
పెన్షన్లరకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్(జీవన్ ప్రమాన్) సమర్పించాల్సిన గడువును 2021 డిసెంబర్ 31 వరకు పొడగించింది. ఇంతక ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లను పొందడానికి వారు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లను నవంబర్ 30లోపు సబ్మిట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ గడువును మరో నెల పొడగించింది. దీంతో పెన్షనర్లకు ఊరట కలగనుంది.
దేశంలో కరోనా మహమ్మారి విజృంబిస్తున్న తరుణంలో వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పుడు, డిసెంబర్ 31 వరకు లైఫ్ సర్టిఫికేట్ పత్రాలను బ్యాంకులు/పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు సబ్మిట్ చేయవచ్చు. అలాగే, లైఫ్ సర్టిఫికేట్ పత్రాలను డిజిటల్ రూపంలో పొందడం కోసం రికగ్నైషన్ టెక్నాలజీని కేంద్రం ప్రారంభించింది. పెన్షనర్ల ఫిర్యాదుల మేరకు పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఇప్పటికే డిజిటల్‌గా లైఫ్ సర్టిఫికేట్‌లను జారీ చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 31 వరకు ఎటువంటి అంతరాయం లేకుండా పెన్షనర్లు పెన్షన్ పొందవచ్చు.
(చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏంటో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment