లైఫ్ సర్టిఫికెట్ ఇస్తేనే ఇకపై ‘ఆసరా’!
♦ మూడు నెలలకోమారు తప్పనిసరి చేస్తూ సర్కారు నిర్ణయం
♦ 4,500 మీ సేవాకేంద్రాలకు బయోమెట్రిక్ విధానానికి అనుమతి
♦ మే 1నుంచి 20లోగా ఇవ్వకుంటే జూన్ నెలలో పెన్షన్ రానట్లే
♦ తొలిదశలో పట్టణ ప్రాంతాల్లోని 10 లక్షలమంది పెన్షనర్లకు వర్తింపు
సాక్షి, హైదరాబాద్: ఆసరా పెన్షనర్లు పింఛన్ పొందాలంటే తాము బతికి ఉన్నట్లుగా ధ్రువీకరణను తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35.85 లక్షలమంది పెన్షనర్ల లో సుమారు 10 లక్షల మందికి పెన్షన్ సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారు. దీంతో సరైన సమాచారం లేక మరణించిన పెన్షనర్ల ఖాతాలకు కూడా పింఛన్ సొమ్ము వెళుతున్నట్లు పలు జిల్లాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.
ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్‌ను తీసుకుంటున్నవారు ఇకపై ప్రతి మూడు నెలలకోమారు తాము బతికే ఉన్నట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. మే నెల 1నుంచి 20వ తేదీలోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పిం చిన పెన్షనర్లకే జూన్‌లో పింఛన్ అందుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తొలిదశలో ఈ విధానాన్ని పట్టణ ప్రాంతాల్లోని సుమారు 10 లక్షలమంది పెన్షనర్లకు వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టాఫీసులు, పంచాయతీ కార్యాల యాల నుంచి పెన్షన్ పొందుతున్నవారికి కూడా త్వరలోనే పెన్షన్‌ను బ్యాంకు ఖాతాల ద్వారా అం దించే ఏర్పాటు చేస్తామని, అప్పట్నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని పెన్షనర్లకు కూడా లైఫ్ సర్టిఫికెట్ నిబంధనను వర్తింపజేస్తామని చెబుతున్నారు.
4,500 మీసేవా కేంద్రాలకు అథెంటికేషన్
ఆసరా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు మూడు నెలలకోమారు లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేం దుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,500 మీసేవాకేంద్రాలకు బయోమెట్రిక్, ఐరిస్ అథెం టికేషన్ సదుపాయాన్ని కల్పించింది. లబ్ధిదారులు మీసేవా కేంద్రానికి వెళ్లి ఐరిస్ ద్వారా కనుపాపలను సరిపోల్చడంతోగానీ, వికలాంగులు(అంధులు) బయోమెట్రిక్(వేలిముద్ర) ద్వారాగానీ తమ ధ్రువీకరణను సమర్పించాలి. ధ్రువీ కరణ కోసం మీసేవ కేంద్రానికి లబ్ధిదారులు ఆధార్ గానీ, పెన్షన్ ఐడీ నెంబరునుగానీ వెంట తీసికెళ్లాలి. ఈ ప్రక్రియ పూర్తికాగానే మీసేవా సిబ్బంది లబ్ధిదారుకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించి నట్లుగా రశీదు అందజేస్తారు. దీనికిగాను 20 రూపాయలు చెల్లించాలి. ఇలా ఏడాదికి రూ.80 మీసేవా కేంద్రానికి సమర్పించుకోవాల్సిందే.
పెన్షనర్లకు ఇది ఇబ్బందికరం..
ఆసరా పింఛన్‌దారులు మీ సేవాకేంద్రాలకు వెళ్లి లైఫ్ సర్టిపికెట్లు సమర్పించడం ఇబ్బం దికరమే. అంధులైన పెన్షనర్లకు ఐరిస్‌తో ధ్రువీకరణ, చాలామంది(లెప్రసీ వంటి) వికలాంగులు, వృద్ధులకు బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలను సరిపోల్చడం వీలుకాదు. పింఛ న్ సొమ్ము నుంచి ప్రతిసారి రూ.20 మీసేవాకేంద్రానికి ఇవ్వడం ఇబ్బందికరమే. దానిని ప్రభుత్వమే భరించాలి.
- కొల్లి నాగేశ్వరరావు, వికలాంగుల హక్కుల సంఘం నేత