
న్యూఢిల్లీ: పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్(జీవన్ ప్రమాణ్)ను అందజేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) మరో వెసులుబాటు కల్పించింది. కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌ఈ)ల ద్వారా వీటిని అందజేయవచ్చునని పేర్కొంది. కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం(ఈపీఎస్) పింఛనుదారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. పింఛనుదారులు ఏటా డిసెంబర్‌లో లైఫ్ సర్టిఫికెట్‌ను అందజేయాల్సి ఉంటుంది. దీనివల్ల పింఛను అందకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 3.65 లక్షల సీఎస్‌సీల్లోనూ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించే వీలుంటుందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 135 ప్రాంతీయ కార్యాలయాలు, 117 జిల్లా కార్యాలయాలకు ఇవి అదనమని తెలిపింది. పింఛనుదారులు ఇకపై తమకు వీలున్న సమయంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను సీఎస్‌సీల్లో ఇవ్వవచ్చని, ఇచ్చిన రోజు నుంచి ఇది ఏడాది పాటు చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది. (చదవండి: భారత్‌లో సామాజిక వ్యాప్తి లేదు)
Comments
Please login to add a commentAdd a comment