How to use
-
యోగా ఇలా చేస్తే...ఎన్నో ప్రయోజనాలు
ఏ రకమైన వ్యాయామం చేసినా పాటించాల్సిన ముఖ్య లక్షణం స్వీయ క్రమ శిక్షణ. వ్యక్తి, శారీరక, మానసిక శ్రేయస్సును మెరుగు పరచడంలో దాని సొంత ప్రాముఖ్యత, ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా యోగా వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీంతో పాటు యోగా లక్ష్యాలలో స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ, అవగాహనను పెంచుకుంటే సానుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రయోజనాలువ్యక్తిగత సంబంధాలలో సానుకూలత, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొత్త అభిరుచిని అలవరచు కోవడం, కోపాన్ని, భావోద్వేగాలను నియంత్రించడం, లక్ష్యంపై దృష్టి పెట్టడం, ఫలితాలను సాధించడానికి సహాయపడుతుంది. మొదట యోగా సాధన చేయాలనుకుంటున్న కారణం, నిర్దేశించుకున్న వ్యవధి, శారీరక, మానసిక ఆరోగ్యంలో చూడాలనుకుంటున్న సానుకూల మార్పులను అర్థం చేసుకోవాలి. ఎలా చేయాలంటే... క్రమం తప్పకుండా యోగసాధన చేయడం వల్ల మానసిక క్రమశిక్షణ కలగడం తోపాటు దినచర్యలో భాగం అవుతుంది. జీవనశైలిలో సానుకూల మార్పు గమనించవచ్చు. స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి...నిద్రించడానికి కనీసం 2–3 గంటల ముందు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి ∙క్రమం తప్పకుండా 7–8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను రాత్రిపూట ఎక్కువ సేపు ఉపయోగించకుండా చూసుకోవాలి నిర్ణీత సమయం, ప్రదేశంలో యోగసాధన చేయాలి యోగాభ్యాసాన్ని నిలిపివేయకుండా ఉండటానికి, ఒక గ్రూప్‌తో లేదా స్నేహితులతో కలిసి సాధన చేయాలి. జట్టుగా కలిసి చేసే యోగా వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.చదవండి: ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?! -
డిజిటల్ రేషన్ కార్డు: ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే..
భారతదేశంలో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కేంద్రం.. డిజిటల్ ఇండియా కింద ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఇటీవల క్యూఆర్ కోడ్ పాన్ కార్డు (పాన్ 2.0) గురించి ప్రస్తావించింది. కాగా ఇప్పటికే డిజిటల్ రేషన్ కార్డును తీసుకురాడంలో ప్రభుత్వం సక్సెస్ సాధించింది. ఇంతకీ ఈ డిజిటల్ రేషన్ కార్డును ఎక్కడ, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. దీనివల్ల ఉపయోగాలు ఏమిటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.డిజిటల్ రేషన్ కార్డు అనేది.. సాధారణ రేషన్ కార్డుకు డిజిటల్ వెర్షన్. దీనిని ఉపయోగించి కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులను పొందవచ్చు. డిజిటల్ రేషన్ కార్డును ఆన్లైన్లో లేదా మేరా రాషన్ 2.0 యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్లోడ్ చేయాలంటే..•ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ వినియోగదారులు యాపిల్ యాప్ స్టోర్ నుంచి 'మేరా రాషన్ 2.0' యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.•మేరా రాషన్ 2.0 యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత, ఓపెన్ చేస్తే స్క్రీన్‌పైన ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయమని ఉంటుంది.•ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. తరువాత రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.•మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తరువాత వెరిఫై క్లిక్ చేయాలి.•ధ్రువీకరించిన తరువాత.. మీ డిజిటల్ రేషన్ కార్డు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: ఆధార్ ఫ్రీ అప్డేట్: గడువు ఆరు రోజులే!డిజిటల్ రేషన్ కార్డు ఉపయోగాలు•ఫిజికల్ రేషన్ కార్డు పోయినప్పటికీ.. దీనిని రేషన్ షాపుల్లో ఉపయోగించవచ్చు.•రేషన్ కార్డు ఎక్కడైనా పోతుందేమో అని భయం అవసరం లేదు.•డిజిటల్ రేషన్ కార్డు కాబట్టి.. మోసాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ. -
డిజీలాకర్ అంటే? డైనమిక్ కేవైసీతో లాభాలేంటి?
భారత ఫిన్‌టెక్‌ను ఐదు విభాగాలుగా వేరు చూసి చూడొచ్చు. క్యూఆర్ కోడ్ తదితర చెల్లింపులు, బిల్లుల చెల్లింపులు, ఇతర అగ్రిగేటర్ సేవలు, బై నౌ, పే లేటర్ సహా రుణ సదుపాయం, రుణాలిచ్చే ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్‌లు, వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలు. ఈ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి సేవలు పొందాలంటే ప్రజలు గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి (కేవైసీ) ఉంటుంది. గత కొన్నేళ్ల కాలంలో కేవైసీ ప్రక్రియను ఫిన్‌టెక్ సంస్థలు ఎంతో సులభతరం చేశాయి. ఫిన్‌టెక్ సంస్థలు డిజీలాకర్‌లో ఉన్న డాక్యుమెంట్లను పొందే అవకాశం కల్పిస్తామని 2023-24 బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం నిజంగా ఒక పెద్ద మార్పు వంటిదే. డిజిటల్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా భారత ప్రభుత్వం దేశంలో ఫిన్‌టెక్ పరిశ్రమ వృద్ధికి ఎన్నో సదుపాయాలు కల్పించింది. ఆధార్, పీఎం జన్ ధన్ యోజన, వీడియో కేవైసీ, యూపీఐ వంటివి ఎన్నో చేపట్టింది. ఫలితంగా భారత ఫిన్‌టెక్ పరిశ్రమ 2025 నాటికి 1.3 ట్రిలియ్ డాలర్ల స్థాయికి చేరుకోనుంది. డిజీలాకర్ ప్రస్తుతం డిజీలాకర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన డాక్యుమెంట్ల డిజిటల్ కాపీలు స్టోర్ చేసుకునేందుకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయం ఇతర డాక్యుమెంట్లను సైతం డిజీలాకర్‌లో స్టోర్ చేసుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. వెబ్‌బ్రౌజర్, మొబైల్ యాప్ రూపంలో అందుబాటులో ఉన్న డిజీలాకర్‌ను డిజీయాత్ర యాప్‌పై ఐడెండిటీ వెరిఫికేషన్‌కు అనుమతిస్తున్నారు. దీంతో దేశీ విమానాశ్రయాల్లో కాంటాక్ట్‌లెస్ చెకిన్‌కు వీలు లభిస్తోంది. డైనమిక్ కేవైసీ డిజీలాకర్ సాయంతో కేవేసీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంతో కేవైసీ ప్రక్రియ క్రియాశీలంగా మారుతుంది. ఆధార్, పాన్ డేటా ఆధారంగా రిస్క్ సమీక్ష సాధ్యపడుతుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశంలో మరింత విస్తరిస్తుంది. రుణాల లభ్యతను పెంచుతుంది. భారత ఫిన్‌టెక్ పరిశ్రమ దీర్ఘకాల వృద్ధికి బడ్జెట్ ఎంతో ముందడుగు వేసింది సాంకేతిక, విజ్ఞాన ఆధారిత వృద్ధి ప్రాధాన్యతను బడ్జెట్ గుర్తించింది. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, నియంత్రణసంస్థలు కలిగి ఉండే పౌరుల డేటా విషయంలో ఏకీకృత పరిష్కారంపై దృష్టి సారించింది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ సహా ఇతర చర్యలు ఫిన్‌టెక్ పరిశ్రమ వృద్ధికి ఎంతో లబ్ధి కలిగిస్తాయి. క్రెడిట్ కార్డులు యూపీఐతో లింక్ చేయడానికి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కూడా ఆహ్వానించతగినది. -
ఇంటర్నెట్ లేకుండా USSD మొబైల్ బ్యాంకింగ్
-
ఇంటర్నెట్ లేకుండా యూఎస్ఎస్డీ మొబైల్ బ్యాంకింగ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన డీమానిటైజేషన్ ప్రకటనతో్ దేశం క్యాష్ లెస్ ఎకానమీవైపు పరుగులు పెడుతోంది. మరోవైపు కరెన్సీ కష్టాల నేపథ్యంలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు డిజిటల్ వాలెట్స్ ద్వారా డబ్బులు చెల్లిస్తూ, రోజువారి అవసరాలను తీర్చకుంటున్నారు. మరి స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోని వారి పరిస్థితి ఏంటి? ఈ నేపపథ్యంలో ఇంటర్నెట్ లేకుండానే , మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందటం ఎలా అనేది ఒకసారి చూద్దాం. సాధారణ మొబైల్‌ఫోన్ యూజర్లకు కూడా యుఎస్ఎస్‌డిల (అన్ స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డివైస్) ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సర్వీసు అందుబాటులో ఉంది. బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లేతో పనిచేసే బేసిక్ ఫోన్లు మొదలుకుని టాప్ఎండ్ స్మార్ట్ఫోన్ల వరకు ఈయుఎస్ఎస్డి మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులను సపోర్ట్ చేస్తాయి.నేషనల్ యునిఫైడ్ యూఎస్ఎస్డి ప్లాట్‌ఫామ్‌చే అభివృద్థిచేయబడిన ఈ ఇంటర్ఫేస్, మిమ్మల్ని మీ టెలికం ఆపరేటర్ ద్వారా మీ బ్యాంకర్‌కు కనెక్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. జీఎస్ఎం నెట్ వర్క్ చానల్స్ ద్వారా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. ఈ సేవలు 11 ప్రాంతీయ భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనికి గాను నిర్దేశించిన షార్ట్ కోడ్స్ ను మొబైల్ కీప్యాడ్ లో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలుగుకోసం *99*24# అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ కీప్యాడ్ షార్ట్ కోడ్స్: తమిళం కోసం (*99*23#), హిందీ కోసం (*99*22#), మరాఠీ కోసం (*99*28#), బెంగాలీ కోసం (*99*29#), పంజాబీ కోసం (*99*30#), కన్నడ కోసం (*99*26#), గుజరాతీ కోసం (*99*27#), మళయాళం కోసం (*99*25#), ఒరియా కోసం (*99*32#), అస్సామీస్ కోసం (*99*31#) ట్రాన్సాక్షన్ లిమిట్, చార్జీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, ఈ యూ ఎస్ఎస్ డీ చెల్లింపు విధానం ద్వారా ఒక్కో ట్రాన్సాక్షన్ లో రూ.1 నుంచి రూ.5,000 వరకు నగదును ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక్కో లావాదేవీకి రూ.50 పైసలు ఛార్జ్ చేయబడుతుంది. ఈ మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ 24/7 అందుబాటులో ఉంటుంది. ఇవి మీ మొబైల్ బిల్లుకు జోడించబడతాయి. అయితే డిశెంబర్ 31 వరకు ఈ సేవలు ఉచితం. కీలకమైన ఎంఎంఐడీ నెంబర్ యుఎస్ఎస్డీ మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందే క్రమంలో ప్రాథమికంగా మనకి ఒక మొబైల్ ఉండాలి. ఆ మొబైల్ నెంబరును మొబైల్ బ్యాంకింగ్ సేవలకోసం తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఫోన్ నెంబర్, మొబైల్ బ్యాంకింగ్‌తో రిజిస్టర్ కాని పక్షంలో వెంటనే మీ బ్యాంకుకు వెళ్లి ఫారమ్‌ను ఫిల్ చేసి బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ విజయవంతమైన వెంటనే మీకో 7 అంకెల మొబైల్ మనీ ఐడెంటీఫైర్ (ఎంఎంఐడీ) నెంబర్ అందుతుంది. ఈ నెంబరును బ్యాంక్ వారు ఇష్యూ చేస్తారు. కొన్ని బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్ ద్వారా, మరికొన్ని బ్యాంకులు ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఈ నెంబర్ ను కేటాయిస్తున్నాయి ఎంపిన్ నెంబర్ యూఎస్ఎస్ డీమొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందే క్రమంలోఈ ఎంఎంఐడీ నెంబర్ కీలకం. దీంతోపాటుగా 4 డిజట్ల డీఫాల్ట్ ఎంపిన్ నెంబర్ బ్యాంకు ద్వారా మనకు అందుతుంది. మామూలు పిన్ నంబర్లలాగానే దీన్ని పాస్‌వర్డ్‌గా ఉపయోగించుకోవాలి. అలాగే దీన్ని తక్షణమే దీన్ని మార్చుకోవాలి కూడా. సో... మొబైల్ బ్యాంకింగ్ సేవలకు మన మొబైల్ ఇపుడు రడీ. తెలుగులో సేవలకు *99*24# ఫోన్ డయల్ ప్యాడ్ నుంచి తెలుగుకోసం *99*24#కు డయల్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయ్యే వెల్కమ్ స్ర్కీన్‌లో మూడు అక్షరాలతో కూడిన బ్యాంక్ షార్ట్ నేమ్ కాని, ఐఎఫ్ఎస్సీ కోడ్‌కు సంబంధించి మొదటి నాలుగు అక్షరాలు గాని, రెండు డిజిట్ల బ్యాంక్ న్యూమరిక్ కోడ్‌ను గాని ఎంటర్ చేసి 'సెండ్' బటన్ పై క్లిక్ చేయాలి.(ఉదాహరణకు ఒకవేళ స్టేట్ బ్యాంక్ ఇండియాలో అకౌంట్ ఉన్నట్లయితే ఎస్ బీఐ అనీ, ఐఎఫ్ఎస్సీ కోడ్ క్రింద ఎస్ బీఐఎన్ అని టైప్ చేస్తే సరిపోతుంది.) అనంతరం మొబైల్ నెంబర్ , బ్యాంక్ అకౌంట్ వివరాలు వెరిఫై కాబడి ఓ ప్రత్యేకమైన సబ్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకోవటం, మినీ స్టేట్మెంట్ను చెక్ చేసుకోవటం, మనీ ట్రాన్స్ఫర్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు ఒకటి (1) ని, మినీ స్టేట్మెంట్ను పొందేందుకు 2 ను ఎంటర్ చేయాలి. అయితే నగదు ట్రాన్స్ ఫర్ కు మాత్రం ఎంఎంఐడీ కోడ్‌ను ఎంటర్ చేయాలి. నగదు ట్రాన్స్ఫర్ చేసే విధానం స్టెప్ 1: నగదును పంపాల్సిన మొబైల్ నంబరు టైప్ చేయాలి. స్టెప్ 2: నగుదును పంపుతున్న వ్యక్తికి సంబంధించిన ఎంఎంఐడీ నెంబర్ ను ఎంటర్ చేయాలి. ( నగదును స్వీకరించే వ్యక్తి కూడా ఈ నెంబర్ పొంది ఉండాలి. అది నగదు పంపుతున్న వ్యక్తికి కచ్చితంగా తెలిసి వుండాలి) స్టెప్ 3: ఇక ఇపుడు మనం పంపుతున్న నగదు వివరాలు జత చేయాలి. ఉదాహరణకు రూ.500 అయితే 500 టైప్ చేసి.. సెండ్ బటన్ ప్రెస్ చేయాలి. స్టెప్ 4: ఇక చివరిగా బ్యాంకు మనకు కేటాయించిన ఎంపీఐఎన్ నెంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి, అకౌంట్ నెంబర్ లోని చివరి నాలుగు అంకెలు టైప్ చేయాలి. దీంతో టాన్సాక్షన్ పూర్తవుతుంది. ఈ మొత్త విధానం అర్థమయ్యి, అలవాటయ్యేంతరకు వరకు కొంత క్లిష్టమైన ప్రక్రియ. ఒకసారి ప్రాసెస్ మొదలుపెట్టిన వెంటనే వేగంగా స్పందించాలి. మొబైల్ లో వస్తున్నసూచనల ఆధారంగా సుమారు 10 సెకన్లలో స్పందించాలి. ఏ మాత్రం తాత్సారం చేసినా ఎక్స్టర్నల్ అప్లికేషన్ డౌన్ అనే ఎర్రర్ ప్రత్యక్షమై మొత్తం ప్రక్రియ క్యాన్సిల్ అవుతుంది. సో..బీ కేర్ ఫుల్...మరింత సౌలభ్యంకోసం వీడియోను గమనించగలరు.