
Biswa Kalyan Rath Success Story: ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేసిన తరువాత ఏదైనా మంచి ఉద్యోగంలో చేరి సంపాదించడం ఆనవాయితీ. అలా కాకుండా ఆధునిక కాలంలో కొంతమంది ఐఐటీయన్లు తమకు నచ్చిన ప్రపంచంలో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'బిశ్వ కళ్యాణ్ రాత్' (Biswa Kalyan Rath). ఇంతకీ ఈయనెవరు? ఈయన సంపాదన ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, బిశ్వ కళ్యాణ్ రాత్ ఇండియన్ స్టాండ్-అప్ కమెడియన్, రచయిత అండ్ యూట్యూబర్. ఈయన తన తోటి హాస్యనటుడు కనన్ గిల్‌తో కలిసి యూట్యూబ్ కామెడీ సిరీస్, ప్రిటెన్షియస్ మూవీ రివ్యూస్ ద్వారా ప్రజాదరణ పొందాడు. అంతే కాకుండా 2016 బ్రహ్మన్ నమన్ అనే నెట్‌ఫ్లిక్స్ కామెడీ చిత్రంలో ఒక పాత్ర కూడా పోషించాడు. ఆ తరువాత 2017లో అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ లాఖోన్ మే ఏక్‌ని సృష్టించాడు.
(ఇదీ చదవండి: సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే!)
నిజానికి బిశ్వ కళ్యాణ్ రాత్ 2012లో ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి గ్రాడ్యుయేట్, ఆ తరువాత బయోటెక్నాలజీ పూర్తి చేసాడు. చదువు పూర్తయిన తరువాత గ్రాఫిక్ డిజైన్, అడ్వర్టైజింగ్, సాఫ్ట్‌వేర్ వంటి వాటిలో పనిచేసాడు. ఈ సమయంలోనే అతను 2013లో బెంగుళూరులో ఒక ఓపెన్ మైక్ ఈవెంట్‌లో కనన్ గిల్‌ను కలిసి 2014లో తన ఉద్యోగాన్ని వదిలి కమెడియన్‌గా మారాడు.
(ఇదీ చదవండి: ఎలాన్ మస్క్, అంబానీ.. వీళ్లకంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈయనే!)
బిశ్వ కళ్యాణ్ రాత్ కమెడియన్‌గా మారిన తరువాత బెంగళూరు, పూణే, ముంబై, హైదరాబాద్ అండ్ కోల్‌కతాలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. బిస్వా మస్త్ ఆద్మీ అనే పేరుతో కామెడీ షో కూడా ప్రారంభించాడు. మొత్తానికి ఐఐటీ వదిలి కమెడియన్‌గా స్థిరపడిన బిశ్వ నికర ఆస్తి విలువ రూ. 11 లక్షల నుంచి రూ. 67 లక్షల వరకు అని సమాచారం. కాగా పాణిగ్రాహి అంబర్ ధార, దో సహేలియాన్ వంటి షోలలో పాపులర్ అయిన 'సులంగ్నా'ను 2020లో వివాహం చేసుకున్నాడు.