
శ్రీనగర్‌కాలనీ: ‘మా ఆయనకు బంగారం కొనడం ఇష్టం లేకున్నా ప్రతిసారీ నేను నచ్చిన బంగారాన్ని ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో కొనిపిస్తుంటాను’ అని సినీ నటి అనసూయ అన్నారు. వాల్యూగోల్డ్ సంస్థ మొబైల్ గోల్డ్ బయ్యింగ్ సర్వీస్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో అనసూయ వాహనాన్ని ప్రారంభించారు.
అమీర్‌పేట్‌లోని సారథి స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు గోల్డ్‌ను అమ్మడం నామోషీగా ఫీలయ్యేవారని, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి గోల్డ్ ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా మారిందని అన్నారు. చాలా మంది గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ వారికి నగదు అవసరమైనప్పుడు వాటిని అమ్ముకుంటున్నారన్నారు. తొలిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో గోల్డ్ అమ్ముకోవాలనుకునే వారి కోసం మొబైల్ గోల్డ్ బయ్యింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన సంస్థ ప్రతినిధులు అభిషేక్ చందాను ఆమె అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment