ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. పలు క్రిప్టోకరెన్సీల విలువ ఆకాశమే హద్దుగా పెరుగుతూనే ఉంది. తాజాగా బిట్‌కాయిన్ 51 వేల డాలర్ల మార్క్‌ను దాటిపోయింది. బిట్‌కాయిన్ తరహాలోనే మరొక క్రిప్టోకరెన్సీ ఈథిరియం కూడా గణనీయంగా వృద్ధి చెందింది. తాజాగా ఈథిరియం విలువ 3907.61 డాలర్లకు చేరుకుంది.
చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీలో భారత్ స్థానం ఎంతో తెలుసా...!
తాజాగా ఈథిరియం విలువ పెరగడంతో పలు కంప్యూటర్లలో వాడే జీపీయూ(గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్) ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. మై డ్రైవర్స్ నివేదిక ప్రకారం చైనా లో ఎన్విడియా జీపీయూ ధరలు 18 శాతం పెరిగాయని వెల్లడించింది. సెప్టెంబర్‌లో ఎన్వీడియా జీపీయూ గ్రాఫిక్ కార్డుల కొనుగోళ్లు 50 శాతం తగ్గుతాయని పేర్కొంది. గతంలో ఈథిరియం విలువ తగ్గడంతో గ్రాఫిక్స్ కార్డు ధరలు గణనీయంగా తగ్గాయి. గత వారంలో ఈథిరియం విలువ 23 శాతం పైగా పెరిగింది. క్రిప్టోకరెన్సీ పెరుగుదలతో ఎన్విడియా గ్రాఫిక్స్ కార్డులు మాత్రమే కాకుండా ఏఎమ్‌డీ ఎక్స్ 6000 సిరీస్, గిగా బైట్ గ్రాఫిక్స్ కార్డు ధరలు కూడా పెరగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా వీటి ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది.
క్రిప్టోకరెన్సీ గ్రాఫిక్స్ కార్డు ధరలు ఎలా నియంత్రిస్తుదంటే..!
క్రిప్టోకరెన్సీ కంటికి కనిపించని ఒక డిజిటల్ కరెన్సీ. క్రిప్టోకరెన్సీ పూర్తిగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఉపయోగించి లావాదేవీలను జరుపుతుంటారు. క్రిప్టోకరెన్సీ మైనింగ్ చేయడం కోసం కంప్యూటర్లలో శక్తివంతమైన గ్రాఫిక్స్ కార్డులు కావాల్సి ఉంటుంది. గ్రాఫిక్స్ కార్డులనుపయోగించి సంక్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించవచ్చును. క్రిప్టోకరెన్సీ మైనింగ్ జరిపే వారితో ఈ గ్రాఫిక్స్ కార్డుల ధరలు గణనీయంగా పెరుగుతాయని టెక్నాలజీ నిపుణులు వెల్లడించారు.
చదవండి: Elon Musk: శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ ఏదో తేల్చిచెప్పిన ఎలన్ మస్క్...!
Comments
Please login to add a commentAdd a comment