digilocker
-
‘డిజీ’ లాకర్‌తో సర్టీఫికెట్లు భద్రం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్వ్యూకి వెళ్లే విద్యార్థి చేతిలో ఫైల్...అందులో విద్యాభ్యాసానికి చెందిన అన్ని సర్టిఫికెట్లు... అవన్నీ ఆర్డర్లో ఉన్నాయా లేదా? అని ముఖంలో కంగారు... అయితే.. ఇప్పటివరకూ ఉన్న పరిస్థితి ఏఐ సాంకేతికతతో మారబోతోందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చెబుతోంది. మౌస్ క్లిక్‌తో క్లౌడ్‌కు కనెక్ట్ అవ్వడం... టెన్త్ దగ్గర్నుంచీ పీహెచ్డీ దాకా డిజిటల్‌గా చూసే విధానానికి నాంది పలుకుతోంది.ఈ ఏడాది డిసెంబర్ నాటికి ‘డీజీ’లాకర్‌ను అందుబాటులోకి తేవాలని అన్ని యూనివర్సిటీలను యూజీసీ ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నీ ఇప్పటికే రంగంలోకి దిగాయి. పరీక్షల విభాగం సమన్వయంతో పైలెట్ ప్రాజెక్టులను మొదలు పెట్టాయి. ఇందులోని సవాళ్లను పరిశీలించిన తర్వాత మరికొన్ని నెలల్లో పూర్తిస్థాయిలో డిజీ లాకర్స్‌ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నాయి. ఎందుకీ లాకర్స్? దీనిద్వారా విద్యార్థి సర్టీఫికెట్లన్నీ డిజిటల్‌గా పొందే వీలుంది. దీనివల్ల సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తేలికగా క్లౌడ్ ద్వారా సర్టీఫికెట్ల ధ్రువీకరణ చేయొచ్చు. నకిలీ సర్టిఫికెట్లు ఉండే అవకాశమే ఉండదు. విద్యారి్థకి టెన్త్ క్లాస్ నుంచే ఒక యూనిక్ ఐడీ కోడ్ ఇస్తారు. దీనిద్వారా క్లౌడ్‌కు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అందులో పూర్తి సమాచారం అందిస్తారు. అక్కడినుంచి టెన్త్, ఇంటర్ బోర్డ్‌లు, యూనివర్సిటీలు సంబంధిత ఐడీకీ సర్టీఫికెట్లను అప్లోడ్ చేస్తాయి. డీజీ లాకర్ వ్యవస్థ కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ ఆధీనంలో, పూర్తి సురక్షితంగా ఉంటుంది.దీంతో సర్టిఫికెట్లు దెబ్బతిన్నాయని, పోయాయని ఆందోళన పడాల్సిన అవసరమే ఉండదు. విదేశీలకు వెళ్లినా కేవలం యూఆర్ఎల్ లింక్ ద్వారా సర్టీఫికెట్లను పొందే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం 2024 పాస్ అవుట్ విద్యార్థుల సర్టిఫికెట్లను అప్లోడ్ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత పదేళ్లలోపు చదివిన విద్యార్థుల సర్టిఫికెట్లు కూడా అందుబాటులోకి తేవడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి అయ్యే మొత్తం ఖర్చు కూడా యూజీసీ భరిస్తుందని వర్సిటీ అధికారులు తెలిపారు. ప్రాక్టికల్‌గా ఎన్నో సవాళ్లు.. డిజీ లాకర్ వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి ప్రాక్టికల్‌గా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల ఆధార్ నంబర్‌ను దీనికి అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అయితే, ఆధార్‌కు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో... దాన్నే లాకర్‌కు ఇవ్వాలి. కానీ విద్యార్థుల్లో చాలామంది తరచూ ఫోన్ నెంబర్లు మారుస్తున్నారు. దీనివల్ల సమస్యలు వస్తున్నాయని జేఎన్టీయూహెచ్ పరీక్షల విభాగం అధికారి సాహూ తెలిపారు. మరోవైపు టెన్త్, ఇంటర్ బోర్డ్‌లతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని, దీనికి ప్రత్యేక యంత్రాంగం ఇప్పటివరకూ లేదని ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో జరిగే దోస్త్ డేటాను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజీ లాకర్ ఎలా పనిచేస్తుంది? విద్యార్థి అన్ని సర్టీఫికెట్లు ఒక క్లౌడ్ ద్వారా నిక్షిప్తం చేస్తారు. విద్యార్థి డీజీ లాకర్ యాప్‌ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటాడు. డీజీ లాకర్ విభాగం ఇచ్చే లాగిన్ పాస్‌వర్డ్‌ను మార్చుకుని భద్రపర్చుకుంటాడు. అవసరమైన సర్టీఫికెట్లను తను ఇంటర్వ్యూ లేదా అడ్మిషన్ పొందే సంస్థలకు మౌస్క్లిక్ లింక్ ద్వారా పంపుకోవచ్చు. యాక్సెస్ ఇవ్వడం ద్వారా ఆయా సంస్థలు సర్టీఫికెట్లన్నీ ఆన్లైన్లోనే తనిఖీలు నిర్వహిస్తాయి. ఒక విభాగాన్ని పరిశీలిస్తున్నాం డిజీ లాకర్‌కు విద్యార్థుల డేటాను డిసెంబర్ నాటికి అప్లోడ్ చేయమని యూజీసీ తెలిపింది. ఇందులో భాగంగా పరీక్షల విభాగం సమన్వయంతో పైలెట్ ప్రాజెక్టు మొదలు పెట్టాం. ఎదురయ్యే సవాళ్లను పరిశీలిస్తున్నాం. విద్యార్థులకు ఇది ఉపయుక్తమైన ప్రాజెక్టు. అయితే, తొలి దశలో అనేక సమస్యలను అధిగమించాల్సి వస్తోంది. – డాక్టర్ కె.విజయకుమార్ రెడ్డి (రెక్టార్, జేఎన్టీయూహెచ్) తొలుత పీజీ విద్యార్థుల సమాచారండిజీ లాకర్ పరిధిలో తొలి విడతగా పీజీ విద్యార్థుల సమాచారం తెచ్చేందుకు ప్రయతి్నస్తున్నాం. ఇందులో ఎదురయ్యే ఇబ్బందులను పరిశీలించి తర్వాత దశకు వెళ్తాం. విద్యార్థుల సర్టీఫికెట్లు సురక్షితంగా, తేలికగా పొందేందుకు డీజీ లాకర్ తోడ్పడుతుంది. – ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ (ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్) -
డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి పోలీసులకు చిక్కారా..? మీకోసమే ‘డిజీలాకర్’
ఏదైనా అత్యవసర సమయాల్లో ప్రయాణాలు చేసి డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారా..? బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేసేపుడు అనుకోకుండా పాన్‌కార్డు మరిచిపోయారా..? టికెట్ రిజర్వేషన్ చేసుకొని ప్రయాణం చేసేపుడు ఆధార్‌కార్డు వెంట తెచ్చుకోవడం గుర్తులేదా..? కంగారు పడకండి. మీ కోసమే ఈ కథనం.నిత్యం ఏదో ఒక సందర్భంలో పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్..వంటి గుర్తింపుకార్డులు అవసరమవుతూ ఉంటాయి. నిత్యం ఫిజికల్‌గా వీటిని వెంటతీసుకెళ్లడం కుదరకపోవచ్చు. కానీ ఎంత అత్యవసరాల్లో అయినా మొబైల్‌ను మాత్రం దాదాపు గుర్తుంచుకుని తీసుకెళ్తుంటాం. మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌లో అన్ని గుర్తింపుకార్డులు డిజిటల్ రూపంలో ఉంటే ఎంత బాగుంటుందో కదా. అయితే, డిజీలాకర్ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. అసలు ఈ లాకర్ ఏంటీ..? దీన్ని ఎలా వినియోగించాలో తెలుసుకుందాం.డిజీలాకర్ఇది కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్. ఇందులో సర్టిఫికెట్లు, కీలకపత్రాలను సురక్షితంగా దాచుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడు సులువుగా వినియోగించుకోవచ్చు. పదోతరగతి సర్టిఫికెట్ నుంచి ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, రేషన్‌కార్డు.. ఇలా ప్రభుత్వం జారీ చేసిన అన్ని డాక్యుమెంట్లనూ డిజిటల్ రూపంలో దాచుకోవడానికి ఈ లాకర్ ఉపయోగపడుతుంది. జీవిత బీమా వంటి ముఖ్యమైన పత్రాలను ఇందులో దాచుకోవచ్చు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయి ట్రాఫిక్ పోలీసులకు చిక్కినా డిజీలాకర్‌లో ఉన్న పత్రాలు చూపించొచ్చు. ఇలా ఎక్కడైనా, ఎప్పుడైనా వీటిని వినియోగించుకోవచ్చు.వినియోగం ఇలా..ప్లేస్టోర్ నుంచి ఫోన్లో డిజీలాకర్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆరంకెల సెక్యూరిటీ పిన్ను వస్తుంది. దాన్ని సంబంధింత బ్లాక్‌లో ఎంటర్ చేయాలి. మీ ఆధార్‌కార్డ్ లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఆధార్ నంబర్ లేదా ఆరంకెల సెక్యూరిటీ పిన్ సాయంతో లాగిన్ అవగానే మీ ఆధార్ కార్డు, పాన్‌కార్డు వివరాలు అందులో కనిపిస్తాయి. యాప్‌లో సెర్చ్ సింబల్‌పై క్లిక్ చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకోగానే పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికెట్ల లిస్ట్ ప్రత్యక్షమవుతుంది. వాటిలో మీ ప్రాంతం, యూనివర్సిటీకి సంబంధించిన ఆప్షన్‌ను ఎంచుకొని హాల్‌టికెట్ నంబర్, ఉత్తీర్ణత పొందిన సంవత్సరం ఎంటర్ చేసి డాక్యుమెంట్లు పొందొచ్చు. వీటితో పాటు రేషన్‌కార్డు..వంటి ప్రభుత్వ గుర్తింపుకార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవసరమైనపుడు ఆ డాక్యుమెంట్లను వినియోగించుకోవచ్చు.ఇదీ చదవండి: లోన్ కావాలా..? సిబిల్ స్కోర్ ఎంత ఉండాలంటే..ఇతర పత్రాలను ఎలా అప్లోడ్ చేయాలంటే..కేవలం ప్రభుత్వం అందించే డాక్యుమెంట్లే కాకుండా ఇతర విలువైన పత్రాలను డిజిటల్ రూపంలో ఈ లాకర్లో భద్రపరచుకోవచ్చు. డిజీలాకర్ యాప్‌లో సైన్-ఇన్ అవ్వగానే కిందకు స్క్రోల్ చేస్తే ‘డిజీలాకర్ డ్రైవ్’ అని ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ‘+’ సింబల్‌పై ప్రెస్ చేయాలి. మీకు కావాల్సిన డాక్యుమెంట్లను మాన్యువల్‌గా అప్లోడ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ మాదిరిగా అక్కడే ప్రత్యేక ఫోల్డర్లు కూడా క్రియేట్ చేసుకొనే సదుపాయం ఉంటుంది. డిజీలాకర్‌లో ప్రతీ యూజర్‌కు 1 జీబీ క్లౌడ్ డేటా లభిస్తుంది. 10 ఎంబీ వరకు సైజ్ ఉన్న ఒక్కో ఫైల్‌ను స్టోర్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సాయంతో ఎక్కడున్నా వీటిని యాక్సెస్ చేయొచ్చు. -
ఆధార్, పాన్ వంటి డాక్యుమెంట్లు ఎలా దాచుకోవాలంటే?
-
డిజిటల్ పత్రాలకు కొత్త ప్లాట్‌ఫామ్ ‘ఈక్వల్’.. ఆవిష్కరించిన జీవీకే
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం జీవీకే గ్రూప్ వైస్ చైర్మన్ సంజయ్ రెడ్డి కుమారుడు కేశవ్ రెడ్డి కొత్తగా ఈక్వల్ పేరిట ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిజిలాకర్, పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా స్టాక్ భాగస్వామ్యంతో దీన్ని రూపొందించారు. యూజర్లు తమ డిజిటల్ పత్రాలను భద్రపర్చుకునేందుకు, ఒక్క క్లిక్‌తో సురక్షితంగా, నిరాటంకంగా షేర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో సుమారు 10 లక్షల బీటా యూజర్లు ఉన్నారని కేశవ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెడ్డి వెంచర్స్, అరాజెన్ లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ ఫౌండేషన్ జీవీకే ఏఎంఆర్ఐ బోర్డుల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. పాన్, ఆధార్ కార్డ్ ఉన్న వారికి గుడ్ న్యూస్!
రేషన్‌కార్డ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటీ ఐడీ కార్డ్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ గుర్తింపు కార్డులలో వేర్వేరు వివరాలు ఉండి వాటిని మార్చుకునేందుకు ఇబ్బంది పడుతున్న వారికి ఊరట కలిగిలించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌లో అడ్రస్ సహా ఎమైనా వివరాలు తప్పుగా ఉండి వాటిని అప్ డేట్ చేస్తే మిగతా డాక్యుమెంట్లలో మార్పులకై ఆయా కార్యాలయాలకు వెళ్లకుండా అన్నింట్లోనూ ఆటోమెటిక్ వివరాలు అప్డేట్ అయ్యేలా కొత్త వ్యవస్థను మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ విభాగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఆధార్ కార్డ్‌తో ఆటో అప్డేట్ ఎలా సాధ్యం? ప్రధానంగా పైన పేర్కొన్నట్లుగా ప్రభుత్వ ఐడీ కార్డ్‌లను డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్‌తో పాటు ఇతర డాక్యుమెంట్లను డిజిలాకర్ (DigiLocker)లో భద్రపరుచుకుంటుంటారు. ఆ డిజిలాకర్‌లో ఉన్న ఆధార్ కార్డులో ఏదైనా అడ్రస్ లేదంటే ఇతర వివరాలు మారిస్తే.. వెంటనే డిజి లాకర్లో ఉన్న మిగిలిన ఐడెంటిటీ కార్డ్‌లలో డేటా సైతం అటోఅప్డేట్ అవుతుంది. ప్రస్తుతం, ఈ ఆటో అప్డేట్పై కేంద్ర ఐటీ శాఖ.. రవాణా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వంటి పరిమిత మంత్రిత్వ శాఖలతో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పాస్‌పోర్ట్‌లను ఆటోమేటిక్‌గా అప్డేట్ చేయడానికి యూజర్లకు అనుమతి ఇచ్చిన తర్వాత ఆధార్ ఆటో అప్డేట్ విధానం అమల్లోకి రానుంది. ఆటో అప్డేట్ సిస్టమ్ ప్రయోజనాలు ఆధార్ ద్వారా డిజిలాకర్‌లో ఉన్న ఐడెంటిటీ కార్డ్‌లను ఆటో అప్డేట్ చేయడం ద్వారా ఆయా డిపార్ట్మెంట్ల సమయం, ఖర్చుల తగ్గింపుతో పాటు ఫేక్ ఐడీ కార్డ్‌ల ముప్పు నుంచి సురక్షితంగా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల కారణంగా తరచు ప్రాంతాలు మారే వారికి ప్రయోజనం కలుగుతుంది. కాగా, గత నెలలో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే విధమైన వ్యవస్థను త్వరలో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
డిజీలాకర్ అంటే? డైనమిక్ కేవైసీతో లాభాలేంటి?
భారత ఫిన్‌టెక్‌ను ఐదు విభాగాలుగా వేరు చూసి చూడొచ్చు. క్యూఆర్ కోడ్ తదితర చెల్లింపులు, బిల్లుల చెల్లింపులు, ఇతర అగ్రిగేటర్ సేవలు, బై నౌ, పే లేటర్ సహా రుణ సదుపాయం, రుణాలిచ్చే ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్‌లు, వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలు. ఈ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి సేవలు పొందాలంటే ప్రజలు గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి (కేవైసీ) ఉంటుంది. గత కొన్నేళ్ల కాలంలో కేవైసీ ప్రక్రియను ఫిన్‌టెక్ సంస్థలు ఎంతో సులభతరం చేశాయి. ఫిన్‌టెక్ సంస్థలు డిజీలాకర్‌లో ఉన్న డాక్యుమెంట్లను పొందే అవకాశం కల్పిస్తామని 2023-24 బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం నిజంగా ఒక పెద్ద మార్పు వంటిదే. డిజిటల్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా భారత ప్రభుత్వం దేశంలో ఫిన్‌టెక్ పరిశ్రమ వృద్ధికి ఎన్నో సదుపాయాలు కల్పించింది. ఆధార్, పీఎం జన్ ధన్ యోజన, వీడియో కేవైసీ, యూపీఐ వంటివి ఎన్నో చేపట్టింది. ఫలితంగా భారత ఫిన్‌టెక్ పరిశ్రమ 2025 నాటికి 1.3 ట్రిలియ్ డాలర్ల స్థాయికి చేరుకోనుంది. డిజీలాకర్ ప్రస్తుతం డిజీలాకర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన డాక్యుమెంట్ల డిజిటల్ కాపీలు స్టోర్ చేసుకునేందుకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయం ఇతర డాక్యుమెంట్లను సైతం డిజీలాకర్‌లో స్టోర్ చేసుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. వెబ్‌బ్రౌజర్, మొబైల్ యాప్ రూపంలో అందుబాటులో ఉన్న డిజీలాకర్‌ను డిజీయాత్ర యాప్‌పై ఐడెండిటీ వెరిఫికేషన్‌కు అనుమతిస్తున్నారు. దీంతో దేశీ విమానాశ్రయాల్లో కాంటాక్ట్‌లెస్ చెకిన్‌కు వీలు లభిస్తోంది. డైనమిక్ కేవైసీ డిజీలాకర్ సాయంతో కేవేసీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంతో కేవైసీ ప్రక్రియ క్రియాశీలంగా మారుతుంది. ఆధార్, పాన్ డేటా ఆధారంగా రిస్క్ సమీక్ష సాధ్యపడుతుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశంలో మరింత విస్తరిస్తుంది. రుణాల లభ్యతను పెంచుతుంది. భారత ఫిన్‌టెక్ పరిశ్రమ దీర్ఘకాల వృద్ధికి బడ్జెట్ ఎంతో ముందడుగు వేసింది సాంకేతిక, విజ్ఞాన ఆధారిత వృద్ధి ప్రాధాన్యతను బడ్జెట్ గుర్తించింది. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, నియంత్రణసంస్థలు కలిగి ఉండే పౌరుల డేటా విషయంలో ఏకీకృత పరిష్కారంపై దృష్టి సారించింది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ సహా ఇతర చర్యలు ఫిన్‌టెక్ పరిశ్రమ వృద్ధికి ఎంతో లబ్ధి కలిగిస్తాయి. క్రెడిట్ కార్డులు యూపీఐతో లింక్ చేయడానికి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కూడా ఆహ్వానించతగినది. -
ఇంటివద్దకే మొబైల్ సిమ్!
న్యూఢిల్లీ: కొత్త మొబైల్ కనెక్షన్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ టెలికం శాఖ (డాట్) ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం కస్టమరు.. ఆన్లైన్లోనే కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని, ఆధార్ లేదా డిజిలాకర్‌లో భద్రపర్చిన ఇతరత్రా గుర్తింపు పత్రాలతో ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంటి వద్దే సిమ్ కార్డు పొందవచ్చు. కొత్త మొబైల్ కనెక్షన్ కోసం విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ యూఐడీఏఐకి సంబంధించిన ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ సర్వీసులను వినియోగించుకున్నందుకు గాను కస్టమర్లు రూ. 1 చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం టెలికం రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణల్లో భాగంగా డాట్ .. తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొత్త మొబైల్ కనెక్షన్ తీసుకోవాలన్నా, ప్రీ–పెయిడ్ నుంచి పోస్ట్–పెయిడ్‌కు లేదా పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ–పెయిడ్ కనెక్షన్‌కు మారాలన్నా కస్టమరు కచ్చితంగా భౌతిక కేవైసీ (కస్టమరు వివరాల వెల్లడి) ప్రక్రియ పాటించాల్సి ఉంటోంది. గుర్తింపు, చిరునామా ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో రిటైల్ షాపునకు వెళ్లాల్సి వస్తోంది. ఆన్లైన్ వినియోగం పెరగడం, కోవిడ్–19 కారణంగా కాంటాక్ట్‌రహిత సర్వీసుల అవసరం నెలకొనడం వంటి పరిణామాల నేపథ్యంలో .. కొత్త విధానం సబ్స్క్రయిబర్స్కు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని డాట్ తెలిపింది. -
డిజిలాకర్: ఆధార్‌ను ఆన్లైన్లోనే దాచుకొవచ్చు!
సాక్షి,హైదరాబాద్: ప్రస్తుత కోవిడ్ మహమ్మారి పరిస్థితులు ‘డిజిటల్ సర్వీసెస్’ను ఫోకస్‌లోకి తీసుకొచ్చాయి. ఏడాది కాలంగా చోటుచేసుకున్న పరిణామాలతో గతంలో డిజిటల్ టెక్నాలజీలను అంతగా అందిపుచ్చుకోని సంప్రదాయ వ్యాపారసంస్థలు, విద్యాసంస్థలు కూడా ఇప్పుడు ఆన్లైన్ కార్యకలాపాలకు షిప్ట్ అయిపోయాయి. గతంలో ఈ సంస్థల లావాదేవీలు, రోజువారీ విధులు, కార్యక్రమాల్లో ఎక్కువగా డాక్యుమెంట్ల రూపంలో కాగితంతో కూడిన ‘ఫిజికల్ డాక్యుమెంట్ అథెంటికేషన్’కున్న ప్రాధాన్యత నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’ప్రణాళికలో భాగంగా ‘డిజిలాకర్’ ఇప్పుడు ముఖ్య భూమికను పోషిస్తోంది. ఎడ్యుకేషన్, బర్త్ సర్టిఫికెట్లు, ఐటీ చెల్లింపు పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ముఖ్యపత్రాలను డిజిలాకర్‌లో దాచుకునే సౌలభ్యం ఏర్పడింది. దీనిద్వారా దేశపౌరులు తమ జనన ధ్రువీకరణపత్రాలు మొదలు విద్యార్హతల సర్టిఫికెట్లు, బిజినెస్ డాక్యుమెంట్లు, ఆదాయపు పన్ను చెల్లింపు పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు ఇలా అనేక రకాల డాక్యుమెంట్లను ఆన్లైన్ డిజిటల్ ఫార్మాట్లో జాగ్రత్తగా దాచుకునే వీలు ఏర్పడింది. ఈ ఏడాది చివరకల్లా యూజర్ల సంఖ్య 8 కోట్లకు... 2015–16లోనే ప్రారంభమైన ఈ వినూత్న ఆలోచన ద్వారా అన్నిరకాల డాక్యుమెంట్లను ఓ ‘సెంట్రల్ రిపోసిటరీ’లో పదిలపరుచుకుని అవసరం పడినపుడు రిజిష్టర్డ్ సొంతదారు వాటిని డిజిటల్ రూపంలో చూపించుకునే సౌలభ్యం చిక్కింది. దీనిని ప్రారంభించిన నాటి నుంచి ఉపయోగించుకునే వారి సంఖ్య క్రమంగా పెరిగినా గతేడాది జూన్–ఆగస్టు మధ్యకాలంలో దేశవ్యాప్తంగా యూజర్స్ రిజిస్ట్రేషన్లు 4 కోట్ల లోపు నుంచి నాలుగున్నర కోట్లకు పెరిగాయి. గతేడాది మార్చి–ఏప్రిల్ నెలల్లో రోజుకు 20 వేల మంది కొత్తయూజర్లు వచ్చి చేరుతుండగా ఇప్పుడు వారి సంఖ్య లక్షకు చేరుకున్నట్టుగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ పరిధిలోని నేషనల్ ఈ–గవర్నెన్స్ డివిజన్ తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది చివరకల్లా దీని రిజిష్టర్డ్ యూజర్ల సంఖ్య 8 కోట్లకు చేరచ్చునని అంచనా వేస్తున్నారు. ఏపీఐ కీలకం... అన్ని రకాల డాక్యుమెంట్లను అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (ఏపీఐ)–లెవల్ ఇంటిగ్రేషన్ ద్వారా డిజిలాకర్ అనుమతిస్తుంది. ఏపీఐ ద్వారా ఒక సాఫ్ట్వేర్ నుంచి మరొక సాఫ్ట్‌వేర్‌కు డేటాను బదిలీ చేసే వీలు ఏర్పడుతుంది. ప్రభుత్వపరంగా ఓపెన్ ఏపీఐ పాలసీ అమల్లో ఉండడంతో డేటా సొంతదారుల నుంచి ప్రభుత్వ ఏజెన్సీల (ఇంటర్ అండ్ ఇంట్రా గవర్నమెంటల్ ఏజెన్సీస్) మధ్య సమర్థవంతంగా ‘డేటా షేర్’చేసుకోడానికి దోహదపడుతోంది. తెలంగాణ విషయానికొస్తే... రాష్ట్రంలో డిజిలాకర్ విధానాన్ని వర్తింపజేస్తూ 2020 నవంబర్ 4న ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఉత్తర్వులు జారీచేసింది. పౌరులకు డిజిటల్ సాధికారతను అందించడంలో భాగంగా డిజిటల్ ఫార్మాట్లో సంబంధిత విభాగాల నుంచి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల యాక్సెస్ చేసేందుకు డాక్యుమెంట్ వ్యాలెట్ ఉపయోగపడుతోంది. పేపర్‌లెస్ గవర్నెన్స్‌లో భాగంగా ఆయా విభాగాలు, రంగాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. అవి... ► వివిధ ప్రభుత్వశాఖలు, పీఎస్‌యూలు, స్వయం ప్రతిపత్తిగల సంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ సంస్థల్లో డిజిలాకర్ సిస్టమ్‌ను అడాప్ట్ చేసుకున్నాయి. ► శాఖలు లేదా ఏజెన్సీలు డిజిలాకర్ ప్లాట్‌ఫామ్‌పై రిజిష్టర్ చేసుకోవాలి. వారి సాఫ్ట్వేర్/సిస్టమ్ (వెబ్, మొబైల్ అప్లికేషన్లు) ఈ ప్లాట్ఫామ్లో అనుసంధానించుకోవాలి. ప్రత్యక్షంగా హార్డ్‌కాపీ సర్టిఫికెట్/డాక్యుమెంట్‌తో సమానంగా దీనిని పరిగణలోకి తీసుకుంటారు. డిజిలాకర్ ద్వారా ఏయే డాక్యుమెంట్లు పరిగణనలోకి... ప్రత్యక్షంగా పేపర్‌తో కూడిన ఆధీకృత డాక్యుమెంట్‌ను చూపడానికి బదులు డిజిలాకర్ ద్వారా దాదాపు 492 ముఖ్యమైన డాక్యుమెంట్లను డిజిటల్ ఫార్మాట్లో పరిగణలోకి తీసుకుంటారు. ఉదా: ఆధార్, పాన్‌కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల ఆర్సీలు, క్లాస్ 10,12 సర్టిఫికెట్లు, ఇన్సురెన్స్పాలసీ డాక్యుమెంట్లు, స్కిల్ సర్టిఫికెట్, లీగల్ హేర్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ సర్టిఫికెట్, ప్రాపర్టీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు తదితరాలు... ఏ విధంగా ప్రయోజనం... ►గతేడాది ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల సందర్భంగా కరోనా కారణంగా విద్యార్థులు కాలేజీకి వచ్చి మార్కుషీట్లు సమర్పించే పరిస్థితి లేదు. నేషనల్ ఈ–గవర్నెన్స్ డివిజన్ ఏపీఐ–లెవల్ వెరిఫికేషన్‌కు అనుమతివ్వడంతో దాదాపు లక్షమంది విద్యార్థులు వ్యక్తిగతంగా వచ్చి సర్టిఫికెట్లను సమర్పించకుండానే అడ్మిషన్లు పొందారు. ► కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ కోసం కర్ణాటక పోలీస్ శాఖ అభ్యర్థుల 10,12 తరగతుల సర్టిఫికెట్లను డిజిలాకర్ ద్వారా పరిశీలించింది. లక్షలాది మంది దరఖాస్తు చేసుకోవడంతో వాటిని వ్యక్తిగతంగా పరిశీలనకు ఆరునెలలకు పైగా సమయం పట్టి ఉండేది. దీంతో రిక్రూట్మెంట్ ప్రక్రియ 7,8 నెలలు ఆలస్యం కాకుం డా డిజిటల్ వెరిఫికేషన్ దోహదపడింది. ► డిజిలాకర్ ద్వారా డిజిటల్ ఇన్సూరెన్స్ పాలసీలను జారీచేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్ని బీమా కంపెనీలకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. ► నేషనల్ అకడెమిక్ డిపొసిటరీ (ఎన్ఏడీ)డిజిలాకర్ను ఏకైక రిపొసిటరీగా చేసుకుంది. ► నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కూడా డిజిలాకర్ను ఉపయోగిస్తోంది. డిజిలాకర్ నమోదు ఎలా ? డిజిలాకర్ యాప్‌ను మొబైల్ (యాపిల్, ఆండ్రాయిడ్) ఫోన్లలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://digilocker.gov.in/ లేదా https://accounts.digitallocker.gov.in/వెబ్సైట్ల ద్వారా నమోదు చేసుకోవచ్చు. కావాల్సినవి... ►పేరు, పుట్టినతేదీ, మొబైల్ ఫోన్, ఆధార్ నంబర్ ►మొబైల్ ఫోన్‌ను ఆధార్ నంబర్‌ను అథెంటికేట్ చేస్తూ వన్టైమ్పాస్ వర్డ్ వస్తుంది. ►ఆ తర్వాత ఆథెంటికేషన్ కోసం సెక్యూరిటీ పిన్ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 80 లక్షల దాకా డిజి యూజర్స్... ‘ఎక్కువగా మీ–సేవా ద్వారా సర్టిఫికెట్ల జారీ, ఇతర కార్యకలాపాలు సాగుతున్నాయి. వివిధ శాఖలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 80 లక్షల దాకా డిజిలాకర్ రిజిష్టర్ యూజర్స్ ఉన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని మరింత ఉపయోగించుకునేందుకు ముందుకు రావాలి. తమ మొబైల్, ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసుకోవాలి. తదనుగుణంగా డిజిలాకర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. విద్యార్థుల సర్టిఫికెట్లకు సంబంధించి యూనివర్సిటీలు, వాహన లైసెన్స్‌లు, ఆర్సీలు తదితర డాక్యుమెంట్ల కోసం రవాణాశాఖ తదితరాలు మరింతగా భాగస్వామ్యమైతే ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. ఈ విషయమై వర్సిటీలకు లెటర్స్ పంపించాం. –శ్రీనివాస్ పెండ్యాల, రాష్ట్ర నోడల్ ఆఫీసర్, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ కోవిడ్‌తో కొంత మేర అంతరాయం... రాష్ట్రంలో ఇప్పటికే మీ–సేవా కేంద్రాల ద్వారా ఆదాయ ధ్రువీకరణపత్రాలు, ఇతర డాక్యుమెంట్లు అప్లోడ్ అవుతున్నాయి. డిజిలాకర్‌లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. పీడీఎస్, రేషన్‌కార్డులు కూడా చేయబోతున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడం ద్వారా డిజిలాకర్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని యూనివర్సిటీలకు కూడా రాశాం. అయితే కోవిడ్ పరిస్థితుల కారణంగా కొంత అంతరాయం ఏర్పడుతోంది. విద్యాశాఖ కూడా ఈ దిశలో చర్యలు చేపడుతోంది. తద్వారా ఎంసెట్, ఇతర కోర్సుల్లో కౌన్సెలింగ్ అపుడు సులభమౌతుంది. రవాణాశాఖకు సంబంధించి ‘ఎం వ్యాలెట్’ను డిజిలాకర్‌తో అనుసంధానించాల్సి ఉంది. ఇది ప్రభుత్వం వెరిఫై చేయాల్సిన పత్రాలకు సంబంధించినది అయినందున, హార్డ్‌కాపీలు వెంట తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి. వివిధ కార్యకలాపాల నిమిత్తం లబ్ధిదారులు లేదా అభ్యర్థుల నుంచి డాక్యుమెంట్లు కోరుతున్న వివిధ ప్రభుత్వ శాఖలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సి ఉంది. డిజిలాకర్ సౌకర్యాన్ని వినియోగించుకునేలా పౌరుల్లో మరింత అవగాహన, ప్రచారం కల్పించాల్సి ఉంది. ఈ విధానంలో పూర్తి భద్రత ఉంది. – గునవలన్, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఈ–గవర్నెన్స్ ప్రతినిధి -
పాస్‌పోర్ట్‌కూ ‘డిజి లాకర్’
సాక్షి, అమరావతి: డిజి లాకర్ సౌకర్యాన్ని కేంద్ర విదేశాంగ శాఖ పాస్‌పోర్ట్‌కు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. పాస్‌పోర్టు దరఖాస్తుదారులు డిజి లాకర్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని.. తమకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను అందులో దాచుకోవచ్చు. దీని వల్ల పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లేటప్పుడు సర్టిఫికెట్లను వెంట తీసుకువెళ్లే శ్రమ తప్పుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని.. నేరుగా పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లి డిజి లాకర్ ఉందని చెబితే చాలు.. డాక్యుమెంట్లను వాళ్లే వెరిఫై చేస్తారు. ఆన్లైన్లో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలోనే డిజి లాకర్ ఆప్షన్ కావాలా? అని అడుగుతుంది. అవసరమని జవాబిస్తే.. మీకు మంజూరయ్యే పాస్‌పోర్ట్ ఒరిజినల్ సైతం డిజి లాకర్లో ఉంచుతారు. దీని వల్ల మన పాస్‌పోర్ట్ ఎక్కడైనా పోతుందేమోననే భయం వదిలిపెట్టవచ్చు. డిజి లాకర్ అంటే.. డిజి లాకర్ అంటే డిజిటల్ లాకర్ అని అర్థం. ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. విలువైన డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లే అవసరం లేకుండా.. కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తూ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీనికి చేయాల్సిందల్లా http://digilocker.gov.in అనే వెబ్‌సైట్‌కు వెళ్లి అకౌంట్ నమోదు చేసుకోవాలి. అనంతరం మన డాక్యుమెంట్లను అందులో నిక్షిప్తం చేసుకోవచ్చు. వాటిని అవసరమైనప్పుడల్లా ఉపయోగించుకోవచ్చు. గెజిటెడ్ అటెస్టేషన్ కూడా అక్కర్లేదు.. డిజి లాకర్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఎవరూ డాక్యుమెంట్లు తీసుకురానవసరం లేదు. గెజిటెడ్ అటెస్టేషన్ అక్కర్లేదు. వారం రోజులుగా దీనిపై ట్రయల్ రన్ నిర్వహించాం. పాస్‌పోర్ట్‌ను కూడా డిజిలాకర్లోదాచుకోవచ్చు. –శ్రీనివాసరావు, ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి, విజయవాడ -
పెన్షన్ పొందేవారికి కేంద్రం శుభవార్త
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెన్షన్ తీసుకునే వారికి కొత్త ఏడాదిలో కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసే వారు లేదా ఇప్పటికే పెన్షన్ తీసుకునే వారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచే ఒక్క చిన్న క్లిక్‌తోనే పెన్షనర్లు పీపీఓను ప్రింట్ తీసుకోవచ్చు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇ-పిపిఓను అభివృద్ధి చేసిన అధికారులను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభినందించారు. లాక్ డౌన్ సమయంలో చాలా మంది పెన్షన్ దారులు పీపీవో గురించి ఆందోళన చెందారని.. ఇకపై ఈ కొత్త ఇ-పిపిఓ ద్వారా వారికీ అన్ని రకాల సమస్యలు తొలగనున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.(చదవండి: సెకండ్ రౌండ్లో టీకా తీసుకోనున్న మోదీ?!) ఇకపై పెన్షన్ దారులు ఆన్లైన్లోనే పీపీవోను పొందొచ్చు. లాక్ డౌన్లో ఉద్యోగ పదవీ విరమణ చెందిన వారికి ఈ సర్వీసులు వల్ల చాలా లాభం కలుగనుంది అని మంత్రి పేర్కొన్నారు. పీపీవో ఆర్డర్ చేతికి రాని వారు ఆన్లైన్లోనే పీపీవో డౌన్లోడ్ చేసుకోవడం వల్ల పెన్షన్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొరని తెలిపారు. ఉద్యోగ పదవీ విరమణ చెందిన లేదా ప్రభుత్వం పెన్షన్ పెంచిన వారికీ పీపీవో అవసరం అవుతుంది. కరోనా కారణంగా పెన్షన్ దారులు చాలా ఇబ్బందులు పడాల్సివచ్చింది. ఇప్పుడు డిజి-లాకర్‌తో అనుసందించబడిన పిఎఫ్ఎంఎస్ ద్వారా ఎలక్ట్రానిక్ పిపిఓ కాపీని సులభంగానే పొందవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు భవిష్య అకౌంట్‌ను డిజి లాకర్ అకౌంట్‌తో లింక్ చేసుకోవాలి. -
మీ డాక్యుమెంట్లు భద్రమేనా...
ఒకప్పటితో పోలిస్తే నేటి జీవనంలో ఆర్థిక లావాదేవీల పాత్ర మరింత ఎక్కువైందనే చెప్పుకోవాలి. వ్యక్తుల ఆర్జనా శక్తి పెరిగినందున.. అవసరాలు, ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి. ప్రాపర్టీలు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు, బీమా పాలసీలు, బ్యాంకు ఖాతాలు.. లిస్ట్ పెద్దగానే ఉంటుంది. కానీ, వీటికి సంబంధించి డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకుంటున్నామా? తప్పకుండా ఉంచుకోవాలి. వీటికి సంబంధించిన డిజిటల్ ఆధారాలను ఎక్కడ నిల్వ చేస్తున్నారు? సాధారణంగా ఈ డిజిటల్ డాక్యుమెంట్లు మెయిల్ బాక్స్‌లకు వస్తుంటాయి. స్టాక్స్‌లో లావాదేవీలకు సంబంధించిన కాంట్రాక్టులు కూడా ఏ రోజుకారోజు మెయిల్ బాక్స్‌కు వస్తుంటాయి. బీమా కంపెనీలు అయితే ప్రస్తుతం ఈ పాలసీ పత్రాలను రిజిస్టర్డ్ ఈ మెయిల్ అడ్రస్‌లకు పంపిస్తున్నాయి. పాలసీ ప్రీమియం సర్టిఫికెట్లను కూడా మెయిల్‌కు పంపిస్తున్నాయి. ఇలా భారీగా వచ్చే డిజిటల్ డాక్యుమెంట్లను ‘డిలీట్’ కొట్టేసేవారూ ఉన్నారు. కానీ, వేటి అవసరం ఎంత మేరకు అన్నది తెలుసుకోకుండా డిలీట్ చేయవద్దు. ప్రతీ డాక్యుమెంట్‌ను ఎంత కాలం పాటు ఉంచుకోవాలన్నది తెలిస్తే.. అప్పుడు వాటి నిర్వహణ సులువవుతుంది. ఐటీ... ఏటా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడంతో పని అయిపోయిందని భావిస్తే అది తప్పే అవుతుంది. ఆదాయపన్ను రిటర్నుల్లో పేర్కొన్న ఆదాయం, పెట్టుబడులు, ఇతరత్రా వనరుల సమాచారానికి సంబంధించిన ఆధారాలు కూడా మీ వద్ద భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ‘‘పన్ను చెల్లింపుదారు తన పన్ను వివరాలను, ఇందుకు సంబంధించిన ఇతర డాక్యుమెంట్లు, ఆధారాలను కనీసం ఏడేళ్లపాటు ఉంచుకోవాలి. ఏడేళ్ల వరకు ఏదేనీ ఆసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన రిటర్నులను తిరిగి విచారించే అధికారం ఆదాయపన్ను శాఖా అధికారులకు ఉంటుంది’’అని ఎన్ఏ షా అసోసియేట్స్ పార్ట్నర్ గోపాల్ బోహ్రా తెలిపారు. ఒకవేళ గత కాలానికి సంబంధించి రిటర్నుల విషయమై ఏదైనా వివాదం ఆదాయపన్ను శాఖతో నెలకొని ఉంటే.. అది పరిష్కారం అయ్యే వరకు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను తప్పకుండా ఉంచుకోవాలని సూచించారు. ‘‘పన్ను చెల్లింపుదారుల ప్రాంగణాల్లో ఆదాయపన్ను శాఖా సోదాలు నిర్వహించినట్టయితే.. ఆ సందర్భంగా రూ.50 లక్షలకు మించి ఆస్తి లేదా ఆదాయాన్ని అసెసింగ్ అధికారి గుర్తించితే, అప్పుడు 10 ఏళ్ల నాటి పాత రికార్డులను కూడా తిరిగి విచారించే అధికారం కలిగి ఉంటారు’’ అని బోహ్రా వివరించారు. విదేశీ మార్గంలో ఆదాయాన్ని కలిగి ఉంటే లేదా విదేశీ ఆస్తి కలిగి ఉంటే సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటి నుంచి 17 ఏళ్ల పాటు ఆయా ఆధారాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆదాయాన్ని దాచిపెట్టినట్టు పన్ను అధికారులు భావిస్తే.. సంబంధిత అసెస్మెంట్ను తిరిగి తెరిచేందుకు చట్ట ప్రకారం వారికి 17 ఏళ్ల పాటు అధికారం ఉంటుంది. ► బ్యాంకు పత్రాలు రుణాలు తీసుకుని, చెల్లింపులు పూర్తయిన తర్వాత అందుకు సంబంధించిన ఆధారాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. ‘‘రుణాన్ని పూర్తిగా చెల్లించేసినప్పటి నుంచి కనీసం ఎనిమిదేళ్ల పాటు డాక్యుమెంట్లను అలాగే ఉంచుకోవాలి. ఏవైనా వివాదాలు తలెత్తితే పరిష్కరించుకునేందుకు ఆధారంగా ఇంతకాలం పాటు వాటిని భద్రపరుచుకుంటే సరిపోతుంది’’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి సూచించారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కూడా బ్యాంకులు ఐదు నుంచి ఎనిమిదేళ్ల పాటు పత్రాలను నిల్వ చేయాల్సి ఉంటుంది. కనుక ఇంత కాలం పాటు రుణాన్ని తీర్చివేసిన ఆధారాలను ఉంచుకుంటే సరిపోతుంది. భద్రత ఎక్కడ..? డాక్యుమెంట్లను నిల్వ చేసుకునేందుకు పలు మార్గాలున్నాయి. మీ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో పదిలపరుచుకోవచ్చు. లేదంటే పెన్‌డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్‌లు కూడా ఉన్నాయి. ఆన్లైన్లో క్లౌడ్ స్టోరేజీ సదుపాయాలు కూడా విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ముఖ్యమైన పత్రాలను తమ ఈ మెయిల్ బాక్స్‌లోనే ఉంచేస్తుంటారు. ‘‘ఈ మెయిల్లో నిల్వ చేయడం అన్నది భద్రతా పరంగా సురక్షితమైనది కాదు. ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవడంతోపాటు పాస్‌వర్డ్‌తో వాటికి రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. బిట్లాకర్ను ఇందుకు వినియోగించుకోవచ్చు’’ అని ఇన్ఫ్రాసాఫ్ట్ టెక్ ప్రొడక్ట్, ఇన్నోవేషన్ హెడ్ మనోజ్ చోప్రా తెలిపారు. బిట్లాకర్లో ఎన్క్రిప్షన్ సదుపాయం ఉంటుంది. దీంతో ఇందులో నిల్వ చేసుకునే డాక్యుమెంట్లకు రక్షణ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా క్లౌడ్ రూపంలోనూ డాక్యుమెంట్లను భద్రపరచుకునే అవకాశం ఉంది. గూగుల్ డాక్యుమెంట్స్, ఐక్లౌడ్, డ్రాప్‌బాక్స్ ఇటువంటివే. స్కాన్ చేసిన డాక్యుమెంట్లను వీటిల్లో స్టోర్ చేసుకుని ఎక్కడి నుంచి అయినా తిరిగి పొందొచ్చు. ముఖ్యమైన, అవసరమైన డాక్యుమెంట్లను లోకల్‌గా (కంప్యూటర్లు, డిస్క్‌లు) స్టోర్ చేసుకోవడంతోపాటు.. వాటి బ్యాకప్ తీసుకుని కనీసం రెండు క్లౌడ్ వేదికల్లో అయినా పదిలం చేసుకోవాలని చోప్రా సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజీ లాకర్ కూడా ఇందుకు చక్కని వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ బీమా పాలసీ డాక్యుమెంట్‌తోపాటు, కట్టిన ప్రీమియం రసీదులను కూడా భద్రంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. దీనివల్ల భవిష్యత్తులో క్లెయిమ్ పరంగా ఎటువంటి సమస్యలు ఎదురైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ‘‘పన్ను మినహాయింపులు పొందాలని భావిస్తే అందుకు ప్రీమియం చెల్లింపుల రసీదులను సిద్ధంగా ఉంచుకోవాలి. దీంతో అవసరమైతే రిటర్నులతోపాటు జత చేయడానికి వీలుంటుంది’’ అని పాలసీఎక్స్ డాట్ కామ్ సీఈవో నావల్ గోయల్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరి, అందుకు అయ్యే చికిత్సా ఖర్చులను తిరిగి పొందినట్టయితే అందుకు సంబంధించిన పత్రాలను, కారు మరమ్మతులకు చేసుకునే బీమా క్లెయిమ్ ఆధారాలను కూడా దీర్ఘకాలం పాటు భద్రంగా ఉంచుకోవడం అవసరమని గోయల్ సూచించారు. పోర్టబిలిటీ సమయంలో ఇవి ఉపయోగపడతాయన్నారు. బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్న ఈ ఇన్సూరెన్స్ అకౌంట్‌ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ‘‘మీ కుటుంబం, మీకు సంబంధించిన బీమా పత్రాలను ఇందులో భద్రంగా నిల్వ చేసుకోవచ్చు’’ అని చెప్పారు. ► మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీస్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్లలో మీకున్న పెట్టుబడుల వివరాలన్నింటినీ ఒకే నివేదిక రూపంలో క్రోడీకరించి ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ సంస్థలు కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ (సీఏఎస్) పేరుతో ప్రతీ త్రైమాసికానికి ఇస్తుంటాయి. వీటిని కుటుంబ సభ్యుల్లో ఒకరితో పంచుకునేందుకు గాను ఆటో ఫార్వార్డ్‌ను ఎంచుకోవాలి. ఒక్క మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి అయితే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (క్యామ్స్) నుంచి ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ను తీసుకుంటే చాలు. వేతన జీవులు అయితే తమ స్టాక్, మ్యూచువల్ ఫండ్ ఖాతాల స్టేట్మెంట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్వయం ఉపాధిలో ఉన్న వారు అయితే వీటిని కనీసం ఆరేళ్ల వరకు పదిలంగా ఉంచుకోవడం అవసరం. ► ఇవి చాలా కీలకం ఆస్తుల కొనుగోలు, అమ్మకాల పత్రాలను లావాదేవీ జరిగిన నాటి నుంచి కనీసం ఏడేళ్ల వరకు అయినా ఉంచుకోవడమే మంచిది. ఎందుకంటే ఆదాయపన్ను శాఖ ఏడేళ్లలోపు ఎప్పుడైనా తిరిగి పరిశీలించే చర్య తీసుకోవచ్చు. ‘‘పన్ను చెల్లింపుదారులు తప్పకుండా డాక్యుమెంట్లను అట్టిపెట్టుకోవాల్సిందే. ఆభరణాల కొనుగోళ్ల రసీదులు, అలాగే పెయింటింగ్, ఇళ్ల మరమ్మతులు, నవీకరణకు చేసే ఖర్చులకు సంబంధించిన ఆధారాలను కూడా ఉంచుకోవాలి. దీంతో ఆయా ఆస్తుల విక్రయం తర్వాత పన్ను తగ్గింపులను ఆదాయపన్ను శాఖ తిరస్కరించదు’’ అని బోహ్రా తెలియజేశారు. ► డిజీలాకర్ ఉచితంగా మీ డాక్యుమెంట్లను స్టోర్ చేసుకునే వేదిక ఇది. దీంతో భౌతికంగా పత్రాలను ఉంచుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. ఇందులో స్టోర్ చేసే డేటా, డాక్యుమెంట్లు అంతా క్లౌడ్ రూపంలోనే ఉంటాయి కనుక ఎక్కుడి నుంచి అయిన వాటిని పొందే వెసులుబాటు ఉంటుంది. పీడీఎఫ్, జేపీఈజీ, పీఎన్జీ రూపాల్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లపై ఈసైన్(ఎలక్ట్రానిక్ రూపంలో సంతకం) చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఇవి సెల్ఫ్ అటెస్టేషన్ కాపీలుగా పనికి వస్తాయి. డిజిలాకర్‌లో అకౌంట్ కోసం మొబైల్ నంబర్ అవసరం ఉంటుంది. ఆధార్ డేటా బేస్‌లో నమోదైన మొబైల్ నంబర్‌ను కూడా వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాలను జ్టి్టpట://ఛీజీజజీ ౌఛిజ్ఛుట.జౌఠి.జీn/ వెబ్ సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. -
ఇక సొంతంగానే యూఏఎన్: ఈపీఎఫ్ఓ
న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి(ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్) సంస్థ తమ చందాదారుల కోసం కొత్త సౌకర్యాన్ని శుక్రవారం అందుబాటులోకి తీసుకువచ్చింది. సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఏఎన్)ను ఉద్యోగులు ఇకపై సొంతంగా ఆన్లైన్లో పొందవచ్చు. ఉద్యోగాలు మారినా యూఏఎన్ ఒకటే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు యూఏఎన్‌ను పొందాలంటే తమ యాజమాన్యం ద్వారా పొందాల్సి వచ్చేది. ఇకపై ఉద్యోగులు ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ ద్వారా తామే యూఏఎన్‌ను జనరేట్ చేసుకోవచ్చు. అలాగే, 65 లక్షల పెన్షన్ ఖాతాదారులకు కూడా ఈపీఎఫ్ఓ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వారు తమ పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌ను ఇకపై డిజీలాకర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. భవిష్య నిధి సంస్థ 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ ఈ సౌకర్యాలను ప్రారంభించారు. -
డిజీలాకర్‌లో ఉంటేనే..!
న్యూఢిల్లీ: ‘డిజీలాకర్’ లేదా ‘ఎంపరివాహన్’ యాప్‌ల్లో ఈ– ఫార్మాట్లో నిక్షిప్తం చేసిన డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ కాగితాలు సాధారణ డాక్యుమెంట్ల మాదిరిగానే చెల్లుబాటు అవుతాయని కేంద్ర రవాణా, రహదారుల శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే, ఆ రెండు యాప్‌ల్లో ఉన్న డాక్యుమెంట్లనే వాస్తవ పత్రాలుగా పరిగణనలోకి తీసుకుంటామని, వేరే యాప్‌ల్లోని లేదా ఇతర ఏ రకమైన ఈ– డాక్యుమెంట్లను పరగణించబోమని స్పష్టం చేసింది. ఆర్సీ, ఇన్యూరెన్స్, ఫిట్నెస్ అండ్ పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్.. తదితర సర్టిఫికెట్లను ఈ–ఫార్మాట్లో ఉన్నా ఆమోదించాలని నవంబర్ 2018లో కేంద్ర మోటారు వాహన చట్ట నిబంధనల్లో చేర్చామని పేర్కొంది. ఎంపరివాహన్ యాప్‌ను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కోసం ఎన్ఐసీ రూపొందించగా, డిజీలాకర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు సంబంధించినది. -
డిజిలాకర్ వినియోగం ఇలా...!
