Assembly by-election
-
Rajasthan By-Election: ‘ఫలితాల’తో నాలుగు నిర్ణయాలకు ముడిపెట్టి..
జైపూర్: రాజస్థాన్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు నేడు (బుధవారం) ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇది కూడా ఈ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షరాష్ట్రంలో జరిగిన ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ పరీక్షను రద్దు చేయాలా వద్దా అనే దానిపై న్యాయ మంత్రి జోగారామ్ పటేల్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. దీనిని సీఎం భజన్‌లాల్ శర్మకు అందించింది. దీనిపై సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నివేదికపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.కొత్త జిల్లాలపై నిర్ణయంగత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన 17 కొత్త జిల్లాల భవిష్యత్తుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ నివేదిక రూపొందించింది. ఐదు చిన్న జిల్లాలను మళ్లీ పాత జిల్లాల్లో కలపవచ్చని సమాచారం. డిసెంబరు 31లోగా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.గత ప్రభుత్వ నిర్ణయాలు రద్దు గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు వైద్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వసర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నివేదికను రూపొందించింది. దీనిని త్వరలో ప్రభుత్వానికి సమర్పించనుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న భూకేటాయింపులతోపాటు పలు నిర్ణయాలను కమిటీ పరిశీలించింది.ఒకే రాష్ట్రం- ఒకే ఎన్నికలురాష్ట్ర ప్రభుత్వం కూడా వన్ స్టేట్- వన్ ఎలక్షన్‌కు సంబంధించి నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ నిర్ణయానికి ప్రభుత్వానికి కొంత సమయం అవసరం ఉంటుంది. దీనిపై చర్చించేందుకు ఒక కమిటీని నియమించి. ఆ తర్వాత ఒక రాష్ట్రం- ఒక ఎన్నికల అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రధాని మోదీ అభ్యర్థన -
కంటోన్మెంట్ ఫలితంపై ఉత్కంఠ
హైదరాబాద్, సాక్షి: కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్‌కు రంగం సిద్ధమైంది.వెస్లీ కళాశాల ప్రాంగణంలోని రెండు వేర్వేరు హాళ్లలో కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక, మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపికకు సంబంధించిన ఓట్ల లెక్కింపును వేర్వేరుగా నిర్వహించనున్నారు. మంగళవారం (రేపు) ఉదయం ఆయా కేంద్రాల్లో ఒకేసారి కౌంటింగ్ మొదలు కానుంది. మొత్తం 232 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అంటే ఒక్కో రౌండ్లో 14 పోలింగ్ కేంద్రాల ఓట్ల చొప్పున మొత్తం 17 రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. తొలుత బ్యాలెట్ ఓట్లు, అనంతరం సాధారణ ఈవీఎంల వారీగా ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు లెక్కింపు ప్రక్రియ కొలిక్కి రానుందని అధికారులు వెల్లడించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం జిల్లాల వారీగా హైదరాబాద్, పార్లమెంట్ స్థానం వారీగా చూస్తే మేడ్చల్– మల్కాజ్గిరి పరిధిలోకి వస్తోంది. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు బోగారంలోని హోలీ మేరీ కళాశాల ప్రాంగణంలో, ఎల్బీ నగర్ అసెంబ్లీ పరిధిలోని ఓట్ల లెక్కింపు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో జరగనుంది. కంటోన్మెంట్ పరిధిలోని అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపు మాత్రం సికింద్రాబాద్ వెస్లీ కళాశాల ఆవరణలో జరగనుంది. సర్వత్రా ఆసక్తి కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆరు నెలల క్రితం నాటి ఎన్నికల్లో 1,23,297 ఓట్లు పోలవ్వగా, తాజాగా 1,30,929 మంది ఓటేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత 59,057 ఓట్లు సాధించగా, బీజేపీ తరఫున పోటీ చేసిన శ్రీగణేశ్‌కు 41,888, కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెలకు 20,825 ఓట్లు వచ్చాయి. ఈ సారి ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి కొత్త అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి శ్రీగణేశ్, కాంగ్రెస్ అభ్యరి్థగా మారారు. రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి డాక్టర్ వంశ తిలక్‌కు టికెట్ ఇచి్చంది. బీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత బరిలో నిలిచారు.వార్డు నేతల్లోనూ టెన్షన్కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పాటు స్థానిక వార్డు నేతల్లోనూ టెన్షన్ కొనసాగుతోంది. తమ వార్డులో పార్టీకి మెజారిటీ వస్తుందా లేదా అని ఆయా నేతలు ఆలోచనలో పడిపోయారు. అభ్యర్థి గెలుపోటములతో సంబంధం లేకుండా, తమ వార్డులో మెజారిటీ వస్తే చాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వార్డుల వారీగా ఓటింగ్ సరళిపై ఎవరికి వారు అంచనాల్లో మునిగిపోయారు. -
కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఖరారు.. ఆయనకే చాన్స్
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మరో కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. కంటోన్మెంట్ అభ్యర్థిగా టీఎన్ వంశీ తిలక్ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఆయన పేరును అధికారికంగా మంగళవారం ప్రకటించింది. ఇక, కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటుగానే కంటోన్మెంట్ ఉప ఎన్నికల కూడా జరుగనుంది. -
'ఆరోపణల స్ట్రాటజీ' వర్సెస్ 'గ్యారంటీల గేమ్'? గెలిచేదెవరూ..?
రాజస్తాన్‌లో ఎన్నికల ప్రచారం తుది అంకానికి వచ్చేసింది. గురువారం సాయంత్రంతో ప్రచార ర్యాలీలకు ముగింపు పడుతోంది. ఒకరకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఎన్నికలు క్లైమాక్స్‌కి చేరినట్టే. ఇప్పుడు సర్వత్ర ఏ పార్టీ గెలుస్తుందన్న చర్చే సాగుతుంది. సోషల్ మీడియాలో సైతం దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ఎన్నికల ప్రచార ర్యాలీలో బీజేపీ కాంగ్రెస్‌ని దుమ్మెత్తిపోయడమే ఎజెండాగా పెట్టకుని ప్రచారం చేసింది. ఆరోపణల స్ట్రాటజీతో ప్రచార ర్యాలీల దూకుడు పెచ్చింది. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌ని రాజస్తాన్ జాదుగార్ అని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఢిల్లీ బాజీగర్ వంటి తిట్లతో వాడివేడిగా ప్రచారాన్ని జోరుగా సాగించారు. బీజేపీ మాత్రమే రైతుల సమస్యలను అర్థం చేసుకోగలదని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే గ్యారంటీ లేదుగానీ గ్యారంటీ హామీలా అని ఎగతాళి చేస్తే ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్‌పై ఆరోపణలు తీవ్రంగా గుప్పిస్తు ప్రచార ర్యాలీల్లో విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ రైతులకు వడ్డీలేని రుణం ఇస్తానన్న మాట అటుంచి ఇంతమునుపు కిసాన్ భవనాలు నిర్మిస్తానంటూ ఎవరికి కట్టించిందో గుర్తుతెచ్చుకోండని అంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోని కూడా దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేరస్తులకు కొమ్ముగాస్తుంది. అందుకు రాజస్తాన్‌లో మహిళలపట్ల జరుగుతున్న ఘోరాలే ఉదహారణ అందువల్ల ఏవిధంగా మిమ్మల్ని రక్షించగలదంటూ.. ప్రజల్లో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చేలా విమర్శనా అస్త్రాలు ఎక్కుపెట్టింది బీజేపీ. ఇక కాంగ్రెస్ కూడా ఏడు గ్యారంటీలతో సహా పలు హామీలను ఇస్తూ.. ప్రచారాన్ని హోరాహోరీగా సాగించింది. బీజేపీకి తీసుపోని విధంగా మాటలు తుటాలు పేల్చింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రచార ర్యాలిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..ప్రధాని మోదీకి తనని, రాహుల్‌గాంధీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని గట్టి కౌంటరిస్తు ప్రచారం చేశారు. మాటిమాటికి వంశపారంపర్య రాజకీయాలంటూ గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తూ వ్యక్తిగత విషయాలకు వెళ్లేది కూడా ఆయనే. మళ్లీ ఆయనే తిరిగి తన తండ్రిని తాము ఏదోన్నట్లు బూటకపు సీన్లు క్రియేట్ చేస్తున్నారని ఖర్గే మండిపడ్డడారు. లోకంలో లేని వ్యక్తి, పైగా రాజకీయాల్లో లేని అతని తండ్రిని తిట్టాల్సిన పని తనకేంటి అని చిరాకుపడ్డారు. కాంగ్రెస్ కూడా బీజేపీ అనే మాటలకు తనదైన రీతిలో కౌంటర్లిస్తూ ప్రచారం స్పీడు పెంచింది. అసంఖ్యాక వర్గాల హక్కులు రక్షించేల కుల గణన చేస్తామని హామీ ఇచ్చింది. దేశానికి ఎక్స్‌రే చేయాల్సి అవసరం ఉందని, కుల ఆధారిత జనాభా గణనే ఎక్స్‌రే అంటూ ఓటర్లను ఆకర్షించే యత్నం చేసింది. బీజీపీ బడా పారిశ్రామికవేత్తల పక్షాన వహిస్తుందని విమర్శించింది. దేశంలో ద్వేషం రగలడానికి ప్రధాన కారణం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అని చెప్పుకొచ్చింది. బీజేపీ మాత్రం దేశాన్ని ద్వేషం వైపుకు వెళ్లేలా యత్నిస్తుందని ఆరోపణలు చేసింది. పేదలు, దళితులు, కూలీలను డబ్బుకి దూరంగా ఉంచేలా చేస్తోంది. బిలీనియర్ల కొమ్ము కాస్తుంటుందని విమర్శలు గుప్పిస్తు తమ హామీలు ప్రజల మనుసుల్లో నాటుకునేలా ప్రచారం చేసింది కాంగ్రెస్. ఈసారి రాజస్తాన్ ఎన్నికల్లో ఇరు పార్టీల పోటాపోటీగా ఏ విషయంలో తగకుండా ప్రచారం చేశాయి. ఇరువురిలో ఏ గేమ్ ప్లే అవుతుంది? అనే తీవ్ర ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. రాష్ట్ర ఎన్నికల చరిత్ర ఏం చెబుతుందంటే.. ఇరు పార్టీలు తామే ఓట్లన్నీ స్వీప్ చేసి గెలుస్తామని ధీమాగా చెబుతున్నాయి గానీ ఓపినియన్ పోల్‌లో ఇందుకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీనే చూపిస్తోంది. కాంగ్రెస్ చెబుతున్నట్లు చరిత్ర పునరావృతం కావడం అనేది అసాధ్యమనే తేలింది. ఇక రాజస్తాన్ రాష్ట్ర ఎన్నికల చరిత్రను ఒకసారి చూస్తే..ఒక మెకానిజం రోల్‌ని ఫాలో అయిందనే చెప్పాలి ఎలా అంటే ఒకసారి బీజీపీ మరోసారి కాంగ్రెస్ అన్నట్లుగా సుమారు 1923 నుంచి 2023 వరకు ..బీజీపీ-ఐఎన్ఎస్-బీజేపీ-ఐఎన్ఎస్-బీజేపీ-ఐఎన్ఎస్ అలా గెలిపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన ఆరు ఎన్నికల్లో మూడింటిలో బీజేపీ, కాంగ్రెస్ ఘెరంగా పరాజయాన్ని చవిచూశాయి. ఇక కాంగ్రెస్ 1998లో భారీ మెజర్జీ ఓట్లతో విజయ ఢంక మోగించినంతగా మళ్లీ ఆ స్థాయిలో ఓట్లను సాధించలేకపోయింది. అలాగే చిన్న పార్టీలు, స్వతంత్రులు రాజస్తాన్‌లో బలమైన ఉనికిని చాటుకున్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే?..1993 నుంచి 2018 మధ్య జరిగిన ఎన్నికలలో సగటున 19 సీట్లు గెలుచుకున్నాయి ఆయా పార్టీలు. తూర్పున ఉత్తరప్రదేశ్‌ను తాకే సరిహద్దు ప్రాంతాలలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా మంచి ఆధిక్యతతో విజయాన్ని సాధించింది. ఇక కాంగ్రెస్ 2008, 2018లలో సుమారు నాలుగు సీట్లకు పరిమితమైంది. వీటన్నింటిన దృష్టిలో ఉంచుకుంటే ఇరు పార్టీలు మధ్య గట్టిపోటీ నెలకొనడమే గాక ఘన విజయాన్ని దక్కించుకోవడం అనేది కష్టమేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. (చదవండి: ఆ సీఎం "మాయగాడు"! అతని 'రెడ్ డైరీ'లో ప్రతీ పేజీ..) -
ఖేడ్ కౌంటింగ్ ప్రారంభమైంది..
♦ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ♦ మొత్తం 14 టేబుళ్లు, 21 రౌండ్లు ♦ రెండు, మూడు గంటల్లోనే ఉప ఎన్నిక ఫలితం వెల్లడి నారాయణఖేడ్: మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. మండలం జూకల్ శివారులోని పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉదయమే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. కౌంటింగ్‌కు 14 టేబుళ్లను ఏర్పాటు చేశామని, మొత్తం 21 రౌండ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి 137 మంది ఉద్యోగులను నియమించినట్లు పేర్కొన్నారు. 11 గంటల వరకు ఫలితం వెలుడడే అవకాశంఉంది. ప్రతీ టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమించారు. ఈ ఫలితాలను త్వరితగతిన అందించేందుకు ప్రింటర్ కమ్ ఆగ్జీలరీ డిస్ప్లే యూనిట్లను వినియోగిస్తున్నారు. ఫలితాల సమాచారం ఎప్పటికప్పుడు మీడియాకు అందించేందుకు కౌంటింగ్ కేంద్రంలో మీడియా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు వివరించారు.