Rail Journeys
-
‘డిజిలాకర్’లో ఉన్నా చాలు!
న్యూఢిల్లీ: ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డులు వెంట లేకుండా రైలు ప్రయాణం చేస్తున్న వారు రిజర్వేషన్, రాయితీలను వినియోగించుకోవడానికి ఇక ఇబ్బందిపడనక్కర్లేదు. డిజిలాకర్‌లో భద్రపరచిన గుర్తింపు కార్డుల సాఫ్ట్ కాపీలను కూడా అనుమతిస్తామని తాజాగా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రెండు కాపీలను చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రాలుగా భావించాలని అన్ని జోన్ల ప్రిన్సిపల్ కమర్షియల్ మేనేజర్లకు లేఖలు పంపింది. డిజిలాకర్ ఖాతాలోని ‘ఇష్యూడ్ డాక్యుమెంట్స్’ సెక్షన్లో పొందుపరచిన ఆధార్, డ్రైవింగ్ లైసెన్సులను చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రాలుగా పరిగణించాలని సూచించింది. అయితే ప్రయాణికుడు స్వయంగా అప్లోడ్ చేసిన ‘అప్లోడెడ్ డాక్యుమెంట్స్’ విభాగంలోని సాఫ్ట్ కాపీలను అనుమతించమని స్పష్టం చేసింది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్రం ప్రారంభించిన క్లౌడ్‌బేస్డ్ ‘డిజిలాకర్’లో ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్లను భద్రపరచుకోవచ్చు. -
‘వెయిటింగ్’ వెతలకు చెక్
కోల్‌కతా: రైలు ప్రయాణాలు చేయాలంటే ముందుగా బుకింగ్ చేసుకోవాల్సిందే. ఆన్లైన్లో బుక్ చేసుకుందామనుకునే సరికి అప్పటికే వెయిటింగ్లో ఉంటే..! వేరే స్టేషన్ నుంచి బెర్త్‌లు ఖాళీగా ఉండే వీలుంది కదా..! మరి ఖాళీగా ఉండే స్టేషన్లను ఎలా కనుక్కోవాలి? కష్టపడి కనుక్కున్నా అప్పటిలోగా ఆ స్టేషన్లో బెర్త్‌లు ఖాళీగా ఉంటాయన్న నమ్మకం లేదు. ఈ బాధలు లేకుండా సులువుగా ఈ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇద్దరు విద్యార్థులు కొత్త మొబైల్ యాప్ కనిపెట్టారు. ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి జాజు, జంషెడ్పూర్ ఎన్ఐటీలో చదివిన అతని సోదరుడు శుభం బల్దావా కలసి ‘టికెట్ జుగాద్’ అనే యాప్‌ను రూపొందించారు. రైలు బయలుదేరిన స్టేషన్ నుంచి చివరి స్టేషన్ వరకు ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను యాప్ చెప్తుంది. మనం టికెట్ బుక్ చేసుకునే సమయానికి ఏ స్టేషన్లో ఎన్ని బెర్తులు ఖాళీగా ఉన్నాయో వెల్లడిస్తుంది. ఒక స్టేషన్ నుంచి బెర్తులు లేకపోయినా వేరే స్టేషన్ నుంచి బుక్ చేసుకోవచ్చు. దీంతో వెయిటింగ్ లిస్ట్ బాధ పోతుంది. టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అంటూ ప్రతి రోజూ చెకింగ్ అనవసరం. యాప్ డౌన్లోడ్, బెర్తుల వివరాలు పూర్తిగా ఉచితం. ఆన్లైన్ ఇంధన నిర్వహణ వ్యవస్థ! న్యూఢిల్లీ: ఇంధన వినియోగంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఆన్లైన్ ఇంధన నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. ఇంధన నిర్వహణ వ్యవస్థ గురించి ఈ నెల 25న ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్లో మంత్రి ప్రకటించనున్నారు.