నోటీసులు రావడంతో డబ్బు చెల్లించిన పది మంది సర్విసు పెన్షనర్లు
వారికి ఆసరా పెన్షన్ల రద్దు.. వాయిదాల్లో రికవరీకి ప్రణాళిక
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ సర్వీసు పెన్షన్లు, సామాజిక ఆసరా పెన్షన్.. రెండూ పొందుతున్న పది మంది రూ.10 లక్షలను తిరిగి ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. జిల్లాలో 71 మంది రెండు పెన్షన్లు పొందుతున్నట్లుగా పేర్కొంటూ జూలై 6న ‘సాక్షి’లో ‘ప్రభుత్వ పెన్షనర్లకు ఆసరా’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో రెండు పెన్షన్లు పొందుతున్న వారికి పంచాయతీ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీచేశారు. రెండు పెన్షన్లు పొందుతున్న వారు ఆసరా పెన్షన్ డబ్బులను తిరిగి చెల్లించాలని ఆదేశించారు.
కాగా, ఏళ్ల తరబడి పొందిన ఆసరా పెన్షన్ డబ్బులను ఒకేసారి చెల్లించడం ఇబ్బందిగా ఉండడంతో రికవరీకి సమయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వారికి వెసులుబాటు కలి్పంచారు. ఇప్పటికే 10 మంది రూ.10 లక్షలు చెల్లించగా.. ఇంకా 61 మంది, రూ.47.75 లక్షల మేరకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని దశలవారీగా రికవరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆసరా పెన్షన్లు నిలిపివేసి, సరీ్వసు పెన్షన్ నుంచి ఆ సొమ్మును దశలవారీగా రికవరీ చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి చేయకుండా వాయిదా పద్ధతిలో వసూళ్లకు ప్రణాళిక సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment