సాక్షి, ముంబై: ఇటీవలి కాలంలో దాదాపు ప్రతీ ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందిఅనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఔత్సాహిక టీనేజర్లు,యువభారతం తమ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు యూట్యూబ్‌ను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు వంటలు, చిట్కాలు, యోగాలు, కిచెన్ గార్డెనింగ్ దగ్గర్నించి, బిజినెస్, రాజకీయాలు ఇలా పలు కేటగిరీల్లో సక్సెస్‌ఫుల్ యూటూబర్లుగా లక్షలు, కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఢిల్లీకి చెందిన భువన్ బామ్ నుండి ముంబైకి చెందిన ప్రజక్తా కోలి వరకు అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. అలాంటి వారిలో ఒకరు యూట్యూబర్ అదితి అగర్వాల్.
అద్దె ఇంట్లో మొదలు పెట్టిన ప్రయాణంలో ఇపుడు సొంత ఫ్లాట్‌తో పాటు దాదాపు 70 లక్షల మంది మద్దతుతో ఈ స్థాయికి చేరడం వెనుక ఏళ్ల కష్టం ఉంది. యూట్యూబ్‌లో క్రాఫ్టర్ అదితిగా దూసుకుపోతోందిఅదితి అగర్వాల్. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అదితి ప్రయాగ్‌రాజ్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో తన విద్యను పూర్తి చేశాక అలహాబాద్ యూనివర్శిటీ నుండి డిగ్రీని చేసింది. (చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్‌లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!)
అదితి ప్రయాణం ఎలా మొదలైంది?
ఒక విధంగా చెప్పాలంటే అదితి ప్రయాణం ఎనిమిదో తరగతిలో మొదలైంది. ఊహాత్మకంగా, ఆకర్షణీయంగా కార్డులు తయారు చేయడం అదితికి చాలా ఇష్టం. అలా ఎనిమిదో తరగతిలో ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఆమె ఓ కార్డును రూపొందించింది. అది చూసిన టీచర్లంతా ఫిదా అయిపోయారు. అక్కడనుంచి ప్రేరణకు తోడు 11వ తరగతిలో, అదితికి కార్డ్ ఆర్డర్ వచ్చింది. దానికి ప్రతిఫలంగా తొలి సంపాదనగా 300 రూపా యలుఆర్జించింది. ఇది ఇలా ఉండగా, అదితి తన 12వ తరగతిలో NIFT పరీక్షకు హాజరై 205 మార్కులు సాధించింది, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కళాశాలలో చేరలేదు. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?)
దీంతో తన స్పెషల్ ఇంట్రస్ట్ గిప్ట్స్, కార్డుల మేకింగ్‌లో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో సోషల్ మీడియాను ఉపయోగించుకుంది. 2015లో ఫేస్‌బుక్‌లో అదితి కార్డ్ జోన్ పేజీని ప్రారంభించింది. ఆ మరుసటి రోజే ఆమెకు 800 రూపాయల ఆర్డర్ వచ్చింది. తానే స్వయంగా కార్డులను డెలివరీ చేసింది. ఈ ప్రయాణం అంతఈజీగా ఏమీ సాగలేదు. కానీ పట్టువదలకుండా తన వంతు ప్రయత్నం చేస్తూ పోయింది అదితి. 2017లో తన యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. గ్రాడ్యుయేషన్ చేస్తూనే ప్రతిరోజూ ఆమె ఒక వీడియోను అప్‌లోడ్ చేసేది. సోదరి సాయంతో వీడియోలను రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.
మదర్స్ డే , ఫాదర్స్ డే ఇలా ఏ అకేషన్‌ను వదులుకోలేదు. రకారకాల గిఫ్ట్స్, కార్డ్‌లను ఆన్‌లైన్‌లో విక్రయించడంతో అదితి వీడియోలను అప్‌లోడ్ చేసేది. అలా కార్డ్ మేకింగ్ వీడియోను వైరల్ అయింది. దాదాపు 2 లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. దీంతో మరింత పాపులారీటి పెరిగింది. ఫలితంగా 2018లో లక్షమార్క్‌ను దాటిన అదితి ఛానెల్ సబ్‌స్క్రైబర్లు 2020 నాటికి 2.60 లక్షలకు చేరుకుంది. ఈ సక్సెస్‌తో 30 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉన్న తన ఫ్యామిలీకి అదితి 2020లో లక్నోలో రెండు పడకగదుల ఫ్లాట్‌ని కొనుగోలు చేసింది. ఆమె తండ్రి ఒక ప్రైవేట్ ఉద్యోగి. ఈలోపు కరోనా రావడంతో 2021లో లక్నోకి మకాం మార్చింది.
అదితి ఛానెల్‌పై కోవిడ్-19 ప్రభావం
కరోనా సమయంలో, అదితి ఛానెల్ కంటెంట్‌కు ఆదరణ కాస్త తగ్గింది. దీంతో 2.60 లక్షల మంది సభ్యులు 2.54 లక్షలకు పడిపోయారు. ఈ సమయంలో కాస్త నిరాశ పడినా, ఆ తర్వాత అదితి తన తల్లి సపోర్ట్‌తో ప్రతిరోజూ వీడియోలు అప్‌లోడ్ చేయాలని నిర్ణయించుకుంది. చివరికి వీడియో ఒకటి వైరల్ కావడంతో కేవలం 15 రోజుల్లో సబ్‌స్క్రైబర్లు 10 లక్షల మంది చేరారు. ప్రస్తుతం అదితి యూట్యూబ్ ఛానెల్‌లో దాదాపు 7 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లుండటం విశేషం. ఈ రోజు సంపాదన 6 అంకెలలో. అదితికి ఇన్‌స్టాగ్రామ్‌లో 5.9 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 2.90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
రేసు గుర్రంలా పరిగెట్టాల్సిందే
యూట్యూబర్ కావాలనుకునే వారికి టిప్స్ ఇస్తూ..సక్సెస్ రావాలంటే లాంగ్ రేసు తప్పదని, చాలామందికి సడెన్‌గా సక్సెస్ వచ్చినా మాయమైపోతుందని, దాన్ని నిలుపు కోవడం ముఖ్యమని సూచిస్తుంది. అందుకే రేసు గుర్రంలా మారితే గొప్ప విజయాన్ని అందుకోలేమని చెబుతుంది అదితి. తనకు కూడా సక్సెస్ రావడానికి ఆరేళ్లు పట్టిందంటూ తన జర్నీని గుర్తు చేసుకుంది. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?)
YouTube ప్రశంసలు అనేక ఈవెంట్‌లకు ఆహ్వానం
అదితి విజయాన్ని యూట్యూబ్ కూడా ప్రశంసించింది. DIY ఈవెంట్‌కి ఆహ్వానాన్ని అందుకుంది. ఇంకా మెటా అనేక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment