Food shares
-
18 దేశాల్లో పేదల ఆకలి తీర్చిన భారత్
న్యూఢిల్లీ: పంచ ఆహార ప్ర వ్యవస్థల్లో సానుకూల మార్పులు తీసుకురాగల సామర్థ్యం భారత్‌కు ఉందని ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగమైన అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి(ఐఎఫ్ఏడీ) అధ్యక్షుడు అల్వారో లారియో ప్రశంసించారు. జీ20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచి్చన ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఆహార కొరత ఏర్పడిందని గుర్తుచేశారు. అలాంటి సమయంలో 18 దేశాలకు భారత్ 10.8 లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేసిందని, పేద ప్రజల ఆకలి తీర్చిందని కొనియాడారు. ఇటీవలి కాలంలో తృణధాన్యాల సాగుకు భారత్ అధిక ప్రాధాన్యం వేస్తుండడం ప్రశంసనీయమని చెప్పారు. ఆహార ఉత్పత్తి విషయంలో భారత్ ప్రాధాన్యతలు, ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతలను పోలి ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో భారత్ సాధించిన నైపుణ్యం ‘గ్లోబల్ సౌత్’లోని ఇతర దేశాలకు సైతం ఉపకరిస్తుందని అల్వారో లారియో వివరించారు. వాతావరణ మార్పులు విపరీత ప్రభావం చూపిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో తృణధాన్యాల సాగు చేపట్టడం రైతులకు లాభదాయకమని సూచించారు. కరువులను తట్టుకొనే శక్తి తృణధాన్యాలకు ఉందన్నారు. పేదలకు పౌష్టికాహారం అందించాలంటే తృణధాన్యాలతోనే సాధ్యమని స్పష్టం చేశారు. -
అబ్బా..! ఎమ్మెల్యే ‘ఎంగిలి కూడు’ చేష్టలు వైరల్
మనసులో అవతలి వాళ్ల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. బహిరంగ వేదికల్లో మాత్రం లేనిపోని ప్రేమలు ఒలకబోయడం కొందరికి మాత్రమే సాధ్యం. అలాంటి ఘటనే ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అవతలివాళ్ల పట్ల, అదీ ప్రత్యేకించి దళితుల పట్ల తన సోదరభావం ఏపాటిదో చూపించే ప్రయత్నంలో.. ఓ ఎమ్మెల్యే చేసిన పని చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్.. ఓ దళిత స్వామిజీతో కలిసి తిండి పంచుకున్నారు. అది అలాంటి ఇలాంటి ఆహారం కాదు. ముందుగా స్వామిజీ నోట్లో పెట్టిన ఎమ్మెల్యే.. ఆయన నమిలిన తర్వాత బయటకు ఉమ్మించి.. తిరిగి అదే బయటకు తీసుకుని తన నోట్ల పెట్టుకుని మరి తిన్నాడు ఎమ్మెల్యే తిన్నాడు. దళిత వర్గానికి చెందిన స్వామి నారాయణ.. చామరాజ్‌పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ ఈ చేష్టలకు దిగారు. తమ మధ్య కుల వివక్షకు తావులేదని, పైగా తమ మద్య సోదరభావం ఏపాటిదో చెప్పేందుకు తాను ఈ పని చేసినట్లు బల్లగుద్ది మరీ ప్రకటించుకున్నాడాయన. ఈ ఘటన చూసి వెనక ఉన్న అనుచరులంతా చప్పట్లతో గా హాలును మారుమోగించారు. ఆదివారం చామరాజ్‌పేటలో జరిగిన ఓ కార్యక్రమంలో సదరు ఎమ్మెల్యే ఈ చేష్టలకు పాల్పడ్డాడు. #WATCH Bengaluru, Karnataka: In an attempt to set an example seemingly against caste discrimination, Congress Chamarajapete MLA BZ Zameer A Khan feeds Dalit community's Swami Narayana & then eats the same chewed food by making Narayana take it out from his mouth to feed him(22.5) pic.twitter.com/7XG0ZuyCRS ANI (@ANI) May 22, 2022 -
మార్కెట్లో 'బ్రెడ్' దుమారం
ముంబై: మ్యాగీ నూడుల్స్ లో మోతాదుకు మించి లెడ్ వాడుతోందన్న వివాదం మ్యాగీ నూడుల్స్ ప్రియులను దిగ్భ్రాంతికి లోను చేసింది. తాజాగా సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) చెప్పిన విషయాలు మరింత దుమారాన్ని రాజేశాయి. బ్రెడ్, పిజ్జా, కొన్ని రకాల బిస్కట్లలో కాన్సర్ కారక రసాయనాలను కనుగొన్నామని (చదవండి....బ్రెడ్డు తింటే కేన్సర్ ఫ్రీ!) సీఎస్ నిన్న ప్రెస్ మీట్ లో వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. దీంతో మంగళవారం నాటి మార్కెట్ లో ఫూడ్ సెక్టార్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా జూబ్లియంట్ ఫుడ్ వర్క్, దాదాపు10 శాతం , బ్రిటానియా 2శాతం నష్టపోయింది. వెస్ట్ లైఫ్ డెవలప్ మెంట్ కూడా ఇదే బాటలోఉంది. అసలే అంచనాలకు మించని ఫలితాలు, పతంజలి దెబ్బతో కుదేలైన బ్రిటానియాకు సీఎస్ ఈ రిపోర్టు అశనిపాతంలా తగిలింది. అయితే సీఎస్ఈ రిపోర్టును మెక్ డోనాల్డ్ , బ్రిటానియా తీవ్రంగా ఖండించాయి. తాము బ్రెడ్ , పిజ్జా తయారీలో పొటాషియం ఐయోడేట్ పొటాషియం బ్రోమేట్ తమ ఉత్పత్తుల్లో వాడటం లేదని వాదించాయి. సీఎస్ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారణమైనవి మెకొ డోనాల్డ్ కొట్టిపారేసింది. భారత ఆహార ఎఫ్ ఎస్ ఎస్ ఏ నిబంధనల ప్రకారంమే బ్రెడ్ లోని ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామని వివరణ ఇచ్చాయి. ఈ వివాదంలో పిజ్జాహట్, కెఎఫ్సీ తదితర ఆహార ఉత్పత్తుల కంపెనీలు ఇంకా ఉన్నాయి. కాగా బ్రెడ్, పిజ్జా, బర్గర్లలో కెమికల్స్‌ను గుర్తించినట్లు సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) అధ్యయనంలో తేలింది. బ్రెడ్‌తో పాటు బర్గర్, పిజ్జా వంటి ఫాస్ట్ ఫుడ్‌లో పొటాషియం బ్రొమేట్ (కేబీఆర్ఓ) లేదా పొటాషియం ఐయోడేట్ (కేఐఓ3)ల శాతం అధికంగా ఉందని, బ్రెడ్, పిజ్జా, బర్గర్లు, బేకరీ ఉత్పత్తుల్లో 84 శాతం పైన పేర్కొన్న రసాయనాలు ఉన్నట్లు శాంపిల్స్ ద్వారా తేటతెల్లమైంది. వీటి ద్వారా క్యాన్సర్ ఏర్పడే అవకాశాలున్నాయని సీఎస్ఈ వెల్లడించడం ఆందోళన రేపిన సంగతి తెలిసిందే.