సాక్షి, సిద్దిపేట: ‘మీ గ్యారంటీ కార్డులు తెలంగాణలో పనిచేయవు..కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష.. కేసీఆర్ అంటేనే గ్యారంటీ, వారంటీ’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నా రు. మంగళవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ, కుమ్మర మోడ్రన్ యాంత్రిక పరిశ్రమకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ 50 ఏళ్ల నుంచి చేయని అభివృద్ధి, ఇప్పుడు చేస్తామని గ్యారంటీ కార్డులు, బాండ్‌పేపర్లు రాసిస్తున్నార న్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాటలు చెప్పేవారయితే, చేతల్లో చూపేది, మాటతప్పని, మడమతిప్పని నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. సీఎం కేసీఆర్ బీసీలకు చేసే ఆర్థికసాయం పథకాన్ని కాపీ కొట్టారని, అది అప్పు రూపంలో మోదీ అందిస్తున్నారని విమర్శించారు.
ఉద్యమస్ఫూర్తి, పోరా టస్ఫూర్తిని చాకలి ఐలమ్మ అందించిందన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన రూ.లక్ష కోట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు 71% ఫిట్‌మెంట్ ఇస్తోందన్నారు. త్వరలో సీఎం కొత్త పీఆర్‌సీ వేసి తీపికబురు చెబుతారన్నారు. అతి తక్కువ వేతనాలు ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో ఉన్నాయని, చూసేందుకు వెజ్ గవర్న మెంట్, కానీ చేసేందుకు నాన్‌వెజ్ గవర్నమెంట్ అంటూ బీజేపీ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment