మార్కెట్లో 'బ్రెడ్' దుమారం
ముంబై: మ్యాగీ నూడుల్స్ లో మోతాదుకు మించి లెడ్ వాడుతోందన్న వివాదం మ్యాగీ నూడుల్స్ ప్రియులను దిగ్భ్రాంతికి లోను చేసింది. తాజాగా సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) చెప్పిన విషయాలు మరింత దుమారాన్ని రాజేశాయి. బ్రెడ్, పిజ్జా, కొన్ని రకాల బిస్కట్లలో కాన్సర్ కారక రసాయనాలను కనుగొన్నామని (చదవండి....బ్రెడ్డు తింటే కేన్సర్ ఫ్రీ!) సీఎస్ నిన్న ప్రెస్ మీట్ లో వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. దీంతో మంగళవారం నాటి మార్కెట్ లో ఫూడ్ సెక్టార్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా జూబ్లియంట్ ఫుడ్ వర్క్, దాదాపు10 శాతం , బ్రిటానియా 2శాతం నష్టపోయింది. వెస్ట్ లైఫ్ డెవలప్ మెంట్ కూడా ఇదే బాటలోఉంది. అసలే అంచనాలకు మించని ఫలితాలు, పతంజలి దెబ్బతో కుదేలైన బ్రిటానియాకు సీఎస్ ఈ రిపోర్టు అశనిపాతంలా తగిలింది.
అయితే సీఎస్ఈ రిపోర్టును మెక్ డోనాల్డ్ , బ్రిటానియా తీవ్రంగా ఖండించాయి. తాము బ్రెడ్ , పిజ్జా తయారీలో పొటాషియం ఐయోడేట్ పొటాషియం బ్రోమేట్ తమ ఉత్పత్తుల్లో వాడటం లేదని వాదించాయి. సీఎస్ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారణమైనవి మెకొ డోనాల్డ్ కొట్టిపారేసింది. భారత ఆహార ఎఫ్ ఎస్ ఎస్ ఏ నిబంధనల ప్రకారంమే బ్రెడ్ లోని ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామని వివరణ ఇచ్చాయి. ఈ వివాదంలో పిజ్జాహట్, కెఎఫ్సీ తదితర ఆహార ఉత్పత్తుల కంపెనీలు ఇంకా ఉన్నాయి.
కాగా బ్రెడ్, పిజ్జా, బర్గర్‌లలో కెమికల్స్‌ను గుర్తించినట్లు సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) అధ్యయనంలో తేలింది. బ్రెడ్‌తో పాటు బర్గర్, పిజ్జా వంటి ఫాస్ట్ ఫుడ్‌లో పొటాషియం బ్రొమేట్ (కేబీఆర్ఓ) లేదా పొటాషియం ఐయోడేట్ (కేఐఓ3)ల శాతం అధికంగా ఉందని, బ్రెడ్, పిజ్జా, బర్గర్లు, బేకరీ ఉత్పత్తుల్లో 84 శాతం పైన పేర్కొన్న రసాయనాలు ఉన్నట్లు శాంపిల్స్ ద్వారా తేటతెల్లమైంది. వీటి ద్వారా క్యాన్సర్ ఏర్పడే అవకాశాలున్నాయని సీఎస్ఈ వెల్లడించడం ఆందోళన రేపిన సంగతి తెలిసిందే.