సాధారణ మొబైల్‌ఫోన్ యూజర్లకు కూడా యుఎస్ఎస్‌డిల (అన్ స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డివైస్) ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సర్వీసు అందుబాటులో ఉంది. బ్లాక్ అండ్ వైట్ డిస్‌ప్లేతో పనిచేసే బేసిక్ ఫోన్‌లు మొదలుకుని టాప్ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల వరకు ఈయుఎస్ఎస్‌డి మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులను సపోర్ట్ చేస్తాయి.నేషనల్ యునిఫైడ్ యూఎస్ఎస్‌డి ప్లాట్‌ఫామ్‌చే అభివృద్థిచేయబడిన ఈ ఇంటర్‌ఫేస్, మిమ్మల్ని మీ టెలికం ఆపరేటర్ ద్వారా మీ బ్యాంకర్‌కు కనెక్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. జీఎస్ఎం నెట్ వర్క్ చానల్స్ ద్వారా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. ఈ సేవలు 11 ప్రాంతీయ భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనికి గాను నిర్దేశించిన షార్ట్ కోడ్స్ ను మొబైల్ కీప్యాడ్ లో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలుగుకోసం *99*24# అని టైప్ చేయాల్సి ఉంటుంది.