నేల తల్లి నిస్సారం
సీఎస్‌ఈ ఆందోళన
వార్షిక నివేదిక విడుదల
సాక్షి నాలెడ్జ్ సెంటర్: అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నామని, రెండంకెల వృద్ధిరేటు సాధిస్తామన్న వార్తలు తరచూ వింటూ ఉంటాం. దేశం మారిపోతోందని మనసులో సంబరపడుతూంటాం. ఇందులో వాస్తవమెంత? అన్న ప్రశ్న వేసుకుంటే భిన్నమైన జవాబులు వస్తాయి. ఆర్థిక వృద్ధి మాటేమోగానీ...పర్యావరణపరంగా మాత్రం భారత్ ఏటికేడాదీ క్షీణిస్తోందని, వెనుకబడిపోతోందని హెచ్చరిస్తోంది సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ). న్యూ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ తన వార్షి క నివేదిక ‘స్టేట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్’లో స్పష్టం చేసింది. అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతోపాటు ఎడారి భూములు ఎక్కువవుతున్న వైనా న్ని విడమరిచింది. ఆ వివరాలు స్థూలంగా...
అభివృద్ధి సూచీల్లో110వ ర్యాంకు
ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి కోసం నిర్దేశించిన 52 సూచీల్లో భారత్ కేవలం పదహారిం టిలోనే ప్రపంచ సగటు స్థాయిని అందుకుం టోంది. విద్య, ఆరోగ్య, పరిశోధన రంగాలు మూడింటికీ కలిపి మనం చేస్తున్న ఖర్చు స్థూల జాతీయోత్పత్తిలో 8.6% మాత్రమే! ఇవన్నీ ప్రపంచ దేశాల సగటు ఖర్చుకంటే తక్కువ!
అందని భూసార కార్డులు: కేంద్రం చేపట్టిన భూసార కార్డుల జారీ నత్త నడకన నడుస్తోంది. ఈ ఏడాది మార్చిలోగా 14 కోట్ల మంది రైతులకు ఈ కార్డులు జారీ చేయాలన్నది లక్ష్యం కాగా.. 2016 అక్టోబరు 18 నాటికి 23% మందికి మాత్రమే జారీ అయ్యా యి. ఈ నెల 17 నాటికి కూడా ఈ అంకె పెరి గింది తక్కువే. రసాయన ఎరువులు, కీటకనాశినుల విచ్చలవిడి వాడకానికి కళ్లెం వేసేందు కు, సూక్ష్మ పోషకాల సరఫరా ద్వారా దిగుబడులను పెంచేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని 2015లో ప్రధాని మోదీ ప్రారంభించారు.
ఎడారులవుతున్న భూములు...
దేశవ్యాప్తంగా సారవంతమైన భూమి విస్తీర్ణం ఏటికేడాదీ తగ్గిపోతోంది. దేశంలో మొత్తం 32.87 కోట్ల చదరపు హెక్టార్ల భూమి ఉండగా ఇందులో దాదాపు 10.51 కోట్ల చదరపు హెక్టా ర్ల భూమి సారం క్షీణించింది. 2030 నాటికల్లా ఈ భూసార క్షీణతకు అడ్డుకట్ట వేస్తామని భారత్ ఐక్యరాజ్య సమితికి హామీ ఇచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు సరికదా... ఎడారుల్లా మారుతున్నా ప్రాంతాలు ఎక్కువైపోతున్నా యి. 2003–05, 2011–13 మధ్యకాలంలోనే 18 లక్షల చదరపు హెక్టార్ల భూమి ఎడారిగా మారిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
చెన్నైలో జలావరణాలు మాయం...
నగరాల్లో వరదముప్పు పెరిగిపోవడానికి చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతూండటంతో వరదనీటిని ఇముడ్చుకునే ఏర్పాట్లు కరవయ్యాయి. తమిళనాడు రాజధాని చెన్నై పదహారేళ్ల కాలంలో 7సార్లు వరద ముప్పునకు గురైందీ ఇందుకే. గతంతో పోలిస్తే చెన్నైలోని జలావరణాలు 50%కిపైగా తగ్గిపోయాయి. శ్రీనగర్, గౌహతిల్లోనూ ఇదే పరిస్థితి.
అటవీ భూమికి రెక్కలు..
గత ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ దాదాపు పదివేల హెక్టార్ల అటవీ భూములను డీ నోటిఫై చేసింది. ఇందులో అత్యధిక శాతం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సం బంధించిన ముంపు భూములు ఉన్నాయి.