ఆధార్ కార్డు ఉంటే చాలు కేంద్ర ప్రభుత్వం దాదాపూ రూ. 5లక్షల వరకు రుణం ఇస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకీ కేంద్రం ఈ పెద్దమొత్తంలో డబ్బులు ఇస్తుందా? అందులో నిజా నిజాలేంటో తెలుసుకుందాం.
ప్రతీ పనికి ఆధార్‌ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. సిమ్ కార్డు నుంచి బ్యాంక్ ఖాతాల వరకు ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆధార్ కార్డు లేనిదే కొన్ని పనులు జరగవు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్రం రూ. 4 లక్షల 78 వేల రుణం అందనుందనే ప్రచారం జరుగుతోంది.
It is being claimed that the central government is providing a loan of ₹4,78,000 to all Aadhar card owners#PibFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) November 19, 2022
▶️ This claim is #fake
▶️ Do not forward such messages
▶️ Never share your personal/financial details with anyone pic.twitter.com/fMdLewGxsF
ఈ ప్రచారాన్ని కేంద్రానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) కొట్టిపారేసింది. ఈ తరహాలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పధకాల్ని అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌లో ఆధార్ కార్డు రుణం వ్యవహారమంతా ఫేక్ అని తేలింది. ఆధార్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment