రైల్వే బుకింగ్‌కి కార్డులు | Railway introduced cards for booking tickets | Sakshi
Sakshi News home page

రైల్వే బుకింగ్‌కి కార్డులు

Published Mon, May 25 2015 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

రైల్వే బుకింగ్‌కి కార్డులు

రైల్వే బుకింగ్‌కి కార్డులు

ఆన్‌లైన్ ద్వారా రైల్వే టికెట్లను వేగంగా బుక్ చేసుకోవడానికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) ప్రీపెయిడ్ కార్డులను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఐఆర్‌సీటీసీ-యూబీఐ ప్రీపెయిడ్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డులను ఉపయోగిస్తే... త్వరితగతిన టికెట్లను బుకింగ్ చేసుకునే వెసులుబాటుతో పాటు రివార్డు పాయింట్లు, రూ. 2 లక్షల ఉచిత ప్రమాద బీమా రక్షణను కల్పిస్తోంది. వర్చువల్, ఫిజికల్ కార్డుల రూపంలో అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ కార్డుల్లో గరిష్టంగా రూ. 10,000 నుంచి రూ. 50,000 వరకు నగదును నింపుకోవచ్చు. కార్డు తీసుకున్న మొదటి ఆరు నెలల్లో మొదటి ఐదు లావాదేవీలపై ఎటువంటి రుసుములు ఉండవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement