రాజస్తాన్‌లో ఎన్నికల ప్రచారం తుది అంకానికి వచ్చేసింది. గురువారం సాయంత్రంతో ప్రచార ర్యాలీలకు ముగింపు పడుతోంది. ఒకరకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఎన్నికలు క్లైమాక్స్‌కి చేరినట్టే. ఇప్పుడు సర్వత్ర ఏ పార్టీ గెలుస్తుందన్న చర్చే సాగుతుంది. సోషల్ మీడియాలో సైతం దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ఎన్నికల ప్రచార ర్యాలీలో బీజేపీ కాంగ్రెస్‌ని దుమ్మెత్తిపోయడమే ఎజెండాగా పెట్టకుని ప్రచారం చేసింది. ఆరోపణల స్ట్రాటజీతో ప్రచార ర్యాలీల దూకుడు పెచ్చింది. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌ని రాజస్తాన్ జాదుగార్ అని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఢిల్లీ బాజీగర్ వంటి తిట్లతో వాడివేడిగా ప్రచారాన్ని జోరుగా సాగించారు.
బీజేపీ మాత్రమే రైతుల సమస్యలను అర్థం చేసుకోగలదని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే గ్యారంటీ లేదుగానీ గ్యారంటీ హామీలా అని ఎగతాళి చేస్తే ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్‌పై ఆరోపణలు తీవ్రంగా గుప్పిస్తు ప్రచార ర్యాలీల్లో విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ రైతులకు వడ్డీలేని రుణం ఇస్తానన్న మాట అటుంచి ఇంతమునుపు కిసాన్ భవనాలు నిర్మిస్తానంటూ ఎవరికి కట్టించిందో గుర్తుతెచ్చుకోండని అంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోని కూడా దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేరస్తులకు కొమ్ముగాస్తుంది. అందుకు రాజస్తాన్‌లో మహిళలపట్ల జరుగుతున్న ఘోరాలే ఉదహారణ అందువల్ల ఏవిధంగా మిమ్మల్ని రక్షించగలదంటూ.. ప్రజల్లో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చేలా విమర్శనా అస్త్రాలు ఎక్కుపెట్టింది బీజేపీ.
ఇక కాంగ్రెస్ కూడా ఏడు గ్యారంటీలతో సహా పలు హామీలను ఇస్తూ.. ప్రచారాన్ని హోరాహోరీగా సాగించింది. బీజేపీకి తీసుపోని విధంగా మాటలు తుటాలు పేల్చింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రచార ర్యాలిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..ప్రధాని మోదీకి తనని, రాహుల్‌గాంధీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని గట్టి కౌంటరిస్తు ప్రచారం చేశారు. మాటిమాటికి వంశపారంపర్య రాజకీయాలంటూ గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తూ వ్యక్తిగత విషయాలకు వెళ్లేది కూడా ఆయనే. మళ్లీ ఆయనే తిరిగి తన తండ్రిని తాము ఏదోన్నట్లు బూటకపు సీన్‌లు క్రియేట్ చేస్తున్నారని ఖర్గే మండిపడ్డడారు. లోకంలో లేని వ్యక్తి, పైగా రాజకీయాల్లో లేని అతని తండ్రిని తిట్టాల్సిన పని తనకేంటి అని చిరాకుపడ్డారు. కాంగ్రెస్ కూడా బీజేపీ అనే మాటలకు తనదైన రీతిలో కౌంటర్లిస్తూ ప్రచారం స్పీడు పెంచింది.
అసంఖ్యాక వర్గాల హక్కులు రక్షించేల కుల గణన చేస్తామని హామీ ఇచ్చింది. దేశానికి ఎక్స్‌రే చేయాల్సి అవసరం ఉందని, కుల ఆధారిత జనాభా గణనే ఎక్స్‌రే అంటూ ఓటర్లను ఆకర్షించే యత్నం చేసింది. బీజీపీ బడా పారిశ్రామికవేత్తల పక్షాన వహిస్తుందని విమర్శించింది. దేశంలో ద్వేషం రగలడానికి ప్రధాన కారణం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అని చెప్పుకొచ్చింది. బీజేపీ మాత్రం దేశాన్ని ద్వేషం వైపుకు వెళ్లేలా యత్నిస్తుందని ఆరోపణలు చేసింది. పేదలు, దళితులు, కూలీలను డబ్బుకి దూరంగా ఉంచేలా చేస్తోంది. బిలీనియర్ల కొమ్ము కాస్తుంటుందని విమర్శలు గుప్పిస్తు తమ హామీలు ప్రజల మనుసుల్లో నాటుకునేలా ప్రచారం చేసింది కాంగ్రెస్. ఈసారి రాజస్తాన్ ఎన్నికల్లో ఇరు పార్టీల పోటాపోటీగా ఏ విషయంలో తగకుండా ప్రచారం చేశాయి. ఇరువురిలో ఏ గేమ్ ప్లే అవుతుంది? అనే తీవ్ర ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
రాష్ట్ర ఎన్నికల చరిత్ర ఏం చెబుతుందంటే..
ఇరు పార్టీలు తామే ఓట్లన్నీ స్వీప్ చేసి గెలుస్తామని ధీమాగా చెబుతున్నాయి గానీ ఓపినియన్ పోల్‌లో ఇందుకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీనే చూపిస్తోంది. కాంగ్రెస్ చెబుతున్నట్లు చరిత్ర పునరావృతం కావడం అనేది అసాధ్యమనే తేలింది. ఇక రాజస్తాన్ రాష్ట్ర ఎన్నికల చరిత్రను ఒకసారి చూస్తే..ఒక మెకానిజం రోల్‌ని ఫాలో అయిందనే చెప్పాలి ఎలా అంటే ఒకసారి బీజీపీ మరోసారి కాంగ్రెస్ అన్నట్లుగా సుమారు 1923 నుంచి 2023 వరకు ..బీజీపీ-ఐఎన్‌ఎస్-బీజేపీ-ఐఎన్‌ఎస్-బీజేపీ-ఐఎన్‌ఎస్ అలా గెలిపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన ఆరు ఎన్నికల్లో మూడింటిలో బీజేపీ, కాంగ్రెస్ ఘెరంగా పరాజయాన్ని చవిచూశాయి.
ఇక కాంగ్రెస్ 1998లో భారీ మెజర్జీ ఓట్లతో విజయ ఢంక మోగించినంతగా మళ్లీ ఆ స్థాయిలో ఓట్లను సాధించలేకపోయింది. అలాగే చిన్న పార్టీలు, స్వతంత్రులు రాజస్తాన్‌లో బలమైన ఉనికిని చాటుకున్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే?..1993 నుంచి 2018 మధ్య జరిగిన ఎన్నికలలో సగటున 19 సీట్లు గెలుచుకున్నాయి ఆయా పార్టీలు. తూర్పున ఉత్తరప్రదేశ్‌ను తాకే సరిహద్దు ప్రాంతాలలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా మంచి ఆధిక్యతతో విజయాన్ని సాధించింది. ఇక కాంగ్రెస్ 2008, 2018లలో సుమారు నాలుగు సీట్లకు పరిమితమైంది. వీటన్నింటిన దృష్టిలో ఉంచుకుంటే ఇరు పార్టీలు మధ్య గట్టిపోటీ నెలకొనడమే గాక ఘన విజయాన్ని దక్కించుకోవడం అనేది కష్టమేనని రాజకీయ విశ్లేషకుల అంచనా.
(చదవండి: ఆ సీఎం "మాయగాడు"! అతని 'రెడ్ డైరీ'లో ప్రతీ పేజీ..)
Comments
Please login to add a commentAdd a comment