లైఫ్ సర్టిఫికెట్లు స్వయంగా అందించాలి
లైఫ్ సర్టిఫికెట్లు స్వయంగా అందించాలి
Published Fri, Nov 18 2016 1:33 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
ఉదయగిరి: జిల్లాలోని పింఛన్‌దారులందరూ తమ లైఫ్ సర్టిపికెట్లు స్వయంగా స్థానిక ఖజానా కార్యాలయంలో అందజేయాలని జిల్లా ఖజానా అధికారిణి ఉదయలక్ష్మి పేర్కొన్నారు. ఆమె గురువారం స్థానిక ఉప ఖజానా కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మార్చి 31లోపు పింఛన్‌దారులు తమ లైఫ్ సర్టిఫికెట్లను స్వయంగా సంబంధిత ఎస్టీవో కార్యాలయంలో అందజేయాలన్నారు. లేకపోతే ఏప్రిల్ నుంచి పింఛన్ నిలిపివేస్తామన్నారు. ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయం నుంచి ఎలాంటి ఫిర్యాదులూ లేవన్నారు. ఆమె వెంట నెల్లూరు డీటీవో కార్యాలయ ఎస్టీవో శ్రీనివాసులు, స్థానిక ఎస్టీవో రవికుమార్ ఉన్నారు.
Advertisement