ప్రాజెక్టులను పూర్తి చేసి కరువు నివారిస్తా | Completeing the projects and solving problem of drought | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులను పూర్తి చేసి కరువు నివారిస్తా

Published Wed, Aug 19 2015 4:54 AM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM

ప్రాజెక్టులను పూర్తి చేసి కరువు నివారిస్తా - Sakshi

ప్రాజెక్టులను పూర్తి చేసి కరువు నివారిస్తా

- మార్చికల్లా కుప్పానికి హంద్రీ-నీవా నీళ్లు
- సోమశిల-స్వర్ణముఖితో తిరుపతి, శ్రీకాళహస్తి, నగరికి నీళ్లు
- కుప్పం పర్యటనలో చంద్రబాబు
సాక్షి, చిత్తూరు :
వచ్చే మార్చి నాటికి హంద్రీనీవా పనులు పూర్తిచేసి కుప్పానికి తాగునీరు తెస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గంలో తొలిరోజు పర్యటనలో పలు కార్యక్రమాల్లో ఆయన ప్రసంగించారు. హంద్రీ-నీవా పనుల కు  సంబంధించి పది రోజుల్లో టెండ ర్లు పిలవనున్నట్లు తెలిపారు. మార్చి నాటికి పనులు పూర్తిచేసి కుప్పంతో పాటు మదనపల్లె, పుంగనూరు, చిత్తూ రు ప్రాంతాలకు నీళ్లిచ్చి జిల్లాలో కరువును పారదోలతారన్నారు. సోమశిల- స్వర్ణముఖి ద్వారా తిరుపతి, శ్రీకాళహస్తి పట్టణాలకు, కల్యాణిడ్యామ్, బాలాజీ రిజర్వాయర్‌తోపాటు నగరి నియోజకర్గానికి సైతం నీటిని మళ్లిస్తామన్నారు.
 
ముఖ్యమంత్రి పర్యటన సాగిందిలా ...
మంగళవారం ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి హెలిక్యాప్టర్‌లో కుప్పంలోని  కేఈఎస్ మెడికల్ కళాశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి ఆ తరువాత ఆర్టీసీ బస్టాండు సెంటర్‌లో మహిళలు ఏర్పాటు చేసిన పోటేళ్లు, మన కోళ్లు స్టాల్స్‌ను సందర్శించారు.  ఈ సందర్భంగా మహిళలకు దీపం గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. అనంతరం కుప్పం సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి ఆ  తరువాత  కుప్పం శివారులోని అణినిగానిపల్లె గ్రామంలో ఎస్సీ కుటుంబంతో కలిసి భోజనం చేశారు.

గ్రామంలో ఎన్టీఆర్ సుజల పథకం తాగునీటి పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వాణి మహల్‌లో జరిగిన అగ్నికుల క్షత్రియ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఆ తరువాత బీసీఎన్ కన్వెక్షన్ సెంటర్‌లో జరిగిన  టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు సత్యప్రభ, సుగుణమ్మ,జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement