CSE
-
9 ఏళ్లలో 75 కాలేజీలు మూత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతోంది. జిల్లాల్లోని కాలేజీల్లో విద్యార్థులు చేరడానికి ఆసక్తి చూపకపోవడంతో మూతపడుతున్నాయి. కొన్ని రాజధాని పరిసర ప్రాంతాలకు మారుతున్నాయి. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది ఎన్ని కాలేజీలు ఉంటాయనేది అధికార వర్గాలే స్పష్టత ఇవ్వడం లేదు. కనీస స్థాయి విద్యార్థుల ప్రవేశాలు లేని కాలేజీలు కౌన్సెలింగ్‌లో నిలబడటం కష్టమనే వాదన వినిపిస్తోంది. ప్రతి ప్రైవేటు కాలేజీకి సంబంధిత విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. ఈ సంవత్సరం ఈ ప్రక్రియ ఇంతవరకూ మొదలవ్వలేదు. ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ద్వారా కాలేజీల తనిఖీలు చేపట్టాలనే యోచనలో ఉంది. దీంతో యూనివర్సిటీలు అఫ్లియేషన్ విధానాన్ని మొదలు పెట్టలేదు. మరోవైపు ఎక్కువ కాలేజీలు డిమాండ్ లేని బ్రాంచీల్లో సెక్షన్లు, సీట్ల తగ్గింపునకు దరఖాస్తు చేసుకున్నాయి. మౌలిక సదుపాయాలు అన్నీ ఉంటేనే గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సంవత్సరం రాష్ట్రంలో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, ఎన్ని సీట్లు ఉంటాయనేది ఇప్పటివరకు స్పష్టత కరువైంది. ఏటా తగ్గుతున్న కాలేజీలు... హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీలు మినహా, జిల్లాల్లోని కాలేజీలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. దీంతో అనివార్యంగా మూతపడే పరిస్థితి కన్పిస్తోంది. 2014లో రాష్ట్రంలో 234 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, 2023 కౌన్సెలింగ్ నాటికి ఈ సంఖ్య 159కి పడిపోయింది. తొమ్మిదేళ్ల కాలంలోనే దాదాపు 75 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. 2017 నుంచి కాలేజీలు కనుమరుగవ్వడం ఎక్కువైంది. నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో కంప్యూటర్ సైన్స్ సీట్లల్లో తప్ప, ఇతర బ్రాంచీల్లో పది మంది కూడా చేరే పరిస్థితి కనిపించడం లేదు. పలు జిల్లాలకు చెందిన కాలేజీ యాజమాన్యాలు దాదాపు 15 కాలేజీలను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మార్చుకునేందుకు దరఖాస్తులు పెట్టాయి. మరో పది కాలేజీలు ఈసారి అఫ్లియేషన్ నిబంధనలకు దూరంగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థుల విముఖతే సమస్య.. జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడటం లేదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులపైనే ఆసక్తి చూపుతున్నారు. ఈ సీట్లను పెంచుకునేందుకు జిల్లా కాలేజీలకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం, డిమాండ్ ఉన్న కోర్సుల్లో అధ్యాపకుల కొరత సమస్య కాలేజీలను వేధిస్తోంది. మేనేజ్మెంట్ కోటా సీట్లకు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న డిమాండ్ జిల్లాల్లో ఉండటం లేదు. ఈ కారణంగా కాలేజీల నిర్వహణ అతికష్టంగా ఉందని యాజమాన్యాలు అంటున్నాయి. దీనికి తోడు విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ తర్వాత తక్షణ ఉపాధి కోరుకుంటున్నారు. ఆలోచనల్లో మార్పు విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం వీటికే మార్కెట్ ఉందని భావిస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్‌లో ఉంటే ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగాలు తెచ్చుకోవడం సులభమనే ఆలోచనలతో ఉన్నారు. ఈ పరిణామాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీల నిర్వహణను కష్టంగా మారుస్తున్నాయి. అన్ని బ్రాంచీల్లోనూ సరికొత్త సాంకేతిక బోధన విధానం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. –ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
#CES2024: ఇప్పుడే కొనాలనిపించే గ్యాడ్జెట్లు (ఫోటోలు)
-
కంప్యూటర్ ఇంజనీరింగ్కే క్రేజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం జరిగిన రెండో దశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో కన్వీనర్ కోటా కింద 75.18 శాతం సీట్లు కేటాయించినట్లు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 79,790 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే ఇప్పటివరకు 59,993 సీట్ల కేటాయింపు పూర్తయింది. ఇంకా 19,797 సీట్లు మిగిలిపోయాయి. రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న వారిలోనూ చాలా మంది కంప్యూటర్ సైన్స్ సహా కొత్త కోర్సులకే ప్రాధాన్యమిచ్చారు. దీంతో కంప్యూటర్ సైన్స్ సీట్లు హాట్ కేకుల్లా భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్ సీట్లకు తక్కువ ఆప్షన్లు ఇవ్వడంతో ఎక్కువగా మిగిలిపోయాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) సీట్లను 95.98 శాతం కేటాయించగా మెకానికల్ ఇంజనీరింగ్‌లో కేవలం 32.57 శాతమే సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్ ఇంజనీరింగ్‌కు కూడా విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో 41.87 శాతమే సీట్ల కేటాయింపు జరిగింది. 20 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్... రెండో దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన సీటును రద్దు చేసుకొనేందుకు ఈ నెల 18 వరకు అవకాశం ఇచ్చారు. ఈలోగా సీటురద్దు చేసు కున్న వారికి చెల్లించిన ఫీజులో 50 శాతం వెనక్కి ఇస్తారు. గడువు తర్వాత రద్దు చేసుకుంటే ఎలాంటి ఫీజు తిరిగి ఇవ్వరు. ప్రస్తుతం భర్తీకాని సీట్లు, రెండో దశలో ఖాళీగా మిగిలే సీట్లను పరిగణలోకి తీసుకొని ఈ నెల 20 నుంచి ప్రత్యేక రౌండ్ సీట్ల కేటాయింపు చేపడతారు. సీటు పొందిన అభ్యర్థులకు ఇప్పటికే వారి రిజిస్టర్డ్ మొబైల్‌కు సంక్షిప్త సందేశం పంపా రు. వివిధ కారణాల చేత 1,861 మంది ఆప్షన్స్ ఇచ్చి నా సీట్లు కేటాయించలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్ కోటా) 4,973 సీట్లు కేటాయించారు. -
కల్తీ తేనె కలకలం: మరింత కరోనా ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: రోగనిరోధక శక్తి పెంచుతుంది.. యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూనిటీ బూస్టర్ అంటూ కరోనా కాలంలో తేనెను తెగ లాగించేస్తున్నారా? అయితే మీకొక షాకింగ్ రిపోర్టు.. చైనా సుగర్ సిరప్‌తో గుర్తు పట్టలేనంతగా దేశంలో కల్తీ తేనెను చలామణీ చేస్తున్నవ్యవహారం కలకలం రేపుతోంది. చిన్నా పెద్ద సహా దాదాపు అన్ని బ్రాండ్ల తేనె చక్కెర సిరప్‌తో కల్తీ చేస్తున్నారని తమ అధ్యయనం తేలిందని ప్రకటించింది. దేశంలోని 13 ప్రధాన బాండ్లలో డాబర్, పతంజలి, బైద్యనాథ్ జండుతో సహా మొత్తం 10 సంస్థలు విక్రయిస్తున్న తేనె కల్తీమయమని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తేల్చి చెప్పింది. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలు తేనెకు బదులుగా, ఎక్కువ చక్కెరను తింటున్నారని, ఇది కోవిడ్-19 ప్రమాదాన్నిమరింత పెంచుతుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. తేనెలో చైనా చక్కెరతో కలిపి కల్తీ తేనెను విక్రయిస్తున్నారని ఇటీవల నిర్వహించిన క్వాలిటీ పరీక్షల్లో నిర్దారణ అయిందని తెలిపింది. గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డిడిబి) సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్ (కాల్‌ఎఫ్)లో వీటి నమూనాలను పరీక్షించారు. జర్మనీలోని ఒక ప్రత్యేక ప్రయోగశాలలో ఎన్ఎంఆర్ టెక్నాలజీని ఉపయోగించి పరీక్షించినప్పుడు, చాలా బ్రాండ్లు విఫలమయ్యాయి. పరీక్షించిన 13 బ్రాండ్లలో మూడు బ్రాండ్లు మాత్రమే ఎన్ఎంఆర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయని సీఎస్ఈ వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలను డాబర్, పతంజలి, జండు ప్రతినిధులు ఖండించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఎఐ) నిర్దేశించిన ప్రమాణాలకనుగుణంగానే ఉందని వాదిస్తున్నాయి. సీఎస్ఈ విడుదల చేసిన రిపోర్టు అవాస్తవమైందనీ, ఇండియన్ నాచురల్ హనీ ఇండస్ట్రీని దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై ప్రముఖ ఆయుర్వేద, హెర్బల్ ఉత్పత్తుల సంస్థ డాబర్ స్పందిస్తూ ప్రపంచంలోనే నంబర్ వన్ తేనె డాబర్ హనీ అని, తమ తేనె 100 శాతం స్వచ్ఛమైంది, సురక్షితమైందని తెలిపింది. తమ తేనెలో కల్తీ జరగలేదని ట్వీట్ చేసింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తేనె అమ్మకాలు పెరిగినప్పటికీ ఉత్తర భారతదేశంలో తేనెటీగల పెంపకందారులు లాభాలు క్షీణించాయని, దీంతో దర్యాప్తు ప్రారంభించినట్లు సీఎస్ఈ డైరెక్టర్ జనరల్ సునీతా నరేన్ తెలిపారు. శీతల పానీయాలపై 2003, 2006 సంవత్సరాల్లో తాముచేపట్టిన పరిశోధనలో పరిశోధనలలో కనుగొన్న దానికంటే దుర్మార్గమైన, దారుణమైన మోసాన్ని గుర్తించామన్నారు. అతి ఘోరమైన, అధునాతన కల్తీ ఇదని, ఇప్పటివరకు గుర్తించినదానికంటే చాలా ఎక్కువ హానికరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం ప్రాణాంతక మహమ్మారితో పోరాడుతున్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని నరేన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్-19 పై పోరులో భాగంగా చాలామందితేనెను విరివిగా వినియోగిస్తున్న తరుణంలో ఈ ఫలితాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. తేనెలోకల్తీని గుర్తించడం కష్టమని ఫుడ్ సేఫ్టీ అండ్ టాక్సిన్స్ టీం ప్రోగ్రామ్ డైరెక్టర్ అమిత్ ఖురానా అన్నారు. సీఎస్ఈ అధ్యయనం ప్రకారం , ప్రారంభంలో తేనెలో తీపిని పెంచేందుకు మొక్కజొన్న, చెరకు, బియ్యం, బీట్రూట్ నుండి తీసిన చక్కెరను తేనెలో కల్తీ చేసేవారు. ఇది సీ3, సీ4 పరీక్షల్లో బయటపడుతుంది. కానీ ఈ కొత్త కల్తీ ‘చైనీస్ సుగర్’ ను న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ (ఎన్ఎంఆర్) అనే పరీక్ష ద్వారా మాత్రమే గుర్తించగలం. ప్రముఖ బ్రాండ్లైన డాబర్, పతంజలి, బైద్యనాథ్, జండు, హిత్కారీ, అపిస్ హిమాలయా సంస్థలనుంచి సేకరించిన తేనె నమూనాలు ఎన్ఎంఆర్ పరీక్షలో విఫలమయ్యాయి. మారికో సఫోలా హనీ, మార్క్‌ఫెడ్ సోహ్నా, నేచర్ నెక్టా మాత్రమే అన్ని పరీక్షల్లో నెగ్గాయి. World's No. 1 Dabur Honey is 100% Pure & Safe! ✅We are NMR profiled ✅We are 22 FSSAI tests compliant. Dabur Honey clears all FSSAI tests and has the first corporate-owned NMR machine in India to ensure 100% purity. Read the complete report here, https://t.co/hLlEEMzh2M pic.twitter.com/J36fBkvnKG — Dabur India Ltd (@DaburIndia) December 2, 2020 -
ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్(జీవన్ ప్రమాణ్)ను అందజేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) మరో వెసులుబాటు కల్పించింది. కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్ఈ)ల ద్వారా వీటిని అందజేయవచ్చునని పేర్కొంది. కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం(ఈపీఎస్) పింఛనుదారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. పింఛనుదారులు ఏటా డిసెంబర్లో లైఫ్ సర్టిఫికెట్‌ను అందజేయాల్సి ఉంటుంది. దీనివల్ల పింఛను అందకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 3.65 లక్షల సీఎస్‌సీల్లోనూ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించే వీలుంటుందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 135 ప్రాంతీయ కార్యాలయాలు, 117 జిల్లా కార్యాలయాలకు ఇవి అదనమని తెలిపింది. పింఛనుదారులు ఇకపై తమకు వీలున్న సమయంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను సీఎస్సీల్లో ఇవ్వవచ్చని, ఇచ్చిన రోజు నుంచి ఇది ఏడాది పాటు చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది. (చదవండి: భారత్‌లో సామాజిక వ్యాప్తి లేదు) -
50 లక్షల ఉద్యోగాలు ఆవిరి
బెంగళూరు: దేశంలో 2011 నుంచి 2018 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో నిరుద్యోగం రెండింతలు పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో ఉద్యోగావకాశాలు క్షీణించడంతోపాటు గడిచిన రెండేళ్ల(2016–18)లో 50 లక్షల మంది పురుషులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు జరిగిన నాటి నుంచే దేశంలో ఉద్యోగావకాశాలు తగ్గుతూ వచ్చాయని తెలిపింది. అయితే ఉద్యోగావకాశాల క్షీణతకు పెద్ద నోట్ల రద్దుకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేకున్నా.. పెద్ద నోట్ల రద్దు జరిగిన నవంబర్ 2016 నుంచే ఉద్యోగాలు తగ్గిపోవడం గమనార్హం అని పేర్కొంది. ది స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా(ఎస్‌డబ్ల్యూఐ)–2019 పేరిట బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను దేశంలోని ఉద్యోగాల స్థితిగతులను లెక్కించే కన్సూమర్ పిరమిడ్స్ సర్వే ఆఫ్ ది సెంటర్ ఫర్ మోనిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ(సీఎమ్ఐఈ–సీపీడీఎక్స్) సంస్థ నుంచి 2016–18 మధ్య గల సమాచారాన్ని సేకరించి రూపొందించారు. ఈ నివేదికలో కేవలం పురుషులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఒకవేళ మహిళలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కోల్పోయిన ఉద్యోగాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. నిరుద్యోగుల్లో ముఖ్యంగా ఉన్నత చదువులు చదివిన వారితోపాటు యువకులే అధికంగా ఉన్నారని పేర్కొంది. ఇదేకాలంలో తక్కువ విద్యార్హత గల వారు కూడా ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు ఆ స్థాయిలో కూడా ఉద్యోగావకాశాలు తగ్గాయని తెలిపింది. ఈ విషయంలో మహిళల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని పేర్కొంది. ఈ నివేదిక రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించిన అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అమిత్ బాసోల్ మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉద్యోగాలను సృష్టించేందుకు కొన్ని పరిష్కార మార్గాలను నివేదికలో తాము సూచించామని అన్నారు. ‘మేము సూచించిన పరిష్కార మార్గాలు ఉద్యోగాల సృష్టికి ఊతమివ్వడంతోపాటు దేశంలోని అందరికీ సమానమైన ఉద్యోగావకాశాలను కల్పిస్తాయని బలంగా నమ్ముతున్నాం’అని పేర్కొన్నారు. పరిష్కార మార్గాలు.. ► దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ తరహాలోనే అర్బన్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ తేవాలని నివేదిక సూచించింది. దీని ద్వారా చిన్న పట్టణాల్లో సుమారు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపింది. ► స్థూల దేశీయ ఉత్పత్తిలో విద్యపై 6 శాతం, వైద్యంపై 3 శాతం అదనంగా ఖర్చు పెట్టగలిగితే సుమారు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చని వెల్లడించింది. అలాగే దీని ద్వారా అత్యంత నాణ్యమైన ప్రజా సేవలను అందించవచ్చని పేర్కొంది. ► భారతీయ తయారీ రంగాన్ని పునరుద్ధరించడానికి సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకురావడం అత్యవసరమని స్పష్టం చేసింది. -
నేడో, రేపో బదిలీలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకునే అధికారులకు స్థానచలనం కలుగనుంది. ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమలులోకి రావడంతో ఒకే చోట తిష్టవేసిన రెవెన్యూ, పోలీసు, ఎంపీడీఓలను మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిర్దేశించింది. డిసెంబర్ 31వ తేదీ నాటికి జిల్లాలో మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న అధికారుల జాబితా పంపాలని లేఖ రాసింది. ఈ మేరకు ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న రెవెన్యూ(రిటర్నింగ్/అసిస్టెంట్ రిటర్నింగ్) అధికారుల వివరాలను జిల్లా యంత్రాంగం పంపింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం.. కోడ్ అమలులోకి రావడంతో ఈ నెల 17వ తేదీలోపు వీరిని బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎంపీడీఓలకు కూడా.. ఎన్నికల బదిలీలు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు(ఎంపీడీఓ) కూడా వర్తించనున్నాయి. దీనిపై ఇప్పటివరకు స్పష్టమైన ఆదేశాలు రానప్పటికీ గత ఎన్నికల వేళ ఎంపీడీఓలను బదిలీ చేయడం, తాజాగా ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల్లో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ల ప్రస్తావన తేవడంతో ఎంపీడీఓలకు కూడా స్థానచలనం కలుగనుందనే ప్రచారం జరుగుతోంది. బీడీఓల వ్యవస్థ రాష్ట్రంలో లేనందున ఆ స్థానంలో పనిచేస్తున్న ఎంపీడీఓలలో మార్పులు చేర్పులు జరుగనున్నాయి. కాగా, మూడేళ్ల పైబడి జిల్లాలో పనిచేస్తున్నవారిని పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో మూడో వంతు ఎంపీడీఓల పీఠాలు కదలనున్నాయి. కొన్నేళ్లుగా పంచాయతీరాజ్ శాఖలో బదిలీలపై నిషేధం కొనసాగుతుండడంతో భారీ స్థాయిలో బదిలీలు అయ్యే అవకాశముంది. ఎన్నికల అనంతరం ప్రస్తుత మండలాల్లోనే కొలువుదీరే వెసులుబాటు ఉండడంతో అధికారుల్లో పెద్దగా ఆందోళన కలగడం లేదు. ఇదిలావుండగా, ఇటీవల పోలీసుశాఖలో భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. ఎన్నికల కోడ్ రావడంతో హోంశాఖ ఈ మేరకు సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులకు స్థానచనలం కలిగించింది. జాబితాకు తుదిమెరుగు ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా మాతృ జిల్లాలో పనిచేస్తున్న, మూడేళ్లుగా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు స్థానచలనం కలుగనుంది. మూడేళ్ల కాలపరిమితిలో పదోన్నతులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 17 మంది రెవెన్యూ అధికారులకు బదిలీ అనివార్యం కానుంది. కాగా, ఎన్నికల కమిషన్ నియమావళి ప్రభావం చూపే అధికారుల జాబితాను పరిశీలిస్తున్న పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంలో జిల్లాలవారీగా తహసీల్దార్లను కేటాయించేందుకు తుది కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రూపొందించిన జాబితాను జిల్లా యంత్రాంగానికి అందగానే బాధ్యతల నుంచి అధికారులు రిలీవ్ కావాల్సి వుంటుంది. ఇదిలావుండగా, గండిపేట, రాజేంద్రనగర్, యాచారం, ఆమనగల్లు, చౌదరిగూడ, షాబాద్, శంకర్పల్లి, హయత్‌నగర్, సరూర్‌నగర్, మహేశ్వరం, మాడ్గుల, తలకొండపల్లి మండలాల తహసీల్దార్లతోపాటు కలెక్టరేట్లో తహసీల్దార్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు అధికారులకు మార్పు తప్పనిసరి అయింది. -
ఆ మెట్రో ఎక్కితే జేబు గుల్లే..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో మెట్రో రైలు ప్రయాణం సామాన్యుడి జేబుకు అందనంత దూరంలో ఉంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) చేపట్టిన అథ్యయనంలో ఢిల్లీ మెట్రో ప్రపంచంలోనే ఖరీదైన మెట్రో ప్రయాణంలో రెండవదిగా నిలిచింది. గత ఏడాది మెట్రో రైలు చార్జీలు పెంచిన అనంతరం ప్రపంచంలోనే అతిఎక్కువ చార్జీలు కలిగిన రెండవ మెట్రో సర్వీసుగా ఢిల్లీ మెట్రో అవతరించింది. ప్రపంచంలో తొమ్మిది మెట్రపాలిటన్ నగరాల్లో పది కిలోమీటర్ల ప్రయాణానికి సగం డాలర్‌లోపే ఖర్చవుతుండగా, ఢిల్లీ మెట్రోలో ప్రయాణించేందుకు ప్రయాణీకులు తమ ఆదాయంలో చేస్తున్న ఖర్చు శాతం ఆధారంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెట్రో ప్రయాణాల్లో రెండవదిగా నిలిచిందని సీఎస్ఈ అథ్యయనం వెల్లడించింది. ఢిల్లీలో మెట్రో జర్నీపై ప్రయాణీకులు తమ ఆదాయంలో 14 శాతం ఖర్చు చేస్తుండగా, అత్యధికంగా వియత్నాంలోని హనోయిలో ప్రయాణీకులు మెట్రో జర్నీ కోసం తమ ఆదాయంలో ఏకంగా 25 శాతం వెచ్చించాల్సి వస్తోంది. ఢిల్లీలో దినసరి కార్మికుడు నాన్ ఏసీ బస్సులో వెళ్లేందుకు తన ఆదాయంలో 8 శాతం, ఏసీ బస్‌లో వెళ్లేందుకు 14 శాతం ఖర్చు చేయాల్సి ఉండగా, ఢిల్లీ మెట్రోలో వెళ్లాలంటే మాత్రం తన రాబడిలో ఏకంగా 22 శాతం ఖర్చు చేయాల్సి వస్తోందని ఈ అథ్యయనం విశ్లేషించింది. -
ఇంజినీరింగ్ పల్టీ
జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల ఆశలు, కలలు, ఆలోచనలు బూమరాంగ్ అయ్యాయి. గత రెండు.. మూడేళ్లుగా ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీకి యాజమాన్యాలు నానా పాట్లు పడుతున్నారు. ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా మారింది. జిల్లా మొత్తంగా ఉన్న కళాశాలల్లో 56.65 శాతం సీట్లు మాత్రమే భర్తీ కాగా, రెండు కళాశాలల్లో ‘0’ శాతం, మరో రెండు కళాశాలల్లో 4 శాతం సీట్లు కూడా భర్తీ కాని పరిస్థితి నెలకొంది. గత విద్యా సంవత్సరాల్లో భర్తీ కానీ సీట్లను యాజమాన్యాలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది కొన్ని కళాశాలలు మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెల్లూరు (టౌన్): ఒకప్పుడు విద్యార్థులు ఇంజినీరింగ్ కళాశాలలో ఏ బ్రాంచ్‌లో అయినా పర్వాలేదు సీటు దొరికితే చాలు అదృష్టంగా భావించే వారు. అప్పట్లో కళాశాలల యాజమాన్యం చెప్పిందే వేదం. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఒక్క విద్యార్థి దొరికితే చాలు కళాశాలను నడుపుకుందామనే ధోరణిలో పలు కళాశాలల యాజమాన్యాలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఆయా కళాశాలల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాకపోవడంతో మూడో విడత కౌన్సెలింగ్‌పై ఆశలు పెట్టుకున్న యాజమాన్యాలకు నిరాశే మిగిలింది. రెండో విడత కౌన్సెలింగ్‌లో ఆయా కళాశాలల్లో చేరిన విద్యార్థులు సైతం మూడో విడత కౌన్సెలింగ్ సమయంలో 106 మంది జారుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 56.56 శాతం భర్తీ ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్ గత నెల 31తో ముగిసింది. జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో 56.65 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. జిల్లాలో ఏ కళాశాలలోనూ 100 శాతం సీట్లు భర్తీ కాలేదు. కావలి ప్రాంతంలో ఉన్న ఆర్ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో మాత్రం 90.82 శాతం సీట్లు భర్తీ అయి ప్రథమ స్థానంలో, ఆ తర్వాత 88.62 శాతం భర్తీతో నారాయణ రెండో స్థానంలో నిలిచాయి. 87.04 శాతంతో శ్రీవెంకటేశ్వర మూడో స్థానం, 85.98 శాతంతో గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాల నాలుగో స్థానంలో నిలిచాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,245 సీట్లు ఉన్నాయి. వాటిల్లో మూడో విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత 3,538 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 2,707 సీట్లు మిగిలి పోయాయి. జిల్లాలో రెండు ఇంజినీరింగ్ కళాశాలల్లో జీరో శాతం అడ్మిషన్లు ఉండగా, మరో రెండు కళాశాలల్లో 4 శాతం లోపు అడ్మిషన్లు ఉండటం గమనార్హం. 20 శాతం లోపు 2 కళాశాలలో 50 శాతం లోపు 6 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలోని 10 ఇంజినీరింగ్ కళాశాలల్లో 50 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్ఈ, ఈసీఈ బ్రాంచ్‌లకు డిమాండ్ ఇంజినిరింగ్‌లో సీఎస్ఈ, సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ, ఈసీఈ, ఐటీ తదితర బ్రాంచ్‌లు ఉన్నాయి. అయితే సీఎస్ఈ, ఈఎస్ఈ బ్రాంచ్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ రెండు బ్రాంచ్‌ల్లో చేరేందుకు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తికాగానే ఉద్యోగంలో చేరవచ్చన్న భావనలో విద్యార్థులు ఉంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో పూర్తయిన బ్రాంచ్‌లను పరిశీలిస్తే సీఎస్ఈలో 70.20 శాతం సీట్లు భర్తీ కాగా ఈసీఈలో 65.3 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్‌లో 38.4 శాతం, ట్రిపుల్ ఈ లో 41.1 శాతం, మెకానికల్‌లో 50.2 శాతం, ఐటీ 34.5 శాతం సీట్లు భర్తీ కావడం విశేషం. మూత దిశగా కొన్ని కళాశాలలు ఇంజినీరింగ్‌లో ఆశించిన మేర విద్యార్థులు చేరక పోవడంతో కొన్ని కళాశాలలు మూత పడే దిశలో ఉన్నాయి. గత ఏడాది అనుభావాలను దృష్టితో ఈ ఏడాది సుమారు 2 వేలు సీట్లను వదులుకున్నారు. ప్రధానంగా జిల్లాలో చదివిన విద్యార్ధులు ఇక్కడ ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరకుండా ఎక్కువ మంది విద్యార్ధులు ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రీతిలో జిల్లా నుంచి ప్రతి ఏటా సుమారు 14 వేల మందికి పైగా విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ చదివేందుకు వెళుతున్నారని తెలిసింది. ఇక్కడ ఎక్కువ కళాశాలల్లో బీటెక్ పూర్తి చేసిన వారితోనే బోధన చేయిస్తున్నారన్న ప్రచారం ఉంది. -
సూపర్మార్కెట్లలో నిషేధిత పదార్థాల వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ : సూపర్ మార్కెట్లలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న జన్యుమార్పిడి ఆహార పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయంటూ ఓ షాకింగ్ రిపోర్ట్ వెలువడింది. నిషేధిత జీఎం(జెనిటికల్లీ మోడిఫైడ్) ఆహార పదార్థాలను ఆకర్షణీయమైన ప్యాకేజీల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్సీ) నివేదించింది. విదేశాలకు చెందిన ఫ్యాన్సీ ఉత్పతులు ముఖ్యంగా శిశువుల ఆహార ఉత్పత్తులు వుండటం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. పాన్ కేక్ సిరప్, మల్టీ గ్రెయిన్ సిరల్స్( సెరిలాక్ లాంటివి) కార్న్ పఫ్స్, నూనెలు లాంటివి అమ్ముతున్నారని తెలిపింది. గుజరాత్, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో సంస్థ పరిశోధకులు 65 ఆహార నమూనాలను పరీక్షించారు. వీటిల్లో 21 నమూనాల్లో 32 శాతం జీఎం పాజిటివ్ అని కనుగొన్నారు. భారతదేశంలో తయారు చేసిన వాటిల్లో 30 శాంపిల్స్‌లో కేవలం ఐదు లేదా 17 శాతం జీఎం పాజిటివ్‌గా ఉండగా, కెనడా, యుఎఇ, అమెరికా, నెదర్లాండ్స్, థాయ్‌లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న 35శాంపిల్స్‌లో 16-46 శాతం జీఎం పాజిటివ్‌గా ఉన్నాయని నివేదించింది. అలాగే జీఎం పాజిటివ్ అయి వుండి జీఎం ఫ్రీ పేరుతో అక్రమంతా విక్రయిస్తున్న ఉత్పత్తులు దాదాపు 15శాతం ఉన్నట్టు వెల్లడించింది. జన్యుమార్పిడి ఆహారాలకు దేశంలో అనుమతి లేనప్పటికీ , సూపర్ మార్కెట్లో ఇలా అక్రమంగా విక్రయిస్తున్నారని తాజా అధ్యయనంలో సీఎస్ఈ తేల్చింది. పైగా వీటిల్లో కొన్నింటిని జీఎం ఫ్రీ అని తప్పుడు ప్రకటనలతో మోసం చేస్తున్నారని నివేదించింది. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006 లోని సెక్షన్ 22 ప్రకారం జన్యుమార్పిడి ఆహార ఉత్పత్తులను భారతదేశంలో తయారుచేయడం, దిగుమతి లేదా విక్రయించడం నిషేధమని పేర్కొంది. నిఘా విభాగం లోపం వల్లే దేశంలోని అనేక సూపర్మార్కెట్లలో జన్యుమార్పిడి ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయని జీఎస్ఈ డైరెక్టర్ జనరల్ సునీతా నారెన్ చెప్పారు. ముఖ్యంగా చిన్నపిల్లల ఆహార ఉత్పత్తులు జన్యుమార్పిడివి వుండటం ఆందోళకరమన్నారు.అంతేకాదు జీఎం ఫ్రీ అనే లేబుల్‌తో ఈ ఉత్పత్తులను విక్రయించడం మరింత విచారకరమని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అమెరికా, నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకున్న ఎనిమిదింటిలో రెండు చిన్నారి ఆహార పదార్థాల నమూనాలు జీఎం పాజిటివ్‌గా ఉన్నప్పటికీ, లేబుళ్ళు ఈ విషయాన్ని వెల్లడించలేదని తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ అంటీముట్టనట్టు వ్యవహరిస్తోందని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇందు భూషణ్ వ్యాఖ్యానించారు. జన్యుపరంగా మార్పు చెందిన బిటి పత్తి పెంపకానికి మాత్రమే భారత్‌లో అనుమతి ఉందన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మ కంపెనీ శిశువుల ఆహార ఉత్పత్తులను (జీఎం, నాన్ జీఎం) విక్రయిస్తుందని కానీ అక్కడి సూపర్మార్కెట్లలో సంబంధిత సూచనలు, తప్పనిసరి హెచ్చరికలుంటాయని సునీతా చెప్పారు. కానీ భారతదేశంలో అలా ఎందుకు కాదు అని ఆమె ప్రశ్నించారు. జన్యుమార్పిడి ఆహార పదార్థాలు హానికరమైనవా, కాదా అనేదానిపై సుదీర్ఘ చర్చ ఉన్నప్పటికీ, వీటి ఎంపికలో వినియోగదారుడికి స్వేచ్ఛ ఉండాలని ఆమె అన్నారు. -
నేల తల్లి నిస్సారం
సీఎస్ఈ ఆందోళన వార్షిక నివేదిక విడుదల సాక్షి నాలెడ్జ్ సెంటర్: అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నామని, రెండంకెల వృద్ధిరేటు సాధిస్తామన్న వార్తలు తరచూ వింటూ ఉంటాం. దేశం మారిపోతోందని మనసులో సంబరపడుతూంటాం. ఇందులో వాస్తవమెంత? అన్న ప్రశ్న వేసుకుంటే భిన్నమైన జవాబులు వస్తాయి. ఆర్థిక వృద్ధి మాటేమోగానీ...పర్యావరణపరంగా మాత్రం భారత్ ఏటికేడాదీ క్షీణిస్తోందని, వెనుకబడిపోతోందని హెచ్చరిస్తోంది సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ). న్యూ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ తన వార్షి క నివేదిక ‘స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్’లో స్పష్టం చేసింది. అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతోపాటు ఎడారి భూములు ఎక్కువవుతున్న వైనా న్ని విడమరిచింది. ఆ వివరాలు స్థూలంగా... అభివృద్ధి సూచీల్లో110వ ర్యాంకు ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి కోసం నిర్దేశించిన 52 సూచీల్లో భారత్ కేవలం పదహారిం టిలోనే ప్రపంచ సగటు స్థాయిని అందుకుం టోంది. విద్య, ఆరోగ్య, పరిశోధన రంగాలు మూడింటికీ కలిపి మనం చేస్తున్న ఖర్చు స్థూల జాతీయోత్పత్తిలో 8.6% మాత్రమే! ఇవన్నీ ప్రపంచ దేశాల సగటు ఖర్చుకంటే తక్కువ! అందని భూసార కార్డులు: కేంద్రం చేపట్టిన భూసార కార్డుల జారీ నత్త నడకన నడుస్తోంది. ఈ ఏడాది మార్చిలోగా 14 కోట్ల మంది రైతులకు ఈ కార్డులు జారీ చేయాలన్నది లక్ష్యం కాగా.. 2016 అక్టోబరు 18 నాటికి 23% మందికి మాత్రమే జారీ అయ్యా యి. ఈ నెల 17 నాటికి కూడా ఈ అంకె పెరి గింది తక్కువే. రసాయన ఎరువులు, కీటకనాశినుల విచ్చలవిడి వాడకానికి కళ్లెం వేసేందు కు, సూక్ష్మ పోషకాల సరఫరా ద్వారా దిగుబడులను పెంచేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని 2015లో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎడారులవుతున్న భూములు... దేశవ్యాప్తంగా సారవంతమైన భూమి విస్తీర్ణం ఏటికేడాదీ తగ్గిపోతోంది. దేశంలో మొత్తం 32.87 కోట్ల చదరపు హెక్టార్ల భూమి ఉండగా ఇందులో దాదాపు 10.51 కోట్ల చదరపు హెక్టా ర్ల భూమి సారం క్షీణించింది. 2030 నాటికల్లా ఈ భూసార క్షీణతకు అడ్డుకట్ట వేస్తామని భారత్ ఐక్యరాజ్య సమితికి హామీ ఇచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు సరికదా... ఎడారుల్లా మారుతున్నా ప్రాంతాలు ఎక్కువైపోతున్నా యి. 2003–05, 2011–13 మధ్యకాలంలోనే 18 లక్షల చదరపు హెక్టార్ల భూమి ఎడారిగా మారిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. చెన్నైలో జలావరణాలు మాయం... నగరాల్లో వరదముప్పు పెరిగిపోవడానికి చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతూండటంతో వరదనీటిని ఇముడ్చుకునే ఏర్పాట్లు కరవయ్యాయి. తమిళనాడు రాజధాని చెన్నై పదహారేళ్ల కాలంలో 7సార్లు వరద ముప్పునకు గురైందీ ఇందుకే. గతంతో పోలిస్తే చెన్నైలోని జలావరణాలు 50%కిపైగా తగ్గిపోయాయి. శ్రీనగర్, గౌహతిల్లోనూ ఇదే పరిస్థితి. అటవీ భూమికి రెక్కలు.. గత ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ దాదాపు పదివేల హెక్టార్ల అటవీ భూములను డీ నోటిఫై చేసింది. ఇందులో అత్యధిక శాతం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సం బంధించిన ముంపు భూములు ఉన్నాయి. -
సీఎస్ఈ యమా క్రేజీ!
ఐఐటీలు, నిట్లు, క్యాంపస్ కాలేజీలు, ప్రైవేటు ఇన్స్టిట్యూట్లు.. సంస్థ ఏదైనా.. ఇంజనీరింగ్ ఔత్సాహికుల ఓటు సీఎస్ఈ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్)కే! నాలుగైదేళ్ల క్రితం ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ వంటి కోర్బ్రాంచ్ల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపేవారు. గత రెండేళ్లుగా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అంతా సీఎస్‌ఈనే కావాలంటున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం ఇంజనీరింగ్ అడ్మిషన్లలో సీఎస్‌ఈపై క్రేజ్ మరింత స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించింది. సీఎస్ఈ.. విద్యార్థులను అమితంగా ఆకర్షించడానికి కారణాలేమిటో తెలుసుకుందాం.. గత రెండేళ్లుగా సీఎస్ఈ జాతీయ స్థాయి ప్రభుత్వ (ఐఐటీలు, నిట్లు), ప్రైవేటు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు, తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ ఏడాది విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ దాదాపు ముగిసింది. ఈసారి విద్యార్థులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) బ్రాంచిలో చేరడానికి మొగ్గు చూపారు. గతంలో కోర్ సబ్జెక్టులపై ఎక్కువగా ఆసక్తి కనబర్చిన విద్యార్థులు.. గత రెండేళ్లుగా సీఎస్ఈలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాలు ద్వారా తెలుస్తోంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఐటీ రంగం రోజురోజుకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఈ కామర్స్ రంగంలో ఎన్నడూలేనంత వృద్ధి. దాంతో కంప్యూటర్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఇది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. సీఎస్ఈ విద్యార్థులకు ప్రముఖ కంపెనీలు అద్భుతమైన ప్యాకేజీలు అందిస్తున్నాయి. సీఎస్ఈ విద్యార్థుల సగటు ప్యాకేజీ ఇతర బ్రాంచ్‌లు గరిష్ట ప్యాకేజీతో సమానంగా ఉండటం గమనార్హం. ఐఐటీ ఢిల్లీ ప్లేస్‌మెంట్స్ రిపోర్ట్ 2015 ప్రకారం- సీఎస్ఈ విద్యార్థులు ఇద్దరికి పేస్బుక్ 1.42 కోట్ల వార్షిక ప్యాకేజీ ప్రకటించింది. ఐఐటీలు, ఇతర ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో వార్షిక ప్యాకేజీలు సగటున రూ.10లక్షలకు పైమాటే! ఉద్యోగంలో చేరాక ప్రతిభ, అనుభవంతో సంవత్సరానికి రూ.30 లక్షల వరకూ అందుకోవడం కష్టమేమీ కాదు. దాంతోపాటు విదేశాల్లో పని చేసే అవకాశం.. రెండు రోజులు సెలవు దినాలు తదితర సౌక్యరాలు వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు సీఎస్ఈ బ్రాంచీని ఎంచుకోమని సలహా ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మన ఐటీ నిపుణులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. అనేక ఎంఎన్‌సీలు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు స్వాగతం పలుకుతున్నాయి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో గూగుల్, అడోబ్, యాపిల్, ఇంటెల్ వంటి టాప్ కంపెనీలు సైతం మన కంప్యూటర్ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇక గూగుల్, ఫేస్బుక్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు మన ఐఐటీ గ్రాడ్యుయేట్లకు లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్న వార్తలు సైతం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అమితంగా ఆకర్షిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడి ఐటీ నిపుణులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూకే, మలేషియా లాంటి దేశాలకు వలస వెళ్తున్నారు. వీరు ఆయా దేశాల ఆర్థిక వృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారు. బ్యాంకాక్, దుబాయ్, సింగపూర్‌ల్లో ఇండియన్ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ కోసం కొత్త వేదికలనూ ఏర్పాటు చేస్తున్నారు. ముందే సీఎస్ఈలో చేరితే.. బీటెక్‌లో ఏ బ్రాంచ్ చదివినా.. చివరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా మారాల్సిన పరిస్థితి. ఐటీలో విస్తృత అవకాశాలు ఉండటమే అందుకు కారణం. వేర్వేరు బ్రాంచ్‌లు చదివి చివరికి సాఫ్ట్వేర్ రంగంలోనే రాణిస్తున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువే అయినా.. మొదటి నుంచే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో చేరితే కెరీర్లో మరింత మెరుగ్గా పని చేయడానికి ఆస్కారం ఉంటుందని విద్యార్థులు భావిస్తున్నారు. వీటికి తోడు కొన్ని టాప్ మల్టీ నేషనల్ కంపెనీలు సీఎస్ఈ విద్యార్థులను మాత్రమే నియమించుకుంటాయి. దాంతో విద్యార్థులు సీఎస్ఈ వైపు మొగ్గు చూపుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. ఐఐటీల్లో బయో టెక్నాలజీ వంటి కోర్సులు చదివిన విద్యార్థులు సైతం కోడింగ్ నేర్చుకొని సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేరుతున్న ఉదంతాలు అనేకం. కాబట్టి ముందే సీఎస్ఈలో చేరితే పోలా..! అనే ఆలోచన ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రుల్లోనూ పెరుగుతుండటమే సీఎస్ఈ పట్ల క్రేజ్‌కు కారణమంటున్నారు. పరిశోధనలు... బిగ్ డేటా సీఎస్ఈ బ్రాంచ్ విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా, పరిశోధనలు చేసేందుకు కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా రోబోటిక్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, న్యూరోసైన్స్ విభాగాల్లో జరుగుతున్న పరిశోధనలు ప్రతిభావంతులకు సవాళ్లతోపాటు అవకాశాలను అందిస్తున్నాయి. అమెరికా వంటి విదేశాల్లో ఎంఎస్ చేసేందుకు సీఎస్ఈ అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయముంది. అలాగే రానున్న కాలంలో క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ లాంటి విభాగాల్లో లక్షల్లో నిపుణుల అవసరం ఉండనుందనే సమాచారం ఆధారంగా విద్యార్థులు సీఎస్ఈ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. సర్కారీ కొలువులు సైతం సీఎస్ఈలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులు ఐటీ, ఐటీ ఆధారిత సేవల విభాగాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడవచ్చు. వీటితో పాటు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగాలు, రైల్వే, బ్యాంకింగ్ రంగంలోనూ వీరికి అవకాశాలు పుష్కలం. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో టెక్నికల్ ఉద్యోగాలు భారీగా పెరుగుతున్నాయి. దాంతో సీఎస్ఈలో చేరితే అద్భుత అవకాశాలు అందుకోవచ్చని భావిస్తున్నారు. కోర్సు కూడా సులభమే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తిగా లాజిక్‌తో కూడుకొని ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. లాజిక్ తెలిసి కోడింగ్ నైపుణ్యం అలవడితే ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా పదో తరగతి, 10+2 స్థాయిలోనే కంప్యూటర్ గురించి విద్యార్థులకు కొంత అవగాహన ఏర్పడుతోంది. దాంతో స్కూల్ స్థాయిలోనే ఎక్కువ మంది విద్యార్థులు కంప్యూటర్స్‌పై ఆసక్తి పెంచుకోవడం కూడా సీఎస్ఈకి పెరిగిన క్రేజ్‌కు ఒక కారణమంటున్నారు. ఇంజనీరింగ్ తర్వాత అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఎంఎస్ చేయడానికి సులువుగా ఉంటుంది. వేరే బ్రాంచ్ అభ్యర్థులతో పోల్చితే వీరికి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. వేతనాలు కూడా ఆకర్షణీయం. భవిష్యత్తులోనూ క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి టెక్నాలజీల వల్ల ఐటీ రంగంలో విస్తృత ఉద్యోగాల సృష్టి జరగే అవకాశం ఉంది కాబట్టి సీఎస్ఈ అభ్యర్థులకు ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. - డాక్టర్ బి.చెన్నకేశవ రావు, ప్రిన్సిపల్, సీబీఐటీ. గత 20 ఏళ్లుగా ఐటీ రంగానికి బూమ్ ఉంది. ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్స్ మొదలైన విభాగాల్లో ఇంజనీరింగ్ చేసిన వారికి, ఎంబీఏ చదివిన అభ్యర్థులకూ ఐటీ రంగం ఉపాధి కల్పిస్తుంది. ఈ విధంగా చదివిన కోర్సు ఏదైనా చివరికి ఐటీ రంగంలో స్థిరపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివించడానికే విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం ఐటీ రంగం వద్ధి కూడా స్థిరంగా ఉంది. రానున్న కాలంలో బిగ్‌డేటా అనలిటిక్స్ లాంటి అందుబాటులోకి వస్తే ఐటీ రంగానికి బూమ్ వచ్చే అవకాశం ఉంది. - డా. పి.ప్రేమ్‌చంద్, ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఓయూ. -
స్మార్ట్‌గా ...సులభంగా!
– అరచేతిలో సమస్త సమాచారం – అన్నమాచార్య కళాశాల విద్యార్థుల నూతన ఆవిష్కరణ తిరుపతి ఎడ్యుకేషన్ : వారంతా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(సీఎస్ఈ) చదువుకుంటున్న విద్యార్థులు. ఓ వైపు చదువుకుంటూనే తమ వంతు ప్రజలకు ఉపయోగపడేలా సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి నడుం బిగించారు. చదువుకు సృజనాత్మకతను జోడించి పలు స్మార్ట్ యాప్స్(అప్లికేషన్స్)ను రూపొందించారు. అన్నదాతకు సమస్త సమాచారం అందించే ‘అగ్రికల్చర్’, తిరుపతికి వచ్చే భక్తులు, యాత్రికులకు అవసరమైన విషయాల కోసం ‘తిరుపతి యాత్ర’, రోడ్డు ప్రమాదాల నివారణకు ‘డ్రైవింగ్ మోడ్’, మహిళలకు భద్రతకు ‘ఉమెన్స్ సెక్యూరిటీ’, షాపింగ్ మరింత సులభంగా చేయడానికి ‘షాప్ హియర్’, ‘బాజే’ అప్లికేషన్లు తదితరాలను రూపొందించి ప్రశంసలందుకున్నారు. స్మార్ట్‌గా.. సులభంగా సమాచారం తెలుసుకునేందుకు అనంతపురం జేఎన్టీయూ వర్సిటీ పరిధిలోని కళాశాలలు, ఇతర వివరాలకు సంబంధించి ‘జేఎన్టీయూఏ సిలబస్’ను యాప్‌ను సృష్టించారు. స్కిల్ ఇండియా పిలుపుతో.. ప్రధాని నరేంద్రమోది స్కిల్ ఇండియా పిలుపుతో తిరుపతి–కరకంబాడి రోడ్డులోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల సీఎస్ఈ విభాగపు తృతీయ సంవత్సర విద్యార్థులు ఈ అప్లికేషన్లు రూపొందించారు. మిట్ టూల్ సహాయంతో ఈ యాప్స్‌ను సృష్టించారు. వీరిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ఆ కళాశాల చైర్మన్lగంగిరెడ్డి, వైస్ చైర్మన్ యల్లారెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అభిషేక్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.నాదమునిరెడ్డి విద్యార్థులను అభినందించారు. ఈ యాప్స్‌కు సంబంధించిన వివరాలు, వాటి ఉపయోగాలు విద్యార్థుల మాటల్లోనే... అన్నదాతల కోసం ‘అగ్రికల్చర్’ ఈ యాప్‌ను వరదన్, శ్రీనివాస్ రూపొందించారు. ఇందులో వాతావరణానికి తగిన పంటలు, పెట్టుబడులు, రాబడులు, రసాయనాలు, పాడి పంట తదితర విషయాలను నిక్షిప్తం చేశారు. సులభంగా అర్థమయ్యేలా తెలుగు భాషలో దీన్ని రూపొందించారు. ఈ యాప్‌ను స్మార్ట్ ఫోనులోకి డౌన్లోడ్ చేసుకుని ఇంటర్నెట్ సహాయంతో సమాచారాన్ని తెలుసుకోవచ్చు. భక్తుల కోసం‘తిరుపతి యాత్ర’ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం రోజూ వేల సంఖ్యలో భక్తులు, యాత్రికులు తిరుపతికి వస్తుంటారు. వీరిని దృష్టిలో పెట్టుకుని నితిన్తేజ, ప్రవీణ్ ఈ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌లో భక్తులకు కావాల్సిన తిరుమల శ్రీవారి దర్శనం, గదులు తదితర వివరాలు ఉంటాయి. తిరుపతి మ్యాప్, ముఖ్యప్రదేశాలు, హోటల్స్, ట్రావెల్స్ వివరాలను పొందుపరిచారు. తిరుపతి సరిసరాల్లోని పుణ్యక్షేత్రాల సమాచారం కూడా ఇందులో ఉంటుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ‘డ్రైవింగ్ మోడ్’ ప్రస్తుతం సెల్‌ఫోన్ డ్రైవింగ్‌తో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీన్ని నివారించేందుకే ‘డ్రైవింగ్ మోడ్’ యాప్‌కు చరిష్మ, దివ్య ప్రాణం పోశారు. ఈ యాప్ ఉంటే వాహనం నడిపేటప్పుడు ఫోన్ చేసే అవతలి వారికి మనము డ్రైవింగ్‌లో ఉన్నామనే విషయాన్ని చేరవేస్తుంది. మహిళల కోసం‘ఉమెన్స్ సెక్యూరిటీ’ మహిళలపై పెరుగుతున్న నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో సౌందర్య, శ్రీలక్ష్మి ‘ఉమెన్స్ సెక్యూరిటీ’ యాప్‌కు శ్రీకారం చుట్టారు. ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఒక బటన్ సహాయంతో తాము ఏ పరిస్థితిలో ఉన్నామో సమీప పోలీస్‌స్టేషన్‌లోని షీ టీమ్‌కు చేరేలా ఈ యాప్ రూపొందించారు. అవసరమైతే మహిళలకు ఈ యాప్‌ను ఉచితంగా ఇస్తామని వారు ముందుకొచ్చారు ‘షాప్ హియర్ ’తో మరింత సులభంగా.. ఆధునిక కాలంలో ఆన్లైన్ షాపింగ్‌కే అందరూ మక్కువ చూపుతున్నారు. ఆన్లైన్ షాపింగ్ మరింత సులభంగా ఉండేలా ప్రత్యేకంగా ‘షాపింగ్ హియర్’ అనే యాప్‌ను రూపొందించారు ఎ.హర్షిత, ఆర్.జ్ఞాన దీపిక. ఈ యాప్‌లో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అన్ని రకాల వస్తువులను చూడొచ్చు, నచ్చితే కొనుగోలు చేయవచ్చు. మరిచిపోకుండా ‘బాజే’ ఉరుకుల పరుగుల జీవితంలో చిన్నచిన్న విషయాలను కూడా మరిచిపోతుంటాం. ముఖ్యంగా షాపింగ్ చేసేటప్పుడు మతిమరుతపుతో పలుమార్లు షాపింగ్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి వారి కోసమే లహరి, దేవిశ్రీ ‘బాజే’ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ సహాయంతో షాపింగ్ సమయంలో మనకు కావాల్సిన అన్ని వస్తువులను మరచిపోకుండా కొనుక్కోవచ్చు. విద్యార్థులకు ఉపయోగపడే ‘జేఎన్టీయూఏ సిలబస్’ విద్యార్థులు, ముఖ్యంగా అనంతపురం జేఎన్టీయూ వర్సిటీ పరిధిలోని కాలేజీలు ఇతర వివరాలు తెలుసుకునేందుకువీలుగా అనీష, కుసుమ ఈ యాప్‌ను రూపొందించారు. ఇందులో వర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలు, సిలబస్, వీడియోస్, నోట్స్, సాంకేతిక నిపుణుల సమాచారం పొందుపరిచారు. సెమిస్టర్లు, బ్రాంచ్‌ల వారీగా సమాచారాన్ని సులభంగా, ఇంటర్నెట్ సదుపాయం లేకుండా తెలుసుకోవచ్చు. -
మార్కెట్లో 'బ్రెడ్' దుమారం
ముంబై: మ్యాగీ నూడుల్స్ లో మోతాదుకు మించి లెడ్ వాడుతోందన్న వివాదం మ్యాగీ నూడుల్స్ ప్రియులను దిగ్భ్రాంతికి లోను చేసింది. తాజాగా సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) చెప్పిన విషయాలు మరింత దుమారాన్ని రాజేశాయి. బ్రెడ్, పిజ్జా, కొన్ని రకాల బిస్కట్లలో కాన్సర్ కారక రసాయనాలను కనుగొన్నామని (చదవండి....బ్రెడ్డు తింటే కేన్సర్ ఫ్రీ!) సీఎస్ నిన్న ప్రెస్ మీట్ లో వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. దీంతో మంగళవారం నాటి మార్కెట్ లో ఫూడ్ సెక్టార్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా జూబ్లియంట్ ఫుడ్ వర్క్, దాదాపు10 శాతం , బ్రిటానియా 2శాతం నష్టపోయింది. వెస్ట్ లైఫ్ డెవలప్ మెంట్ కూడా ఇదే బాటలోఉంది. అసలే అంచనాలకు మించని ఫలితాలు, పతంజలి దెబ్బతో కుదేలైన బ్రిటానియాకు సీఎస్ ఈ రిపోర్టు అశనిపాతంలా తగిలింది. అయితే సీఎస్ఈ రిపోర్టును మెక్ డోనాల్డ్ , బ్రిటానియా తీవ్రంగా ఖండించాయి. తాము బ్రెడ్ , పిజ్జా తయారీలో పొటాషియం ఐయోడేట్ పొటాషియం బ్రోమేట్ తమ ఉత్పత్తుల్లో వాడటం లేదని వాదించాయి. సీఎస్ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారణమైనవి మెకొ డోనాల్డ్ కొట్టిపారేసింది. భారత ఆహార ఎఫ్ ఎస్ ఎస్ ఏ నిబంధనల ప్రకారంమే బ్రెడ్ లోని ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామని వివరణ ఇచ్చాయి. ఈ వివాదంలో పిజ్జాహట్, కెఎఫ్సీ తదితర ఆహార ఉత్పత్తుల కంపెనీలు ఇంకా ఉన్నాయి. కాగా బ్రెడ్, పిజ్జా, బర్గర్లలో కెమికల్స్‌ను గుర్తించినట్లు సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) అధ్యయనంలో తేలింది. బ్రెడ్‌తో పాటు బర్గర్, పిజ్జా వంటి ఫాస్ట్ ఫుడ్‌లో పొటాషియం బ్రొమేట్ (కేబీఆర్ఓ) లేదా పొటాషియం ఐయోడేట్ (కేఐఓ3)ల శాతం అధికంగా ఉందని, బ్రెడ్, పిజ్జా, బర్గర్లు, బేకరీ ఉత్పత్తుల్లో 84 శాతం పైన పేర్కొన్న రసాయనాలు ఉన్నట్లు శాంపిల్స్ ద్వారా తేటతెల్లమైంది. వీటి ద్వారా క్యాన్సర్ ఏర్పడే అవకాశాలున్నాయని సీఎస్ఈ వెల్లడించడం ఆందోళన రేపిన సంగతి తెలిసిందే. -
అవకాశాలయానం..ఏరోనాటికల్ ఇంజనీరింగ్
శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఏవియేషన్ ఒకటి.. ఆకాశమే హద్దుగా విస్తరిస్తున్న రంగం.. పెరుగుతున్న అవసరాలు.. పోటీని తట్టుకోవాలంటే సాంకేతికంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావల్సిన పరిస్థితులు.. ఈ నేపథ్యంలో సంబంధిత రంగంలో భద్రత ప్రమాణాలను పర్యవేక్షించడం, నిరంతరంగా వస్త్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడం, విమానాలు అన్ని విధాలుగా సురక్షితంగా ఉన్నాయో? లేవా? పరీక్షించడం వంటి అంశాలను నిర్వహించడం కోసం నిపుణులు అవసరం.. అటువంటి మానవ వనరులను తీర్చిదిద్దే కోర్సు.. ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ విద్యార్థుల సామర్థ్యానికి సవాలుగా నిలిచే బ్రాంచ్‌లలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఒకటి. భిన్నంగా ఆలోచించే వారికి సరిగ్గా సరిపోయే కెరీర్ ఇది. గతంలో సివిల్, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ వంటి సంప్రదాయ బ్రాంచ్‌లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఆ తర్వాత సీఎస్ఈ, ఐటీ, మెటలర్జీ వంటి స్పెషలైజ్డ్ బ్రాంచ్‌లను ప్రవేశ పెట్టారు. ఆయా రంగాలపై సంపూర్ణ అవగాహ కల్పించడమే లక్ష్యంగా ఈ బ్రాంచ్‌లను ప్రారంభించారు. అదే కోవలో ఏరోనాటికల్ రంగానికి సంబంధించి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను రూపొందించారు. బ్యాచిలర్ నుంచి మొదలు: బీటెక్/బీఈ స్థాయి నుంచి ఏరోనాటికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌గా వ్యవహరిస్తారు. ఈ కోర్సుల్లో చేరడానికి 10+2/తత్సమానం (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) పూర్తిచేసి ఉండాలి. అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల మాదిరిగానే..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్) ద్వారానే ఏరోనాటికల్ బ్రాంచ్‌లో ప్రవేశం కల్పిస్తారు. జాతీయ స్థాయిలో: జాతీయ స్థాయిలో ఐఐటీ, నిట్లు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్నాయి. వివరాలు.. ఐఐటీ-మద్రాస్ కోర్సులు: బీటెక్ ( ఏరోస్పేస్ ఇంజనీరింగ్), బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విత్ ఎంటెక్ ఇన్ అప్లయిడ్ మెకానిక్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్), బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ఐఐటీ-బాంబే కోర్సు: బీటెక్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్) ఐఐటీ-కాన్పూర్ కోర్సు: బీటెక్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్) ఐఐటీ-ఖరగ్‌పూర్. కోర్సులు: బీటెక్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్), బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ఐఐఎస్టీ-తిరువనంతపురం కోర్సులు: బీటెక్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియెనిక్స్) ప్రవేశం: జేఈఈ-అడ్వాన్స్డ్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. నిట్-త్రిచి, సూరత్కల్, రూర్కెలా తదితర ఇన్స్టిట్యూట్లలో కూడా ఈ కోర్సు అందుబాటులో ఉంది. వీటిలో జేఈఈ-మెయిన్ ఆధారంగా ప్రవేశం పొందొచ్చు. బోధించే అంశాలు: ఈ కోర్సులో విమానాల నిర్మాణం, స్పేస్ వెహికల్స్ డిజైన్‌ను కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించి ఎలా డిజైన్ చేయాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఇందులో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ మెకానిక్స్, డ్రాయింగ్, ఇంజనీరింగ్ వర్క్‌షాప్, థర్మోడైనమిక్స్, మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఎయిరోడైనమిక్స్, ప్రొడక్షన్ టెక్నాలజీ, ఏరోస్పేస్ వెహికిల్ స్ట్రక్చర్, స్పేస్ టెక్నాలజీ, ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్, క్యాడ్/క్యామ్, న్యూమరికల్ మెథడ్స్, హెలికాప్టర్ ఇంజనీరింగ్ తదితర అంశాలను బోధిస్తారు. ఉన్నత విద్య: ఉన్నత విద్యా విషయానికొస్తే.. బీఈ/బీటెక్ తర్వాత ఆయా స్పెషలైజేషన్స్‌తో ఎంఈ/ఎంటెక్ పూర్తి చేయవచ్చు. పీజీలో ఏరోస్పేస్ స్ట్రక్చర్స్, ఏరోడైనమిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ స్ట్రక్చర్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఏరో థర్మోడైనమిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్, కంప్యుటేషనల్ మెకానిక్స్ సాలిడ్స్, ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్, ఏరోడైనమిక్స్ అండ్ ఫ్లూయిడ్ డైనమిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్/క్యాడ్, రాకెట్ ప్రొపల్షన్, థర్మోడైనమిక్స్ అండ్ కంబూషన్, కాంపోజిట్ మెటీరియల్స్ అండ్ ఎయిర్‌క్రాఫ్ట్ మెటీరియల్స్, ఏరోఫాయిల్ డిజైన్, ఆర్బిటాల్ మెకానిక్స్, గెడైన్స్ అండ్ కంట్రోల్ వంటి స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉంటాయి. తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్డీ కూడా చే యవచ్చు. నైపుణ్యాలు: ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకోవాలనుకునే విద్యార్థులు ఇంటర్మీడియెట్ స్థాయిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లలో మంచి పట్టు ఉండాలి. దాంతోపాటు ఈ రంగంలో రాణించాలంటే కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. అవి.. సృజనాత్మకత, బాధ్యతాయుతంగా వ్యవహరించే గుణం తక్కువ కాలంలోనే స్పందించాల్సి ఉంటుంది కాబట్టి వేగం-కచ్చితత్వంతో పనిచేసే నైపుణ్యం మ్యానువల్, టెక్నికల్, మెకానికల్ ఆప్టిట్యూడ్ ఏకాగ్రత, జట్టుగా పని చేసే సామర్థ్యం శారీరకంగా ఫిట్తోపాటు చక్కటి కంటి చూపు ఉండాలి. విధులు: దేశంలోనేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏరోనాటికల్ ఇంజనీర్లకు మంచి డిమాండ్ ఉంది. వీరు సాధారణంగా డిజైన్, మాన్యుఫాక్చరింగ్ సంబంధిత విధులను నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో వీరు ఒక సీనియర్ సూపర్వైజర్ పర్యవేక్షణలో జట్టుగా పని చేస్తారు. ఏవియేషన్‌కు సంబంధించి నూతన టెక్నాలజీ ఆవిష్కరణ, ఎయిర్‌క్రాఫ్ట్‌ల డిజైనింగ్, కన్స్ట్రక్షన్, డెవలప్మెంట్, టెస్టింగ్, ఆపరేషన్, సంబంధిత పరికరాల నిర్వహణ వంటి కార్యకలాపాల్లో వీరు పాలుపంచుకుంటారు. ఈ క్రమంలో ఉండే జాబ్ ప్రొఫైల్స్.. అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, ఏరోస్పేస్ డిజైన్ చెకర్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్, ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొడక్షన్ మేనేజర్, థర్మల్ డిజైన్ మేనేజర్ తదితరాలు. అవకాశాలు: ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం మంచి ప్రగతిని కనబరుస్తోంది. ఎయిర్‌ట్రాఫిక్ పెరగడం, అంతేకాకుండా రక్షణ రంగంలో పెట్టుబడులు పెరుగుతుండడం, ఈ రంగంలోని ప్రైవేటు కార్యకలాపాలకు పరిమితంగా అవకాశం ఇవ్వడం కూడా ఏరోనాటికల్ ఇంజనీర్లకు డిమాండ్‌ను పెంచింది. ప్రైవేటు రంగంతో సమానంగా ప్రభుత్వ రంగంలో అవకాశాలు ఉండడం ఈ బ్రాంచ్ ప్రత్యేకత. ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి విమానయాన సంస్థల్లో, విమానాల తయారీ విభాగాల్లో, ఎయిర్ టర్బైన్ ప్రొడక్షన్ ప్లాంట్స్, ఏవియేషన్ పరిశ్రమ, అంతరిక్ష పరిశోధన సంస్థలు, హెలికాప్టర్ కంపెనీలు, శాటిలైట్ మాన్యుఫాక్చరింగ్, రక్షణ దశాలు, ఏవియేషన్ సంబంధిత ప్రభుత్వ, ప్రైవేటు, జాతీయ-అంతర్జాతీయ సంస్థల్ల్లో అవకాశాలు ఉంటాయి. విమానయాన సంస్థల్లో, విమానాల తయారీ విభాగాల్లో, ఎయిర్ టర్బైన్ ప్రొడక్షన్ ప్లాంట్స్, ఏవియేషన్ పరిశ్రమలో డిజైన్ అండ్ డెవలప్మెంట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వ, రక్షణ, స్పేస్ ఏజెన్సీలు భవిష్యత్‌లో ఫ్లైయింగ్ వెహికల్, సిస్టమ్స్‌ను అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఏరోనాటికల్ ఇంజనీర్లకోసం చూస్తున్నాయి. వేతనాలు: వేతనాల విషయానికొస్తే.. ఏరోనాటికల్ ఇంజనీర్లకు సాధారణంగా కెరీర్ ప్రారంభంలో కనీసం రూ.2.75 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు పేప్యాకేజ్ లభిస్తుంది. అత్యధికంగా రూ. 10 లక్షల వరకు ఆఫర్ చేసే కంపెనీలున్నాయి. విదేశాల్లో: విదేశాల్లో కూడా ఏరోనాటికల్ ఇంజనీర్లకు చక్కటి అవకాశాలు ఉంటాయి. హోనీవెల్, రాక్ వెల్ కోలీన్స్, ఎయిర్‌బస్, బోయింగ్ తదితర విదేశీ కంపెనీలు ఏరోనాటికల్ ఇంజనీర్లను నియమించుకుంటున్నాయి. అంతేకాకుండా స్టాన్‌ఫర్డ్, ఎంఐటీ, జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కార్నెల్, ఫ్లోరిడా తదితర యూనివర్సిటీల నుంచి ఎంఎస్ అవకాశం కూడా ఉంది. తేడాలేదు చాలా మంది ఏయిరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ రెండు వేర్వేరు బ్రాంచ్‌లనే భావనలో ఉంటారు. కానీ వాస్తవానికి ఈ రెండు బ్రాంచ్‌ల సిలబస్ ఒక్కటే. ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు, మిస్సైల్స్ తదితరాల నిర్మాణం, డిజైన్ వంటి అంశాలు ఉంటాయి. అవసరాల మేరకు ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఏవిధంగా రూపొందించాలో ఇందులో వివరిస్తారు. అదేవిధంగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో కూడా ఎయిర్‌క్రాఫ్ట్‌ల రూపకల్పన ప్రధానం అంశంగా ఉంటుంది. టాప్ ఇన్స్టిట్యూట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ-తిరువనంతపురం వెబ్సైట్: www.iist.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -మద్రాస్ వెబ్సైట్: www.iitm.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే వెబ్సైట్: www.iitb.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు వెబ్సైట్: www.iisc.ernet.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్ వెబ్సైట్: www.iitk.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరగ్‌పూర్ వెబ్సైట్: www.iitkgp.ac.in -
రోడ్లు యమపురికి రహదారులు!
న్యూఢిల్లీ: రాజధాని నగర రోడ్లు పౌరుల పాలిట యమపురికి రహదారులుగా మారిపోతున్నాయి. ద్విచక్రవాహనాలపై ప్రయాణం సైతం ప్రాణాలకు భద్రత కల్పించలేకపోతోంది. ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు జరిగే నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర శాస్త్ర, పర్యావరణ విభాగం (సీఎస్ఈ) నివేదిక వెల్లడించింది. రోడ్డు ప్రమాదాల కారణంగా నగరంలో ప్రతిరోజూ సగటున 4.31 శాతం మరణా లు సంభవిస్తున్నాయి. ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి 151 రోజుల్లో 651 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మృతి చెందారు. రాత్రి సమయంలో 325, పగలు 332 మంది మరణించారు. రోడ్డు ప్రమాదాల్లో పాదచారులే అత్యధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రూపొందించిన భారత్‌లో రోడ్డు ప్రమాదాలు-2012 నివేదికను సీఎస్ఈ ఉటంకించింది. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతిరోజూ ఐదుగురు మృతి చెందుతున్నారని, వీరిలో ఇద్దరు పాదచారులు, ఇద్దరు ద్విచక్రవాహనదారులు ఉంటున్నారని సీఎస్ఈ తెలిపింది. ప్రతివారం ఇద్దరు సైకిలిస్టులు, ఒక కారు ప్రయాణికుడు మృత్యువాత పడుతున్నారని పేర్కొంది. ఇక రాజధాని నగరంలో నిబంధనల ఉల్లంఘనకు హద్దే లేదని సీఎస్ఈ తెలిపింది. సిగ్నల్ జంపింగ్ కేసులు 3.29 లక్షలు, డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు 14 వేలు, పరిమితిని మించిన వేగం కేసులు 45,158 నమోదయ్యాయని పేర్కొంది. ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు జరిగే నగరాల్లో చెన్నై రెండో స్థానంలో నిలిచింది. వాహనాలు ఢీకొని మృతి చెందే పాదచారుల సంఖ్య దేశంలోనే అత్యధికంగా 44 శాతం ఉన్నట్లు సీఎస్ఈ నివేదిక తెలిపింది. యాభై శాతం రోడ్డు ప్రమాదాలు రాత్రి పూటే జరుగుతున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా సాయంత్రం 6.00 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య 33 శాతం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. ‘‘ప్రాణాంతక రోడ్లు సృష్టిస్తున్న ఈ మారణహోమానికి ధనికులు, శక్తిమంతులు, పేదలు అన్న తేడాలేకుండా అందరూ బలవుతున్నారు’’ అని సీఎస్ఈ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అనుమిత రాయ్ చౌదరి వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ఫ్లై ఓవర్లు, హైస్పీడ్ కారిడార్లు, క్రాసింగ్‌ల వద్ద చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఫ్లైఓవర్ల వద్ద ప్రమాదాలు జరిగే ప్రాం తాలను గుర్తించామని వీటిలో 27 శాతం రింగ్‌రోడ్డుపై, 17 శాతం జీటీ కే రోడ్డుపై, 13 శాతం ఔటర్ రింగు రోడ్డుపై, ఆరు శాతం మథురా రోడ్డు ఉన్నాయని ఆమె చెప్పారు. కనీసం 75 శాతం మరణాలు నగరంలోని హైస్పీడ్ కారిడార్లుగా ఉన్న ఎనిమిది ప్రధాన రహదారులపై నమోదవుతున్నాయని అనుమిత పేర్కొన్నారు. ఈ రహదారులపై ఫ్లై ఓవర్లు, పాదచారుల వంతెనలు, భూగర్భ మార్గాలు ఉన్నప్పటికీ ఈ రహదారులు మృత్యుకుహరంగా మారుతున్నాయని ఆమె వాపోయారు. ప్రమాదాల్లో అత్యధిక భాగం బస్స్టాండ్లు, మెట్రో స్టేషన్ల వద్ద జరగడం విచిత్రంగా ఉందని సీఎస్ఈ డెరైక్టర్ జనరల్ సునీతా నారాయణ్ పేర్కొన్నారు. ఐఎస్బీటీ గేట్, ఆనంద్ విహార్ ఐఎస్బీటీ, పశ్చిమ్ విహార్ మెట్రో స్టేషన్, ఉత్తమ్‌నగర్ మెట్రో స్టేషన్, జహంగీర్‌పురీ బస్టాండ్ ప్రాంతాలు ప్రమాదాలకు నెలవులని అన్నారు. ప్రమాద స్థలాలుగా కశ్మీరీగేట్, వజీర్పూర్ సహా పది బస్టాప్‌లను గుర్తించామని, వీటి సమీపంలోనే 8 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. మెట్రోస్టేషన్లలో మానసరోవర్ పార్క్, ఉత్తమ్‌నగర్, మాదీపూర్ పార్కులు ప్రధాన ప్రమాద స్థలాలని పేర్కొన్నారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థను ఉపయోగించకోకపోవడం, బస్టాప్‌లను అత్యధికంగా ఫుట్‌పాత్‌లపై నిర్మించడం వల్లనే ప్రమాదాల్లో మృతుల సంఖ్య అధికం గా ఉంటోందని, ఈ విధానం మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.