బ్రెడ్‌ని చాలామంది స్నాక్స్ రూపంలోనో లేదా బ్రేక్‌ఫాస్ట్‌గానో తీసుకుంటుంటారు. అయితే వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదికాదని నిపుణులు చెప్పడంతో కొందరూ ప్రత్యామ్నాయంగా గోధుమలతో చేసిన బ్రెడ్‌ని ఎంచుకుంటున్నారు. అయినప్పటకీ పరిమితంగానే తినమని నిపుణులు సూచించడం జరిగింది. అయితే బ్రెడ్ అంటే.. ఇష్టపడే ఔత్సాహికులు ఇలాంటి బ్రెడ్‌ని బేషుగ్గా తినొచ్చని నిపుణులే స్వయంగా చెప్పారు. పైగా ఆ సమస్యలు దరిచేరవని చెబుతున్నారు.
ఈ బ్రెడ్‌పై పరిశోధన చేసిన వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలోనూ సమర్థవంతంగా ఉటుందని తెలిపారు. స్పెయిన్‌లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం..ఆ దేశంలోని ప్రజలు ఏడాదికి సగటున 27.35 కిలోల బ్రెడ్‌ని తింటారట. వారికి ఈ బలవర్ధకమైన బ్రెడ్‌ని అందివ్వగా వారంతా బరువు తగ్గడమే గాక ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. అంతేగాదు ఈ బ్రెడ్ కొలొరెక్టల్ కేన్సర్ ప్రమాదాన్నికూడా తగ్గిస్తుందట. దీని పేరు "రై బ్రెడ్".
"రై బ్రెడ్" అనేది కేవలం రై ధాన్యంతో చేసిన రొట్టె. రై ఒక మట్టి రుచిని కలిగి ఉంటుంది. దీన్ని కొద్ది మొత్తంలో ఇతర పిండిలతో కలిపి తయారు చేయడంతో రుచి చాలా డిఫెరెంట్‌గా ఉంటుంది. దీన్ని మొలాసిస్, కోకో పౌడర్ వంటి చేర్పులతో ఆకర్షణీయంగా తయారు చేస్తారు.
కలిగే లాభాలు..
దీనిలో తక్కువ మొత్తంలో కొవ్వు ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇది ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌గా పిలిచే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా ధమనుల్లో రక్తప్రసరణ సాఫీగా జరిగి హృదయ సంబంధ సమస్యలను దూరం చేస్తుంది.
ఇందులో ప్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కణితులు పెరగకుండా సంరక్షిస్తుంది.
ఇందులోని ఫైబర్ పేగు రవాణాను వేగవంతం చేసేలా మల ఫ్రీక్వెన్సీని పెంచి బ్యాక్టీరియా జీవక్రియను పెంచుతుంది. ఫలితంగా కొలొరెక్టల్ కేన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది.
రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
ఇది ఫెరులిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్ వంటి ఫినాలిక్ సమ్మేళనాలు రక్తప్రవాహంలోని చక్కెర, ఇన్సులిన్ విడుదలను నెమ్మదించేలా చేస్తుంది.
కొలెస్ట్రాల్‌ను 14 శాతం వరకు తగ్గిస్తుంది.
హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు, వైద్యులను సంప్రదించి అనుసరించటం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment