న్యూఢిల్లీ: బ్యాంకులు, బ్యాంక్‌యేతర సంస్థలు జారీ చేసే కార్డులకు సంబంధించి అదీకృత నెట్‌వర్క్‌లను ఎంచుకునే వెసులుబాటును కస్టమర్‌కు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించింది. ప్రస్తుతం కార్డ్ నెట్‌వర్క్‌లు, కార్డ్‌లు జారీ చేసే సంస్థల (బ్యాంకులు, నాన్–బ్యాంకులు) మధ్య ఉన్న ఒప్పందాలు.. కస్టమర్లకు తగినన్ని ఆప్షన్లను అందుబాటులో ఉంచేలా లేవని సర్క్యులర్ ముసాయిదాలో అభిప్రాయపడింది.
కార్డును జారీ చేసేటప్పుడు గానీ లేదా ఆ తర్వాత గానీ అర్హత కలిగిన కస్టమర్లు.. బహుళ కార్డు నెట్‌వర్క్‌ల నుంచి ఏదో ఒకదాన్ని ఎంచుకునేందుకు అవకాశం కలి్పంచాలని పేర్కొంది. కార్డు ఇష్యూయర్లు ఒకటికి మించి నెట్‌వర్క్‌లతో కార్డులను జారీ చేయాలని తెలిపింది. సంబంధిత వర్గాలు ఆగస్టు 4 వరకు ఈ ముసాయిదా సర్క్యులర్‌పై ఆర్‌బీఐకి తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీసా, రూపే, మాస్టర్‌కార్డ్ మొదలైన కార్డ్ నెట్‌వర్క్‌లు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటితో భాగస్వామ్యం ద్వారా బ్యాంకులు, నాన్–బ్యాంకులు తమ డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులు మొదలైన వాటిని జారీ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment