ నోటీసులు అందించటం విశేషం. బ్యాంకులు ఉచితంగా అందించే సేవలపై.. సర్వీస్ ఛార్జీ విధిస్తున్నట్లుగా భావించి ఈ పన్నులు చెల్లించాలని జీఎస్టీ ఇంటలిజెన్స్ కోరింది. ఈ మేరకు ప్రధాన బ్యాంకులకు నోటీసులు అందాయి. అంతేకాదు ఈ సంవత్సరానికే కాకుండా.. గత ఐదేళ్లుగా ఖాతాదారులకు బ్యాంకులు అందించిన అన్ని ఉచిత సేవలపైనా ట్యాక్స్ కట్టాలని ఈ నోటీసుల్లో తెలిపింది. ఈ పన్నుల భారం మొత్తం విలువ సుమారు రూ.6వేల కోట్లు ఉండొచ్చని అంచనా. ఇదే జరిగితే ఉచిత సేవలకు బదులు బ్యాంకులు ఇక సర్వీస్ చార్జీ బాదుడుకు తెర తీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏటీఎం లావాదేవీలు, చెక్ బుక్కుల జారీ, లావాదేవీలు, కార్డుల ద్వారా జరిగే అన్ని లావాదేవీలపై సర్వీస్ ఛార్జీ భారం తప్పదంటున్నారు. ఇప్పటివరకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్ మహీంద్ర బ్యాంకులకు నోటీసులు అందాయి. త్వరలోనే ఇతర బ్యాంకులకు నోటీసులు అందే అవకాశం ఉంది. -
రంగు పడుద్ది..
జిల్లాలోని ప్రభుత్వ భవనాలకు పసుపు రంగు పడుతోంది. పంచాయతీ, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు పచ్చరంగు వేయాల్సిందేనని ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. తాజాగా ఉపాధి కార్డులు పసుపు రంగులోనే ఉండాలని పాలకులు నిర్ణయించారు. లోటు బడ్జెట్ అంటూ సంక్షేమ పథకాలకు కత్తెర వేస్తూ.. ఏమాత్రం ఉపయోగం లేని అంశాలపై ప్రజాధనాన్ని వెచ్చిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు, సాక్షి: రాష్ట్ర ప్రభుత్వానికి రంగు పైత్యం పట్టుకుంది. తమ పార్టీ అధికార రంగు పసుపును ప్రభుత్వ భవనాలకు వేయాల్సిందేనని హుకుం జారీ చేసింది. దీంతో జిల్లాలోని పంచాయతీ భవనాలు, ఓహెచ్ఎస్ఆర్ (ఓవర్‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్) ట్యాంకులు, ఉపాధి కార్డులపై పచ్చరంగు పడుతోంది. దీనిపై ఎన్ని విమర్శలు వస్తున్నా ప్రభుత్వం లెక్క చేయడం లేదు. పైకి విమర్శలు చేయకపోయినా ఉద్యోగులు కూడా ఈ విషయంపై చర్చించుకుంటున్నారు. మెమో నంబర్ 2754/2017 సీపీఆర్‌అండ్‌బీ ఆర్డీ పేరిట పంచాయతీరాజ్ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు, డీపీఓలకు పచ్చరంగు పులమడంపై ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భవనాలకు ఏ రంగు వేయాలి, ఏ కంపెనీ రంగు వాడాలో ఓ నమూనా చిత్రాన్ని పంపారు. పంచాయతీ భవనాలకు.. జిల్లాలో 1,363 పంచాయతీలు ఉన్నా యి. వీటిలో 1,148 పంచాయతీలకు భవనాలు న్నాయి. వీటన్నింటిపై పసుపు రంగు పడనుంది. రాజ్యాంగం ప్రకారం పంచాయతీలు స్వపరిపాలన సంస్థలు. వీటికి.. రాజకీయ పార్టీలకు ఎలాంటి సబంధం లేదనే విషయం తెల్సిందే. అయినా పంచాయతీ భవనా లన్నింటికీ తెలుగుదేశం పార్టీ అధికారిక రంగును వేయిం చేందుకు ప్రభుత్వం పూనుకుంది. భవనం మొత్తం పసుపు రంగు, కార్నర్లకు తెలుపు రంగు వేయాలని మెమోలో ప్రభుత్వం సూచించింది. 9600 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు కూడా.. జిల్లాలో 9600 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులున్నాయి. వీటికి కూడా పచ్చరంగు వే యాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ట్యాంకుపైకి ఎక్కడానికి కేటా యించిన వంతెనకు తప్ప మొత్తం ట్యాంకుకు పసుపు రంగు వేయాలని పేర్కొం ది. 6734/2017 సీపీఆర్ ఆర్అండ్డీ పేరుతో ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి కార్డులకూ.. ఇప్పుడు ఉండే ఉపాధికార్డులను రద్దు చేసి పసుపు రంగు కార్డులిచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. పసుపు జాబ్ కార్డులు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పంపిణీ కూడా చేశారు. మన జిల్లాలో 6,58,914 జాబ్ కార్డులున్నాయి. వీటన్నింటినీ పసుపురంగులో ముద్రించి కొత్తగా పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. కేంద్రం నిధులతో నడిచే ఈ పథకంపై తన ముద్ర వేసుకోడానికే ఈ ప్రయత్నమని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆడంబరాలకు ప్రజాధనం దుర్విని యోగం అవుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. -
జూదంలో భార్యను పణంగా పెట్టాడు
ఇండోర్: జూదంలో ఓడిపోయిన భర్త తనను ఇద్దరు వ్యక్తులకు అప్పగించటంతో వారు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. జూదానికి బానిసైన ఓ వ్యక్తి ఓడిపోతే తన భార్యను ఇస్తానని బెట్ కట్టాడు. ఆటలో ఓటమి పాలై అందుకు బదులుగా భార్యను గెలిచిన ఇద్దరికి అప్పగించాడు. దీంతో ఆ ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఆమె భర్తతోపాటు వేధింపులకు పాల్పడిన ఇద్దరిని పిలిపించి విచారించారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఇండోర్ మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్చార్జ్ జ్యోతి శర్మ వెల్లడించారు. అయితే, భర్తతో పాటు మిగతా ఇద్దరు కూడా మహిళను వేధిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని వివరించారు. -
పరిహారం ‘పాపం’ నిజమే..
