న్యూఢిల్లీ: ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డులు వెంట లేకుండా రైలు ప్రయాణం చేస్తున్న వారు రిజర్వేషన్, రాయితీలను వినియోగించుకోవడానికి ఇక ఇబ్బందిపడనక్కర్లేదు. డిజిలాకర్‌లో భద్రపరచిన గుర్తింపు కార్డుల సాఫ్ట్ కాపీలను కూడా అనుమతిస్తామని తాజాగా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రెండు కాపీలను చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రాలుగా భావించాలని అన్ని జోన్ల ప్రిన్సిపల్ కమర్షియల్ మేనేజర్లకు లేఖలు పంపింది.
డిజిలాకర్ ఖాతాలోని ‘ఇష్యూడ్ డాక్యుమెంట్స్’ సెక్షన్‌లో పొందుపరచిన ఆధార్, డ్రైవింగ్ లైసెన్సులను చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రాలుగా పరిగణించాలని సూచించింది. అయితే ప్రయాణికుడు స్వయంగా అప్‌లోడ్ చేసిన ‘అప్‌లోడెడ్ డాక్యుమెంట్స్’ విభాగంలోని సాఫ్ట్ కాపీలను అనుమతించమని స్పష్టం చేసింది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్రం ప్రారంభించిన క్లౌడ్‌బేస్డ్ ‘డిజిలాకర్’లో ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌లను భద్రపరచుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment