ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు గురువారం పట్టుకున్నారు.
యాకుత్‌పురా (హైదరాబాద్) : ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్సై పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్‌పురా నాగబౌలి ప్రాంతానికి చెందిన మహ్మద్ కమర్ (40) కొన్ని రోజులుగా తన ఇంట్లో పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి మరో ఏడుగురితో కలసి పేకాట ఆడుతుండగా రెయిన్‌బజార్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7 వేల నగదు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.