న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెన్షన్ తీసుకునే వారికి కొత్త ఏడాదిలో కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసే వారు లేదా ఇప్పటికే పెన్షన్ తీసుకునే వారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచే ఒక్క చిన్న క్లిక్‌తోనే పెన్షనర్లు పీపీఓను ప్రింట్ తీసుకోవచ్చు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇ-పిపిఓను అభివృద్ధి చేసిన అధికారులను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభినందించారు. లాక్ డౌన్ సమయంలో చాలా మంది పెన్షన్ దారులు పీపీవో గురించి ఆందోళన చెందారని.. ఇకపై ఈ కొత్త ఇ-పిపిఓ ద్వారా వారికీ అన్ని రకాల సమస్యలు తొలగనున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.(చదవండి: సెకండ్ రౌండ్‌లో టీకా తీసుకోనున్న మోదీ?!)
ఇకపై పెన్షన్ దారులు ఆన్‌లైన్‌లోనే పీపీవోను పొందొచ్చు. లాక్ డౌన్‌లో ఉద్యోగ పదవీ విరమణ చెందిన వారికి ఈ సర్వీసులు వల్ల చాలా లాభం కలుగనుంది అని మంత్రి పేర్కొన్నారు. పీపీవో ఆర్డర్ చేతికి రాని వారు ఆన్‌లైన్‌లోనే పీపీవో డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల పెన్షన్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొరని తెలిపారు. ఉద్యోగ పదవీ విరమణ చెందిన లేదా ప్రభుత్వం పెన్షన్ పెంచిన వారికీ పీపీవో అవసరం అవుతుంది. కరోనా కారణంగా పెన్షన్ దారులు చాలా ఇబ్బందులు పడాల్సివచ్చింది. ఇప్పుడు డిజి-లాకర్‌తో అనుసందించబడిన పిఎఫ్‌ఎంఎస్ ద్వారా ఎలక్ట్రానిక్ పిపిఓ కాపీని సులభంగానే పొందవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు భవిష్య అకౌంట్‌ను డిజి లాకర్ అకౌంట్‌తో లింక్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment