ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇకపై కోవిడ్ -19 అడ్వాన్స్‌లను అందించబోమని ప్రకటించింది. కోవిడ్ -19 ఇకపై మహమ్మారి కానందున, తక్షణమే ఈ అడ్వాన్స్ నిలిపివేయాలని కాంపిటెంట్ అథారిటీ నిర్ణయించిందని ఈపీఎఫ్ఓ ఒక ప్రకటనలో తెలిపింది. మినహాయింపు పొందిన ట్రస్టులకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది.
కరోనా మహమ్మారి సమయంలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాదారులు రెండుసార్లు డబ్బులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. ఈ ఆప్షన్‌ను మొదటి వేవ్ సమయంలో ప్రవేశపెట్టగా, సెకండ్ వేవ్‌లో మరో అడ్వాన్స్‌తో పొడిగించారు. ఈ వెసులుబాటు కింద ఈపీఎఫ్ఓ చందాదారులు మూడు నెలల బేసిక్ వేతనం, కరువు భత్యాలు లేదా తమ ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్‌లో 75 శాతం ఏది తక్కువైతే అది నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఉండేది.
కాగా పిల్లల చదువులు, పెళ్లిళ్ల, మెడికల్ ఎమర్జెన్సీ, రెసిడెన్సియల్ ప్రాపర్టీ కొనుగోలు వంటి వాటి కోసం ఉద్యోగుల ఈపీఎఫ్ నుంచి పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. నగదు ఉపసంహరణ కోసం ఆన్‌లైన్‌లోనే క్లెయిమ్ చేసుకునే వెసులుబాటును ఈపీఎఫ్‌వో కల్పించింది. ఈ ఆన్‌లైన్ విత్‌డ్రాయల్ ప్రక్రియను ఇప్పుడు మరింత సులభతరం చేసింది.
పీఎఫ్ విత్‌డ్రా ఎలా?
» ముందుగా మీరు మీ పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అర్హులా కాదా నిర్ధారించుకోండి.
» ఈపీఎఫ్ పోర్టల్ లో మీ వ్యక్తిగత వివరాలు అప్‌టు డేట్‌గా ఉండేలా చూసుకోండి.
» మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) ఇప్పటికే యాక్టివేట్ కాకపోతే యాక్టివేట్ చేయండి.
» పాక్షిక లేదా పూర్తి ఉపసంహరణ కోసం ఈపీఎఫ్ ఫారాన్ని పూర్తి చేయండి.
» రిటైర్మెంట్ తర్వాత లేదా రెండు నెలల కంటే ఎక్కువ నిరుద్యోగం తర్వాత మాత్రమే పూర్తి ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.
ఆన్‌లైన్‌లో క్లెయిమ్ ఇలా..
» మీ UAN క్రెడెన్షియల్స్ ఉపయోగించి మెంబర్ ఇంటర్ ఫేస్ ని యాక్సెస్ చేసుకోండి.
» మీ యూఏఎన్ తో లింక్ చేసిన అన్ని సర్వీస్ అర్హతలు, కేవైసీ ఆవశ్యకతలను మీరు తీర్చారని నిర్ధారించుకోండి.
» సంబంధిత క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోండి.
» యూఐడీఏఐతో మీ రిజిస్టర్డ్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఉపయోగించి మీ వివరాలను ధ్రువీకరించండి.
» ఆన్‌లైన్ క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment