డీఎస్సీలో ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
విశాఖపట్నం (గోపాలపట్నం): డీఎస్సీలో ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని చెప్పారు. నరవలోని జామియా ఇస్తామియా అషఫ్రుల్ ఉలూం మదర్‌సాలో రూ.1.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంలో ఉన్న ముస్లింల పిల్లలను విద్యావేత్తలుగా తీర్చిదిద్దుతున్న మదర్‌సా ప్రతినిధులను అభినందించారు.
విశాఖలో ముస్లిం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ముస్లింల విద్యాలయాలు, మసీదుల సమస్యల పరిష్కారానికి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 10312 టీచర్ పోస్టు భర్తీకి నోటి ఫికేషన్ జారీ చేసినట్టు తెలిపారు. ఎంపీ ముత్తంశెట్టి మాట్లాడుతూ ఇక్కడ సైన్సుల్యాబ్ ఏర్పాటుకు రూ.3 లక్షలు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ఇక్కడి ముస్లిం బోధకులకు మదీనాబాగ్‌లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో ఇళ్లు కేటాయిస్తామన్నారు.