భారత ఫిన్‌టెక్‌ను ఐదు విభాగాలుగా వేరు చూసి చూడొచ్చు. క్యూఆర్ కోడ్ తదితర చెల్లింపులు, బిల్లుల చెల్లింపులు, ఇతర అగ్రిగేటర్ సేవలు, బై నౌ, పే లేటర్ సహా రుణ సదుపాయం, రుణాలిచ్చే ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్‌లు, వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థలు. ఈ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి సేవలు పొందాలంటే ప్రజలు గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి (కేవైసీ) ఉంటుంది. గత కొన్నేళ్ల కాలంలో కేవైసీ ప్రక్రియను ఫిన్‌టెక్ సంస్థలు ఎంతో సులభతరం చేశాయి. ఫిన్‌టెక్ సంస్థలు డిజీలాకర్‌లో ఉన్న డాక్యుమెంట్లను పొందే అవకాశం కల్పిస్తామని 2023-24 బడ్జెట్‌లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం నిజంగా ఒక పెద్ద మార్పు వంటిదే. డిజిటల్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా భారత ప్రభుత్వం దేశంలో ఫిన్‌టెక్ పరిశ్రమ వృద్ధికి ఎన్నో సదుపాయాలు కల్పించింది. ఆధార్, పీఎం జన్ ధన్ యోజన, వీడియో కేవైసీ, యూపీఐ వంటివి ఎన్నో చేపట్టింది. ఫలితంగా భారత ఫిన్‌టెక్ పరిశ్రమ 2025 నాటికి 1.3 ట్రిలియ్ డాలర్ల స్థాయికి చేరుకోనుంది.
డిజీలాకర్
ప్రస్తుతం డిజీలాకర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన డాక్యుమెంట్ల డిజిటల్ కాపీలు స్టోర్ చేసుకునేందుకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయం ఇతర డాక్యుమెంట్లను సైతం డిజీలాకర్‌లో స్టోర్ చేసుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. వెబ్‌బ్రౌజర్, మొబైల్ యాప్ రూపంలో అందుబాటులో ఉన్న డిజీలాకర్‌ను డిజీయాత్ర యాప్‌పై ఐడెండిటీ వెరిఫికేషన్‌కు అనుమతిస్తున్నారు. దీంతో దేశీ విమానాశ్రయాల్లో కాంటాక్ట్‌లెస్ చెకిన్‌కు వీలు లభిస్తోంది.
డైనమిక్ కేవైసీ
డిజీలాకర్ సాయంతో కేవేసీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంతో కేవైసీ ప్రక్రియ క్రియాశీలంగా మారుతుంది. ఆధార్, పాన్ డేటా ఆధారంగా రిస్క్ సమీక్ష సాధ్యపడుతుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశంలో మరింత విస్తరిస్తుంది. రుణాల లభ్యతను పెంచుతుంది. భారత ఫిన్‌టెక్ పరిశ్రమ దీర్ఘకాల వృద్ధికి బడ్జెట్ ఎంతో ముందడుగు వేసింది సాంకేతిక, విజ్ఞాన ఆధారిత వృద్ధి ప్రాధాన్యతను బడ్జెట్ గుర్తించింది. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, నియంత్రణసంస్థలు కలిగి ఉండే పౌరుల డేటా విషయంలో ఏకీకృత పరిష్కారంపై దృష్టి సారించింది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ సహా ఇతర చర్యలు ఫిన్‌టెక్ పరిశ్రమ వృద్ధికి ఎంతో లబ్ధి కలిగిస్తాయి. క్రెడిట్ కార్డులు యూపీఐతో లింక్ చేయడానికి ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం కూడా ఆహ్వానించతగినది.
Comments
Please login to add a commentAdd a comment