-బోగస్ ఐడీ కార్డుల బాగోతాన్ని నిర్ధారించిన అధికారులు -ముంపు మండలాల మీ సేవా కేంద్రాల్లో పీఓ, ఆర్డీఓ తనిఖీలు -కూనవరంలో ఒకటి, వీఆర్ పురంలో రెండు కేంద్రాల సీజ్ కూనవరం (రంపచోడవరం) : పరిహారం కోసం సాగిన మోసకారి వ్యవహారంలో అధికార యంత్రాంగం కదిలింది. ‘పోలవరం’ ముంపు మండలాల్లో బాధితులకు ఇచ్చే పరిహారాన్ని అర్హత లేకున్నా పొందే దురుద్దేశంతోత ఆగమేఘాలపై నకిలీ ఓటరు ఐడీ కార్డులు, ఆధార్ కార్డులు జారీ అవుతున్న బాగోతంపై ‘ఇదో ‘ఐడి’యా’ పేరుతో బుధవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంతో చర్యలకు ఉపక్రమించారు. అసలు క్షణాల్లో బోగస్ ఓటరు ఐడీ కార్డులు ఎలా లభ్యమవుతున్నాయనే దానిపై చింతూరు ఐటీడీఏ పీఓ గుగ్గిలి చినబాబు, ఎటపాక ఆర్డీఓ ఎల్లారమ్మ బుధవారం వీఆర్ పురం, కూనవరం మండలాల్లోని మీసేవా కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డుల నమోదులో ఆయా కేంద్రాలు పలు అవకతవకలకు పాల్పడుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు. మీ సేవా కేంద్రాల నిర్వాహకులు పేర్కొన్న అంశాలకు, దరఖాస్తుల పరిశీలనలో కనిపిస్తున్న వాస్తవాలకు పొంతన లేకపోవడంతో వీఆర్ పురంలో రెండు కేంద్రాన్ని, కూనవరంలో ఒక కేంద్రాన్ని సీజ్ చేశారు. ఆ కేంద్రాల నుంచి హోలోగ్రామ్, స్టాంప్‌లు, తదితర రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గతంలో పనిచేసిన «అధికారుల పేర్లతో ఉన్న స్టాంపులు వినియోగిస్తున్నారని, భద్రాచలం ఆర్డీఓ పేరుతో పాత తేదీలతో ఉన్న ఓటరు ఐడీ కార్డులు జారీ చేస్తున్నట్లు వెల్లడైందన్నారు. ఆర్డీఓ ఎల్లారమ్మ మాట్లాడుతూ గొమ్ము పొట్లవాయిగూడెంలో వీఆర్ పురం మండలానికి చెందిన మీ సేవా కేంద్రం నిర్వాహకుడు అవకతవకలకు పాల్పడినట్లు తనిఖీల్లో తేలిందన్నారు. ఆధార్ కార్డులు తీసి వెంటనే ఇస్తున్నాడని, వాటితో ఎలాంటి దరఖాస్తు చేసుకున్నా చెల్లుబాటు కాకపోవడంతో నష్టపోయామంటూ కొందరు తనకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అలాగే పైదిగూడెంకు చెందిన కొందరు బాధితులు కూనవరం మీ సేవ నిర్వాహకునిపై కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామాల్లో విచారణ జరిపానని, నివేదికను జాయింట్ కలెక్టర్‌కు అందజేస్తానని తెలిపారు. కాగా పోలవరం ముంపు మండలాల్లో పరిహారం పొందేందుకు పదేళ్ల క్రితం ఊరు వదిలి వెళ్లిన వారు సైతం తిరిగివచ్చి నకిలీ ఆధార్‌కార్డులు, ఓటర్ ఐడీ, రేషన్‌కార్డులు పొందేందుకు మీ సేవా కేంద్రాలను ఆశ్రయించడంతో వాటి నిర్వాహకులు అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలడంతోనే అధికారులు ఈ కేంద్రాలపై చర్యలు తీసుకున్నారు. తనిఖీల్లో విఆర్‌పురం, చింతూరు తహసీల్దార్లు జీవీఎస్ ప్రసాద్, తేజేశ్వరరావు, ఎస్సైలు బి.అజయ్‌కుమార్, రామకృష్ణ, ఆర్ఐ చలపతిరావు, వీఆర్ఓ వనపర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా మరింత లోతుగా విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశముందని, దీనివలన అసలైన అర్హులకు మేలు జరుగుతుందని నిర్వాసితులు కోరుతున్నారు.