
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) సభ్యులకు శుభవార్తను అందించింది. పెన్షనర్లకు భారీ ఊరట కలిపిస్తూ ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు సంబంధించి రూల్స్‌ను సడలించింది.
ఈపీఎఫ్‌వో సభ్యులకు పెన్షన్ సదుపాయాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. పెన్షన్ స్కీమ్ ను పొందాలంటే కచ్చితంగా ఆయా సభ్యులు లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించాల్సి ఉంది. కాగా తాజాగా లైఫ్ సర్టిఫికేట్ విషయములో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెన్షనర్లు ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేసేలా వీలును కల్పించింది. ఇంతకుముందు పెన్షనర్లు ఈ డాక్యుమెంట్‌ను నవంబర్ నెలలో కచ్చితంగా సబ్మిట్ చేయాల్సి వుండేది. ఒకవేళ ఈ డాక్యుమెంట్‌ను ఇవ్వకపోతే పెన్షన్ నిలిచిపోతుంది.
ఈపీఎఫ్‌వో పెన్షనర్లు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి వుంటుంది.