ఈ సారి ఎప్పుడైనా రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు మీ వాహనాన్ని ఆపితే ఎంచక్కా జేబులోంచి మొబైల్‌ఫోన్ తీసి డిజిటల్ రూపంలో భద్రపరిచిన వాహన పత్రాలు చూపించొచ్చు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్కు, ఇన్సురెన్స్, తదితర ధృవీకరణపత్రాలను కాగిత రూపంలోనే కాకుండా అవి డిజిటల్ రూపంలో ఉన్నా అధికారికంగా చెల్లుబాటు అవుతాయని తాజాగా కేంద్ర రోడ్డురవాణా, జాతీయ రహదారుల శాఖ ప్రకటించింది. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని అన్ని రాష్ట్రాల రవాణాశాఖలను కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో డిజిలాకర్ యాప్ లేదా ఎం పరివాహన్ ప్లాట్ఫోమ్లో ఈకాపీల రూపంలో వివిధ డాక్యుమెంట్లు ఇలా దాచుకోవచ్చు... డ్రైవింగ్‌కు సంబంధించిన పత్రాలే కాకుండా ఓటరు ఐడీకార్డు, ఆధార్‌కార్డు, విద్యాసంబంధిత సర్టిఫికెట్లు ఏవైనా డిజిలాకర్ మొబైల్ యాప్‌లో నిక్షిప్తం చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ వెబ్సైట్లతో పాటు మొబైల్ ఫోన్లలోనూ అందుబాటులో ఉంది. మీ డాక్యుమెంట్లన్నింటిని డిజిటల్ లాకర్లో భద్రపరుచుకోవడమే ’డిజిలాకర్’. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో పనిచేస్తుంది.ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్ నెంబర్లకు దీనిని లింక్చేస్తారు. క్లౌడ్ పద్ధతిలో (ఓ సాఫ్ట్వేర్)లో డేటానంతా స్టోర్ చేస్తారు. మీ డాక్యుమెంట్లను పీడీఎఫ్, జేపీఈజీ లేదా పీఎన్జీ ఫార్మాట్లో స్కాన్ చేసి వాటిని ఆ యాప్‌లో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఎప్పుడు అవసరం పడినా దాని నుంచి వాటిని ఉపయోగించవచ్చు. అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లపై మీరు ఎలక్ట్రానిక్(ఈ) సంతకం కూడా చేయొచ్చు. ఈ విధంగా మీ పత్రాలపై మీరు సొంతంగా అటెస్ట్ చేసినట్టు అవుతుంది. అదే విధంగా సీబీఎస్ఈ, రిజిస్ట్రార్ ఆఫీస్ లేదా ఆదాయపన్ను శాఖలు కూడా వారి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల ఎలక్ట్రానిక్ కాపీలు కూడా నేరుగా మీ ఈలాకర్లోకి పంపవచ్చు. ఆధార్ పథకాన్ని అమలుచేస్తున్న ’యూనిక్ ఇండెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సంస్థతో పాటు, రోడ్డురవాణా, హైవేల మంత్రిత్వశాఖ. ఆదాయపు పన్ను శాఖ, సీబీఎస్ఈ తో సహా వివిధ స్కూలు బోర్డులు, వివిధ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, సంస్థలు డిజిలాకర్‌లో రిజిష్టరయి ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం 1.35 కోట్ల మంది డిజిలాకర్ను ఉపయోగిస్తున్నారు. పాన్‌కార్డులు, మార్కుషీట్లు, కుల, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు, రేషన్‌కార్డులు ఇలా వివిధ సేవల కోసం దానిని వాడుతున్నారు. ఎలా ఉపయోగించాలి... డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ సిస్టమ్‌లో ముందుగా డిజిలాకర్ వెబ్‌సైట్‌కు వెళ్లడం లేదా స్మార్ట్‌ఫోన్‌లో డిజిలాకర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. వన్ టైమ్ పాస్వర్్డ కోసం మీ ఆధార్‌కార్డు, మొబైల్‌నెంబర్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించాలి. ఏదైనా సంస్థ మీ ఈడాక్యుమెంట్లను అందులో అప్లోడ్ చేసినా మీ అకౌంట్లో కనిపిస్తుంది. మీ డాక్యుమెంట్లు కూడా మీరే స్వయంగా అప్లోడ్ చేయడంతో పాటు వాటిపై సంతకం చేయొచ్చు. ఈ డాక్యుమెంట్లను ఇతరులతో పంచుకునే (షేర్ చేసుకునే) సౌకర్యాన్ని కూడా మీరు పొందవచ్చు. దీని కోసం ఈడాక్యుమెంట్లో లింక్ షేర్ చేయాల్సి ఉంటుంది. -
డిజిలాకర్ను అంగీకరించండి
న్యూఢిల్లీ: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) తదితర వాహన సంబంధిత ధ్రువపత్రాలను డిజిలాకర్ లేదా ఎం–పరివాహన్ యాప్ ద్వారా అంగీకరించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. మోటార్ వాహనాల చట్టం–1988, సమాచార, సాంకేతిక చట్టం–2000 ప్రకారం ఆ ఎలక్ట్రానిక్ ధ్రువపత్రాలను రవాణా శాఖ జారీ చేసిన ఒరిజినల్స్‌తో సమానంగా పరిగణించాలంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. కొత్త వాహనాలఇన్సూరెన్స్ వివరాలు, రెన్యువల్ ఇన్సూరెన్స్ వివరాలను ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బోర్డు ‘వాహన్’ డేటాబేస్‌లోకి ప్రతి రోజూ అప్లోడ్ చేస్తుందని, ఇవన్నీ ఎం–పరివాహన్ లేదా ఈ–చలాన్ యాప్‌లో కనిపిస్తాయని స్పష్టం చేసింది. ఇన్సూరెన్స్ వివరాలు సదరు యాప్‌ల్లో కనిపిస్తే ఒరిజినల్ ధ్రువపత్రాలు చూపించాల్సిన అవసరం లేదని పేర్కొంది. -
‘డిజిలాకర్’లో ఉన్నా చాలు!
న్యూఢిల్లీ: ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డులు వెంట లేకుండా రైలు ప్రయాణం చేస్తున్న వారు రిజర్వేషన్, రాయితీలను వినియోగించుకోవడానికి ఇక ఇబ్బందిపడనక్కర్లేదు. డిజిలాకర్‌లో భద్రపరచిన గుర్తింపు కార్డుల సాఫ్ట్ కాపీలను కూడా అనుమతిస్తామని తాజాగా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రెండు కాపీలను చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రాలుగా భావించాలని అన్ని జోన్ల ప్రిన్సిపల్ కమర్షియల్ మేనేజర్లకు లేఖలు పంపింది. డిజిలాకర్ ఖాతాలోని ‘ఇష్యూడ్ డాక్యుమెంట్స్’ సెక్షన్లో పొందుపరచిన ఆధార్, డ్రైవింగ్ లైసెన్సులను చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రాలుగా పరిగణించాలని సూచించింది. అయితే ప్రయాణికుడు స్వయంగా అప్లోడ్ చేసిన ‘అప్లోడెడ్ డాక్యుమెంట్స్’ విభాగంలోని సాఫ్ట్ కాపీలను అనుమతించమని స్పష్టం చేసింది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్రం ప్రారంభించిన క్లౌడ్‌బేస్డ్ ‘డిజిలాకర్’లో ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్లను భద్రపరచుకోవచ్చు. -
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : రైలుల్లో ప్రయాణించే వారికి ఐడెంటీ ప్రూఫ్స్ తప్పనిసరి. ఒకవేళ అవి పోగొట్టుకుంటే ఎలా అని చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఏం ఆందోళన చెందక్కర్లేదట. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ డిజిటల్ వెర్షన్లను ఐడీ ప్రూఫ్స్ అంగీకరిస్తామని దేశీయ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. దేశీయ రైల్వే గుర్తింపు ధృవీకరణలుగా మీ డిజిలాకర్ అందించే ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ సాఫ్ట్ కాపీలను అంగీకరిస్తుందని గురువారం ప్రకటించింది. పలు కీలకమైన అధికారిక డాక్యుమెంట్లను స్టోర్ చేసుకోవడానికి ప్రభుత్వం ఈ డిజిటల్ స్టోరేజ్ సర్వీసులను అందిస్తోంది. ఈ విషయంపై అన్ని జోనల్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు రైల్వే ఓ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు గుర్తింపు ధృవీకరణలను, వాలిడ్‌గా భావిస్తామని రైల్వే చెప్పింది. ‘డిజిలాకర్ అకౌంట్లోకి లాగిన్ అయి ఇష్యూడ్ డాక్యుమెంట్ల సెక్షన్‌కు వెళ్లి ప్రయాణికులు ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తే, దాన్ని వాలిడ్ గుర్తింపుగానే ధృవీకరించాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వపు డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా.. డిజిలాకర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను, ఆధార్‌ను డిజిటల్‌గా అందిస్తోంది. సీబీఎస్ఈతో కూడా ఇది భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. -
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లాల్సిన పనిలేదు!
న్యూఢిల్లీ: వాహనచోదకులకు శుభవార్త. తరచూ డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్ సీ) లను మర్చిపోయి బయటకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారా? ఇక ముందు అలాంటి సమస్యలు ఉండవు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో 'డిజీ లాకర్' యాప్ ను ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా ఏ ప్రాంతం నుంచి అయినా మొబైల్ ను ఉపయోగించి డీఎల్, ఆర్ సీ లను చూసుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు, ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు యాప్ ద్వారా వ్యక్తుల వివరాలను కూడా తెలుసుకోవచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. 'డిజీ లాకర్'లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు నంబర్ ను మొబైల్ నంబర్ తో లింక్ చేయాల్సి వుంటుందని చెప్పారు. ఈ యాప్ ను ఐటీ, రవాణా శాఖల మంత్రులు బుధవారం విడుదల చేయనున్నారు. డీఎల్, ఆర్ సీల్లో ఏవైనా తేడాలు ఉంటే పెనాల్టీ పాయింట్లను జోడించే వెసులుబాటు కూడా ఇందులో ఉంది. తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలు ఈ-చలాన్లు జారీ చేయడంలో దేశంలోనే ముందున్నాయి.