పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కిషన్‌రెడ్డి
అభిప్రాయ సేకరణ జరపనున్న బీజేపీ
‘వికసిత్ భారత్ మోదీ కీ గ్యారంటీ’ ప్రారంభించిన కిషన్‌రెడ్డి
‘మరోసారి మన మోదీ సర్కార్’ పోస్టర్ విడుదల
డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వికసిత్ భారత్ సంకల్ప పత్రం పేరిట ప్రజల నుంచి సలహాలు, సూచనల స్వీకరణకు బీజేపీ జాతీయ నాయకత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రజల అభిప్రాయాలు తెలుసు కునేలా ’వికసి త్ భారత్ మోదీ కీ గ్యారంటీ’ పేరు తో చేపట్టిన కార్యక్రమాన్ని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రారంభించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఇతర నాయకు లతో కలిసి ‘మరో సారి మన మోదీ సర్కార్ ’ పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. రిమోట్ నొక్కి డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
అభిప్రాయాలు నేరుగా ప్రధానికి..
వివిధ రూపాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని నేరుగా ప్రధాని మోదీకి తెలియజేసేలా ఏర్పాట్లు చేసినట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. వివిధ గ్రూపులతో సమావేశాలు (మిలన్, సంవాద్), ఇంటింటికీ వెళ్లడం,ౖ సోషల్ మీడియా (వాట్సాప్), ప్రచార, ప్రసార (ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా) తదితర రూపాల్లో అభిప్రాయ సేకరణ జరపనున్న ట్టు చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో సూచనల పెట్టె (సజెషన్స్ బాక్సులు) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వివిధ గ్రూపులతో సమా వేశాలకు సంబంధించి.. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో మార్చి 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.
శక్తికి తగ్గట్టుగా విరాళాలివ్వండి
ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు, స్వయం సహాయక బృందాలు, రైతులు, సహకార సంఘాలు, కార్మికులు, జాతీయ అవార్డుల విజేతలు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులు తదితరుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని కిషన్‌రెడ్డి వివ రించారు. కళాకారులు, వ్యాపారులు, ఉద్యోగులు, అన్ని రకాల చేతి వృత్తుల కళాకారులు, సఫాయీ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, పూజా రులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, దళిత సంఘాల నాయకులు, సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు.. ఇలా అన్ని వర్గాల ఇంటింటికీ వెళ్లి అభి ప్రాయాలు సేకరిస్తామన్నారు. ‘ప్రజలతో నడిచే పార్టీ బీజేపీ కోసం ప్రజల శక్తికి తగ్గట్లుగా ఆర్థిక సాయం చేయాలని అన్ని వర్గాల ప్రజలను కోరుతు న్నాం. నమో యాప్ ద్వారానే పార్టీకి ఆర్థిక సాయం చేయాలి..’అని విజ్ఞప్తి చేశారు. ఈ యాప్ ద్వారా తాను స్వయంగా పార్టీకి విరాళం పంపారు.
Comments
Please login to add a commentAdd a comment