Life Certificate
-
ఈపీఎఫ్‌వో సభ్యులకు శుభవార్త...!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) సభ్యులకు శుభవార్తను అందించింది. పెన్షనర్లకు భారీ ఊరట కలిపిస్తూ ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు సంబంధించి రూల్స్‌ను సడలించింది. ఈపీఎఫ్‌వో సభ్యులకు పెన్షన్ సదుపాయాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. పెన్షన్ స్కీమ్ ను పొందాలంటే కచ్చితంగా ఆయా సభ్యులు లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించాల్సి ఉంది. కాగా తాజాగా లైఫ్ సర్టిఫికేట్ విషయములో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెన్షనర్లు ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేసేలా వీలును కల్పించింది. ఇంతకుముందు పెన్షనర్లు ఈ డాక్యుమెంట్‌ను నవంబర్ నెలలో కచ్చితంగా సబ్మిట్ చేయాల్సి వుండేది. ఒకవేళ ఈ డాక్యుమెంట్‌ను ఇవ్వకపోతే పెన్షన్ నిలిచిపోతుంది. ఈపీఎఫ్‌వో పెన్షనర్లు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి వుంటుంది. -
ఎల్ఐసీ ఉద్యోగులకు, పెన్షన్ పాలసీదారులకు గుడ్‌న్యూస్..!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. వ్యక్తిగత పెన్షన్ ప్లాన్(ఐపీపీ) యాన్యుటర్లు, ఎల్ఐసీ సిబ్బంది పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను ఇక నుంచి ఆన్లైన్లోనే పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను సబ్మిట్ చేయడం కోసం ఎల్ఐసీ బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎల్ఐసీ జీవన్ సాక్ష్య అనే మొబైల్ యాప్‌ని డౌన్లోడ్ చేయడం ద్వారా తేలికగా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయవచ్చు అని తెలిపింది. సకాలంలో పెన్షన్ పొందడానికి పెన్షనర్లు ప్రతి ఏటా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇక నుంచి సులభంగా ఈ యాప్ ద్వారా సులభంగా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను సబ్మిట్ చేయవచ్చు. అయితే, ఈ సదుపాయాన్ని వినివగించడం కోసం పెన్షన్ పాలసీదారులు మీ ఆధార్ ఆధార్ నెంబరుని మొబైల్ నెంబరుకు లింక్ చేయాల్సి ఉంటుంది. ఎల్ఐసీ జీవన్ సాక్ష్య యాప్‌ని ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. జీవన్ సాక్ష్య యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ఇలా పొందండి: మొదట ఎల్ఐసీ జీవన్ సాక్ష్య యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆన్లైన్లో మీ ఆధార్ కార్డు, పాలసీ వివరాలను నమోదు చేయండి. ఇప్పుడు మీరు మీ మొబైల్ ద్వారా ఒక సెల్ఫీ దిగి సబ్మిట్ చేయండి. వెంటనే మీ ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయండి. ఆ తర్వాత మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను డౌన్లోడ్ చేసుకోండి. "ఫెసిలిటేటర్" ఆప్షన్ ద్వారా కూడా మీ లైఫ్ సర్టిఫికెట్‌ను పొందవచ్చు. యాన్యుయిటెంట్లు/స్టాఫ్ పెన్షనర్లు కాకుండా వారి కుటుంబ సభ్యులు ఈ ఆప్షన్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ పొందవచ్చు. ఫెసిలిటేటర్ ద్వారా మీ లైఫ్ సర్టిఫికెట్ ఇలా పొందండి: ఎల్ఐసీ జీవన్ సాక్ష్య యాప్‌లో ఫెసిలిటేటర్ సమాచారాన్ని నమోదు చేయండి. ఆ తర్వాత యాన్యుటెంట్/పెన్షనర్ ఆధార్ కార్డు, పాలసీ వివరాలను నమోదు చేయండి. ఇప్పుడు యాన్యుటెంట్/పెన్షనర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటిపిని వెరిఫై చేయండి. యాన్యుటెంట్/పెన్షనర్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ తీసి సబ్మిట్ చేయండి. ఇటీవల ఒక ప్రకటనలో, కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడానికి గడువును పొడిగించింది. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి గడువును ఇప్పుడు డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించారు. (చదవండి: 5జీ మొబైల్స్.. ఈ ఫీచర్స్‌తో ఈ మోడలే చాలా చీప్ అంట!) -
పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!
పెన్షన్లరకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్(జీవన్ ప్రమాన్) సమర్పించాల్సిన గడువును 2021 డిసెంబర్ 31 వరకు పొడగించింది. ఇంతక ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లను పొందడానికి వారు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లను నవంబర్ 30లోపు సబ్మిట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ గడువును మరో నెల పొడగించింది. దీంతో పెన్షనర్లకు ఊరట కలగనుంది. దేశంలో కరోనా మహమ్మారి విజృంబిస్తున్న తరుణంలో వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పుడు, డిసెంబర్ 31 వరకు లైఫ్ సర్టిఫికేట్ పత్రాలను బ్యాంకులు/పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు సబ్మిట్ చేయవచ్చు. అలాగే, లైఫ్ సర్టిఫికేట్ పత్రాలను డిజిటల్ రూపంలో పొందడం కోసం రికగ్నైషన్ టెక్నాలజీని కేంద్రం ప్రారంభించింది. పెన్షనర్ల ఫిర్యాదుల మేరకు పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఇప్పటికే డిజిటల్‌గా లైఫ్ సర్టిఫికేట్లను జారీ చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 31 వరకు ఎటువంటి అంతరాయం లేకుండా పెన్షనర్లు పెన్షన్ పొందవచ్చు. (చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏంటో తెలుసా?) -
పింఛనుదారులు లైఫ్ సర్టిఫికెట్‌ను పోస్టాఫీసులో ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్‌ను ఇకనుంచి పోస్టాఫీసు ద్వారా ఆన్లైన్లో పింఛనుశాఖకు సమర్పించుకోవచ్చునని సిక్రింద్రాబాద్ తపాలశాఖ సీనియర్ సూపరింటెండెంట్ సంతోష్ నేత తెలిపారు. ఈ సేవలను పోస్టుమెన్ ద్వారా పొందవచ్చునని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. (చదవండి: పాము రాసిన విషాద గీతం) -
వృద్ధులకు, పింఛనుదారులకు గుడ్ న్యూస్!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండియా పోస్ట్ కేంద్రాల ద్వారా వృద్దులు, పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాన్ సేవలను పొందవచ్చు అని ప్రకటించింది. తాజా నిర్ణయంతో పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు ఇద్దరికీ భారీ ఉపశమనం లభించింది. సాంకేతికపరిజ్ఞానం లేని వృద్దులు తమ లైఫ్ సర్టిఫికేట్ పొందడం కోసం వారు బ్యాంకులను సందర్శించాల్సి వచ్చేది. అక్కడ వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు ఆ సమస్యలకు చెక్ పెట్టినట్లయింది. "ఇకపై వృద్ధులు సులభంగా జీవన ప్రమాణ సేవలను పొందవచ్చు. సమీప పోస్టాఫీసులో ఉండే సీఎస్సీ కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి" అని పోస్టల్ విభాగం ట్వీట్ చేసింది. తాజా నిర్ణయం వల్ల కేంద్ర, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల(యుటీలు) 60 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ది జీవన్ ప్రమాన్ అధికారిక వెబ్ సైట్ ద్వారా జీవిత ధృవీకరణ పత్రాన్ని పొందడానికి పెన్షన్ తీసుకునే వ్యక్తి ప్రభుత్వం చేత గుర్తించబడిన ఏజెన్సీ ముందు హాజరు కావాలి లేదా పింఛనుదారుడు ఇంతకు ముందు పనిచేసిన అథారిటీ ద్వారా జారీ చేయబడ్డ లైఫ్ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. తర్వాత దానిని ఏజెన్సీకి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడుఆ వారు లైఫ్ సర్టిఫికేట్ పొందడానికి సమీప పోస్టాఫీసు కేంద్రాన్ని సందర్శించవచ్చు. అలాగే, మీ దగ్గరలో గనుక జీవన్ ప్రమాన్ కేంద్రాలు ఉంటే దాని ద్వారా కూడా లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఈ కేంద్రాలలో వారు మీ ఆధార్ బయో మెట్రిక్ తీసుకుంటారు. वरिष्ठ नागरिक अब सरलता से नज़दीकी डाकघर के सीएससी काउंटर पर जीवन प्रमाण सेवाओं का लाभ उठा सकते हैं। #AapkaDostIndiaPost Senior citizens can now easily avail the benefit of Jeevan Praman services at the nearest post office CSC counter.#AapkaDostIndiaPost pic.twitter.com/tKrzifc6yc — India Post (@IndiaPostOffice) July 15, 2021 -
లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు గడువు పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్(జీవన్ ప్రమాణ్ పత్ర–జేపీపీ) సమర్పించే తుది గడువును వచ్చే ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించినట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. ఆలోగా ఎప్పుడైనా ఇవ్వవచ్చని పేర్కొంది. కోవిడ్–19 కారణంగా జేపీపీ అందజేయలేకపోయిన సుమారు 35 లక్షల పింఛనుదారులకు ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. నవంబర్ 30వ తేదీలోగా జేపీపీ సమర్పించని వారికి ఫిబ్రవరి వరకు పింఛను యథా ప్రకారం అందుతుందని స్పష్టం చేసింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం–1995 ప్రకారం పింఛను పొందుతున్న వారికి ఈ వెసులుబాటు వర్తిస్తుందని వివరించింది. జేపీపీ ఏడాదిపాటు అమల్లో ఉంటుందని తెలిపింది. -
పెన్షనర్లకు ఊరట : కీలక ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌దారులకు ఊరట. కేంద్ర పెన్షన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును మరో రెండు నెలలు పెంచుతూ కేంద్రప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఈ గడువును పెంచాలన్న పెన్షన్‌దారుల సంఘాల విజ్ఞప్తి మేరకు 2021 ఫిబ్రవరి 28 వరకు పెంచుతూ కేంద్ర పెన్షన్ వెల్ఫేర్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని లైఫ్ సర్టిఫికేట్ గడువును మరికొంత కాలం పెంచాలంటూ వివిధ పెన్షన్‌దారుల సంఘాల నుంచి పిటిషన్లు సంబంధిత మంత్రిత్వ శాఖకు వెల్లువెత్తడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని భారత ప్రభుత్వ అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. కోవిడ్-19 కేసులు వరకు పెరుగుతున్న నేపథ్యంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయంతో సంప్రదించిన పిదప ఈ గడువును 2021 ఫిబ్రవరి 28 వరకు పెంచినట్టు తెలిపారు. అలాగే పొడిగించిన కాలంలో, (ఫిబ్రవరి వరకు) ప్రతీ నెలా పెన్షన్ యథావిధిగా చెల్లిస్తామని పేర్కొన్నారు. వాయిదా ప్రధాన లక్ష్యం వివిధ శాఖల వద్ద విపరీతమైన రద్దీని నివారించడమనీ, సంబంధిత శాఖలలో సరైన పారిశుద్ధ్యం, సామాజిక దూరాన్ని పాటించాలని నోటీసులో పేర్కొంది. కాగా ప్రతీ ఏడాది పింఛనుదారులు నవంబర్‌లోగా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంది. కరోనా ప్రభావం వృద్ధులపై తీవ్రంగా ఉంటుందనే ఆందోళన మేరకు కేంద్ర పెన్షన్ వెల్ఫేర్ శాఖ లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసే చివరి తేదీని 2020 డిసెంబర్ 31వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
కేంద్ర ప్రభుత్వ పెన్షన్ దారులకు శుభవార్త
న్యూఢిల్లీ : కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పెన్షన్ దారులకు శుభవార్త. నవంబర్ చివరిలోగా సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్ గడువును ఈ ఏడాది చివరి వరకూ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా 80 ఏళ్లు దాటినవారు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చని తెలిపారు. అప్పటి వరకూ వారి పెన్షన్ పంపిణీకి ఎలాంటి ఢోకా ఉండబోదని పేర్కొన్నారు. వృద్ధులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న కారణంగా లైఫ్ సర్టిఫికెట్ గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా బ్యాంకులు వీడియో ఆధారిత గుర్తింపు కాల్ (వీ సిప్) ద్వారా వారిని గుర్తించి పెన్షన్ ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు. చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్ -
లైఫ్ సర్టిఫికెట్.. పెన్షనర్లకు వెసులుబాటు
ప్రభుత్వ పెన్షన్ దారులు, ఫ్యామిలీ పెన్షనర్లు 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏటా మాదిరిగానే పెన్షన్ కోసం వార్షిక ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుంది. ఈ పత్రాన్ని ప్రతీ పెన్షనర్ తప్పనిసరిగా డిసెంబర్ 31లోగా అందజేయాలి. ఆ విధంగా అందజేసిన వారికి మాత్రమే తదుపరి ఆర్థిక సంవత్సరం పెన్షన్ అందజేస్తారు. అందజేయని వారికి 2020 మార్చి నెలకు సంబంధించి పెన్షన్ ఏప్రిల్‌లో ఇవ్వకుండా నిలిపివేస్తారు. అయితే, గతంలో మాదిరిగా తప్పనిసరి వ్యక్తిగతంగా ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలనే నిబంధనలో కొంత సడలింపు ఇచ్చారు. ఆండ్రాయిడ్ మొబైల్లో టీ ఫోలియో యాప్ ద్వారా కానీ, మీ సేవ కేంద్రాల నుంచి జీవన్‌ప్రమాణ్ సైట్ ద్వారా కానీ పంపించే వెసులుబాటు కల్పించారు. కాగా, మొబైల్ యాప్ ద్వారా ధ్రువీకరణ పత్రం అందజేసే అవకాశం కల్పించిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఈ నిర్ణయంతో పెన్షనర్లు వ్యక్తిగతంగా కార్యాలయాలకు రావాల్సిన అవసరం ఉండదు. ఉమ్మడి వరంగల్‌లో పరిశీలిస్తే ఒక్క వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోనే మొత్తం 19వేల మంది వరకు పెన్షనర్లు ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నూతన నిర్ణయంతో వీరందరూ కార్యాలయాలకు రావడంలో ఎదుర్కొనే ఆర్థిక, శారీరక భారం నుంచి బయటపడినట్లవుతుంది. ఈ మేరకు నూతన విధానంపై వివరణాత్మక కథనం. మొబైల్ యాప్ ద్వారా.. ఆండ్రాయిడ్ సెల్ఫోన్లో టీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సెల్ నంబర్, ఈ మెయిల్ ద్వారా రిజిష్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత యూజర్ ఐడీగా సెల్ నంబర్ మారుతుంది. పిన్ను పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకోవాలి. సెల్ నంబర్, పాస్ వర్డ్‌ను ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి. అనంతరం పెన్షనర్ మాన్యువల్ వెరిఫికేషన్ ఆప్షన్ ద్వారా ఎంటర్ అవ్వాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంపిక చేసుకుని బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా పెన్షనర్ ఐడీ నంబర్ నమోదు చేయాలి. ఓటరు ఐడీ కార్డు కార్డుపై ఉండే ఎపిక్ నంబర్, అసెంబ్లీ నియోజకవర్గం పేరు నమోదుచేయాలి. అనంతరం ఒక సెల్ఫీ తీసుకోవాలి. ఆ సెల్ఫీఫొటో ఎపిక్ కార్డులోని ఫొటోతో వెరిఫై చేయబడి ఆమోదించినట్లు వెరిఫికేషన్ నంబర్ వస్తుంది. ఆ మెసేజ్ సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి చేరుతుంది. ట్రెజరీ కార్యాలయంలో అధికారి తనకు వచ్చిన వివరాలు, తన వద్ద అందుబాటులో ఉన్న వివరాలతో పోల్చి చూసుకుని ఆమోదిస్తారు. దీని ద్వారా పెన్షనర్లు సుదూర ప్రాంతాల నుంచి ట్రెజరీ కార్యాలయానికి వచ్చే ఇబ్బంది ఉండదు. బ్యాంకులు, మీసేవ కేంద్రాలకు వెళ్లే అవసరం ఉండదు. ఇంటివద్దనే ఉండి ధ్రువీకరణ పత్రం అందజేయవచ్చు. ప్రస్తుతం మొబైల్ యాప్‌తో ధ్రువీకరణ పత్రం ఇచ్చే సదుపాయం కల్పించిన మొదటి రాష్ట్రం తెలంగాణ. ట్రెజరీకి రాలేని వారి కోసం... పెన్షనర్ల వయస్సు 75 సంవత్సరాలు పైబడి, కార్యాలయానికి రాలేని వారు ఇలా చేయొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే తమ వార్షిక ధ్రువీకరణ పత్రాన్ని నివాస పరిధిలోని గ్రామపంచాయతీ ఈఓ ద్వారా ధృవీకరించి తమ ప్రతినిధుల ద్వారా ట్రెజరీలో అందజేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి స్వయంగా పెన్షనర్ గృహాన్ని సందర్శించి పెన్షనర్ కదలలేని పరిస్థితిలో ఉన్నట్లు ధృవీకరించి పత్రాన్ని జారీ చేస్తారు. వీరు మాత్రమే... ఆధార్ నంబర్ ఆధారంగా మీ సేవ కేంద్రంలో, ఓటర్ ఐడీ ద్వారా కూడా టీ యాప్ ఫోలియో యాప్ తో జీవన ధృవీకరణ పత్రాలు అందజేయలేని వారు మాత్రమే ట్రెజరీ కార్యాలయానికి రావల్సి ఉంటుంది. వారి పత్రాలు మాత్రమే ట్రెజరీ అధికారులు స్వీకరిస్తారు. దివ్యాంగులకు.. ప్రభుత్వ ఉత్తర్వులు 315 ద్వారా పెన్షన్ పొందుతున్న దివ్యాంగులు తాము గత మూడేళ్లలోపు తీసుకున్న వైకల్య ధృవీకరణ పత్రాన్ని అందజేయాలి. మూడేళ్ల క్రితం తీసుకున్నట్లయితే అంగీకరించరు. మరికొన్ని సూచనలు లైఫ్ సర్టిఫికెట్లో అడిగిన అన్ని వివరాలు పెన్షనర్లు నింపాలి. పీపీఓ నంబర్, ఐడీ నంబర్, బ్యాంకుఖాతా నంబర్, ఆధార్, పాన్‌కార్డు వివరాలు అవసరం మేరకు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. నెలసరి రూ.15వేలకు పైగా పింఛన్ పొందుతున్న వారు తప్పనిసరిగా పాన్‌కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వివరాలు ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్లో మాత్రమే అందజేయాలి. పెన్షనర్ కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందినట్లయితే ఆ వివరాలు అందజేస్తే పెన్షన్‌లో డీఏ కట్ చేస్తారు. డీఏను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో పొందొచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు ఉద్యోగి డ్రాయింగ్ అధికారి ద్వారా ధ్రువీకరించి అందజేయాల్సి ఉంటుంది. రెండు చోట్ల డీఏ పొందినట్లయితే సదరు పెన్షనర్ / ఉద్యోగిపై చట్టరీత్యా చర్యలకు అవకాశం ఉంటుంది. పెన్షనర్లు తమ 10వ పీఆర్సీ ఏరియర్స్ కోసం ఆధార్ నంబర్ తప్పనిసరిగా అంజేయాలి. కొన్ని నిబంధనలు పెన్షనర్ రెండో వివాహం చేసుకున్నట్లయితే ఆ వివరాలు ఏజీ ఆమోదం తర్వాత రికార్డుల్లో నమోదు చేయించుకోవాలి. కారుణ్య నియామక ఉద్యోగం చేస్తున్న వారు స్వీయ ధ్రువీకరణ పత్రం, డ్రాయింగ్ అధికారి ధ్రువీకరణ పత్రం అందజేయాలి. పెన్షన్ పొందుతున్న బ్యాంకులో కూడా వార్షిక ధ్రువీకరణ పత్రం అందజేయాలి. ట్రెజరీలో అందజేసిన పత్రాలకు రశీదు తప్పని సరిగా పొందాలి. పోస్టు ద్వారా పంపినవి, అసంపూర్తిగా నింపినవి అంగీకరించబడవు. లైఫ్ సర్టిఫికెట్ అందజేయని వారి పెన్షన్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి నిలిపివేసే అధికారం ట్రెజరీ అధికారులకు ఉంది. సద్వినియోగం చేసుకోవాలి.. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అవకాశాన్ని పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా కార్యాలయానికి వచ్చే భారం తప్పుతుంది. నూతన విధానం ద్వారా సాంకేతిక పరిజ్ఞానం వాడుతూ జీవిత ధ్రువీకరణ పత్రాలు అందజేస్తే ఇబ్బందులు తొలగిపోతాయి. పెన్షనర్లు ఆన్లైన్ ద్వారా పంపిన వివరాలను అధికారులు పరిశీలించి ఆమోదిస్తారు. ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా పెన్షనర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారు. – గుజ్జు రాజు, ఉప సంచాలకులు, ట్రెజరీ శాఖ, వరంగల్ అర్బన్ -
సెల్ఫీతో లైఫ్ సర్టిఫికెట్
సాక్షి, కాజీపేట అర్బన్: ఉద్యోగ విరమణ పొందిన అనంతరం ఉద్యోగులు పెన్షన్దారులుగా వృద్ధాప్యంలో తమ శేష జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది. కాగా ప్రతి ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు పెన్షన్‌దారుడు లైఫ్ సర్టిఫికెట్‌ను సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో లేదా బ్యాంకులో అందజేస్తే సంబంధిత అధికారులు పెన్షన్‌దారుడు జీవించి ఉన్నట్లుగా ధృవీకరించి పెన్షన్ అందజేస్తారు. ఒకవేళా పెన్షన్‌దారుడు ట్రెజరీ కార్యాలయం, బ్యాంకుకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నప్పుడు జీవన్ ప్రమాణ్ వెబ్సైట్లో లేదా మీ–సేవా కేంద్రానికి వెళ్లి ఆధార్ ఆధారిత లైఫ్ సర్టిఫికేట్‌ను అందజేయాలి. ఇందుకు రూ.30 చెల్లించాలి. సకాలంలో లైఫ్ సర్టిఫికెట్ అందజేయకపోతే పెన్షన్ నిలపి వేయబడుతుంది. దీంతో పెన్షన్‌దారుడికి టెన్షన్ మొదలవుతుంది. పెన్షన్‌దారులకు వరంలా.. నేటి ఆధునిక యుగంలో మారుతున్న టెక్నాలజీ వృద్ధాప్యానికి చేరుకున్న పెన్షన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం టీయాప్–ఫోలియో వరంగా మారనుంది. ఇంట్లో ఉంటునే కేవలం ఒక సెల్ఫీ ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ను అందజేసే విధంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం టీ యాప్ ఫోలియోకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల యాబై వేల మంది, ఉమ్మడి వరంగల్‌లో సుమారు ఇరవై వేల మంది పెన్షన్‌దారులకు లైఫ్ సర్టిఫికెట్ అందజేయడంలో చాలా ఈజీగా మారనుంది. యాప్ డౌన్లోడ్ ఇలా.. పెన్షన్‌దారులు తొలుత తమ ఆండ్రాయిడ్ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి టీ యాప్–ఫోలియోను డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యూజర్ ఐడీగా మొబైల్ నెంబర్ స్వీకరిస్తుంది. ఎంపీన్ను పాస్‌వర్డ్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేయడం ద్వారా టీ–యాప్ ఫోలియోలోకి లాగిన్ అవుతారు. యాప్‌లోకి ప్రవేశించిన అనంతరం పెన్షనర్ అన్యూవల్ వెరిఫికేషన్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ అనే అప్షన్‌ను క్లిక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా పెన్షనర్ ఐడీ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత ఎలక్షన్ ఓటర్ ఈపీక్ నెంబర్ , అసెంబ్లీ నియోజకవర్గం పేరును ఎంటర్ చేయాలి. అనంతరం పెన్షన్‌దారుడు ఒక సెల్ఫీ దిగి పంపించాలి. సెల్ఫీ ఫోటో జనాభా లెక్కల (ఓటర్ ఐడీ)తో సరిపోలితే ఆమోదం పొందినట్లుగా ధృవీకరిస్తూ ఒక మెసేజ్, రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. పెన్షన్‌దారుడికి అందిన మెసేజ్ సంబంధిత ట్రెజరరీ, బ్యాంకు అధికారికి చేరడంతో లైఫ్ సర్టిఫికెట్ అందించినట్లుగా భావిస్తారు. దీంతో పెన్షన్‌దారులకు లైఫ్ సర్టిఫికేట్ అందించడంలో ఏర్పడే కష్టాల నుంచి ఒక సెల్ఫీతో ఊరట లభించనుంది. సద్వినియోగం చేసుకోవాలి... పెన్షన్‌దారులు ప్రభుత్వం, ట్రెజరరీ శాఖ ప్రవేశపెట్టిన ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫేస్ రికాగనైజేషన్ టెక్నాలజీ ద్వారా మొట్టమొదటి సారిగా పెన్షన్‌దారుడు టీయాప్–ఫోలియో సౌజన్యంతో సెల్ఫీ అందిస్తే కార్యాలయంలోని రికార్డుల ఆధారంగా ఆమోదం అందిస్తాం. ఒక్క సారి ఆమోదం పొందిన పెన్షన్‌దారుడు తర్వాత ఏడాది నుంచి లైఫ్ సర్టిఫికెట్ అందజేయకపోయినా ఆటోమెటిక్‌గానే ఆమోదం పొందుతారు. - గుజ్జురాజు, ఉప సంచాలకులు, జిల్లా ఖజానా కార్యాలయం -
లైఫ్ సర్టిఫికెట్లు స్వయంగా అందించాలి
ఉదయగిరి: జిల్లాలోని పింఛన్‌దారులందరూ తమ లైఫ్ సర్టిపికెట్లు స్వయంగా స్థానిక ఖజానా కార్యాలయంలో అందజేయాలని జిల్లా ఖజానా అధికారిణి ఉదయలక్ష్మి పేర్కొన్నారు. ఆమె గురువారం స్థానిక ఉప ఖజానా కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మార్చి 31లోపు పింఛన్‌దారులు తమ లైఫ్ సర్టిఫికెట్లను స్వయంగా సంబంధిత ఎస్టీవో కార్యాలయంలో అందజేయాలన్నారు. లేకపోతే ఏప్రిల్ నుంచి పింఛన్ నిలిపివేస్తామన్నారు. ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయం నుంచి ఎలాంటి ఫిర్యాదులూ లేవన్నారు. ఆమె వెంట నెల్లూరు డీటీవో కార్యాలయ ఎస్టీవో శ్రీనివాసులు, స్థానిక ఎస్టీవో రవికుమార్ ఉన్నారు. -
లైఫ్ సర్టిఫికెట్ ఇస్తేనే ఇకపై ‘ఆసరా’!
♦ మూడు నెలలకోమారు తప్పనిసరి చేస్తూ సర్కారు నిర్ణయం ♦ 4,500 మీ సేవాకేంద్రాలకు బయోమెట్రిక్ విధానానికి అనుమతి ♦ మే 1నుంచి 20లోగా ఇవ్వకుంటే జూన్ నెలలో పెన్షన్ రానట్లే ♦ తొలిదశలో పట్టణ ప్రాంతాల్లోని 10 లక్షలమంది పెన్షనర్లకు వర్తింపు సాక్షి, హైదరాబాద్: ఆసరా పెన్షనర్లు పింఛన్ పొందాలంటే తాము బతికి ఉన్నట్లుగా ధ్రువీకరణను తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35.85 లక్షలమంది పెన్షనర్ల లో సుమారు 10 లక్షల మందికి పెన్షన్ సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారు. దీంతో సరైన సమాచారం లేక మరణించిన పెన్షనర్ల ఖాతాలకు కూడా పింఛన్ సొమ్ము వెళుతున్నట్లు పలు జిల్లాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్‌ను తీసుకుంటున్నవారు ఇకపై ప్రతి మూడు నెలలకోమారు తాము బతికే ఉన్నట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. మే నెల 1నుంచి 20వ తేదీలోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పిం చిన పెన్షనర్లకే జూన్‌లో పింఛన్ అందుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తొలిదశలో ఈ విధానాన్ని పట్టణ ప్రాంతాల్లోని సుమారు 10 లక్షలమంది పెన్షనర్లకు వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టాఫీసులు, పంచాయతీ కార్యాల యాల నుంచి పెన్షన్ పొందుతున్నవారికి కూడా త్వరలోనే పెన్షన్‌ను బ్యాంకు ఖాతాల ద్వారా అం దించే ఏర్పాటు చేస్తామని, అప్పట్నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని పెన్షనర్లకు కూడా లైఫ్ సర్టిఫికెట్ నిబంధనను వర్తింపజేస్తామని చెబుతున్నారు. 4,500 మీసేవా కేంద్రాలకు అథెంటికేషన్ ఆసరా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు మూడు నెలలకోమారు లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేం దుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,500 మీసేవాకేంద్రాలకు బయోమెట్రిక్, ఐరిస్ అథెం టికేషన్ సదుపాయాన్ని కల్పించింది. లబ్ధిదారులు మీసేవా కేంద్రానికి వెళ్లి ఐరిస్ ద్వారా కనుపాపలను సరిపోల్చడంతోగానీ, వికలాంగులు(అంధులు) బయోమెట్రిక్(వేలిముద్ర) ద్వారాగానీ తమ ధ్రువీకరణను సమర్పించాలి. ధ్రువీ కరణ కోసం మీసేవ కేంద్రానికి లబ్ధిదారులు ఆధార్ గానీ, పెన్షన్ ఐడీ నెంబరునుగానీ వెంట తీసికెళ్లాలి. ఈ ప్రక్రియ పూర్తికాగానే మీసేవా సిబ్బంది లబ్ధిదారుకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించి నట్లుగా రశీదు అందజేస్తారు. దీనికిగాను 20 రూపాయలు చెల్లించాలి. ఇలా ఏడాదికి రూ.80 మీసేవా కేంద్రానికి సమర్పించుకోవాల్సిందే. పెన్షనర్లకు ఇది ఇబ్బందికరం.. ఆసరా పింఛన్‌దారులు మీ సేవాకేంద్రాలకు వెళ్లి లైఫ్ సర్టిపికెట్లు సమర్పించడం ఇబ్బం దికరమే. అంధులైన పెన్షనర్లకు ఐరిస్‌తో ధ్రువీకరణ, చాలామంది(లెప్రసీ వంటి) వికలాంగులు, వృద్ధులకు బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలను సరిపోల్చడం వీలుకాదు. పింఛ న్ సొమ్ము నుంచి ప్రతిసారి రూ.20 మీసేవాకేంద్రానికి ఇవ్వడం ఇబ్బందికరమే. దానిని ప్రభుత్వమే భరించాలి. - కొల్లి నాగేశ్వరరావు, వికలాంగుల హక్కుల సంఘం నేత