సాక్షి, న్యూఢిల్లీ: కోల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. వన్ టైం అడ్వాన్స్ కింద ప్రతీ ఉద్యోగికి అందించే చెల్లింపును భారీగా (25శాతం) పెంచింది. రూ.40వేలకు బదులుగా తాజాగా రూ.51 వేలను అందించనున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీపావళికి ముందే ఈ అడ్వాన్స్‌ను చెల్లించనున్నట్టు బొగ్గు మంత్రి పియూష్ గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో మూడు లక్షల మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
దీపావళి సందర్భంగా కోల్ ఇండియా, దాని అనుబంధ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం ధంతేరస్ కానుకను ప్రకటించింది. ప్రభుత్వ జారీ చేసిన ప్రకటన ప్రకారం రూ.40 వేలకు బదులుగా రూ.51వేలను అందించనుంది. ముఖ్యంగా దీపావళి పర్వదినానికి ముందే అక్టోబర్ 17 వ తేదీ నాటికి ఉద్యోగులకు ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు వెల్లడించింది.
కోల్ ఇండియా మేనేజ్మెంట్, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు ఆమోదంతో 2016 నుండి ఉద్యోగుల జీతాల్లో 20 శాతం పెంపుదల చేసినట్టు చెప్పింది. అలాగే 2017 సెప్టెంబరులో 10.1 శాతం వృద్ధిని నమోదు చేయగా, 2017 అక్టోబర్లో 13 శాతం వృద్ధిని నమోదు చేస్తామని అధికారిక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment