ఈ సారి ఎప్పుడైనా రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు మీ వాహనాన్ని ఆపితే ఎంచక్కా జేబులోంచి మొబైల్‌ఫోన్ తీసి డిజిటల్ రూపంలో భద్రపరిచిన వాహన పత్రాలు చూపించొచ్చు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ బుక్కు, ఇన్సురెన్స్, తదితర ధృవీకరణపత్రాలను కాగిత రూపంలోనే కాకుండా అవి డిజిటల్ రూపంలో ఉన్నా అధికారికంగా చెల్లుబాటు అవుతాయని తాజాగా కేంద్ర రోడ్డురవాణా, జాతీయ రహదారుల శాఖ ప్రకటించింది. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని అన్ని రాష్ట్రాల రవాణాశాఖలను కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో డిజిలాకర్ యాప్ లేదా ఎం పరివాహన్ ప్లాట్‌ఫోమ్‌లో ఈకాపీల రూపంలో వివిధ డాక్యుమెంట్లు ఇలా దాచుకోవచ్చు...
డ్రైవింగ్‌కు సంబంధించిన పత్రాలే కాకుండా ఓటరు ఐడీకార్డు, ఆధార్‌కార్డు, విద్యాసంబంధిత సర్టిఫికెట్లు ఏవైనా డిజిలాకర్ మొబైల్ యాప్‌లో నిక్షిప్తం చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ వెబ్‌సైట్‌లతో పాటు మొబైల్ ఫోన్లలోనూ అందుబాటులో ఉంది. మీ డాక్యుమెంట్లన్నింటిని డిజిటల్ లాకర్‌లో భద్రపరుచుకోవడమే ’డిజిలాకర్’. ఇది కేంద్ర ప్రభుత‍్వ నిర్వహణలో పనిచేస్తుంది.ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్ నెంబర్లకు దీనిని లింక్‌చేస్తారు. క్లౌడ్ పద్ధతిలో (ఓ సాఫ్ట్‌వేర్)లో డేటానంతా స్టోర్ చేస్తారు. మీ డాక్యుమెంట్లను పీడీఎఫ్, జేపీఈజీ లేదా పీఎన్‌జీ ఫార్మాట్‌లో స్కాన్ చేసి వాటిని ఆ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత ఎప్పుడు అవసరం పడినా దాని నుంచి వాటిని ఉపయోగించవచ్చు. అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్లపై మీరు ఎలక్ట్రానిక్(ఈ) సంతకం కూడా చేయొచ్చు. ఈ విధంగా మీ పత్రాలపై మీరు సొంతంగా అటెస్ట్ చేసినట్టు అవుతుంది.
అదే విధంగా సీబీఎస్‌ఈ, రిజిస్ట్రార్ ఆఫీస్ లేదా ఆదాయపన్ను శాఖలు కూడా వారి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల ఎలక్ట్రానిక్ కాపీలు కూడా నేరుగా మీ ఈలాకర్‌లోకి పంపవచ్చు. ఆధార్ పథకాన్ని అమలుచేస్తున్న ’యూనిక్ ఇండెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సంస్థతో పాటు, రోడ్డురవాణా, హైవేల మంత్రిత్వశాఖ. ఆదాయపు పన్ను శాఖ, సీబీఎస్‌ఈ తో సహా వివిధ స్కూలు బోర్డులు, వివిధ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, సంస్థలు డిజిలాకర్‌లో రిజిష్టరయి ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం 1.35 కోట్ల మంది డిజిలాకర్‌ను ఉపయోగిస్తున్నారు. పాన్‌కార్డులు, మార్కుషీట్లు, కుల, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు, రేషన్‌కార్డులు ఇలా వివిధ సేవల కోసం దానిని వాడుతున్నారు.
ఎలా ఉపయోగించాలి...
- డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ సిస్టమ్‌లో ముందుగా డిజిలాకర్ వెబ్‌సైట్‌కు వెళ్లడం లేదా స్మార్ట్‌ఫోన్‌లో డిజిలాకర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. వన్ టైమ్ పాస్‌వర్‌్డ కోసం మీ ఆధార్‌కార్డు, మొబైల్‌నెంబర్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించాలి.
- ఏదైనా సంస్థ మీ ఈడాక్యుమెంట్లను అందులో అప్‌లోడ్ చేసినా మీ అకౌంట్‌లో కనిపిస్తుంది. మీ డాక్యుమెంట్లు కూడా మీరే స్వయంగా అప్‌లోడ్ చేయడంతో పాటు వాటిపై సంతకం చేయొచ్చు.
- ఈ డాక్యుమెంట్లను ఇతరులతో పంచుకునే (షేర్ చేసుకునే) సౌకర్యాన్ని కూడా మీరు పొందవచ్చు. దీని కోసం ఈడాక్యుమెంట్‌లో లింక్ షేర్ చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment