Advance
-
EPF Update: ఇక ఆ సౌకర్యం లేదు.. ప్రకటించిన ఈపీఎఫ్‌వో
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇకపై కోవిడ్ -19 అడ్వాన్స్‌లను అందించబోమని ప్రకటించింది. కోవిడ్ -19 ఇకపై మహమ్మారి కానందున, తక్షణమే ఈ అడ్వాన్స్ నిలిపివేయాలని కాంపిటెంట్ అథారిటీ నిర్ణయించిందని ఈపీఎఫ్ఓ ఒక ప్రకటనలో తెలిపింది. మినహాయింపు పొందిన ట్రస్టులకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది.కరోనా మహమ్మారి సమయంలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాదారులు రెండుసార్లు డబ్బులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. ఈ ఆప్షన్‌ను మొదటి వేవ్ సమయంలో ప్రవేశపెట్టగా, సెకండ్ వేవ్‌లో మరో అడ్వాన్స్‌తో పొడిగించారు. ఈ వెసులుబాటు కింద ఈపీఎఫ్ఓ చందాదారులు మూడు నెలల బేసిక్ వేతనం, కరువు భత్యాలు లేదా తమ ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్‌లో 75 శాతం ఏది తక్కువైతే అది నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఉండేది.కాగా పిల్లల చదువులు, పెళ్లిళ్ల, మెడికల్ ఎమర్జెన్సీ, రెసిడెన్సియల్ ప్రాపర్టీ కొనుగోలు వంటి వాటి కోసం ఉద్యోగుల ఈపీఎఫ్ నుంచి పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. నగదు ఉపసంహరణ కోసం ఆన్లైన్లోనే క్లెయిమ్ చేసుకునే వెసులుబాటును ఈపీఎఫ్‌వో కల్పించింది. ఈ ఆన్లైన్ విత్‌డ్రాయల్ ప్రక్రియను ఇప్పుడు మరింత సులభతరం చేసింది.పీఎఫ్ విత్‌డ్రా ఎలా?» ముందుగా మీరు మీ పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అర్హులా కాదా నిర్ధారించుకోండి.» ఈపీఎఫ్ పోర్టల్ లో మీ వ్యక్తిగత వివరాలు అప్టు డేట్‌గా ఉండేలా చూసుకోండి.» మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) ఇప్పటికే యాక్టివేట్ కాకపోతే యాక్టివేట్ చేయండి.» పాక్షిక లేదా పూర్తి ఉపసంహరణ కోసం ఈపీఎఫ్ ఫారాన్ని పూర్తి చేయండి.» రిటైర్మెంట్ తర్వాత లేదా రెండు నెలల కంటే ఎక్కువ నిరుద్యోగం తర్వాత మాత్రమే పూర్తి ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.ఆన్లైన్లో క్లెయిమ్ ఇలా..» మీ UAN క్రెడెన్షియల్స్ ఉపయోగించి మెంబర్ ఇంటర్ ఫేస్ ని యాక్సెస్ చేసుకోండి.» మీ యూఏఎన్ తో లింక్ చేసిన అన్ని సర్వీస్ అర్హతలు, కేవైసీ ఆవశ్యకతలను మీరు తీర్చారని నిర్ధారించుకోండి.» సంబంధిత క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోండి.» యూఐడీఏఐతో మీ రిజిస్టర్డ్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఉపయోగించి మీ వివరాలను ధ్రువీకరించండి.» ఆన్లైన్ క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయండి. -
కోవిడ్ అడ్వాన్స్‌లకు ఈపీఎఫ్ఓ చెక్
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కోవిడ్–19 అడ్వాన్స్ మంజూరును నిలిపివేసింది. ప్రస్తుతం కోవిడ్–19 పరిస్థితులు పూర్తిగా సద్దుమణగడం, ఉద్యోగావకాశాలు పెరిగిన నేపథ్యంలో కోవిడ్–19 కారణంగా భవిష్యనిధి నుంచి నగదు ఉపసంహరణ అవకాశాన్ని ఈపీఎఫ్ఓ రద్దు చేసింది. ఇకపై భవిష్యనిధి నుంచి సాధారణ కారణాలతో నగదు ఉపసంహరించుకునే అవకాశాన్ని మాత్రం కొనసాగిస్తోంది. కోవిడ్–19 ప్రభావంతో 2020 మార్చిలో లాక్డౌన్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర కాలంలో పలుమార్లు వివిధ కంపెనీలు లాక్డౌన్ పాటించాల్సిరావడం, ఫలితంగా తయారీ రంగంతో పాటు పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. దీంతో ఉద్యోగులు ఒక్కసారిగా ఉపాధి కోల్పోవడంతో వారి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఈపీఎఫ్ఓ కోవిడ్–19 అడ్వాన్స్‌ల విడుదలకు నిర్ణయించింది. ఇందులో భాగంగా 2020 ఏప్రిల్ నెల నుంచి ప్రారంభించిన ఈ ఉపసంహరణ ప్రక్రియతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2.25 కోట్ల మంది ఖాతాదారులు రూ.50 కోట్ల మేర భవిష్య నిధిని ఉపసంహరించుకున్నారు. నిధి మెరుగుపడేలా.. దాదాపు మూడున్నరేళ్ల పాటు కోవిడ్–19 ఆడ్వాన్స్ విడుదలకు ఈపీఎఫ్ఓ అవకాశం కల్పించింది. ఈ కాలంలో ఖాతాదారులు దాదాపు మూడుసార్లు నిధి నుంచి అర్హత మేరకు ఉపసంహరించుకున్నారు. మూలవేతనం నుంచి దాదాపు 3 రెట్ల నగదును ఉపసంహరించుకునేలా వెసులుబాటు ఉండడంతో దాదాపు 2.25 కోట్ల మంది ఈమేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 7.25 కోట్ల మంది ఈపీఎఫ్ఓలో చందాదారులుగా ఉన్నారు. మారిన పరిస్థితుల దృష్ట్యా తాజాగా కోవిడ్–19 అడ్వాన్స్ ఉపసంహరణను ఈపీఎఫ్ఓ నిలిపివేసింది. భవిష్యత్ అవసరాల కోసం, పదవీ విరమణ పొందిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా చందాదారులు జీవించేందుకు వినియోగించుకోవాల్సిన ఈపీఎఫ్ నిధి నుంచి ఉపసంహరణ ప్రక్రియను ఇలాగే కొనసాగిస్తే చివరి నాటికి ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఉపసంహరణల ప్రక్రియకు కాస్త బ్రేక్ వేస్తూ సాధారణ పద్ధతిలో మాత్రమే నిధిని వెనక్కు తీసుకునే అవకాశాలను కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ఇప్పటివరకు ఉపసంహరణలతో తగ్గిన నిధిని తిరిగి మెరుగుపర్చే దిశగా ఈపీఎఫ్ఓ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. -
ఇక వర్క్ ఫ్రం ఆఫీస్.. ఫ్లాట్ అద్దె రూ.2.5 లక్షలు.. 25 లక్షల అడ్వాన్స్!
బెంగళూరు: ఫ్లాట్ అద్దె అడ్వాన్సు రూ.25 లక్షలంటూ వచ్చిన ట్వీట్‌పై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ అనంతరం టెక్ ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం నుంచి తిరిగి ఆఫీసులకు వస్తుండటంతో బెంగళూరులో ఇళ్ల అద్దెలు ఏ స్థాయిలో పెరిగాయనేందుకు ఉదాహరణ ఇది. నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఓ ఫ్లాట్‌కు అద్దె నెలకు రూ.2.5 లక్షలు కాగా, అడ్వాన్స్ రూ.25 లక్షలంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు పెద్ద సంఖ్యలో యూజర్లు ఛలోక్తులు సంధించడంతోపాటు మండిపోతున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా అనంతరం ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంతోపాటు ఆఫీసుల్లోనూ విధులకు హాజరవ్వాలంటూ ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చాయి. చాలా వరకు కంపెనీలు మళ్లీ ఆఫీసులకొచ్చి డ్యూటీ చేయాలంటూ ఆదేశాలిచ్చాయి. ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు చేరుతుండటంతో ఇళ్ల అద్దెలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఖరీదైన ప్రాంతాల్లోనైతే యజమానులు మరీ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని తేజస్వీ శ్రీవాస్తవ అనే టెక్ కంపెనీ సీఈవో ట్విట్టర్లో ప్రస్తావించారు. హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని 4 బీహెచ్‌కే ఫ్లాట్‌కు నెల వారీ రెంట్ రూ.2.5 లక్షలు, డిపాజిట్ రూ.25 లక్షలంటూ ఉన్న ప్రకటనను చూసి ఆయన షాకయ్యారు. అడ్వాన్స్‌కు అవసరమైన మొత్తానికి లోన్ ఆప్షన్ కూడా ఉండటం ఆయన్ను మరింత షాక్‌కు గురి చేసింది. ఆయన ఈ ప్రకటనను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పెట్టారు. ‘కిడ్నీ అమ్ముకోవడానికి కూడా ఆప్షన్ ఉంటే బాగుండేది’అంటూ శ్రీవాస్తవ క్యాప్షన్ ఇచ్చారు. ఆ ట్వీట్లపై కామెంట్లు పోటెత్తాయి. కొందరు నెటిజన్లు ఇంటి అద్దెలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా ఇంకొందరు రుణం కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్‌పై మండిపడ్డారు. చివరి రెండు సున్నాల ముందు చుక్క పెట్టడం మరిచిపోయారేమో అంటూ మరో వ్యక్తి వ్యంగ్యంగా కామెంట్ చేశారు. They should add an option: Apply for Kidney Donation.#Bangalore #HouseRent#Bengaluru #HSRLayout@peakbengaluru pic.twitter.com/KPyeKmkfyF — Tejaswi Shrivastava (@trulytazz) July 27, 2023 -
సీఎం జగన్ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తి చేయడానికి వీలుగా ముందస్తు (అడ్‌హక్) నిధులివ్వాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తొలి, రెండో దశ పనులను పూర్తి చేయడానికి ఏ మేరకు నిధులు అవసరమో గుర్తించి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లను ఉన్నతస్థాయి కమిటీ సోమవారం ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రి మండలికి కేంద్ర జల్‌శక్తి, ఆర్థిక శాఖలు ప్రతిపాదనలు పంపనున్నాయి. దానిపై కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేస్తే.. అడ్‌హక్‌గా పోలవరానికి నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుంది. రూ.10 వేల కోట్లను అడ్‌హక్‌గా విడుదల చేసి, నిధుల కొరత లేకుండా చేయాలని, డిజైన్లను త్వరితగతిన ఆమోదిస్తే పోలవరాన్ని సత్వరమే పూర్తి చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అడ్‌హక్ నిధుల విడుదలతోపాటు సీఎం జగన్ లేవనెత్తిన అంశాలపై చర్చించడానికి ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో రెండుసార్లు రాష్ట్ర కమిటీ సమావేశమైంది. ఈ సమావేశాలలో అడ్‌హక్‌గా పోలవరానికి నిధులిచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని కేంద్ర జల్‌శక్తి శాఖను కేంద్ర కమిటీ ఆదేశించింది. మార్చి వరకూ రూ.7,300 కోట్లు ఇప్పటివరకూ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్మెంట్ చేయడం, మార్చి వరకూ భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, పనులు చేయడానికి రూ.7,300 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఢిల్లీలో సోమవారం సమావేశమై చర్చించింది. పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని.. తక్షణం ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించి.. తొలి దశ, రెండో దశ పూర్తికి ఏ మేరకు నిధులు అవసరమో నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీ, పీపీఏలను ఆదేశించింది. చదవండి: (కల్లుగీత..రాత మారేలా..! సీఎం వైఎస్ జగన్ చొరవతో తీరిన కష్టాలు) -
అడ్వాన్స్డ్ స్టేజ్‌లో రెండు కరోనా వ్యాక్సిన్లు
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సిన్లను రూపొందించే ప్రక్రియ వేగం పుంజుకుంది. అంతర్జాతీయంగా కీలక దశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలతో వ్యాక్సిన్‌పై ఆశలను పెంచుతున్నాయి. దేశీయంగా కనీసం ఐదు వ్యాక్సిన్లు వివిధ దశల ప్రయోగాల్లో ఉన్నాయని, వాటిలో రెండు అడ్వాన్స్డ్ స్టేజ్‌కు చేరుకున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు, వ్యాక్సిన్ ఉత్పత్తి , పంపిణీపై ప్రధానమంత్రికి సలహా ఇచ్చే ప్యానెల్ అధిపతి డాక్టర్ వినోద్ పాల్ అన్నారు. ముఖ్యంగా భారత్ బయోటెక్‌కు చెందిన భారతీయ వ్యాక్సిన్ కోవాక్సిన్ ఇప్పటికే దశ-3 క్లినికల్ ట్రయల్ ప్రారంభించిందన్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఐదు వ్యాక్సిన్లు వివిధ దశల ట్రయల్స్‌లో ఉన్నాయని పాల్ తెలిపారు. ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా ఫేజ్-3 అధునాతన దశలో ఉందన్నారు. అలాగే కాడిలా వ్యాక్సిన్ , రష్యాకుచెందిన స్పుత్నిక్వి ట్రయల్ ఫేజ్-2 ట్రయల్ ప్రిపరేషన్ పూర్తయిందని ఆయన పేర్కొన్నారు, దీంతోపాటు జైడస్ కాడిలా రూపొందించిన జైకోవ్-డి దేశంలో రెండవ దశ క్లినికల్ ట్రయల్‌లో ఉందని చెప్పారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మరో టీకా కోవిషీల్డ్ ఇటీవల భారతదేశంలో మూడవ దశ క్లినికల్ ట్రయల్ ను ప్రారంభించింది.అలాగే డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ త్వరలో దేశంలో రష్యన్ కోవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనుందని తెలిపారు. (కీలక దశకు దేశీయ కరోనా వ్యాక్సిన్) దేశంలో టీకా అందుబాటులోకి వచ్చాక ఫ్రంట్‌లైన్ కార్మికులకే తొలి ప్రాధాన్యమన్నారు. మరణాలను తగ్గించడం, ఫ్రంట్‌లైన్ కార్మికులను రక్షించడానికే మొదటి ప్రాధాన్యతనివ్వాలని పాల్ తెలిపారు. సుమారు 30 కోట్ల ప్రాధాన్యతా లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది.ప్రారంభ దశలో టీకా అందించేవారిని నాలుగువర్గాల వ్యక్తులుగా వర్గీకరించింది. వైద్యులు, ఎంబిబిఎస్ విద్యార్థులు, నర్సులు, ఆశా కార్మికులతో సహా ఒక కోటి మంది ఆరోగ్య నిపుణులు, మునిసిపల్ కార్పొరేషన్ కార్మికులు, పోలీసు సిబ్బంది, సాయుధ దళాలతో సహా రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ కార్మికులు ఉంటారు. వీరితోపాటు 50 ఏళ్లు పైబడిన 26 కోట్ల మంది; 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండి, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. -
కోల్ ఇండియా ఉద్యోగులకు దీపావళి బొనాంజా
సాక్షి, న్యూఢిల్లీ: కోల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. వన్ టైం అడ్వాన్స్ కింద ప్రతీ ఉద్యోగికి అందించే చెల్లింపును భారీగా (25శాతం) పెంచింది. రూ.40వేలకు బదులుగా తాజాగా రూ.51 వేలను అందించనున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీపావళికి ముందే ఈ అడ్వాన్స్‌ను చెల్లించనున్నట్టు బొగ్గు మంత్రి పియూష్ గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో మూడు లక్షల మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. దీపావళి సందర్భంగా కోల్ ఇండియా, దాని అనుబంధ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం ధంతేరస్ కానుకను ప్రకటించింది. ప్రభుత్వ జారీ చేసిన ప్రకటన ప్రకారం రూ.40 వేలకు బదులుగా రూ.51వేలను అందించనుంది. ముఖ్యంగా దీపావళి పర్వదినానికి ముందే అక్టోబర్ 17 వ తేదీ నాటికి ఉద్యోగులకు ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు వెల్లడించింది. కోల్ ఇండియా మేనేజ్మెంట్, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు ఆమోదంతో 2016 నుండి ఉద్యోగుల జీతాల్లో 20 శాతం పెంపుదల చేసినట్టు చెప్పింది. అలాగే 2017 సెప్టెంబరులో 10.1 శాతం వృద్ధిని నమోదు చేయగా, 2017 అక్టోబర్‌లో 13 శాతం వృద్ధిని నమోదు చేస్తామని అధికారిక ప్రకటనలో తెలిపింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు దసరా అడ్వాన్స్
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు దసరా అడ్వాన్స్ చెల్లించడానికి సంస్థ యాజమాన్యం అంగీకరించింది. అడ్వాన్స్‌ను ఈ నెల 19న అందజేయనున్నదని టీఎస్ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) తెలిపింది. టీఎంయూ అధ్యక్షుడు తిరుపతి, కార్యనిర్వాహక అధ్యక్షుడు థామస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, యూనియన్ రాష్ట్ర నేతలు బస్‌భవన్‌లో టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ రమణారావును కలిశారు. సంస్థలోని క్లాస్-3 క్యాటగిరీ ఉద్యోగుల వరకు రూ. 4500, క్లాస్-4 క్యాటగిరీ ఉద్యోగులకు రూ. 3000 చొప్పున అడ్వాన్స్ అందజేస్తామని ఎండీ హామీ ఇచ్చినట్టు టీఎంయూ నేతలు తెలిపారు. దీనిపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. -
వసూళ్ల వెలుగులు!
– పెద్ద నోట్ల రద్దుతో ముందస్తు విద్యుత్ బిల్లుల చెల్లింపులు – నెల బిల్లు కంటే వంద రెట్లు అధికంగా చెల్లిస్తున్న వినియోగదారులు – కలెక్షన్ అంతా రూ.500, రూ.వెయ్యి నోట్లే – 11న ఒకే రోజు రూ. 9.98కోట్లతో రికార్డు – నెలనెలా బిల్లులో మైనస్ అవతుందని ధీమా కర్నూలు(రాజ్‌విహార్): కర్నూలు నగరంలోని బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న ఓ వినియోగదారుడికి ఈనెల రూ.1,074 విద్యుత్ బిల్లు వచ్చింది. అయితే ఆయన మంగళవారం ఆశాఖకు రూ.1,00,000 చెల్లించాడు. అంతారూ.వెయ్యి నోట్లతోనే. మీ బిల్లు రూ.1,074లే కదా.. రూ.లక్ష కడుతున్నారేంటి? అని పవర్ హౌస్‌లోని కౌంటరు ఉద్యోగి ప్రశ్నించగా.. మా ఇష్టమండి.. అడ్వాన్స్‌గా చెల్లించవచ్చని అధికారులే ప్రకటన ఇచ్చారు. మీరు అడగడమేంటి అని సమాధానం ఇవ్వడంతో ఆడబ్బును తీసుకొని రసీదు ఇచ్చారు. దీంతో ఈ లెక్కన దాదాపు 8 ఏళ్ల వరకు ఆయన బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కల్లూరు ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లోని ఓ పరిశ్రమకు నెలవారి బిల్లు దాదాపు రూ.8వేలు వస్తుంది. కాని ఆ పరిశ్రమ యజమాని ఇటీవలే రూ.6లక్షల నగదును చెల్లించాడు'. .. వీరిద్దరే కాదు. ఇలా కర్నూలు జిల్లా వ్యాప్తంగా వేలాంది మంది వినియోగదారులు తమకు వచ్చిన విద్యుత్ బిల్లు కంటే వందరెట్లు అధికంగా చెల్లిస్తున్నారు. అదంతా రూ.500, రూ.వెయ్యి నోట్లతోనే. నెలవారి బిల్లులు సకాలంలో చెల్లించండయ్యా బాబు అని ఆశాఖ అధికారులు నెత్తినోరు కొట్టుకున్నా అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేసే వినియోగదారులు ఇప్పుడు కౌంటర్ల వైపు పరుగుతీస్తున్నారు. రద్దయిన పెద్ద నోట్లతో విద్యుత్ బిల్లులు కట్టవచ్చని, అదీ పాత బకాయిలతోపాటు ముందస్తు (అడ్వాన్స్) చెల్లింపులు చేయవచ్చని ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించడంతో రూ.వెయ్యి, రూ.500 నోట్లతో కేంద్రాల వద్ద కివ్∙లైనులో నిలబడి కట్టేస్తున్నారు. వచ్చిన బిల్లులు పక్కనపెడితే కొందరు వంద రెట్ల వరకు అధికంగా చెల్లిస్తున్నారు. తరువాత ఎలాగూ నెలనెలా బిల్లులో మైనస్ అవతుందని ధీమాతో రద్దయిన పాత పెద్ద నోట్లను ఇలా చెలామని చెసుకుంటున్నారు. దీంతో ఆశాఖ ఖజానా రూ.500, రూ.వెయ్యి నోట్లతో నిండిపోతోంది. ఈనెల 8తేదీన పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి రెండు రోజులు పెద్ద నోట్ల స్వీకరణకు అనుమతి లేకపోవడంతో రోజుకు కేవలం లక్షల్లోనే ఆదాయం వచ్చింది. పాత నోట్లతో విద్యుత్ బిల్లులు చెల్లించవ్చని ప్రకటించడంతో 11వ తేదీన ఒకే రోజు రూ.9.98కోట్ల రికార్డు స్థాయి కలెక్షన్ వచ్చింది. ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో బిల్లులు కట్టడంతో సంస్థ, జిల్లా చరిత్రలోనే మొదటి సారి అని అధికారులు పేర్కొంటున్నారు. గత ఆరు రోజుల్లో రూ.22 కోట్ల రద్దయిన రూ.500, రూ.వెయ్యి నోట్లతో బిల్లులు కట్టగా వాటిలో ఎల్టీ (గృహాలు, షాపులు, చిన్న ఫ్యాక్టరీలు) రూ.15.61కోట్ల కట్టగా పారిశ్రామికులు రూ.6.39కోట్ల చెల్లించినట్లు లెక్కలు చెబుతున్నాయి. తెలివైన వినియోగదారులు తమ డబ్బులు ఇలా తెలుపు చేసుకుంటున్నారు. – గత ఎమినిది రోజుల కలెక్షన్ ఇలా.. తేదీ ఎల్టీ హెచ్‌టీ మొత్తం 9వ తేదీన రూ.52.41లక్షలు రూ.9.79లక్షలు రూ.62.20లక్షలు 10వ తేదీన రూ.42.04లక్షలు రూ.44.85లక్షలు రూ.86.89లక్షలు 11వ తేదీన రూ.5.79కోట్లు రూ.4.18కోట్లు రూ.9.98కోట్లు 12వ తేదీన రూ.2.15కోట్లు రూ.9.11లక్షలు రూ.2.24కోట్లు 13వ తేదీన రూ.1.69కోట్లు రూ.13.12లక్షలు రూ.1.82కోట్లు 14వ తేదీన రూ.3.23కోట్లు రూ.31.88లక్షలు రూ.3.54కోట్లు 15వ తేదీన రూ.1.63కోట్లు రూ.19.29లక్షలు రూ.1.82కోట్లు 16వ తేదీన రూ.1.12కోట్లు రూ.51.20లక్షలు రూ.1.63కోట్లు -
జెట్ ఎయిర్వేస్ మరో ఆఫర్
ముంబై: జెట్ ఎయిర్వేస్ సంస్థ తన ప్రయాణికులకోసం ఒక వెసులు బాటు కల్పిస్తోంది. నిర్ధారిత సమయంకంటే ముందుగా వెళ్లాలనుకునే వారికి విమాన టికెట్ ను ప్రీపోన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే అలా ప్రయాణించాలనుకున్నవారు వెయ్యి రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ ఈ అవకాశాన్ని ప్రయాణికులకు కల్పిస్తోంది. అంటే టికెట్ క్యాన్సిలేషన్, మళ్లీ బుకింగ్ లాంటి తల నొప్పులేవీ లేకుండా.. నామమాత్రపు రుసుంతో సింపుల్ గా ప్రయాణాన్ని ముందుకు జరుపుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రయాణీకులకు నామమాత్రపు రుసుముతో అంతకుముందు విమాన బుకింగ్ మార్చడానికి అవకాశం కల్పిస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ అవకాశాన్నిగరిష్టంగా నాలుగు గంటల ముందు వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సమయం మార్పు, సీట్లు లభ్యత తదితర వివరాలను చెక్-ఇన్ కౌంటర్ దగ్గర నిర్ధారించబడుతుందని తెలిపింది. ఈ సౌకర్యం జెట్ ఎయిర్వేస్ దేశీయ నెట్ వర్క్ అంతటా అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. కాగా టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలను భారీగా వసూలు చేస్తున్న విమానయాన సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర జేసింది. ఈ నేపథ్యంలో సంస్థలకు కొత్త నిబంధనలను విధించిన సంగతి తెలిసిందే. -
యూకీ బాంబ్రీ శుభారంభం
సోమ్‌దేవ్, రామ్‌కుమార్ ఓటమి మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, యువతార రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టగా... యూకీ బాంబ్రీ మాత్రం శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ 4-6, 6-1, 8-6తో 15వ సీడ్ ఎవగెని డాన్స్కాయ్ (రష్యా)ను ఓడించాడు. రెండు గంటల తొమ్మిది నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఢిల్లీ ప్లేయర్ ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్‌వద్దకు 29 సార్లు దూసుకొచ్చిన యూకీ 18 సార్లు పాయింట్లు సాధించాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన యూకీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు సోమ్‌దేవ్ 4-6, 6-3, 4-6తో ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) చేతిలో; రామ్‌కుమార్ 5-7, 6-4, 4-6తో నిల్స్ లాంగర్ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు. గతంలో మూడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడిన సోమ్‌దేవ్ ఈ ఏడాది బరిలోకి దిగిన రెండు టోర్నీల్లోనూ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. గతవారం స్వదేశంలో జరిగిన చెన్నై ఓపెన్‌లోనూ అతను తొలి రౌండ్లోనే నిష్ర్కమించాడు. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో యోషిహిటో నిషిఓకా (జపాన్)తో యూకీ ఆడతాడు. 128 మంది పాల్గొంటున్న క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి 16 మంది మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తారు. ఈనెల 19న మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’ వివరాలను శుక్రవారం విడుదల చేస్తారు. -
పని చేయించుకొని డబ్బులివ్వరా..?
మునిపల్లి: తమతో పని చేయించుకుని డబ్బులివ్వమంటే ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని గీత కార్మికులు మునింలను నిలదీశారు. ఆదివారం మండలంలోని తాటిపల్లి గ్రామ శివారులోని వనంలో గీత కార్మికులు తమకు వెంటనే వేతనాలు ఇవ్వాలని మునీంలను డిమాండ్ చేశారు. 115 రోజులుగా ఇక్కడే పని చేస్తున్నాం.. ఇప్పటి వరకు తమకు సుమారు 3000 రూపాయల చొప్పున 33 మందికి అడ్వాన్సు ఇచ్చినట్లు గీత కార్మికులు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కోయల్‌కొండ మండలం చంద్రాస్‌పల్లి గ్రామం నుంచి ఐదుగురు, మదూర్ మండలం బొమ్మూరు నుంచి 12 మంది, బొనిడు గ్రామం నుంచి ఏడుగురు, అనాజిపూరం నుంచి ఇద్దరిని మునింలు కృష్ణయ్య, వెంకన్న తీసుకవచ్చారన్నారు. కల్లు కాంట్రాక్టర్ దగ్గర గీత కార్మికులుగా పని చేస్తే మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామంలోని ఈత వనంలో కల్లు గీస్తే రూ.9100లు ఇప్పిస్తానని ఇద్దరు మునింలు తమను తెచ్చినట్లు గీత కార్మికులు తెలిపారు. అలాగే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నుంచి 8 మందితో పాటు మునిపల్లి మండలం తాటిపల్లిలో ముగ్గురు, పిల్లోడి, బొడపల్లి, మన్సాన్పల్లి నుంచి ఒక్కొక్కరి చొప్పున మొత్తం 33 మందితో సుమారు 1600 ఇతచెట్ల నుంచి కల్లు గీయించినట్లు తెలిపారు. తాము ఇక్కడకు వచ్చి మూడు నెలల 15 రోజులవుతున్నా వేతనం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. తమ యూనియన్ గీత కార్మికులకు రూ. 8,100 చొప్పున చెల్లించాలని చెబితే కాంట్రాక్టర్ రూ.9.100లకు బదులు రూ.6.100 ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బొమ్మూరు గ్రామానికి చెందిన అంజయ్య నాలుగు రోజులుగా చలి జ్వరంతో బాధపడుతున్నారని, వైద్యం చేయిద్దామంటే తమ వద్ద డబ్బులు లేవని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే ఇత వనంలో కల్లు గీయడానికి వచ్చిన ఓ కార్మికుడు వనంలోనే శవమై తేలాడాన్నారు. తమ వద్ద కనీసం ఇంటికి వెళ్లడానికి కూడా బస్సు చార్జీలు లేవని, చాలీ చాలీ భోజనం తింటున్నామని గీత కార్మికులు మునింలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల క్రితం కల్లు తీసుకపోవడానికి డీసీఎం వస్తే తమ వేతనాలు ఇచ్చేంత వరకు డీసీఎంను కదలినిచ్చేది లేదని గీత కార్మికులు వాహనాన్ని అడ్డుకోవడంతో గ్రామస్తులు ఇరువురిని శాంతింపజేశారు. 3 నెలల 15 రోజుల నుంచి భార్యా పిల్లలకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి పంపలేదని, డబ్బులు లేకుండా ఇంటికి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చిక్కడపల్లికి చెందిన కల్లు కాంట్రాక్టర్ తమకు వేతనాలు చెల్లించకుండా చేస్తున్నారని, అందువల్లనే కల్లుకోసం వచ్చిన డీసీఎంను అడ్డుకున్నామన్నారు. -
‘కస్తూరిబా’
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : మధ్యలో చదువు మానేసిన పిల్లల కోసం ఏర్పాటు చేసిన కస్తూరిబా పాఠశాలలు ఆచరణలో చతికిలపడుతున్నాయి. పాఠశాలల్లో ప్రహరీలు లేకపోవడంతో విద్యార్థినుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొందరు ప్రత్యేకాధికారులు మెనూ పాటించకుండా డబ్బులు నొక్కేసి నాసిరకం భోజనం పెడుతున్న దాఖలాలున్నాయి. చాలాచోట్ల విద్యార్థులకు ఈ ఏడాదికి సంబంధించిన నోట్ బుక్‌లు, ట్రంకు పెట్టెలతోపాటు యూనిఫాంలు కూడా ఇవ్వలేదంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దుప్పట్లు లేకపోవడంతో రాత్రి వేళ దోమలతో ఇబ్బందులు పడడమేకాదు చలికి వణికిపోతున్నారు. ఈ ఇక్కట్లపై ‘సాక్షి’ విజిట్ చేయగా పాఠశాలల డొల్లతనం బట్టబయలైంది. చినగంజాంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలలో మొత్తం 200 మంది బాలికలున్నారు. పాఠశాల చుట్టూ గోడ లేకపోవడంతో వారికి రక్షణ కరువైంది. మర్రిపూడి మండలం రావిళ్లవారిపాలెం శివారులోని పాఠశాలల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక బాలికలు మథనపడుతున్నారు. పాఠశాల ప్రత్యేకాధికారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేస్తవారిపేట పాఠశాల పక్కనే శ్మశానవాటిక ఉండటంతో విద్యార్థినులు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. శవాలను తీసుకెళ్లేటప్పుడు పాఠశాల ముందు భాగంలో శవాన్ని దింపే కార్యక్రమం నిర్వహిస్తుండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పొన్నలూరు మండలం కె.అగ్రహారంలోని కస్తూరిబా పాఠశాలలో పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నాయి. పాఠశాలను పెద్ద గోడౌన్లో నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థినులు సామాన్లు పెట్టుకోవడంతోపాటు పాఠాలు కూడా అక్కడే వినాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం 104 మంది ఉండగా మరుగుదొడ్లు రెండు మాత్రమే ఉన్నాయి. పీసీపల్లి కస్తూరిబా పాఠశాలకు ప్రహరీ లేక బాలికలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెలిగండ్ల పాఠశాలలో లైట్లు వెలగక, ఫ్యాన్లు తిరగక రాత్రి పూట అనేక ఇక్కట్లు పడుతున్నారు. చాలాచోట్ల బాలికలకు బోరింగ్ నీరే దిక్కు. బోర్లలోని ఫ్లోరైడ్ నీరు తాగలేక నానా అవస్థలు పడుతున్నారు. హనుమంతునిపాడు కస్తూరిబాలో బోరింగ్ నీరు తాగుతుండటంతో ఇటీవల కొందరు దురద, ఇతర చర్మవ్యాధులతో ఇబ్బందులు పడ్డారు. మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలోని ఆట స్థలం కొండలు, గుట్టలతో నిండిపోయింది. తరగతి గదుల్లోనే రాత్రి సమయంలో నిద్రిస్తున్నారు. = తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు విద్యార్థినులకు ఫ్లోరైడ్ నీరే దిక్కు. పాఠశాల చుట్టూ ముళ్లపొదలు, చెత్తచెదారం ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బాలికలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఊరికి దూరంగా బీడు భూముల్లో పాఠశాల ఉండటం, ప్రహరీ మధ్యలో ఆగిపోవడంతో రాత్రి పూట బాలికలు నానా అవస్థలు పడుతున్నారు. కొనకనమిట్ల మండలం గొట్లగట్టు కస్తూరిబా పాఠశాలలో ఉడికీ ఉడకని అన్నంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. తాళ్లూరు, కురిచేడు, దొనకొండ పాఠశాలల్లో ప్రహరీలు లేకపోవడంతో తరచూ విష సర్పాలు లోపలికి వస్తున్నాయి. తాళ్లూరు పాఠశాలలో సరిపడినన్ని బెంచీలు లేకపోవడంతో బాలికలు నేలపై కూర్చొంటున్నారు. డార్మేటరీ పూర్తి కాకపోవడంతో డైనింగ్ హాల్, పెట్టెల మధ్యనే నిద్రిస్తున్నారు. కురిచేడు విద్యాలయానికి కంప్యూటర్లు అందజేసిన అధికారులు ఇన్స్ట్ట్రక్టర్ను నియమించకపోవడంతో కంప్యూటర్లు నిరుపయోగంగావున్నాయి. రాచర్లలో అసంపూర్తిగా నిలిచిన భవనంలో విద్యార్థినులు ఆరు బయట నిద్రించాల్సి వస్తోంది. మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడంతో ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కస్తూర్బా పాఠశాలల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
అడ్వాన్స్....
అదంతే! ‘‘పర్స్ దొరికిన వారికి వెయ్యి రూపాయల బహుమానం ఇస్తానన్నది మీరేనా?’ లక్షాధికారి దగ్గరకు ఓ బిక్షాధికారి వచ్చి అడిగాడు. ‘‘అవును! నీకేమైనా దొరికిందా?’’ ఆనందంగా అడిగాడు లక్షాధికారి. ‘‘ఇంకా లేదు. ఇంకొంచెం టైం పడుతుంది. ఈలోగా ఆ వెయ్యి రూపాయల్లో కొంత అడ్వాన్స్ తీసుకుందామని వచ్చాను’’ చెప్పాడు బిక్షాధికారి. -
అడ్వాన్సు మాఫీ..ఉత్తమాటేనా?
మంచిర్యాల సిటీ : ‘నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రెలు అయినట్టు’ సింగరేణి బొగ్గు గని కార్మికుల పరిస్థితి ఉంది. సింగరేణిలో కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో నష్టపోయారని భావించి కార్మిక సంఘాల ఒత్తిడి మేరకు యాజమాన్యం ప్రతి కార్మికుడికి రూ.25 వేలు అడ్వాన్సుగా ఇచ్చింది. యాజమాన్యం ఇచ్చిన అడ్వాన్సును మాఫీ చేయిస్తామని గుర్తింపు సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్ ఇప్పుడు ఆ విషయాన్ని ఎత్తడం లేదు. యాజమాన్యం కూడా అడ్వాన్సును తిరిగి వసూలు చేసుకుంది. ఇచ్చిన హామీని గుర్తింపు సంఘం విస్మరించడంతో కార్మిక వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రితో ప్రకటన కూడా చేయించకపోవడం శోచనీయం. ఢిల్లీలో అమలు కావలసిన ఆదాయపు పన్ను సమస్యను రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించిన కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు స్థానికంగా ముఖ్యమంత్రితో ప్రకటన కూడా చేయించలేకపోయారనే విమర్శ వెల్లువెత్తుతోంది. దీంతో కార్మికులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. గురువారం హైదరాబాద్‌లో గుర్తింపు సంఘంతో యాజమాన్యం చర్చలు జరుపనుంది. ఈ సందర్భంలోనైనా అడ్వాన్సు గురించి మాట్లాడుతారా అని కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఏం జరిగింది సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కార్మికులు తమ హక్కుల కోసం కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2011లో 38 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె విజయవంతం అనంతరం 2012 జూన్ 23న గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ముందు సమ్మెలో కార్మికులు ఆర్థికంగా నష్టపోయారని భావించి కార్మిక సంఘాలు యాజమాన్యాన్ని ఒప్పించి ప్రతి కార్మికుడికి 2011 నవంబరు మాసంలో రూ.25 వేలు అడ్వాన్సు రూపంలో ఇప్పించారు. కార్మికులకు ఇచ్చిన అడ్వాన్సును రద్దు చేయిస్తామని ఎన్నికల ప్రచారంలో గుర్తింపు సంఘంగా గెలిచిన టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకెఎస్ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో టీబీజీకెఎస్ గెలిచిన నాటి నుంచి సంఘం అంతర్గత కుమ్ములాటలో పడి సమస్య పక్కకుపోయింది. ఇదే అదనుగా భావించిన యాజమాన్యం ఇచ్చిన అడ్వాన్సును కార్మికుల నుంచి ముక్కు పిండి మరీ వారి వేతనాల నుంచి నెలకు రూ.1,500ల చొప్పున వసూలు చేసుకొంది. నష్టం 38 రోజుల సమ్మె కాలంలో సింగరేణి సంస్థ రోజుకు రెండు లక్షల టన్నుల చొప్పున 64 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టపోయింది. దీంతో టన్నుకు రూ.2వేల చొప్పున రూ.1,280 కోట్లు సంస్థకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది. కార్మికులు కూడా సగటున రూ.50 నుంచి రూ.70 వేల వరకు ఒక్కొక్క కార్మికుడు వేతన రూపంలో నష్టపోయారు. కొసమెరుపు తన చేతిలో ఉన్న అస్త్రాన్ని ఉపయోగించి కార్మికులకు మేలు చేయాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సమస్యను పరిష్కారం చేస్తామంటూ ఆదాయపు పన్ను రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయడం కార్మికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
ఇదేం పద్ధతి?
అడ్వాన్స్ లేకుండా పనులు ఎలా సాధ్యం మేడారం జాతర పనులపై పే అండ్ అకౌంట్స్ అభ్యంతరం ఇరుక్కుపోయిన ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం అధికారులు సమస్య నుంచి బయటపడేందుకు సచివాలయం వేదికగా పైరవీలు ఎవ్వరూ మనల్ని చూడట్లేదు.. ఏం చేసినా పరవాలేదు అనే ధీమాతో మేడారం జాతర పనుల్లో నిబంధనలను తుంగలో తొక్కిన ఐటీడీఏ, గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు.. ఇప్పుడు అడ్డంగా ఇరుక్కున్నారు. జాతర పనుల్లో నిబంధనలు పక్కనపెట్టిన విషయూన్ని పే అండ్ అకౌంట్స్ విభాగం గుర్తించింది. ఏ పద్ధతి ప్రకారం పనులు చేపట్టారో తెలపాలని వివరణ కోరింది. దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఐటీడీఏ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర సచివాలయం వేదికగా ఎలాగైనా సమస్యను పరిష్కరించుకునేందుకు పావులు కదుపుతున్నారు. సాక్షి, హన్మకొండ :మేడారం జాతర సందర్భంగా రెడ్డిగూడెం, చిలకలగుట్ట దగ్గర, జంపన్నవాగులో ఇన్‌ఫిల్టరేషన్ వెల్స్, మంచినీటి సరఫరా పనులు నిర్వహించేందుకు గిరిజన సంక్షేమ శాఖ టెండర్లు ఆహ్వానించింది. అయితే జాతరకు సమయం తక్కువగా ఉందని పేర్కొంటూ ఈ టెండర్లు రద్దు చేస్తూ దాదాపుగా 1.42 కోట్ల విలువైన పనులు శాఖ తరఫున సొంతంగా చేపడతామని చివరి నిమిషంలో గిరిజన సంక్షేమశాఖ అధికారులు ప్రకటించారు. ఈ అంశంలో కలెక్టర్ దగ్గరి నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని పనులు చేపట్టారు. జాతర ముగిసిన తర్వాత ఈ పనికి సంబంధించిన బిల్లులు మంజూరు చేయాల్సిందిగా కోరుతూ పే అండ్ అకౌంట్స్ విభాగానికి సంబంధిత ఫైలును గిరిజన సంక్షేమశాఖ, ఇంజినీరింగ్ విభాగం పంపింది. అడ్వాన్స లేకుండా పనులెలా..? ప్రభుత్వ అధికారులు తమ శాఖ తరఫున సొంతంగా పనిని చేపట్టాలంటే పని మొత్తం విలువలో కొంత మొత్తాన్ని మొదట అడ్వాన్సుగా తీసుకుని పనిని ప్రారంభించాలి. ఆ తర్వాత దశల వారీగా పని చేపడుతూ అడ్వాన్సులు తీసుకుంటూ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే పని పూర్తి చేశాం.. మాకు బిల్లులు మంజూరు చేయండి అంటూ పే అండ్ అకౌంట్స్ విభాగానికి పంపిన ఫైలులో పనిని చేపట్టేందుకు అడ్వాన్సులు తీసుకున్నట్లుగా ఎక్కడా పేర్కొనలేదు. అందుకు సంబంధించిన పత్రాలను దాఖలు చేయలేదు. దాంతో ఈ అంశాన్ని తప్పు బడుతూ పే అండ్ అకౌంట్స్ విభాగం.. బిల్లులు మంజూరు చేసేందుకు నిరాకరించింది. 1.40 కోట్ల రూపాయల విలువైన పనులు ఎటువంటి అడ్వాన్సులు తీసుకోకుండా ప్రభుత్వ అధికారులు ఏ విధంగా పనులు పూర్తి చేశారో చెప్పాలంటూ వివరణ కోరింది. అడ్వాన్సులు తీసుకోకుండా పనులు పూర్తి చేసేందుకు నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారో తెలపాలంటూ నిలదీసింది. కమీషన్ల వల్లే సమస్య తమకు అనుకూలుడైన వ్యక్తికి పనిని కట్టబెట్టేందుకు గిరిజన సంక్షేమశాఖ, ఇంజినీరింగ్ అధికారులు నిబంధనలను తొక్కిపెట్టి టెండర్లు రద్దు చేశారనే ఆరోపణలు జాతర ముందే వినిపించాయి. శాఖ తరఫున పనిచేస్తున్నట్లు కాగితాల్లో పేర్కొన్నా... వాస్తవంలో ఈ పనులు ఏటూరునాగారానికి చెందిన ఓ కాంట్రాక్టరుకు కట్టబెట్టారు. దానితో పనిని చేపట్టేందుకు అడ్వాన్సులు తీసుకోవాల్సిన అవసరం అధికారులకు రాలేదు. కానీ జాతర పూర్తయిన తర్వాత బిల్లుల మంజూరు సమయంలో శాఖ తరఫున పనిని చేపట్టామని పేర్కొన్న అధికారులు అందుకు సంబంధించిన అడ్వాన్సు బిల్లులను సమర్పించలేక పోయారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఈ పనికి సంబంధించిన బిల్లులు మంజురుకు ఫైలును పే అండ్ అకౌంట్స్ విభాగానికి పంపారు. ఇప్పుడు అక్కడ కథ అడ్డం తిరిగింది. చినికి చినికి గాలివాన అడ్వాన్సు రూపంలో సొమ్ము డ్రా చేయకుండా గిరిజన సంక్షేమ శాఖ కింది స్థాయి సిబ్బంది పనులు చేపడుతుంటే దాన్ని పర్యవేక్షించాల్సిన పై అధికారులు ఎందుకు చూస్తుండిపోయారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పే అండ్ అకౌంట్స్ విభాగం ఈ అంశాన్ని తప్పు పట్టే వరకు ఏ ఒక్కరూ ఈ ఉందంతంపై నోరు విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పే అండ్ అకౌంట్స్ విభాగం ఈ వ్యవహారాన్ని తప్పు పట్టడంతో ఈ అంశం రాష్ట్ర రాజధానికి చేరింది. ఇంతకాలం తమ మధ్య గుట్టుగా ఉన్న అంశం బట్టబయలు కావడంతో ఇంజనీరింగ్ అధికారుల్లో గుబులు మొదలైంది. ఈ అంశంపై పెద్ద ఎత్తున విచారణ జరిగితే చాలా మంది అధికారులకు అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో ఎలాగైనా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సచివాలయం కేంద్రంగా పైరవీలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. -
అంగారక యాత్ర చేసేందుకు జనం ఆసక్తి