ఇంటర్నెట్ లేకుండా యూఎస్ఎస్డీ మొబైల్ బ్యాంకింగ్ | How to use USSD-based mobile banking, here’s everything you should know | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్ లేకుండా యూఎస్ఎస్డీ మొబైల్ బ్యాంకింగ్

Published Thu, Dec 1 2016 1:14 PM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

ఇంటర్నెట్ లేకుండా యూఎస్ఎస్డీ మొబైల్ బ్యాంకింగ్

ఇంటర్నెట్ లేకుండా యూఎస్ఎస్డీ మొబైల్ బ్యాంకింగ్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన డీమానిటైజేషన్ ప్రకటనతో్  దేశం క్యాష్ లెస్ ఎకానమీవైపు పరుగులు  పెడుతోంది. మరోవైపు కరెన్సీ కష్టాల నేపథ్యంలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు డిజిటల్ వాలెట్స్ ద్వారా డబ్బులు చెల్లిస్తూ, రోజువారి అవసరాలను తీర్చకుంటున్నారు.  మరి  స్మార్ట్  ఫోన్లు,  ఇంటర్నెట్  సదుపాయం అందుబాటులోని వారి పరిస్థితి ఏంటి?  ఈ నేపపథ్యంలో ఇంటర్నెట్ లేకుండానే ,  మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందటం ఎలా అనేది  ఒకసారి  చూద్దాం.
 
సాధారణ మొబైల్‌ఫోన్ యూజర్లకు  కూడా యుఎస్ఎస్‌డిల (అన్ స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డివైస్) ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సర్వీసు అందుబాటులో ఉంది. బ్లాక్ అండ్ వైట్ డిస్‌ప్లేతో పనిచేసే బేసిక్ ఫోన్‌లు మొదలుకుని టాప్ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల వరకు  ఈయుఎస్ఎస్‌డి మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులను సపోర్ట్ చేస్తాయి.నేషనల్ యునిఫైడ్ యూఎస్ఎస్‌డి ప్లాట్‌ఫామ్‌చే అభివృద్థిచేయబడిన ఈ ఇంటర్‌ఫేస్, మిమ్మల్ని మీ టెలికం ఆపరేటర్ ద్వారా మీ బ్యాంకర్‌కు కనెక్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. జీఎస్ఎం నెట్ వర్క్ చానల్స్ ద్వారా ఈ టెక్నాలజీ  పనిచేస్తుంది. ఈ సేవలు 11 ప్రాంతీయ భాషల్లో ఈ సేవలు  అందుబాటులో ఉన్నాయి. దీనికి గాను నిర్దేశించిన షార్ట్ కోడ్స్‌ ను మొబైల్ కీప్యాడ్ లో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలుగుకోసం  *99*24# అని టైప్ చేయాల్సి ఉంటుంది.



ఫోన్ కీప్యాడ్‌ షార్ట్  కోడ్స్:
తమిళం కోసం (*99*23#), హిందీ కోసం (*99*22#), మరాఠీ కోసం (*99*28#), బెంగాలీ కోసం (*99*29#), పంజాబీ కోసం (*99*30#), కన్నడ కోసం (*99*26#), గుజరాతీ కోసం (*99*27#), మళయాళం కోసం (*99*25#), ఒరియా కోసం (*99*32#), అస్సామీస్ కోసం (*99*31#)

ట్రాన్సాక్షన్ లిమిట్,  చార్జీలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, ఈ యూ ఎస్ఎస్ డీ చెల్లింపు విధానం ద్వారా ఒక్కో  ట్రాన్సాక్షన్ లో  రూ.1 నుంచి రూ.5,000 వరకు నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఒక్కో లావాదేవీకి రూ.50 పైసలు ఛార్జ్ చేయబడుతుంది. ఈ మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ 24/7 అందుబాటులో ఉంటుంది. ఇవి మీ మొబైల్ బిల్లుకు జోడించబడతాయి. అయితే డిశెంబర్ 31 వరకు ఈ  సేవలు ఉచితం.

కీలకమైన ఎంఎంఐడీ నెంబర్
యుఎస్ఎస్‌డీ మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందే క్రమంలో ప్రాథమికంగా మనకి ఒక మొబైల్ ఉండాలి. ఆ మొబైల్ నెంబరును మొబైల్ బ్యాంకింగ్ సేవలకోసం తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి.   ఒకవేళ మీ ఫోన్ నెంబర్, మొబైల్ బ్యాంకింగ్‌తో రిజిస్టర్ కాని పక్షంలో వెంటనే మీ బ్యాంకుకు వెళ్లి ఫారమ్‌ను ఫిల్ చేసి బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ విజయవంతమైన వెంటనే మీకో 7 అంకెల మొబైల్ మనీ ఐడెంటీఫైర్ (ఎంఎంఐడీ) నెంబర్ అందుతుంది. ఈ నెంబరును బ్యాంక్ వారు ఇష్యూ చేస్తారు. కొన్ని బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్ ద్వారా, మరికొన్ని  బ్యాంకులు ఎస్ఎంఎస్  ద్వారా  కూడా ఈ నెంబర్ ను  కేటాయిస్తున్నాయి

ఎంపిన్ నెంబర్
యూఎస్ఎస్ డీమొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందే క్రమంలోఈ ఎంఎంఐడీ నెంబర్ కీలకం. దీంతోపాటుగా 4 డిజట్ల  డీఫాల్ట్ ఎంపిన్  నెంబర్  బ్యాంకు ద్వారా మనకు అందుతుంది.  మామూలు పిన్ నంబర్లలాగానే దీన్ని పాస్‌వర్డ్‌గా ఉపయోగించుకోవాలి. అలాగే దీన్ని తక్షణమే దీన్ని  మార్చుకోవాలి కూడా.  సో... మొబైల్ బ్యాంకింగ్ సేవలకు మన మొబైల్ ఇపుడు రడీ.

తెలుగులో సేవలకు *99*24#
ఫోన్ డయల్ ప్యాడ్ నుంచి  తెలుగుకోసం *99*24#కు డయల్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయ్యే వెల్‌కమ్ స్ర్కీన్‌లో మూడు అక్షరాలతో కూడిన బ్యాంక్ షార్ట్ నేమ్ కాని, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌కు సంబంధించి మొదటి నాలుగు అక్షరాలు గాని, రెండు డిజిట్ల బ్యాంక్ న్యూమరిక్ కోడ్‌ను గాని ఎంటర్ చేసి 'సెండ్' బటన్ పై క్లిక్ చేయాలి.(ఉదాహరణకు ఒకవేళ స్టేట్ బ్యాంక్ ఇండియాలో అకౌంట్ ఉన్నట్లయితే ఎస్ బీఐ అనీ, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ క్రింద ఎస్ బీఐఎన్ అని టైప్ చేస్తే సరిపోతుంది.)  

అనంతరం మొబైల్ నెంబర్ , బ్యాంక్ అకౌంట్ వివరాలు వెరిఫై కాబడి ఓ ప్రత్యేకమైన సబ్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకోవటం, మినీ స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకోవటం, మనీ ట్రాన్స్‌ఫర్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు  ఒకటి (1) ని, మినీ స్టేట్‌మెంట్‌ను పొందేందుకు 2 ను ఎంటర్ చేయాలి. అయితే నగదు ట్రాన్స్ ఫర్ కు మాత్రం ఎంఎంఐడీ కోడ్‌ను ఎంటర్ చేయాలి.

నగదు ట్రాన్స్‌ఫర్ చేసే విధానం
స్టెప్ 1:   నగదును పంపాల్సిన మొబైల్ నంబరు టైప్ చేయాలి.


స్టెప్ 2:  నగుదును పంపుతున్న వ్యక్తికి సంబంధించిన ఎంఎంఐడీ నెంబర్ ను ఎంటర్ చేయాలి. ( నగదును స్వీకరించే వ్యక్తి కూడా ఈ నెంబర్ పొంది ఉండాలి.  అది  నగదు పంపుతున్న వ్యక్తికి కచ్చితంగా  తెలిసి వుండాలి)


స్టెప్ 3: ఇక ఇపుడు మనం పంపుతున్న నగదు వివరాలు జత చేయాలి. ఉదాహరణకు రూ.500 అయితే  500 టైప్ చేసి.. సెండ్ బటన్ ప్రెస్  చేయాలి.


స్టెప్ 4: ఇక చివరిగా బ్యాంకు మనకు కేటాయించిన ఎంపీఐఎన్ నెంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి, అకౌంట్ నెంబర్ లోని చివరి నాలుగు అంకెలు టైప్ చేయాలి.   దీంతో  టాన్సాక్షన్   పూర్తవుతుంది. 

ఈ మొత్త విధానం అర్థమయ్యి, అలవాటయ్యేంతరకు వరకు కొంత క్లిష్టమైన ప్రక్రియ.  ఒకసారి ప్రాసెస్  మొదలుపెట్టిన వెంటనే  వేగంగా స్పందించాలి. మొబైల్ లో వస్తున్నసూచనల ఆధారంగా సుమారు 10 సెకన్లలో స్పందించాలి.  ఏ మాత్రం తాత్సారం చేసినా   ఎక్స్టర్నల్ అప్లికేషన్ డౌన్ అనే ఎర్రర్ ప్రత్యక్షమై  మొత్తం  ప్రక్రియ క్యాన్సిల్ అవుతుంది. సో..బీ కేర్ ఫుల్...మరింత సౌలభ్యంకోసం వీడియోను గమనించగలరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement