guarantee
-
AP: బాదుడే.. బాదుడు.. ఇప్పుడు రూ. 9,412 కోట్లు
సాక్షి, అమరావతి/కర్నూలు న్యూసిటీ: కూటమి పాలనలో ప్రజలపై రెండో సారి భారీ విద్యుత్ చార్జీల భారం పడింది. రూ.9,412.50 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయనుంది. దీని ద్వారా ప్రతి యూనిట్‌కు రూ.0.92 అదనపు భారం ప్రజలపై పడుతుంది. డిసెంబర్ వినియోగం నుంచే అంటే జనవరి నుంచి ప్రభుత్వం ఈ చార్జీలు వసూలు చేస్తుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం దీపావళి పండుగకే రాష్ట్ర ప్రజలపై రూ.6,072.86 కోట్ల భారం వేసింది. ఈ చార్జీలను యూనిట్‌కు రూ.1.27 చొప్పున ఈ నెల నుంచి వసూలు చేస్తున్నారు. తాజా చార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్‌కు రూ.2.19 అదనంగా వినియోగదారులు చెల్లించాలి. గతంలో వేసిన రూ.6.072.86 కోట్లు, తాజాగా వసూలు చేస్తున్న రూ.9,412.50 కోట్లు కలిపి మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే రూ.15,485.36 కోట్ల భారం ప్రజలపై మోపింది. రూ.0.92 వరకూ అదనం 2023–24 సంవత్సరానికి రూ.12,844.88 కోట్ల సర్దుబాటు చార్జీల వసూలుకు డిస్కంలు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. అందులో రూ.3,432.38 కోట్లు తగ్గించి, రూ.9,412.50 కోట్లు వసూలు చేసుకునేందుకు డిస్కంలకు ఏపీఈఆర్సీ అనుమతించింది. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో యూనిట్‌కు దాదాపు రూ.0.91, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో రూ.0.92, ఏపీఈపీడీసీఎల్‌లో పరిధిలో రూ.0.90 చొప్పున వినియోగదారుల నుంచి 24 నెలల్లో వసూలు చేసుకోమని డిస్కంలకు ఏపీఈఆర్సీ చెప్పింది. మాట మార్చడం.. మాట తప్పడమే బాబు నైజం కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం, రకరకాల మాయ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఓట్లేసిన ప్రజలనే ముంచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మాట మార్చడం.. మాట తప్పడమే ఆయన నైజం. ఇటీవలి ఎన్నికల్లో ఆయనిచ్చిన సూపర్ సిక్స్ హామీలు, కరెంటు చార్జీలు పెంచబోమంటూ చెప్పిన మాటలను తుంగులో తొక్కేసి ఆయన నైజాన్ని మరోసారి బయట పెట్టుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి చోటా మైకు పట్టుకొని గత ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందంటూ అబద్ధాలాడేశారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదని, అవసరమైతే వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తామని ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టి ఐదు నెలలు తిరక్కుండానే చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు. విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన రోజే ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పాను’ అంటూ నాలుక మడతెట్టేశారు. విద్యుత్ చార్జీలపై బాబు వంచనకు మచ్చు తునకలు కొన్ని.. 19 మార్చి 2019, కడప : కరెంటు కొరత 2004లో లేదు. 2014లో అది 22.5 మిలియన్ యూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను. రెండు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు చార్జీలు పెంచేది లేదన్నాం. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ ఇస్తున్నాం. ఇళ్లకు 24 గంటలూ ఇస్తున్నాం. భవిష్యత్‌లో ఎంత కావాలంటే అంత కరెంట్ ఇచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నా. 27 మే 2020, టీడీపీ మహానాడు : కరెంటు చార్జీలు ఎవరూ కట్టే పరిస్థితి లేకపోతే కరెంటు చార్జీలు పెంచబోమని చెప్పాం. ఐదేళ్లు కరెంటు చార్జీలు పెంచలేదు. టెక్నాలజీ ఉపయోగించాం. సోలార్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. దానివల్ల రానున్న రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనం ముందుకు వెళితే.. మీరు (జగన్) పవర్ రేట్లు పెంచారు. రైతులకు కూడా కరెంటు చార్జీలు పెంచే పరిస్థితికి వస్తున్నారు. ఇది క్షమించరాని నేరం. 10 ఆగస్ట్ 2022, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ చార్జీలు తగ్గించే వాళ్లం. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వంపై దశలవారీ పోరాటానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి. జగన్ అధికారం చేపట్టిన మూడేళ్లలో ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. విద్యుత్ చార్జీల పెంపును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. 16 ఫిబ్రవరి 2023, పెద్దాపురం : తమ్ముళ్లూ.. ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారా లేదా? ఏవమ్మా ఆడబిడ్డలూ మీరు చెప్పండి. నేనున్నప్పుడైనా కరెంటు చార్జీలు పెంచానా? లోటు బడ్జెట్ ఉన్నా కరెంటు చార్జీలు పెంచకుండా పరిపాలన సాగించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 2 ఆగస్ట్, 2023, పులివెందుల : కరెంట్ చార్జీలను పెంచను.. తగ్గిస్తా. ఇప్పటికి ఎనిమిది సార్లు కరెంటు చార్జీలను జగన్ పెంచారు. వినూత్న ఆలోచనతో 2000లో కరెంట్ సంస్కరణలు తెచ్చి 2004కు మిగులు విద్యుత్ తెచ్చా. ఎండతో కరెంటు వస్తుంది. సోలార్ నేనే తీసుకొచ్చా. రూ.14 ఉండే కరెంటు రూ.2కు వచ్చి0ది. ఎండతో, గాలితో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే రూ.2 నుంచి రూ.3కే కరెంట్ వస్తుంది. రానున్న ఐదేళ్లలో కరెంట్ చార్జీలు పెంచను. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని, మీరే వినియోగించుకునే పరిస్థితి తెస్తా. గ్రిడ్‌కు కనెక్ట్ చేసి మిగులు విద్యుత్‌ను వినియోగదారులే అమ్ముకునేలా చేస్తా. 16 ఆగస్ట్ 2023, విజన్ డాక్యుమెంట్ విడుదల, విశాఖపట్నం : రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం. వీలైతే తగ్గిస్తాం. 90వ దశకం చివరిలో విద్యుత్ రంగంలో సంస్కరణలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ఉత్పత్తి విధానాలతో యూనిట్ ధర రూ.8 నుంచి రూ.2కు పడిపోయింది. హైడ్రోజన్, అమ్మోనియా హబ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. 4 మార్చి 2024, పెనుగొండ : ఎవరి మార్కు ఎంత అని అడుగుతున్నాడు.. నేను చెబుతున్నా జగన్.. నీ మార్కు తెలుసుకో. రూ.200 ఉండే కరెంటు బిల్లు రూ.800 చేయడం నీ మార్కు. కరెంటు చార్జీల బాదుడు నీ మార్కు. నేడు ఏఆర్ఆర్ సమర్పించనున్న డిస్కంలు 2025–26 సంవత్సరానికి అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్, రిటైల్ సప్లై బిజినెస్ ప్రపోజల్స్‌ను విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) శనివారం ఏపీఈఆర్సీకి సమర్పించనున్నాయి. తమ పరిధిలోని నివేదికలతో డిస్కంల సీఎండీలు ఏపీఈఆర్సీ ముందు హాజరుకానున్నారు. -
నిరుద్యోగులకు సర్కార్ షాక్
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్‌లో మొట్టమొదటి హామీకే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తూ నిరుద్యోగ యువతకు షాక్ ఇచ్చింది. వారి పొట్టకొట్టే చర్యలు చేపట్టి.. రిటైర్డ్ ఉద్యోగులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించడానికి గేట్లు తెరిచింది. సూపర్ సిక్స్‌లో మొట్టమొదటి హామీగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పన, లేదంటే ఉద్యోగాల కల్పించే వరకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫేస్టోలోస్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోపోగా తమకు కావాల్సిన రిటైర్డ్ ఉద్యోగులకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో ప్రభుత్వ కొలువులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో తమకు ఇక సర్కారు కొలువులు ఎండమావే అని నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లడమే.. ఖాళీ అయిన పోస్టులను కొత్త వారితో భర్తీ చేయకుండా తిరిగి రిటైర్ ఉద్యోగులతోనే భర్తీ చేయడం అంటే నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తేనే నిరుద్యోగ యువతకు అవకాశాలు ఉంటాయని, రిటైర్ వారితో వాటిని భర్తీ చేయడం అంటే నిరుద్యోగ యువతను నిండా ముంచడమేనని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఒకపక్క రిటైర్డ్ వారికే మళ్లీ అవకాశం ఇస్తూ.. కొత్త పోస్టులు మంజూరు చేయకపోవడంతో సర్కారు కొలువులు నిరుద్యోగ యువతకు అందని ద్రాక్షగానే మిగిలిపోనున్నాయి. ఒక పక్క వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీని రద్దు చేసి.. ఆ నియామక ప్రక్రియను తాత్సారం చేస్తున్న విషయం విదితమే. ఈ ఏడాది డీఎస్సీ ఉండే అవకాశం కనిపించకపోవడంతో నిరుద్యోగులు ఉస్సూరుమంటున్నారు. వైద్య, ఆరోగ్య శాఖలోనూ గత ప్రభుత్వం ఇచి్చన ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. రెండు స్క్రీనింగ్ కమిటీలు డిప్యూటీ కార్యదర్శి, డిప్యూటీ డైరెక్టర్ స్థాయి కేడర్‌లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, సంబంధిత శాఖల ప్రత్యేక సీఎస్, ముఖ్యకార్యదర్శి, కార్యదర్శులతో స్కీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. డిప్యూటీ కార్యదర్శి, డిప్యూటీ డైరెక్టర్ కంటే దిగువ కేడర్‌లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో తిరిగి తీసుకునేందుకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శి (హెచ్ఆర్), సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మరో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. రిటైర్డ్ ఉద్యోగులతో ఖాళీల భర్తీ ప్రతిపాదనల పూర్తి వివరాలు సంబంధిత శాఖల ప్రత్యేక సీఎస్‌లు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు.. స్క్రీనింగ్ కమిటీలకు పంపాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. స్క్రీనింగ్ కమిటీల ఆమోదం తరువాత సీఎం ఆమోదం తీసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను రెగ్యులర్ పోస్టుల్లోనే తీసుకోవాలని, మంజూరు కాని పోస్టుల్లోకి తీసుకోకూడదని తెలిపారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకున్న రిటైర్డ్ ఉద్యోగులకు వేతనాలు, అలవెన్స్‌లను 2018లో ఆరి్థక శాఖ జారీ చేసిన 48 జీవో మేరకు ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు రిటైరైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు మాత్రమే వర్తిస్తాయని, అఖిల భారత సర్విసు, కేంద్ర సర్విసు ఉద్యోగులకు వర్తించవని పేర్కొన్నారు. -
గ్యారంటీలను అందిస్తాం.. పేదవారిని ఆదుకోవడమే మా లక్ష్యం: మంత్రి దామోదర
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పథకాలను నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. కాంగ్రెస్‌కు కార్యకర్తలే బలమని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు.కాగా, మంత్రి దామెదర ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తల దయతోనే మాకు పదవులు వచ్చాయి. మా కోసం పనిచేసే వారికి నామినేటెడ్ పదవులు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం. ఆరు గ్యారంటీల్లో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఆగస్టు 15వ తేదీన రెండు లక్షల రుణమాఫీ చేస్తాం. సంక్షేమంతో పేదవాడిని ఆదుకోవాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం.అందులో భాగంగానే ఆర్టీసీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ప్రతీఏటా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడం ద్వారా రూ.580 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతోంది. అయినా పేదల కోసం ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం కాంగ్రెస్ పథకాలను నిర్వీర్యం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా విద్యా, వైద్యంపైనే ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా పేదలకు అందజేస్తోంది.అవసరం ఉన్న చోట డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. జాతీయ రహదారిపై ప్రమాదాల్లో గాయపడిన వారిని రక్షించేందుకు ప్రతీ 35 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ అంబులెన్స్ ఏర్పాటుతో పాటు 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. జాతీయ రహదారిపై 35 కిలోమీటర్ల దూరంలోని ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. దేవరకద్రలో వంద పడకల ఆసుపత్రి మంజూరు అయ్యింది. కొత్తకోటలో 50 పడకల ఆసుపత్రికి మంజూరుకి అనుమతులు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడికి పండుగను తీసుకువస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
మోదీ హామీలు చైనా వస్తువులు లాంటివి: తేజస్వి యాదవ్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశ రాజధాని నగరంలో భారీ ర్యాలీ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో RJD నాయకుడు తేజస్వి యాదవ్.. ప్రధాని 'నరేంద్ర మోదీ'పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ హామీలు చైనా వస్తువుల లాంటివని, అవన్నీ కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఉద్దేశించినవని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. అలాంటి హామీల మాయలో ప్రజలు పడవద్దని కోరారు. దేశంలో ఇప్పుడు 'ప్రకటించని ఎమర్జెన్సీ' నెలకొందని ఆరోపించారు. దేశంలో ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడానికి ప్రతిపక్షాలు అనుమతించవని నొక్కి చెప్పారు. ప్రధాని మోదీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని ఆరోపించారు. హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విధానాన్ని అందరూ చూసారు. బీజేపీ బెదిరింపులకు మేము భయపడేది లేదు. ఒక సింహాన్ని మాత్రమే అరెస్ట్ చేశారు. మేము కూడా సింహలమే.. పోరాటానికి సిద్ధంగా ఉన్నామని యాదవ్ అన్నారు. ప్రజలు తగిన గుణపాఠం చెబితే మోదీ అధికారంలోకి రారు. ఈ ఉదయం బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రదానం చేసే కార్యక్రమంలో.. రాష్ట్రపతి అద్వానీకి భారతరత్న ప్రదానం చేస్తున్నప్పుడు, మోడీ జీ అద్వానీ జీ పక్కన కూర్చున్నారు కానీ రాష్ట్రపతి గౌరవార్థం కూడా నిలబడలేదని అన్నారు. దేశం నలుమూలల ఉన్న ఇండియా కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సోదరభావాన్ని కాపాడేందుకు కూటమి ఐక్యంగా ఉందని యాదవ్ అన్నారు. ప్రజలే నిజమైన గురువులు.. దేశాన్ని ఎవరు పాలించాలో మీరే నిర్ణయించుకోవాలని యాదవ్ అన్నారు. -
మేనిఫెస్టో కోసం ప్రజల వద్దకు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వికసిత్ భారత్ సంకల్ప పత్రం పేరిట ప్రజల నుంచి సలహాలు, సూచనల స్వీకరణకు బీజేపీ జాతీయ నాయకత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రజల అభిప్రాయాలు తెలుసు కునేలా ’వికసి త్ భారత్ మోదీ కీ గ్యారంటీ’ పేరు తో చేపట్టిన కార్యక్రమాన్ని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రారంభించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఇతర నాయకు లతో కలిసి ‘మరో సారి మన మోదీ సర్కార్ ’ పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. రిమోట్ నొక్కి డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అభిప్రాయాలు నేరుగా ప్రధానికి.. వివిధ రూపాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని నేరుగా ప్రధాని మోదీకి తెలియజేసేలా ఏర్పాట్లు చేసినట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. వివిధ గ్రూపులతో సమావేశాలు (మిలన్, సంవాద్), ఇంటింటికీ వెళ్లడం,ౖ సోషల్ మీడియా (వాట్సాప్), ప్రచార, ప్రసార (ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా) తదితర రూపాల్లో అభిప్రాయ సేకరణ జరపనున్న ట్టు చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో సూచనల పెట్టె (సజెషన్స్ బాక్సులు) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వివిధ గ్రూపులతో సమా వేశాలకు సంబంధించి.. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో మార్చి 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. శక్తికి తగ్గట్టుగా విరాళాలివ్వండి ఆశా, అంగన్వాడీ వర్కర్లు, స్వయం సహాయక బృందాలు, రైతులు, సహకార సంఘాలు, కార్మికులు, జాతీయ అవార్డుల విజేతలు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులు తదితరుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని కిషన్‌రెడ్డి వివ రించారు. కళాకారులు, వ్యాపారులు, ఉద్యోగులు, అన్ని రకాల చేతి వృత్తుల కళాకారులు, సఫాయీ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, పూజా రులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, దళిత సంఘాల నాయకులు, సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు.. ఇలా అన్ని వర్గాల ఇంటింటికీ వెళ్లి అభి ప్రాయాలు సేకరిస్తామన్నారు. ‘ప్రజలతో నడిచే పార్టీ బీజేపీ కోసం ప్రజల శక్తికి తగ్గట్లుగా ఆర్థిక సాయం చేయాలని అన్ని వర్గాల ప్రజలను కోరుతు న్నాం. నమో యాప్ ద్వారానే పార్టీకి ఆర్థిక సాయం చేయాలి..’అని విజ్ఞప్తి చేశారు. ఈ యాప్ ద్వారా తాను స్వయంగా పార్టీకి విరాళం పంపారు. -
AP: బలంగా.. బడుగుల అడుగులు
సాక్షి, అమరావతి: బీసీలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాలతో వారికి అత్యధికంగా ప్రయోజనం చేకూర్చి ముఖ్యమంత్రి జగన్ బడుగుల బంధువుగా నిలిచారు. నాలుగున్నరేళ్లలో బలహీన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా నవరత్నాల ద్వారా బీసీ లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేశారు. జనాభాలో అత్యధిక శాతం బీసీలే ఉన్నా గత ప్రభుత్వాలు ఆ మేరకు లబ్ధి చేకూర్చలేదు. దీన్ని సరిదిద్దుతూ ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేశారు. నవరత్నాల లబ్ధిదారుల్లో బీసీలే అత్యధికంగా ఉండటం దీనికి నిదర్శనం. సింహభాగం లబ్ధి బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు... బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్ అంటూ పాద యాత్రతో పాటు ఎన్నికల ముందు నిర్వహించిన బీసీ సదస్సులో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్ తు.చ. తప్పకుండా దీన్ని ఆచరించారు. బీసీలకు అన్ని రంగాల్లో తగిన వాటా కల్పించారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.1.65 లక్షల కోట్ల మేర బీసీలకు ప్రయోజనం చేకూర్చారు. నేరుగా నగదు బదిలీ ద్వారా 4.07 కోట్ల ప్రయోజనాల కింద రూ.1.15 లక్షల కోట్లు బీసీల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నగదేతర బదిలీ ద్వారా 1.23 కోట్ల ప్రయోజనాలతో రూ.50,321.88 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అత్యధికంగా 16.70 లక్షల మంది బీసీలే ఉండటం విశేషం. ఇందులో 10.35 లక్షల మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా ఇప్పటికే రూ.5,972.50 కోట్లు బిల్లుల రూపంలో నేరుగా చెల్లింపులు చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 25.64 లక్షల మంది బీసీ రైతులకు రూ.15,000 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 30.36 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేతి వృత్తిదారులైన బీసీ వర్గాలకు రూ.39,845 కోట్లు సాయం అందించారు. ప్రతి అడుగులో.. ఇన్నాళ్లకు బీసీలకు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో మెజార్టీ వాటా లభించింది. ఏ పథకాన్ని తెచ్చినా, ఏ నియామకాలు చేపట్టినా వారికే గరిష్టంగా మేలు జరిగేలా చర్యలు తీసుకుంది. రాజ్యాధికారంలోనూ వారికి సీఎం జగన్ పెద్ద పీట వేశారు. మంత్రివర్గంలోనే కాకుండా బీసీల్లోని వివిధ వర్గాలకు జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు. గత ప్రభుత్వంలో బీసీలకు సబ్సిడీ పథకాలపై బ్యాంకు రుణాలు మాత్రమే అందేవి. అదికూడా ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేస్తేనే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా నవరత్నాల ద్వారా బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా ఆర్ధిక, సామాజిక ప్రయోజనాన్ని చేకూర్చింది. రాజకీయ సిఫార్సులతో పని లేకుండా వైఎస్సార్ నవశకం ద్వారా నవరత్నాల అర్హులను ప్రభుత్వం గుర్తించింది. అర్హత ఉండి కూడా ఎవరికైనా పొరపాటున లబ్ధి చేకూరకుంటే వారికి ఏడాదిలో రెండు సార్లు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి మరీ పథకాల ప్రయోజనాలను అందిస్తున్నారు. సామాజిక మహా విప్లవానికి నాంది దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాలుగా మిగిలిపోయిన వారిని వెన్నుముక వర్గాలుగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుంది. సామాజిక మహా విప్లవానికి నాంది పలికారు. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం ఒక చరిత్ర. బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు నడిపిస్తున్నారు. నవరత్నాలతో పారదర్శకంగా మేలు చేస్తున్నారు. ఏటా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి పక్కాగా అమలు చేస్తున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని ఉద్యమాలు జరిగినా కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. సీఎం జగన్ బీసీల న్యాయమైన కోర్కెను తీర్చేందుకు సంకల్పించడం శుభ పరిణామం. –మోర్ల మహీంధర్, వర్కింగ్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ప్రైవేట్ బిల్లు ఘనత వైఎస్సార్సీపీదే.. అట్టడుగు వర్గాలను ఆదుకుంటూ బడుగులకు అన్ని విధాలుగా గొడుగై నిలిచి సీఎం జగన్ కొత్త ఒరవడి సృష్టించారు. అంబేడ్కర్ ఆలోచనలు, జ్యోతిబా పూలే ఆశయాలను ఆచరించి చూపిస్తున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. దేశంలో బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో సైతం బలహీన వర్గాలకు జరగనంత మేలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది. రాజకీయంగా, సామాజికంగానూ బీసీలకు సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కుతుంది. కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖతోపాటు నిధుల కేటాయింపుపై సీఎం జగన్ పార్టీ ఎంపీల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవటాన్ని స్వాగతిస్తున్నాం. – చింతపల్లి గురుప్రసాద్, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల సమాఖ్య -
రేపటి నుంచే ఆర్టీసీ బస్సుల్లో..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ప్రధానమైన ఆరు గ్యారంటీలలో రెండింటిని సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా శనివారం నుంచే (ఈనెల 9) అమల్లోకి తేవాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో దీనికి పచ్చజెండా ఊపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల పరిమితిని రూ.10 లక్షలకు పెంచే హామీల అమలుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించి, దశలవారీగా పకడ్బందీగా ఆరు గ్యారంటీలను అమలు చేయాలని ఆలోచనకు వచ్చారు. ఈ భేటీ అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రులు దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. ఆరు గ్యారంటీలపై సుదీర్ఘ చర్చ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలపై కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్టు మంత్రులు తెలిపారు. ఈ హామీలను దశలవారీగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని తీర్మానించినట్టు వివరించారు. ఆరు గ్యారంటీలతోపాటు ప్రజలకు ఇచ్చిన ఇతర హామీలను ఐదేళ్లలోగా నెరవేర్చడమే తమ ప్రభుత్వ కర్తవ్యమన్నారు. ముందుగా ఈ నెల 9వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆధార్, రేషన్‌కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని బస్సుల్లో వెళ్లవచ్చని తెలిపారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా చర్చ జరిగిందని మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ‘‘2014 నుంచి గురువారం (డిసెంబర్ 7వ తేదీ) వరకు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఏయే ప్రభుత్వ విభాగాలు ఎంత ఖర్చు చేశాయి? దేని కోసం, ఏం ప్రయోజనాల కోసం ఖర్చు చేశాయి? ఆ ఖర్చులతో ఒనగూరిన ప్రయోజనాలేమిటన్న అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు వివరాలు అందజేయాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన ఖర్చు, చేకూరిన ప్రయోజనాలు తెలంగాణ ప్రజలందరికీ తెలియజేసేలా అన్ని వివరాలు కావాలని అధికారులను ఆదేశించారు’’ అని మంత్రులు వివరించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి, గ్యారంటీల అమలుకు అవసరమైన ఆర్థిక వనరులను సేకరించి హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్టు తెలిపారు. గ్రూప్–1, 2 పరీక్షల అంశంపైనా కేబినెట్ చర్చించినట్టు వివరించారు. నేడు విద్యుత్ అధికారులతో సమావేశం రాష్ట్రంలో రైతులకు, పరిశ్రమలకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ అందించాలని మంత్రివర్గం సమావేశంలో తీర్మానించినట్టు మంత్రులు వెల్లడించారు. ఈ క్రమంలో 2014 నుంచి ఇప్పటివరకు విద్యుత్ అంశానికి సంబంధించి చోటు చేసుకున్న తప్పుడు నిర్ణయాలపై చర్చించామని, ఆయా అంశాల్లో అధికారుల వివరణ కోరామని తె లిపారు. శుక్రవారం విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి, అధి కారులతో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు వివరించారు. గత పదేళ్లలో విద్యుత్‌కు సంబంధించి అనేక అంశాల్లో తప్పులు జరిగాయని, వాటిని స మీక్షించి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై తగిన నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా అమలుపైనా చర్చించనున్నట్టు వెల్లడించారు. 9న కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కొత్త శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని 9వ తేదీన చేపట్టాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్టు మంత్రులు తెలిపారు. ఇందుకోసం అసెంబ్లీలో సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకోవడం జరుగుతుందని.. తర్వాత స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం తదితర కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. పూర్తి స్థాయి కేబినెట్ కూర్పుపై సీఎం, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. రెవెన్యూ గ్రామంగా జయశంకర్ ఊరు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ప్రకటించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి గురువారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం అక్కంపేట గ్రామం పెద్దాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి గ్రామం–బి లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద స్మృతి వనం సుందరీకరణ, అభివృద్ధి కోసం ఎకరం భూమి కేటాయిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులను వెంటనే చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. -
'ఆరోపణల స్ట్రాటజీ' వర్సెస్ 'గ్యారంటీల గేమ్'? గెలిచేదెవరూ..?
రాజస్తాన్‌లో ఎన్నికల ప్రచారం తుది అంకానికి వచ్చేసింది. గురువారం సాయంత్రంతో ప్రచార ర్యాలీలకు ముగింపు పడుతోంది. ఒకరకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఎన్నికలు క్లైమాక్స్‌కి చేరినట్టే. ఇప్పుడు సర్వత్ర ఏ పార్టీ గెలుస్తుందన్న చర్చే సాగుతుంది. సోషల్ మీడియాలో సైతం దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ఎన్నికల ప్రచార ర్యాలీలో బీజేపీ కాంగ్రెస్‌ని దుమ్మెత్తిపోయడమే ఎజెండాగా పెట్టకుని ప్రచారం చేసింది. ఆరోపణల స్ట్రాటజీతో ప్రచార ర్యాలీల దూకుడు పెచ్చింది. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌ని రాజస్తాన్ జాదుగార్ అని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఢిల్లీ బాజీగర్ వంటి తిట్లతో వాడివేడిగా ప్రచారాన్ని జోరుగా సాగించారు. బీజేపీ మాత్రమే రైతుల సమస్యలను అర్థం చేసుకోగలదని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే గ్యారంటీ లేదుగానీ గ్యారంటీ హామీలా అని ఎగతాళి చేస్తే ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్‌పై ఆరోపణలు తీవ్రంగా గుప్పిస్తు ప్రచార ర్యాలీల్లో విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ రైతులకు వడ్డీలేని రుణం ఇస్తానన్న మాట అటుంచి ఇంతమునుపు కిసాన్ భవనాలు నిర్మిస్తానంటూ ఎవరికి కట్టించిందో గుర్తుతెచ్చుకోండని అంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోని కూడా దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేరస్తులకు కొమ్ముగాస్తుంది. అందుకు రాజస్తాన్‌లో మహిళలపట్ల జరుగుతున్న ఘోరాలే ఉదహారణ అందువల్ల ఏవిధంగా మిమ్మల్ని రక్షించగలదంటూ.. ప్రజల్లో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చేలా విమర్శనా అస్త్రాలు ఎక్కుపెట్టింది బీజేపీ. ఇక కాంగ్రెస్ కూడా ఏడు గ్యారంటీలతో సహా పలు హామీలను ఇస్తూ.. ప్రచారాన్ని హోరాహోరీగా సాగించింది. బీజేపీకి తీసుపోని విధంగా మాటలు తుటాలు పేల్చింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రచార ర్యాలిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..ప్రధాని మోదీకి తనని, రాహుల్‌గాంధీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని గట్టి కౌంటరిస్తు ప్రచారం చేశారు. మాటిమాటికి వంశపారంపర్య రాజకీయాలంటూ గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తూ వ్యక్తిగత విషయాలకు వెళ్లేది కూడా ఆయనే. మళ్లీ ఆయనే తిరిగి తన తండ్రిని తాము ఏదోన్నట్లు బూటకపు సీన్లు క్రియేట్ చేస్తున్నారని ఖర్గే మండిపడ్డడారు. లోకంలో లేని వ్యక్తి, పైగా రాజకీయాల్లో లేని అతని తండ్రిని తిట్టాల్సిన పని తనకేంటి అని చిరాకుపడ్డారు. కాంగ్రెస్ కూడా బీజేపీ అనే మాటలకు తనదైన రీతిలో కౌంటర్లిస్తూ ప్రచారం స్పీడు పెంచింది. అసంఖ్యాక వర్గాల హక్కులు రక్షించేల కుల గణన చేస్తామని హామీ ఇచ్చింది. దేశానికి ఎక్స్‌రే చేయాల్సి అవసరం ఉందని, కుల ఆధారిత జనాభా గణనే ఎక్స్‌రే అంటూ ఓటర్లను ఆకర్షించే యత్నం చేసింది. బీజీపీ బడా పారిశ్రామికవేత్తల పక్షాన వహిస్తుందని విమర్శించింది. దేశంలో ద్వేషం రగలడానికి ప్రధాన కారణం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అని చెప్పుకొచ్చింది. బీజేపీ మాత్రం దేశాన్ని ద్వేషం వైపుకు వెళ్లేలా యత్నిస్తుందని ఆరోపణలు చేసింది. పేదలు, దళితులు, కూలీలను డబ్బుకి దూరంగా ఉంచేలా చేస్తోంది. బిలీనియర్ల కొమ్ము కాస్తుంటుందని విమర్శలు గుప్పిస్తు తమ హామీలు ప్రజల మనుసుల్లో నాటుకునేలా ప్రచారం చేసింది కాంగ్రెస్. ఈసారి రాజస్తాన్ ఎన్నికల్లో ఇరు పార్టీల పోటాపోటీగా ఏ విషయంలో తగకుండా ప్రచారం చేశాయి. ఇరువురిలో ఏ గేమ్ ప్లే అవుతుంది? అనే తీవ్ర ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. రాష్ట్ర ఎన్నికల చరిత్ర ఏం చెబుతుందంటే.. ఇరు పార్టీలు తామే ఓట్లన్నీ స్వీప్ చేసి గెలుస్తామని ధీమాగా చెబుతున్నాయి గానీ ఓపినియన్ పోల్‌లో ఇందుకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీనే చూపిస్తోంది. కాంగ్రెస్ చెబుతున్నట్లు చరిత్ర పునరావృతం కావడం అనేది అసాధ్యమనే తేలింది. ఇక రాజస్తాన్ రాష్ట్ర ఎన్నికల చరిత్రను ఒకసారి చూస్తే..ఒక మెకానిజం రోల్‌ని ఫాలో అయిందనే చెప్పాలి ఎలా అంటే ఒకసారి బీజీపీ మరోసారి కాంగ్రెస్ అన్నట్లుగా సుమారు 1923 నుంచి 2023 వరకు ..బీజీపీ-ఐఎన్ఎస్-బీజేపీ-ఐఎన్ఎస్-బీజేపీ-ఐఎన్ఎస్ అలా గెలిపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన ఆరు ఎన్నికల్లో మూడింటిలో బీజేపీ, కాంగ్రెస్ ఘెరంగా పరాజయాన్ని చవిచూశాయి. ఇక కాంగ్రెస్ 1998లో భారీ మెజర్జీ ఓట్లతో విజయ ఢంక మోగించినంతగా మళ్లీ ఆ స్థాయిలో ఓట్లను సాధించలేకపోయింది. అలాగే చిన్న పార్టీలు, స్వతంత్రులు రాజస్తాన్‌లో బలమైన ఉనికిని చాటుకున్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే?..1993 నుంచి 2018 మధ్య జరిగిన ఎన్నికలలో సగటున 19 సీట్లు గెలుచుకున్నాయి ఆయా పార్టీలు. తూర్పున ఉత్తరప్రదేశ్‌ను తాకే సరిహద్దు ప్రాంతాలలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా మంచి ఆధిక్యతతో విజయాన్ని సాధించింది. ఇక కాంగ్రెస్ 2008, 2018లలో సుమారు నాలుగు సీట్లకు పరిమితమైంది. వీటన్నింటిన దృష్టిలో ఉంచుకుంటే ఇరు పార్టీలు మధ్య గట్టిపోటీ నెలకొనడమే గాక ఘన విజయాన్ని దక్కించుకోవడం అనేది కష్టమేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. (చదవండి: ఆ సీఎం "మాయగాడు"! అతని 'రెడ్ డైరీ'లో ప్రతీ పేజీ..) -
ఫ్రిజ్‌లు, ఏసీలు.. కొంటున్నారా? గ్యారెంటీపై ప్రభుత్వం కీలక సూచన!
రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వైట్‌గూడ్స్‌పై ఇచ్చే గ్యారెంటీ లేదా వారంటీకి సంబంధించి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వాటి తయారీ, విక్రయ కంపెనీలకు కీలక సూచనలు చేసింది. ఆయా ఉపకరణాల వారంటీ లేదా గ్యారెంటీ విధానాలను సవరించాలని కోరింది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వంటి ఉపకరణాలపై వారంటీ లేదా గ్యారంటీని అవి కొనుగోలు చేసిన తేదీ నుంచి వర్తింపజేస్తారు. అలా కాకుండా వాటిని ఇన్స్టాల్ చేసిన తేదీ నుంచి వర్తింపజేయాలని పరిశ్రమలు, రిటైల్ అసోసియేషన్లు, వైట్ గూడ్స్ తయారీదారులకు ప్రభుత్వ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఒక లేఖలో సూచించారు. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి ఉపకరణాలను సాధారణంగా శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులే ఇన్స్టాలేషన్ చేస్తుంటారు. వాటిని సరిగ్గా ఇన్స్టాల్ చేసే వరకు వినియోగదారులు ఆ వస్తువులను ఉపయోగించలేరు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, వినియోగదారులు ఉత్పత్తిని ఉపయోగించలేనప్పుడు వారంటీ లేదా గ్యారెంటీ వ్యవధిని ప్రారంభించడం వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం అన్యాయమైన వాణిజ్య పద్ధతిని ఏర్పరుస్తుంది. కొనుగోలు తేదీ నుంచి వారంటీ లేదా గ్యారెంటీ వ్యవధిని ప్రారంభించడం వలన వినియోగదారు సాధారణంగా ఆనందించే మొత్తం వారంటీ వ్యవధిలో తగ్గింపునకు దారి తీస్తుంది. ఈ-కామర్స్ ద్వారా చేసిన కొనుగోళ్ల విషయంలో ఈ సమస్య మరింతగా పెరిగింది. ఇక్కడ ఉత్పత్తి డెలివరీలో అదనపు సమయం ఉంటుంది. -
కేసీఆర్ అంటేనే గ్యారంటీ
సాక్షి, సిద్దిపేట: ‘మీ గ్యారంటీ కార్డులు తెలంగాణలో పనిచేయవు..కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష.. కేసీఆర్ అంటేనే గ్యారంటీ, వారంటీ’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నా రు. మంగళవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ, కుమ్మర మోడ్రన్ యాంత్రిక పరిశ్రమకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ 50 ఏళ్ల నుంచి చేయని అభివృద్ధి, ఇప్పుడు చేస్తామని గ్యారంటీ కార్డులు, బాండ్‌పేపర్లు రాసిస్తున్నార న్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాటలు చెప్పేవారయితే, చేతల్లో చూపేది, మాటతప్పని, మడమతిప్పని నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. సీఎం కేసీఆర్ బీసీలకు చేసే ఆర్థికసాయం పథకాన్ని కాపీ కొట్టారని, అది అప్పు రూపంలో మోదీ అందిస్తున్నారని విమర్శించారు. ఉద్యమస్ఫూర్తి, పోరా టస్ఫూర్తిని చాకలి ఐలమ్మ అందించిందన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన రూ.లక్ష కోట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు 71% ఫిట్మెంట్ ఇస్తోందన్నారు. త్వరలో సీఎం కొత్త పీఆర్సీ వేసి తీపికబురు చెబుతారన్నారు. అతి తక్కువ వేతనాలు ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్లో ఉన్నాయని, చూసేందుకు వెజ్ గవర్న మెంట్, కానీ చేసేందుకు నాన్‌వెజ్ గవర్నమెంట్ అంటూ బీజేపీ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ పేదలకు ‘ఉన్నతి’
సాక్షి, అమరావతి:గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పనులపై ఎక్కువగా ఆధారపడే పేద కుటుంబాల్లో యువతకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘ఉన్నతి’ పేరుతో వివిధ రకాల ఉపాధి, వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి శాశ్వత జీవనోపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ద్విచక్ర వాహనాలు, ఏసీ మెషిన్లు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిపేర్ అండ్ సర్వీసింగ్, ఇంటర్నెట్ సేవలకు సంబంధించి టెక్నికల్ సర్వీస్ తదితర 192 రకాల ఉపాధి, వృత్తి విద్య కోర్సుల్లో పేద కుటుంబాల్లోని దాదాపు 25 వేల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. నిబంధనల ప్రకారం.. ఉపాధి హామీ పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి గరిష్టంగా వంద రోజులపాటు పనులు కల్పిస్తున్నారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో ముగ్గురు పనిచేసే వ్యక్తులు ఉండి.. ఆ ముగ్గురు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకోవాలనుకుంటే.. ఒక్కొక్కరికి గరిష్టంగా 33 పని దినాల చొప్పున కేటాయిస్తున్నారు. ఉపాధి కూలీల కుటుంబాలు గరిష్ట వంద రోజుల పరిమితి వినియోగించుకున్న అనంతరం కూడా ఆ కుటుంబం ఏ పనిలేక ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా.. ఉన్నతి పథకం కింద శిక్షణ ఇస్తారు. ఏడాదిలో వంద రోజుల పనులు పూర్తి చేసుకున్న కుటుంబాలను గుర్తించి ఆయా కుటుంబాల్లో యువతకు శిక్షణ కార్యక్రమాలు అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో గరిష్టంగా 18–45 ఏళ్ల మధ్య, ఇతర సామాజిక వర్గాల్లో 18–35 ఏళ్ల మధ్య వయసు గలవారు ఈ శిక్షణ కార్యక్రమాలకు అర్హులుగా నిర్థారించారు. ఉచిత శిక్షణతోపాటు రోజూ కూలి జమ శిక్షణ కార్యక్రమాలను పూర్తి ఉచితంగా అందజేయడంతో పాటు శిక్షణకు హాజరయ్యే యువతకు రోజు వారీ కూలి డబ్బులను స్టైఫండ్ రూపంలో ప్రభుత్వం అందజేస్తుంది. గరిష్టంగా వంద రోజులు పాటు స్టైఫండ్ అందజేస్తారు. సంబంధిత యువత శిక్షణ కాలంలో కనీసం 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. గరిష్టంగా వంద రోజుల పాటు ఉపాధి హామీ పనులకు వెళ్లిన కుటుంబాల్లో యువత ఉన్న కుటుంబాలు 4,75,327 ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఎస్ఈఈడీఏపీ (సీడాప్), ఆర్ఎస్ఈటీఐ, కేవీకే సంస్థల ద్వారా ప్రభుత్వం శిక్షణ ఇప్పించేందుకు నిర్ణయించారు. ఆయా సంస్థలు క్షేత్రస్థాయిలో పనిచేసే ఉపాధి హామీ పథకం సిబ్బంది సాయంతో సంబంధిత కుటుంబాలను ప్రత్యక్షంగా సందర్శించి శిక్షణ పొందేందుకు ఆసక్తి గల యువత పేర్లను నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత అర్హులైన వారికి శిక్షణ అందజేస్తారు. -
ఔను.. 6 నెలలకు సీఎం మారడం గ్యారంటీ
పెద్దశంకరంపేట (మెదక్) / కంగ్టి (నారాయణఖేడ్): కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ కార్డు పథకాలపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ కార్డులు అమలు కావని, ఆరు నెలలకు ముఖ్యమంత్రి మారడం మాత్రం గారంటీ అని విమర్శించారు. అదేవిధంగా 6 నెలలకు ఒక కర్ఫ్యూ, రైతులకు 6 గంటల కరెంటు, పరిశ్రమలకు వారానికి రెండు పవర్ హాలిడేలు ఉండటం మాత్రం గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. మంగళవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట, సంగారెడ్డి జిల్లా కంగ్టిలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎలాగూ అధికారంలోకి రాలేమని తెలిసి కాంగ్రెస్ నేతలు కల్లగోల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఇక రెండో రాజధాని బెంగళూరు అవుతుందేమో ఎమ్మెల్యేలకు ఢిల్లీ హైకమాండ్ అవుతుందని, దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లాలంటే వయా బెంగళూరు మీదుగా వెళ్లాలని, ఇక బెంగళూరు మనకు రెండో రాజధాని అవుతుందని హరీశ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హామీలు పోస్టుడేటెడ్ చెక్కులాంటివన్నారు. కర్ణాటకలో అధికారంలో ఉండి రూ.600లు పింఛన్ ఇస్తున్న ఆ పార్టీ.. తెలంగాణలో రూ.4000 ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ ప్రస్తుతం అక్కడ బస్సులు తగ్గించారన్నారు. బీఆర్ఎస్ 24 గంటలూ ఉచిత కరెంటు సరఫరా చేస్తుందని, గతంలో ఉచిత కరెంటు హామీ ఇచి్చన కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉత్త కరెంటు ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. కిట్లు ఇచ్చే వారు కావాలో, కేసీఆర్‌ను తిట్టే వారు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. త్వరలో బీఆర్ఎస్ నుంచి అద్భుతమైన మేనిఫెస్టో వస్తుందని వెల్లడించారు. -
1 నుంచి ‘ఉపాధి’కి ఆధార్ చెల్లింపులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు సెప్టెంబరు 1వతేదీ నుంచి పూర్తి స్థాయిలో ఆధార్‌తో అనుసంధానం చేసిన బ్యాంకు అకౌంట్లకు మాత్రమే వేతనాలు చెల్లింపులు చేస్తారు. ఉపాధి హామీ జాబ్ కార్డు నెంబరుతో పాటు ఆధార్, బ్యాంకు ఖాతాలను ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటేనే ఆయా ఖాతాలకు వేతనాలు జమ అవుతాయి. ఈ మూడింటినీ అనుసంధానం చేసుకోని వారికి సెప్టెంబరు ఒకటో తేదీ తర్వాత ఉపాధి పథకం పనులకు హాజరైనా వేతనాలు జమ చేసే పరిస్థితి ఉండదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు కీలక మార్పులు తెచ్చింది. దీన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 1వతేదీ నుంచే అమలు చేయాలని తొలుత భావించినా చాలా రాష్ట్రాల్లో (మన రాష్ట్రం కాదు) పెద్ద సంఖ్యలో కూలీల జాబ్‌కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పలు దఫాలు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సెప్టెంబరు ఒకటి నుంచి ఖచ్చితంగా నూతన విధానంలోనే కూలీలకు వేతనాల చెల్లింపులు ఉంటాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు స్పష్టం చేసినట్టు అధికారులు వెల్లడించారు. కేంద్రం ఈ ప్రతిపాదనలను తేకముందు నుంచే మన రాష్ట్రంలో ఉపాధి కూలీలకు పాక్షికంగా ఆధార్ అనుసంధానంతో కూడిన వేతనాల చెల్లింపులు కొనసాగుతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో పథకం అమలులో పారదర్శకత కోసం వీలైనంత మేర కూలీల జాబ్‌కార్డులను బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించగా మిగతావారికి కూడా ఇప్పటివరకు వేతనాలను చెల్లిస్తున్నారు. అయితే సెప్టెంబరు ఒకటి నుంచి మాత్రం వందకు వంద శాతం తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం విధానంలో వేతనాల చెల్లింపుల ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 99.53 శాతం అనుసంధానం ఆంధ్రప్రదేశ్‌లో 69 లక్షల కుటుంబాలకు చెందిన 1.24 కోట్ల మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఏటా గరిష్టంగా 47.74 లక్షల కుటుంబాలకు సంబంధించి దాదాపు 79.81 లక్షల మంది కూలీలు ఉపాధి పనులతో లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కలిపి గత ఐదేళ్లుగా ఏటా రూ.ఐదారు వేల కోట్లకు తక్కువ కాకుండా ప్రయోజనం చేకూరుతోంది. వేతనాల చెల్లింపుల్లో కేంద్రం తెచ్చిన నూతన విధానంతో ఉపాధి హామీ కూలీలెవరూ ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మొత్తం 1.24 కోట్ల మంది కూలీలలో 99.53 శాతం మంది జాబ్ కార్డులు ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానం ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. గత మూడేళ్లలో ఒక్క రోజైనా ఉపాధి పనులకు హాజరైన క్రియాశీలక కూలీలలో 97.2 శాతం మందిని కూడా ఇప్పటికే అనుసంధానించారు. ఉపాధి పథకం కూలీల జాబ్‌కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. త్రిపుర, కేరళ, లడఖ్, పుదుచ్చేరి, చత్తీస్‌గఢ్, సిక్కిం, తమిళనాడు తరువాత స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న కూలీలలో ఇంకా కేవలం 60 వేల మందికి సంబంధించి మాత్రమే ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. వారు గతంలో పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ ఉపాధి పనులపై పెద్దగా ఆసక్తి చూపని వారే కావచ్చని పేర్కొంటున్నారు. -
యులిప్స్‌కు పెరుగుతున్న డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం పాలసీదారులు తమ ఆర్థిక అవసరాలు, లక్ష్యాల సాధన కోసం యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు (యులిప్‌లు), గ్యారంటీ ప్లాన్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ (సీడీవో) రాహుల్ అగర్వాల్ తెలిపారు. ఇందుకు అనుగుణంగానే తాము ఇటీవలే ఎక్సైడ్ లైఫ్ స్మార్ట్ ఇన్‌కం ప్లాన్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. ఇది ఇటు జీవితాంతం లైఫ్ కవరేజీ ఇవ్వడంతో పాటు అటు క్రమానుగతంగా ఆదాయం కూడా అందించే సాధనమని వివరించారు. మరోవైపు, పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో టర్మ్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాల్సిన సాధనమని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా జీవిత బీమా పాలసీలంటే మరణానంతరం మాత్రమే ప్రయోజనం చేకూర్చే సాధనాలుగా ఒక ప్రతికూల అభిప్రాయం ఉండటం వల్ల వీటి గురించి మాట్లాడేందుకు ఎక్కువగా ఎవరూ ఇష్టపడరని అగర్వాల్ చెప్పారు. అయితే, కోవిడ్ రాకతో పరిస్థితులు మారాయని, జీవితంలో అనిశ్చితి గురించి అందరూ గ్రహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ పరిణామాల అనంతరం తాము కూడా గణనీయంగా డిజిటల్‌కు మళ్లుతున్నామని వివరించారు. -
2014 నుంచి ఎన్ని నిధులిచ్చారో చెప్పండి..
సాక్షి, అమరావతి : ఉపాధి హామీ పథకం కింద 2014 నుంచి ఇప్పటి వరకు ఏపీకి ఎన్ని నిధులిచ్చారు? ఇంకా ఎన్ని ఇవ్వాలి? తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టును ఆశ్రయించిన వారిలో పలువురికి ఉపాధి పనుల బకాయిలు చెల్లించామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఆ డబ్బు అందిందా? లేదా? చెప్పాలని వారి తరఫు న్యాయవాదులను హైకోర్టు మరోసారి ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులిచ్చారు. తాము చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. ఉపాధి హామీ కింద రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను సమర్పించాలని గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం ఓ మెమోను కోర్టు ముందుంచింది. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి.. ఆ వివరాలు సంతృప్తికరంగా లేవంటూ పైవిధంగా ఆదేశాలిచ్చారు. -
రెవెన్యూ వ్యవస్థ: ‘టైటిల్’ గ్యారంటీ
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి ‘టైటిల్ గ్యారంటీ’ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. యూపీఏ సర్కారు 2011లో రూపొందించిన భూ హక్కుల ముసాయిదా చట్టానికి మార్పులు, చేర్పులు చేసి.. కొత్త్త ముసాయిదాను రూపొందించే బాధ్యతను నీతి ఆయోగ్‌కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు నూతన ముసాయిదా చట్టం–2020, నియమాల(రూల్స్)ను తయారు చేసిన నీతి ఆయోగ్ వాటిని రాష్ట్ర ప్రభు త్వాలకు పంపింది. కేంద్రం రూపొందించిన టైటిల్ గ్యారంటీ ముసాయిదా చట్టంతో పాటు మహారాష్ట్ర చట్టాన్ని కూడా జతపరిచింది. ఈ రెండింటిలో ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా టైటిల్ గ్యారంటీ చట్టాలను రూపొందించు కోవాలని స్పష్టం చేసింది. కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యేక నిబంధనలు (రెగ్యులేషన్లు) పంపింది. ఇప్పటికే హరియాణాలో ప్రయో గాత్మకంగా అమలు చేస్తున్న ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ 2024లోపు ప్రవేశపెట్టాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. భూ వివాదాలకు అంతిమ పరిష్కారం టైటిల్ గ్యారంటీ చట్టంతోనే సాధ్యపడుతుం దని కేంద్ర సర్కారు భావిస్తోంది. గత యూపీఏ ప్రభుత్వం టైటిల్ గ్యారంటీని 2020లోపు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా కూడా తయారు చేసింది. ఆ తర్వాత కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావ డంతో ఈ చట్టంలో మార్పులు, చేర్పులు చేసి కొత్త ముసాయిదాను రూపొం దించే బాధ్యతను నీతి ఆయోగ్‌కు మోదీ ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీకే అగర్వాల్ నేతృత్వంలోని కమిటీ ముసాయిదాకు తుదిరూపు ఇచ్చింది. ఈ డ్రాఫ్టును తాజాగా నీతి ఆయోగ్ రాష్ట్రాలకు పంపింది. ప్రస్తుతం ఉన్న రికార్డ్స్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్) స్థానే కంక్లూజివ్ టైటిల్‌ను తేవాలని కేంద్రం నిర్ణయించింది. కేవలం రెండు రిజిస్టర్లే..! టైటిల్ గ్యారంటీ ముసాయిదా చట్టంలో పలు కీలకాంశా లను నీతి ఆయోగ్ పొందుపరిచింది. భూములకు సంబం ధించి పదుల సంఖ్యలో ఉన్న రిజిస్టర్ల స్థానంలో రెండు రిజిస్టర్లనే నిర్వహించాలని అభిప్రాయపడింది. అవి టైటిల్ రిజిష్టర్, దానికి అనుబంధంగా వివాదాల రిజిష్టర్ మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. భూ సర్వే, ఇతరత్రా సంస్కరణలకు నిధులను సమకూర్చేందుకు కేంద్రం ఇదివరకే అంగీకరించింది. భూ భారతి, మొదలు సమగ్ర భూ సర్వేకు కూడా నిధులను విడుదల చేసింది. దీంట్లో భాగంగానే టైటిల్ గ్యారంటీ చట్టం అమలుకు అవసరమైన ఆర్థిక వనరులను అందజేసేందుకు సుముఖంగా ఉంది. ముసాయిదా చట్టంలో ముఖ్యాంశాలు: – అన్ని రకాల భూములకు ఇక ఓకే ఒక రికార్డు. వివాదాలు ఉంటే తాత్కాలికంగా మరో రికార్డులో. – వివాద పరిస్కారాలకు ట్రిబ్యూనళ్ల ఏర్పాటు. – రికార్డుల్లో ఉన్న వివరాలకు ప్రభుత్వమే పూచీకత్తు. యజమానికి నష్టం జరిగితే పరిహారం. – రికార్డుల్లోకి ఎక్కిన వివరాలను రెండేళ్ల తరువాత మార్చే వీలు ఉండదు – భూముల సర్వే చేసి ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఏపీలో ఇప్పటికే చట్టానికి ఆమోదం టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమలుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకంటే ఒకడుగు ముందుంది. గతేడాది ఏపీ అసెంబ్లీ టైటిల్ గ్యారంటీ చట్టాన్ని ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ చట్టం అమలుకు ఆయువు పట్టయిన భూ సమగ్ర సర్వేను వచ్చేడాది జనవరి నుంచి శ్రీకారం చుట్టడానికి ముహూర్తం ఖరారు చేసింది. మన రాష్ట్రంలో ఇలా.. తెలంగాణలోనూ కంక్లూజివ్ టైటిల్‌ను తీసుకురావాలని గత మూడేళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా భూ రికార్డుల ప్రక్షాళనతో రెవెన్యూ రికార్డులను పకడ్బందీగా నిర్వహించింది. ఈ క్రమంలో కంప్యూటర్ ఆధారిత భూ రికార్డుగా ప్రకటించిన ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. పార్ట్–బీ, పెండింగ్ కేసులను కొలిక్కి తేవడానికి సమగ్ర భూ సర్వేను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మూడుచింతలపల్లిలో జరిగిన ధరణి ప్రారంభోత్సవ సభలో ప్రకటించారు. దీంతో మన రాష్ట్రం కూడా టైటిల్ గ్యారంటీ చట్టం వైపు అడుగులేస్తుందని చెప్పవచ్చు. -
గ్రామాల్లోనే కొనుగోళ్లు
-
పండించిన ప్రతి గింజనూ కొంటం
సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణలో ప్రస్తుతం 50 లక్షల ఎకరాల పైచిలుకు పంటలున్నయి. 40 లక్షల ఎకరాల వరి, 14.50 లక్షల టన్నుల దిగుబడినిచ్చే మొక్కజొన్న పంటలున్నయి. యాసంగిలో ఇది రికార్డు. ఒక గింజ కూడా రైతులు బయట అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అంతా ప్రభుత్వమే కొంటది. ప్రస్తుతం మొక్క జొన్నకు ధరలేదు. బయట అమ్ముకుంటే నష్టపోతారు. దాని దృష్ట్యా ప్రభుత్వమే కొనాలని నిర్ణయించింది. క్వింటాల్ మక్కలకు రూ. 1,200 కూడా కొన్ని చోట్ల ఇస్తలేరు. రూ. 800 అని కొన్నిచోట్ల అంటున్నరు. వరి, మొక్కజొన్న ప్రతి గింజనూ ప్రభుత్వమే 100 శాతం కొంటుంది’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రైతులకు హామీ ఇచ్చారు. వరి, మక్కల కొనుగోళ్లపై ఆదివారం ప్రగతి భవన్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియంత్రిత విధానంలో కూపన్లలో ఇచ్చిన తేదీ రోజుల్లోనే రైతులు ధాన్యం, మక్కలను తీసుకురావాలి. లేకుంటే కొనరు.. వెనక్కి పంపిస్తారు. రవాణా డబ్బులు మీద పడుతాయి అని రైతులను హెచ్చరించారు. ఇతర వివరాలు ఆయన మాటల్లోనే.. హార్వెస్టర్ల మెకానిక్‌లకు అనుమతి... వరి పంట కోతకు మన రాష్ట్రంలో 5 వేల హార్వెస్టర్లున్నయి. తమిళనాడు నుంచి 500–1,500 వరకు వస్తున్నాయి. ట్రాక్టర్ ఆధారిత హార్వేస్టర్లు మనవి. ఒకటే ట్రాక్టర్‌ను రైతులు అనేక పనులకు వాడుతున్నరు. హార్వెసర్లన్నీ ట్రాక్టర్ల నుంచి దించి ఉన్నయి. రైతులు ఎవరికి వారు ఎక్కించుకోలేరు. పట్టణాల్లో ఉన్న హార్వెస్టర్ టెక్నిషియన్లకు ప్రత్యేక పాసులు ఇచ్చి గ్రామాలకు అనుమతించాలని ఆదేశించినం. హార్వెస్టర్ల స్పేర్‌పార్ట్స్ కోసం షాపులు తెరిపించి ఇప్పించాలని, స్థానికంగా లభించకపోతే హైదరాబాద్‌లోని పరిశ్రమలు, డీలర్లను సంప్రదించేందుకు సీఎస్‌కు ఫోన్ చేసి చెప్పండి. బిహార్ నుంచి హమాలీలను .. రైస్ మిల్లుల్లో పనిచేసే హమాలీల్లో 95 శాతం బిహార్వాళ్లే. హోలీ పండుగకు బిహార్ వెళ్లిన వారు అక్కడే ఉన్నరు. పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరించి కస్టమైజ్డ్ మిల్లింగ్ కోసం మిల్లులకు పంపిస్తది. ఆ మిల్లుల నుంచి బియ్యం ఎఫ్‌సీఐ గోదాములకు వెళ్లాలి. ఈ పనిచేసేటోళ్లు బిహార్ హమాలీలు. వారిని రప్పిస్తున్నాం. అవసరమైతే ప్రత్యేక ట్రైన్స్ పెట్టించి వారిని రప్పిస్తం. నేడు రైస్ మిల్లర్లతో సమావేశం.. రైస్ మిల్లర్లు, వ్యాపారస్తులు కొంటామంటే వారిని గ్రామాలకు రానీయాలి. వారు కచ్చితంగా కనీస మద్దతు ధర చెల్లించాలి. సోమవారం ఉదయం 11.30 రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌కి చెందిన ఆరుగురు ప్రతినిధులతో సమావేశమై చర్చిస్తా. కంచెలు తొలగించాలి గ్రామాలకు బయటి వారు రాకుండా ముళ్ల కంచెలు, రాళ్ల గోడవు పెట్టారు. కరోనా వరకు మంచిదే. రైతులు వడ్లు అమ్ముకోవాలి. హమాలీ వాళ్లు రావాలి. కూపన్లు ఇచ్చే అధికారి రావాలి. వారిని అనుమతించే విష యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతు సమితి సభ్యులు సమన్వయం చేసుకోవాలి. వారి కోసం కంచెలను తొలగించాలి. తెల్లకార్డుదారులకు ఒకట్రెండు రోజుల్లో బియ్యం, రూ. 1,500 పంపిణీ ప్రారంభమవుతుంది. బియ్యం వాహనాన్ని గ్రామాల్లో రానివ్వాలి. మీ ఊర్లకు నిత్యవసర సరులకు రానీయండి. గంగాళం, శానిటైజర్, సబ్బులు పెట్టి వచ్చిపోయే వారు కాళ్లు చేతులు కడుక్కోవాలనే నిబంధన పెట్టండి. రోడ్లు మూసేయొద్దు. ధాన్యం, మక్కల కొనుగోళ్లకు రూ. 30 వేల కోట్లు.. ధాన్యం కొనడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లు లేవు. ప్రభుత్వ రెవెన్యూ పడిపోయింది. ఇంత కఠిన పరిస్థితిలో కూడా ధాన్యం సేకరణ కోసం సివిల్ సప్లైస్ కార్పొ రేషన్‌కు రూ. 25 వేల కోట్లు సమీకరిం చినం. కార్పొరేషన్‌కు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సమీకరించడం చరిత్రలో ఇదే తొలిసారి. ఉమ్మడి ఏపీలోనూ ఇన్ని డబ్బు లు ఎన్నడూ ఇవ్వలేదు. మక్కల కొనుగోళ్ల కోసం మార్క్‌ఫెడ్‌కు రూ. 3,200 కోట్లు కలిపి రైతుల కోసం సుమారు రూ. 30 వేల కోట్లను ప్రభుత్వం సమీకరించింది. ఏ రాష్ట్రంలోనూ ఇన్ని ఏర్పాట్లు లేవు. ప్రతి గింజా కొంటామనిది డైలాగ్ కాదు. ప్రతి కిలో వరి, మక్కలను కొంటామని సీఎంగా చెబుతున్న. ఒక కోటీ 5 లక్షల టన్నుల వరి వచ్చే అవకాశముంది. ఒక్క కేజీ మిగల కుండా ప్రభుత్వమే కొంటది. ఆన్లైన్లో డబ్బులు వేస్తది. రైతులకు ఆందోళన వద్దు. 2, 3 రోజుల్లో జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు సమన్వయం చేసుకుని కూపన్లు ఇస్తరు. రైతులు వచ్చేటప్పుడు ఖాతా నంబర్, పాస్‌బుక్ తీసుకుని రావాలి. -
ఐదేళ్లా.. ఐదు నెలలా..?
సాక్షి, శ్రీకాకుళం: లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం.. సావిత్రి కోసం ఎన్టీఓడు పాడుతుంటే.. ఉలిక్కి పడి లేచాడు సర్వేశ్వరరావు.. సమయం ఉదయం ఐదున్నర. ప్రచారానికి ఇంకా సమయం ఉంది. ఆ లోపు తానే సొంతంగా కొంతమందినైనా కలుద్దామని అప్పటికప్పుడే అనుకుని కాస్తంత ఫ్రెష్ అయ్యి వీధిలో పడ్డాడు. మహిళామణుల ఊసులు వినలేకేమో కుళాయి బలహీనంగా ఏడుస్తోంది.. బిందె నిండడానికి అధమపక్షం అరగంటైనా పట్టేట్టు ఉంది. సరిగ్గా సర్వేశ్వరరావు అక్కడికే వెళ్లారు. ఏంటమ్మా.. నీరు అవీ బాగా వస్తున్నాయా.. ఇబ్బందులేమీ లేవు కదా.. మైక్ లేదు కాబట్టి చాలా క్యాజువల్‌గా మాట్లాడాడు. మందీమార్బలం లేని ఎమ్మెల్యేను చూసి గుర్తు పట్టలేకపోయిన మహిళలు. కొద్దిసేపటికే తెలివి తెచ్చుకున్నారు. అంతే.. అందరూ చుట్టూ చేరిపోయారు. బాబూ.. ఐదేళ్ల ముందు ఇక్కడే జీపుపై నుంచుని ట్యాంకు గురించి హామీలిచ్చారు. గుర్తుందా.. మహిళల మొదటి ప్రశ్న. ఇచ్చామా.. ఇచ్చే ఉంటాం. శతకోటిలో ఇదొకటి అని సర్వేశు మనసులో అనుకుని, అవునమ్మా ట్యాంకుతో మీ కష్టాలన్నీ తీరాయి కదా అన్నాడు గర్వంగా. ‘మా మేడెక్కి ఈ చుట్టుపక్కల ఒక్క ట్యాంకు ఉన్నట్టు చూపిస్తే.. మా ఓట్లన్నీ మీకే’ అని వత్సల గబుక్కున అనేసింది. సర్వేశుకు పరిస్థితి అర్థమైపోయింది. గత సారి ఏదో అలా అయిపోయిందమ్మా.. ఈసారి అలా కాదు. చూడండి, ఓట్లు మాత్రం నాకే వెయ్యాలి అని గుంపులో నుంచి బయటపడ్డానికి ప్రయత్నించాడు. ‘జీపుపై ఉన్నప్పుడు వంద మాటలు చెబుతా రు.. ఇలా నేల మీద నించున్నప్పుడు మాత్రం ఒక్కరితో మాట్లాడలేరు. మీకెందుకు ఓటు’ అని భాగ్యవతి మొహమ్మీదే అనేయడంతో ఏమీ అనలేక సర్వేశు మెల్లగా జారుకున్నాడు. వెనుక మంది లేకుండా ఇలా గుంపులోకి అదీ ఆడవాళ్ల దగ్గరికి వెళ్లకూడదని సర్వేశుకు జ్ఞానోదయమైంది. అలా నడుస్తూ నడుస్తూ ఓ గుడిసె దగ్గర ఆగాడు. ఇంటి బయట కల్లాపి చల్లుతున్న పద్మ సర్వేశును చూసి కాసింత ఆశ్చర్యపోయింది. ఆమె హావభావాలు గమనించిన సర్వేశు ఈమేదో అమాయకురాలిలా ఉందనుకుని అటువైపే అడుగులు వేశారు. ఏమ్మా.. ఇల్లు లేదా ఇంకా గుడిసెలోనే ఉన్నారు.. నిమ్మళంగా అడిగాడు. ఇల్లు మంజూరైందయ్యా.. మీ వెనుక తిరిగే వారున్నారు కదా.. ఏదో కమిటీ అట.. ఐదు వేలు ఇస్తేనే నీకు ఇల్లు ఇస్తామని సెప్పారు. అంత డబ్బు కట్టనేక ఇలా గుడిసె నీడన బతకతన్నాం బాబూ అంది పద్మ. అమ్మా.. ఐదు తీసుకుంటున్నారా.. నాకు రెండున్నరే ఇస్తున్నారు అని లోలోపలే అనుకున్న సర్వేశు ఈమెతో మాట్లాడితే బండారం బయటపడుతుందని భయపడి ‘నాకు ఓటెయ్యమ్మా.. ఈసారి ఇల్లు గ్యారెంటీ’ అని వేగంగా నడిచాడు. మైదానం నుంచి ఓ కుర్రమూక అటుగా వచ్చి సర్వేశు మాటలు విని ఆయన చుట్టూ చేరిపోయారు. చచ్చానురా.. బాబోయ్.. అనుకున్నాడు సర్వేశు. ఎమ్మెల్యే గారూ.. ఇన్నాళ్లకు దొరికారు అన్న భరత్.. ఐదేళ్ల కిందట ఎమ్మెల్యే చెప్పిన మాటలన్నీ ఒక్కసారి ఏకరువు పెట్టాడు. ఇవన్నీ ఏమయ్యాయండీ అని అంతా మూకుమ్మడిగా అడిగేసరికి సర్వేశు గుటకలు మింగి ఏదో చెబుదామని ప్రయత్నించాడు. ఐదు నెలలుగా డబ్బులు ఇస్తున్నాం కదయ్యా.. చాలడం లేదా ఇంకా అని భయపడుతూనే అన్నాడు సర్వేశు. డబ్బులిస్తే.. ఉద్యోగాలు ఇవ్వలేదనే విషయం మర్చిపోతామా.. నాలుగు నెలలు కాసిన్ని డబ్బులు విదిలిస్తే నాలుగేళ్లు మీ అరాచకాలు మర్చిపోతామా..? అసలు మీరెప్పుడైనా కారు దిగి ఇటుగా నడిచారా.. కాలువ ఉందో లేదో చూశారా.. ఇక్కడి మనుషులు ఎలా బతుకుతున్నారో గమనించారా.. అంటూ అభ్యుదయవాదైన నారాయణమూర్తి ఆవేశంగా ప్రశ్నిస్తున్నాడు. సర్వేశుకు అంతా అర్థమైపోయింది. ఐదు నెలల కాలక్షేపం ఐదేళ్ల పాలన ఒక్కటి కాదని అర్థమైంది. జనం తాను అనుకున్నంత అమాయకులు కాదని తెలిసింది. ప్రశ్నించడం కూడా చేతనవుతుందని జ్ఞానోదయమైంది.. అన్నింటి కంటే ఒక్కటి మాత్రం బాగా తెలిసింది. చుట్టూ మంది లేకుండా ఒంటరిగా జనం దగ్గరకు వెళ్లకూడదని స్పష్టంగా తెలిసింది. అంతే.. ఓటు అడగడం కూడా మర్చిపోయి ఇంటి వైపు పరుగు లాంటి నడక అందుకున్నాడు. -
స్మార్ట్ సిటీ ఏదీ బాబు ?
సాక్షి, శ్రీకాకుళం : ‘రాజాం పట్టణాన్ని స్మార్ట్‌సిటీగా మారుస్తాం. పట్టణంలో నివాసముంటున్న ఇల్లులేని పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తాం. ఏడాది లోగా ప్రతి ఒక్క అర్హుడికి ఇల్లు ఇస్తాం. ఈ స్మార్ట్ సిటీ ఎలా ఉంటుందంటే ఈ భవనాలపై హెలికాప్టర్ కూడా అవలీలగా దిగుతుంది.’ 2017 జనవరి–6వ తేదీన రాజాంలోని జన్మభూమి మా ఊరులో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది. ఇలా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన స్మార్ట్ సిటీ హామీ లబ్ధిదారులను ఊహాలోకంలో విహరించేలా చేసింది. రాజాం పట్టణంలో సొంతింటి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇప్పటికీ ఇల్లు నిర్మించి అధికారులు ఇవ్వలేదు. రాజాం పట్టణ కేంద్రంలో ఇల్లు వస్తుందనుకుంటే పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో నిర్మాణాలు ప్రారంభించారు. అక్కడ ఫ్లాట్ల నిర్మాణం కూడా నత్తనడకన సాగుతుండడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 నెలల క్రితం స్మార్ట్ సిటీలో ఫ్లాట్ల నిమిత్తం డీడీలు తీసి లబ్ధిదారులు దరఖాస్తు పెట్టుకున్నారు. వీటికి సంబంధించి లబ్ధిదారులకు తొలివిడత ఫ్లాట్స్ కేటాయింపు మూడునెలల క్రితం చేపట్టారు. మొత్తం 893 మంది లబ్ధిదారులు తొలివిడతలో డీడీలు తీయగా, వారిలో 90 మందికి లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయించారు. అయితే వారికి ఇంతవరకూ ఫ్లాట్లు అప్పగించలేదు. మొత్తం 1104 ఫ్లాట్లు నిర్మించాల్సి ఉంది. ఇంతవరకూ ఒక్కటి కూడా పూర్తికాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నత్తనడకన నిర్మాణాలు ఈ ఫ్లాట్ల నిమిత్తం సింగిల్ బెడ్ రూమ్‌కు ముందుగా రూ.500, డబుల్ బెడ్రూంతో పాటు పెద్ద సైజు సింగిల్ బెడ్ రూం నిమిత్తం ముందస్తుగా లబ్ధిదారుడు రూ.50 వేలు నుంచి రూ.ఒక లక్ష డీడీలు తీసి నగరపంచాయతీకి చెల్లించారు. వీరికి ప్రభుత్వం నుంచి రూ.3 లక్షలు రాయితీ వస్తుండగా, మరో రూ.3 లక్షలు బ్యాంకు లోన్ కూడా మంజూరు చేశారు. ఈమొత్తం నిధులను టెండర్ల రూపంలో ఫ్లాట్ల నిర్మాణానికి టెండర్ పిలవగా విశాఖపట్నానికి చెందిన ఓ సంస్థ ఆ టెండర్‌ను దక్కించుకుంది. పనులు మాత్రం సకాలంలో పూర్తీచేయకపోవడంతో పలువురు లబ్ధిదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీనే ఇలా ఉంటే సాధారణ నాయకులు ఇచ్చే హామీ పరిస్థితి ఏమిటని? నమ్మించి మోసం చేసిన ప్రభుత్వానికి ఇప్పుడెలా ఓటు వేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
‘ఆసిఫ్‌నగర్’ ఆందోళన తాత్కాలిక విరమణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా ఆసిఫ్‌నగర్ మండల కార్యాలయ సిబ్బందిపై కొందరు దుండగులు చేసిన దాడికి నిరసనగా గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆందోళనలను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీఆర్ఎస్ఏ) ప్రకటించింది. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇచ్చిన హామీ మేరకు ఆందోళనలను విరమించుకుంటున్నామని టీఆర్ఎస్ఏ అధ్యక్షుడు మఠం శివశంకర్ తెలిపారు. మహమూద్ అలీతో పాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ సమక్షంలో మంగళవారం టీజీటీఏ, వీఆర్వో, వీఆర్ఏ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. దాడి ఘటన నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి వారంలోగా జిల్లా కలెక్టర్‌తో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పినట్లు శివశంకర్ తెలిపారు. దాడికి పాల్పడ్డ దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. సమావేశంలో టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, అధ్యక్షుడు కె.గౌతంకుమార్, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు జి.సతీశ్, వీఆర్ఏల అధ్యక్షుడు వి.ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
దీర్ఘాయుష్మాన్ భవ!
మనిషి ఎన్నాళ్లు బతుకుతాడో గ్యారంటీ ఏమీ లేదు. అయినా సరే, ప్రతి ఒక్కరూ వీలయినంత ఎక్కువకాలం జీవించాలని కోరుకుంటారు. పెద్దలు కూడా దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తారు. అంతవరకూ బాగానేఉంది కానీ, అసలు ఏం చేస్తే మనం ఎక్కువకాలం జీవించగలమో... మన జీవిత ప్రయాణం ఒడుదొడుకులు లేకుండా హ్యాపీగా సాఫీగా ఎలా సాగుతుందో చెప్పే చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో చూద్దాం... మనిషి తన కాళ్ల మీద తాను నిలబడేలా చేసేది డి విటమిన్. అది సమృద్ధిగా లభించేది సూర్మరశ్మిలోనే. అందుకే పొద్దునా, సాయంత్రం ఎప్పుడు వీలయితే అప్పుడు ఒంటికి సూర్యరశ్మి తగిలేలా తిరిగితే సరి. కంటినిండా నిద్ర పోండి రోజుకు కనీసం 6గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలి. అదీ రాత్రి నిద్ర. నిద్ర తక్కువైతే అనారోగ్య సమస్యలు తథ్యం. కాబట్టి కంటినిండా నిద్రపోతే సరి.. ఆయుష్షు అదే పెరుగుతుంది. పండ్లు తినండి రోజూ ఏదో ఒక పండు తినటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల రుతువుల వారీగా దొరికే పండ్లు తినడం చాలా మంచిది. నొప్పి నివారణ మాత్రలు తగ్గించండి తలనొప్పి, ఒళ్లు నొప్పులు... వెన్ను నొప్పి...వంటి వాటికి సొంత పరిజ్ఞానంతో పెయిన్ కిల్లర్స్ వాడటం అలవాటు చాలామందికి. అయితే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల హార్ట్ ఎటాక్ వంటి ముప్పు పెరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి, పెయిన్ కిల్లర్స్‌కు దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు. పెళ్లి చేసుకోండి... ఒక స్టడీ ప్రకారం పెళ్లి చేసుకున్న స్త్రీలు లేదా పురుషులు అవివాహితులకన్నా 46 శాతం అధికంగా హృద్రోగానికి దూరంగా ఉంటారట. పెళ్లికాని వారితో పోల్చితే వివాహితులలో కార్డియో వాస్కులర్ డిసీజెస్ వచ్చే ముప్పు తక్కువగా ఉంటుందట. సో... పెళ్లి చేసుకోవాల్సిందే మరి! నిల్వ వద్దు... తాజానే ముద్దు నిల్వ ఉంచిన పండ్లు, కూరగాయలలో పోషక విలువలు తగ్గిపోతాయట. అందువల్ల తాజా పండ్లు, కూరగాయలే మంచిదంటున్నారు పరిశోధకులు. చక్కెర తగ్గించండి చక్కెర ఎక్కువ వాడటమంటే కొలెస్ట్రాల్ ముప్పును పెంచుకున్నట్టే. సో... తీపి కోసం చక్కెర బదులు బెల్లం లేదా తేనె వాడటం మంచిది. కొంచెం కారంగా... పచ్చి లేదా పండుమిర్చిలో ఆయుష్షును పెంచే కారకాలేవో ఉన్నాయట. కారం ప్రభావాన్ని తగ్గించడానికి మెదడు ఎండార్ఫిన్లను ఎక్కువగా విడుదల చేస్తుందట. ఎండార్ఫిన్ల వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయట. అందువల్ల కారం తినండి. మంచి కాఫీ... మంచి ఆరోగ్యం రోజుకు మూడు నుంచి నాలుగు కప్పుల వరకు కాఫీ తాగడం వల్ల బీపీ, షుగర్, గుండెజబ్బులు వచ్చే ముప్పు తప్పు తగ్గుతుందట. మీరు కాఫీ ప్రియులయితే ఇంకేం... ఇంచక్కా తాగేయండి స్ట్రాంగ్ కాఫీ. గింజలు తినండి గింజ ధాన్యాలు తినడం ఆరోగ్యానికి మంచిది. హార్వార్డ్ యూనివర్శిటీ స్టడీ ప్రకారం రోజూ గింజధాన్యాలు తినేవారిలో ముఖ్యంగా పొట్టు తీయని ధాన్యం, బ్రౌన్ రైస్ వంటివి తినేవారికి, అవి తినని వారితో పోల్చితే ఆరోగ్య సమస్యలు తక్కువగా వస్తాయట. గో గ్రీన్ ఇందాక కాఫీ తాగమన్నాం కదా అని టీ ప్రియులు బాధపడకండి... అయితే మామూలు మిల్క్ టీ కాదు... గ్రీన్ టీ! అవును, గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. అందుకే ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటిస్, హృద్రోగ సమస్యలు రాకూడదనుకునేవారు రెగ్యులర్‌గా గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధ్యయుగంలోకి వెళ్లిపొండి ఇదేం కిరికిరి... మధ్యయుగంలోకి వెళ్లడమెలా అనుకుంటున్నారా? ఉద్దేశ్యం అది కాదు... మధ్యయుగం వాళ్లలా వీలయినంతగా పచ్చి కూరలు తినడం మంచిదట. వాటితోపాటు చేపలు, ఆలివ్ ఆయిల్, గుడ్లు తినడం హెల్దీ అట. ఆరోగ్యానికి హోల్ మిల్క్ ఏ కాడికీ వెన్న తీసిన పాలు, స్కిమ్డ్ మిల్క్ తాగమని చెప్పిన వారే కానీ, ఇలా హోల్ మిల్క్ తాగమని ఎవరూ చెప్పలేదే అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడే ఉంది కిటుకు... (ప్రత్యేకమైన ఆరోగ్య కారణాలుంటే తప్ప) వెన్న, నెయ్యి వంటివి ఆరోగ్యానికి మంచిదేనట. హోల్ మిల్క్ తాగేవారిలో ఆరోగ్య సమస్యలు ఇతరులకన్నా యాభైశాతం తక్కువగా తలెత్తుతాయని అధ్యయనాల్లో తేలిందట. తగినన్ని నీళ్లు తాగండి ఇది మొదటినుంచి వింటున్నదేననుకోండి... బాడీలో తగినన్ని ద్రవపదార్థాలు ఉంటే కోలోన్ క్యాన్సర్ ముప్పు తప్పుతుందట, అలాగే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయట. అందుకే వీలయినన్ని ఎక్కువ గ్లాసులు నీరు తాగండి. ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు పరిశోధకులు. రాత్రి భోజనాన్ని తొమ్మిదికల్లా ముగించెయ్యండి రాత్రి తొమ్మిది దాటాక ఫుడ్ తినకుండా ఉండటం మంచిదట. బాగా పొద్దుపోయాక పడుకోబోయే ముందు తినడం, తిన్న వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదట. అందువల్ల వీలయినంత వరకు రాత్రి తొమ్మిదిలోగానే భోజనం ముగించెయ్యడం మంచిది మరి! ముందే చేతులు కడిగేసుకోండి భోజనానికి ముందే కాదు... కడుపు నిండక ముందే చేతులు కడుక్కోవాలి మరి! అంటే పొట్ట నిండేదాకా తినకూడదని దీని అర్థం. ఫుల్లుగా తినేబదులు కడుపులో ఇంకా 20 శాతం ఖాళీ ఉండేలా చూసుకుని తిండి ముగించెయ్యడం వల్ల బీపీ, కొలెస్టరాల్, షుగర్ వంటి ముప్పు నుంచి తప్పించుకోవచ్చట. నచ్చినట్లు చెయ్యండి మనసుకు ఇష్టమైన పనులు చేయడం ఆరోగ్యానికి మంచిదట. మంచి మ్యూజిక్ వినడం, వాకింగ్, పెయింటింగ్, సింగింగ్, డ్యాన్సింగ్ వంటి వాటివల్ల ఆయుష్షు పెరుగుతుందట. ఇంకా... మంచి పుస్తకాలు చదవడం, ఫన్నీ వీడియోలు చూడటం, పదిమందితోనూ హాయిగా కలిసిపోవడం, మనవళ్లు, మనవరాళ్లతో ఉల్లాసంగా గడపటం, పెంపుడు జంతువులతో ఎంగేజ్ అవడం, వర్క్‌లో బిజీ అవడం వంటివి ఆయుష్షును పొడిగించేలా చేస్తాయట. వీలయినన్ని ఫాలో అవండి... దీర్ఘాయుష్మంతులు కండి. -
తెలంగాణ వచ్చినా బతుకులు మారలేదు
♦ ఏ ఒక్క హోంగార్డు ఆనందంగా లేడు ♦ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా పరిస్థితి బాగుపడలేదు ♦ సూసైడ్ నోట్లో హోంగార్డు శివకుమార్ ఆవేదన (కామారెడ్డి ) ఎల్లారెడ్డి : ‘తెలంగాణ రాష్ట్రం వచ్చినంక కూడా బతుకులు బాగు పడలేదు.. చాలీచాలని జీతాలతో రాష్ట్రంలోని ఏ ఒక్క హోంగార్డు కూడా ఆనందంగా లేడు. వేతనాలు పెంచి పర్మినెంట్ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా మా పరిస్థితి బాగుపడలేదని’ పేర్కొంటూ ఓ హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎల్లారెడ్డిలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. వివరాలు.. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన జంగం శివకుమార్ (32) భిక్కనూర్ పోలీసుస్టేషన్లో హోం గార్డుగా పని చేస్తున్నాడస్పాయనకు భార్య పవిత్ర, కూతురు మనస్విని ఉన్నారు. తల్లికి ఆరోగ్యం బాగా లేదని తెలిసి ఆదివారం సాయంత్రం ఎల్లారెడ్డికి వచ్చిన శివకుమార్.. సోమవారం ఉదయం వరకు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాడు. బతుకమ్మ చీరలను తెచ్చుకోవాలని ఉదయం 10 గంటల సమయంలో తల్లి వీరమణి, వదిన నవనీతలను గ్రామపంచాయతీ కార్యాలయానికి ఆటోలో పంపించాడు. అనంతరం, ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అంత్యక్రియలకు రానున్న కిషన్‌రెడ్డి హోంగార్డ్ శివకుమార్ అంత్యక్రియలకు రాష్ట్ర హోంగార్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి హాజరు కానున్నట్లు ఆ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి తెలిపారు. శివకుమార్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. టీఆర్ఎస్ హయాం లో హోంగార్డుల పరిస్థితి ఘోరంగా తయారైందని, హోంగార్డులను పర్మినెంట్ చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ నీటి మూటగానే మిగిలిం దని విమర్శించారు. శివకుమార్ కుటుంబానికి రూ.10లక్షలతో పాటు ఆయన భార్యకు రెవెన్యూ శాఖలో పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శివకుమార్ కుటుంబాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఒడ్డెపల్లి సుభాష్‌రెడ్డి పరామర్శించారు. వేతనాలు చాలక ఆర్థిక ఇబ్బందులతో శివకుమార్ లాంటి వారెందరో నానా బాధలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్న శివకుమార్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోంగార్డ్ శివకుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి నల్లమడుగు సురేందర్ డిమాండ్ చేశారు. భిక్కనూరులో విషాదం భిక్కనూరు(కామారెడ్డి) : హోంగార్డు శివకుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో భిక్కనూరు మండలంలో విషాదం నెలకొంది. అందరితో కలగొలుపుగా ఉండే శివ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న పలువురు గ్రామస్తులు, పోలీసులు, వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సూసైడ్ నోట్ (ఇన్సెట్లో) శివకుమార్ (ఫైల్) సొమ్మసిల్లి పడిపోయిన భార్య పవిత్ర ఎవరూ ఆనందం లేరూ.. ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు శివకుమార్ సూసైడ్ నోట్ రాశాడు. తాను చావడానికి ఆర్థిక పరిస్థితులు.. ఎదుగూ బొదుగూ లేని హోంగార్డ్ ఉద్యోగమే కారణమని అందులో పేర్కొన్నాడు. చాలీచాలని జీతాలతో రాష్ట్రంలో ఏ ఒక్క హోంగార్డ్ కూడా ఆనందంగా లేడని, సీఎం కేసీఆర్ శాసనసభలో హోంగార్డ్‌ల వేతనాలను పెంచి ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చినా తమ పరిస్థితి బాగు పడలేదంటూ సూసైడ్ నోట్లో రాసి తన స్నేహితులకు, తోటి హోంగార్డ్‌లకు వాట్సప్‌లో పంపించాడు. శివ పంపిన వాట్సప్ మెస్సేజ్ చూసిన స్నేహితులు అతని తమ్ముడు శంభుకు సమాచారం అందించి, ఇంటికి వెళ్లి చూడమని తెలిపారు. శంభు ఇంటికి వచ్చే సరికే శివ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. హోం గార్డుల ఆందోళన శివ ఆత్మహత్య విషయం తెలిసిన తోటి హోం గార్డ్లు, కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఎల్లారెడ్డికి చేరుకున్నారు. సరైన వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న హోంగార్డ్‌ల సమస్యలను శివకుమార్ ఆత్మహత్య చూసైనా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హోంగార్డ్లు నిరసన తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నల్లమడుగు సురేందర్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు హోంగార్డ్‌లతో కలిసి ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఐ సుధాకర్ జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డికి సమాచారం అందించారు. ఆమె కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి శివకుమార్ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి కూడా ఫోన్లో హామీ ఇచ్చారు. అయితే, స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు, తమ యూనియన్ నాయకులు వచ్చే వరకు శవాన్ని తరలించేది లేదంటూ హోంగార్డ్లు, కాంగ్రెస్ నాయకులు ఆందోళన కొనసాగించారు. సీఐ సుధాకర్, స్థానిక టీఆర్ఎస్ నేతలు కుటుంబ సభ్యులతో మాట్లాడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఉదయం వరకు తమతో సరదాగా గడిపిన తమ కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు వీరమణి, సంగప్ప బోరున విలపించారు. -
విభజన హామీల సాధన కోసం కలిసి పోరాడాలి
వేసవి తరువాత ప్రత్యేక కార్యాచరణ విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని తాళ్లరేవు (ముమ్మిడివరం) : కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయాలంటే అన్ని పక్షాలు కలిసి పోరాడాలని విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీలోని బాపనపల్లిలో పేరిచర్ల రాజగోపాల్‌రాజు ఫార్మ్‌హౌస్‌ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రం పట్ల పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుందన్నారు. ఉత్తరాదిలో ఓ రాష్ట్రానికి రూ.43వేల కోట్లు ఇచ్చి, మన రాష్ట్రానికి మాత్రం రూ.2500 కోట్లు ముష్టి వేశారన్నారు. ఏపీలో జిల్లాకు 50 కోట్లు ఇచ్చి చట్టబద్ధత తీసుకొచ్చాం పండగ చేసుకోండి అనడం ఎంతవరకు న్యాయమన్నారు. తెలంగాణాలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలకు ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున ఇచ్చారని, అయితే ఆంధ్రాలో కేవలం రాయలసీమలో 4, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు ఇచ్చారన్నారు. ఇక కేంద్రం రాష్ట్రానికి చేసిందేంటని ప్రశ్నించారు. పోలవరంపై సరైన స్పష్టత లేదని, పోలవరం ప్రాజెక్టుకు రూ.ఏడు వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా, రూ.1900 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కీం నుంచి ఇచ్చామంటున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నింటికీ కేంద్రమే నిధులు ఇవ్వాలన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.7500 కోట్లు హడ్కో ద్వారా అప్పు ఇప్పిస్తామని కేంద్రం చెబుతోందని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అప్పులతో కట్టాల్సిన పరిస్థితి ఏంటన్నారు. హైదరాబాద్ నుంచి రావాల్సిన ఉమ్మడి నిధులు సుమారు రూ.32 వేల కోట్లు రావాలని అంటున్నారని అయితే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. దీనిపై ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. నాగార్జున సాగర్‌నుంచి నీళ్లు రావాలంటే తెలంగాణా ప్రభుత్వం విడుదల చేయాలి. దానిని సెంట్రల్ కమిటీకి అప్పగించమంటే దానిపై స్పందించడం లేదన్నారు. 2018లోపు మన రాష్ట్రంలో పోర్టును అభివృద్ధి చేయాలని విభజన చట్టంలో ఉంటే ఒక్క రూపాయి ఇవ్వకపోగా, రూ.25 వేల కోట్లతో తమిళనాడులో మూడో పోర్టు కొల్లేచల్కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడం దారుణమన్నారు. విభజన చట్టం 108వ అధికరణం ప్రకారం రాష్ట్రపతికి ఉన్న అధికారాలు జూన్ 1తో అయ్యిపోతున్నా, ఏ ఒక్కరూ స్పందించడం లేదన్నారు. తెలుగువాళ్ల మధ్య ఐక్యత లేకపోవడంతో రాష్ట్రం అన్ని రంగాలలో వెనక్కిపోతుందన్నారు. ఇప్పటికైనా ఎంపీలు భయం వదిలి పోరాడితే విభజన చట్టంలో ఉన్న హామీలు అన్నీ నెరవేరతాయన్నారు. ప్రత్యేక హోదాపై భవిష్యత్ కార్యాచరణ చేస్తున్నామని, దీనిలో భాగంగా పలు గీతాలు, పుస్తకాల ద్వారా చైతన్యం చేస్తామన్నారు. -
హామీలను అమలు చేయాలి
మోత్కూరు సీఎం కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌మాదిగ, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపెల్లి శ్రీనివాస్‌మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్యమాదిగ డిమాండ్ చేశారు. మాదిగ చైతన్య పాదయాత్ర మంగళవారం మోత్కూరు మండల కేంద్రానికి చేరుకుంది. హైస్కూల్ చౌరస్తా వద్ద బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలువేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా టీఎమ్మార్పీఎస్ జెండాను యాతాకుల భాస్కర్ మాదిగ ఎగరవేశారు. అనంతరం దళితులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ నవంబర్ 19వ తేదీలోపు దళితులకు ఇచ్చిన హామీలు అమలుచేయకుంటే హైదరాబాద్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు సుంకపాక దేవయ్యమాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్యమాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు కూరెళ్ల ఎల్లయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జీ దాసరి ప్రవీణ్, మండల అధ్యక్షుడు బాలెంల పరుశరాములు, నాయకులు దళిత యువసేన రాష్ట్ర కార్యదర్శి అలెగ్జండర్, నాయకులు కుప్పల రమేష్, దాసు,నరేష్,నవీన్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.