రేషన్‌కార్డ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటీ ఐడీ కార్డ్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ గుర్తింపు కార్డులలో వేర్వేరు వివరాలు ఉండి వాటిని మార్చుకునేందుకు ఇబ్బంది పడుతున్న వారికి ఊరట కలిగిలించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆధార్‌లో అడ్రస్ సహా ఎమైనా వివరాలు తప్పుగా ఉండి వాటిని అప్ డేట్ చేస్తే మిగతా డాక్యుమెంట్లలో మార్పులకై ఆయా కార్యాలయాలకు వెళ్లకుండా అన్నింట్లోనూ ఆటోమెటిక్ వివరాలు అప్‌డేట్ అయ్యేలా కొత్త వ్యవస్థను మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ విభాగం సిద్ధం చేస‍్తున్నట్లు తెలిపింది.
ఆధార్ కార్డ్‌తో ఆటో అప్‌డేట్ ఎలా సాధ్యం?
ప్రధానంగా పైన పేర్కొన‍్నట్లుగా ప్రభుత్వ ఐడీ కార్డ్‌లను డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్‌తో పాటు ఇతర డాక్యుమెంట్లను డిజిలాకర్ (DigiLocker)లో భద్రపరుచుకుంటుంటారు. ఆ డిజిలాకర్‌లో ఉన్న ఆధార్ కార్డులో ఏదైనా అడ్రస్ లేదంటే ఇతర వివరాలు మారిస్తే.. వెంటనే డిజి లాకర్‌లో ఉన్న మిగిలిన ఐడెంటిటీ కార్డ్‌లలో డేటా సైతం అటోఅప్‌డేట్ అవుతుంది.
ప్రస్తుతం, ఈ ఆటో అప్‌డేట్‌పై కేంద్ర ఐటీ శాఖ.. రవాణా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వంటి పరిమిత మంత్రిత్వ శాఖలతో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పాస్‌పోర్ట్‌లను ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయడానికి యూజర్లకు అనుమతి ఇచ్చిన తర్వాత ఆధార్ ఆటో అప్‌డేట్ విధానం అమల్లోకి రానుంది.
ఆటో అప్‌డేట్ సిస్టమ్ ప్రయోజనాలు
ఆధార్ ద్వారా డిజిలాకర్లో ఉన్న ఐడెంటిటీ కార్డ్‌లను ఆటో అప్‌డేట్ చేయడం ద్వారా ఆయా డిపార్ట్‌మెంట్ల సమయం, ఖర్చుల తగ్గింపుతో పాటు ఫేక్ ఐడీ కార్డ్‌ల ముప్పు నుంచి సురక్షితంగా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల కారణంగా తరచు ప్రాంతాలు మారే వారికి ప్రయోజనం కలుగుతుంది. కాగా, గత నెలలో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే విధమైన వ్యవస్థను త్వరలో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment