రూ.5 వేల నుంచి రూ.100 కోట్లు వరకు - సామాన్యుడి సక్సెస్ స్టోరీ! | Rich Youtuber Bhuvan Bam Success Story And Net Worth | Sakshi
Sakshi News home page

Success Story: రూ.5 వేల నుంచి రూ.100 కోట్లు వరకు - సామాన్యుడి సక్సెస్ స్టోరీ!

Published Sun, Sep 10 2023 9:09 PM | Last Updated on Sun, Sep 10 2023 9:58 PM

Rich Youtuber Bhuvan Bam Success Story And Net Worth - Sakshi

ఆధునిక కాలంలో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలున్నాయి. ఇందులో ఒకటి యూట్యూబ్. ప్రస్తుతం యూట్యూబ్ రాజ్యమేలుతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీని ద్వారా సంపాదిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. ఇండియాలో యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న వారిలో 'భువన్ బామ్' (Bhuvan Bam) ఒకరు. ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భువన్ బామ్ యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చేస్తూ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న వారి జాబితాలో ఒకరుగా ఉన్నారు. మ్యుజిషియ‌న్‌గా కెరీర్ ప్రారభించిన భువన్ ఆ తరువాత యూట్యూబ్ ప్రారభించారు. దీని కోసం సింగింగ్ కెరీర్ వదులుకున్నట్లు సమాచారం. ఇతడు చేసిన మొదటి కామెడీ వీడియో బాగా పాపులర్ అయింది. దీంతో 'బీబీ కి వైన్స్' (BB Ki Vines) అనే సొంత సిరీస్ ప్రారభించాడు.

స్పూప్ వీడియోలు..
బీబీ కి వైన్స్ సిరీస్‌లో భాగంగా వివిధ రకాల పాత్రలతో స్పూప్ వీడియోలు క్రియేట్ చేసి ఎక్కువ వ్యూవ్స్ పొందగలిగాడు. దెబ్బకు ఈ సిరీస్‌ పెద్ద హిట్ కొట్టింది. తన సొంత కుటుంబాన్ని మాత్రమే కాకుండా, ఫ్రెండ్స్ పాత్రలు కూడా పోషించి ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ఇప్పటికి తన యూట్యూబ్ ఛానెల్‌కి 2.6 కోట్ల కంటే ఎక్కువమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నట్లు సమాచారం.

వీడియోలు చాలా కామెడీగా ఉండటం వల్ల ఎక్కువ మంది వ్యూవ్స్ రావడంతో, ఇండియాలో టాప్ యూట్యూబర్లలో ఒకడుగా నిలిచాడు. కేవలం యూట్యూబ్ ఛానల్ వీడియోలు మాత్రమే కాకుండా.. అనేక వెబ్ సిరీస్‌లు కూడా ప్రారభించి సక్సెస్ సాధించాడు. దీంతో చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించాడు. 

ఇదీ చదవండి: వాడిన పూలతో కోట్ల బిజినెస్ - ఎలాగో తెలిస్తే షాకవుతారు!

ప్రారంభంలో కేవలం రూ. 5000 పొందిన భువన్ క్రమంగా లక్షలు సంపాదించడం ప్రారంభించాడు. ప్రస్తుతం రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులని కలిగి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎంతోమంది యూట్యూబర్లకు రోల్ మోడల్‌గా నిలిచాడు. మొత్తానికి కష్టపడి ఎంతోమంది ప్రేక్షకులను ఆకర్శించి ఈ రోజు గొప్ప సక్సెస్ సాధించిన వారి జాబితాలో ఒకడిగా నిలిచాడు. కష్టపడి అంకిత భావంతో పనిచేయడమే సక్సెస్ మంత్రం అని ఇతని ద్వారా తెలుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement