యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్‌చేసి ఎందరో ముందుకు వెళ్లినవారు, మధ్యలోనే నిలపివేసినవారు, మళ్ళీ కొనసాగించినవారున్నారు. కానీ కోట్ల సబ్‌స్క్రైబర్స్‌ని పొందినవారు ఎందరున్నారు? ఎవరున్నారు? అనే సందేహానికి ఈ యూట్యూబరే.. నిదర్శనం. మరి అతని గురించి తెలుసుకుందామా..
'గౌరవ్ చౌధరీ' రిచెస్ట్ ఇండియన్ టెక్ యూట్యూబర్. ‘టెక్నికల్ గురూజీ’ అనే యూట్యూబ్ చానెల్‌తో పాపులర్. దీన్ని 2015లో స్టార్ట్ చేశాడు. కష్టమైన టెక్నికల్ అంశాలను ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో ఇతను ఎక్స్‌పర్ట్.
ఈ స్కిల్‌తోనే 2017 కల్లా కోటి మంది సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత వ్యూస్ గెయిన్ చేస్తోంది అతని చానెల్. 2024, మార్చి నాటికి రెండు కోట్ల 35 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌తో టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో ఒకడిగా ఉన్నాడు. టెక్ కేటగరీలో తొలి నేషనల్ క్రియేటర్స్ అవార్డ్‌ను అందుకున్నాడు.
అతని నెట్ వర్త్ 360 కోట్లకు పైమాటే! రాజస్థాన్‌లోని అజ్మేర్ అతని సొంతూరు. 16 ఏళ్లకే కోడింగ్‌లో ఆరితేరాడు. బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో మైక్రోఎలక్ట్రానిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు. కోడింగ్‌లో తనకున్న నైపుణ్యంతో దుబాయ్‌లోనే డిజిటల్ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు.
సోషల్ మీడియా అనగానే ఎంటర్‌టైన్‌మెంటే కాదు సీరియస్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. వాటితోనూ వ్యూస్ అండ్ క్యాష్‌ని రాబట్టుకోవచ్చని నిరూపించాడు!
ఇవి చదవండి: కలే నిజమైంది.. ప్రాణాలు కాపాడింది!
Comments
Please login to add a commentAdd a comment