not working
-
కేసీఆర్ అంటేనే గ్యారంటీ
సాక్షి, సిద్దిపేట: ‘మీ గ్యారంటీ కార్డులు తెలంగాణలో పనిచేయవు..కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష.. కేసీఆర్ అంటేనే గ్యారంటీ, వారంటీ’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నా రు. మంగళవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ, కుమ్మర మోడ్రన్ యాంత్రిక పరిశ్రమకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ 50 ఏళ్ల నుంచి చేయని అభివృద్ధి, ఇప్పుడు చేస్తామని గ్యారంటీ కార్డులు, బాండ్‌పేపర్లు రాసిస్తున్నార న్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాటలు చెప్పేవారయితే, చేతల్లో చూపేది, మాటతప్పని, మడమతిప్పని నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. సీఎం కేసీఆర్ బీసీలకు చేసే ఆర్థికసాయం పథకాన్ని కాపీ కొట్టారని, అది అప్పు రూపంలో మోదీ అందిస్తున్నారని విమర్శించారు. ఉద్యమస్ఫూర్తి, పోరా టస్ఫూర్తిని చాకలి ఐలమ్మ అందించిందన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన రూ.లక్ష కోట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు 71% ఫిట్మెంట్ ఇస్తోందన్నారు. త్వరలో సీఎం కొత్త పీఆర్సీ వేసి తీపికబురు చెబుతారన్నారు. అతి తక్కువ వేతనాలు ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్లో ఉన్నాయని, చూసేందుకు వెజ్ గవర్న మెంట్, కానీ చేసేందుకు నాన్‌వెజ్ గవర్నమెంట్ అంటూ బీజేపీ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. -
అక్టోబర్ నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎందుకంటే!
ఆధునిక కాలంలో వాట్సాప్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ యాప్ ఆధునిక అవసరాలను అనుకూలంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. ఇందులో వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తూ.. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో బహుశా కొన్ని పాత మొబైల్స్‌లో వాట్సాప్ యాప్ పనిచేయక పోవచ్చు. ఈ కథనంలో ఏ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 2023 అక్టోబర్ 24 తరువాత ఆండ్రాయిడ్ OS వెర్షన్ 4.1, అంతకంటే అంతకు ముందు వెర్షన్లతో కూడిన ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని కంపెనీ తెలిపింది. ఈ జాబితాలో ఏకంగా 20 కంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లు ఉండటం గమనార్హం. సోనీ ఎక్స్‌పీరియా జెడ్ ఎల్జీ ఆప్టిమస్ జీ ప్రో శాంసంగ్ గ్యాలక్సీ ఎస్2 శాంసంగ్ గ్యాలక్సీ నెక్సస్ హెచ్‌టీసీ సెన్సేషన్ మోటోరోలా డ్రోయిడ్ రేజర్ (Motorola Droid Razr) సోనీ ఎక్స్‌పీరియా ఎస్2 మోటోరోలా జూమ్ శాంసంగ్ గ్యాలక్సీ టాబ్ 10.1 ఆసుస్ ఈ ప్యాడ్ ట్రాన్స్ఫార్మర్ (Asus Eee Pad Transformer) ఏసర్ ఐకానియా ట్యాబ్ ఏ5003 శాంసంగ్ గ్యాలక్సీ ఎస్ హెచ్‌టీసీ డిజైర్ హెచ్డీ ఎల్జీ ఆప్టిమస్ 2ఎక్స్ సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా Arc3 నెక్సస్ 7 (ఆండ్రాయిడ్ 4.2కి అప్‌గ్రేడబుల్) శాంసంగ్ గ్యాలక్సీ నోట్ 2 హెచ్‌టీసీ వన్ ఇదీ చదవండి: వందే భారత్‌లో 6 నెలలు అవన్నీ బ్యాన్.. ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం! ఈ జాబితాలోని మొబైల్స్ అన్నీ దాదాపు పాత మోడల్స్. కావున ఇవి చాలా తక్కువమంది వద్ద మాత్రమే ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే వాట్సాప్ వినియోగిస్తున్న వారు దీన్ని అప్డేట్ చేసుకోవాలి, లేకుంటే వాట్సాప్ ఆపరేటింగ్ సిస్టం ఆగిపోతుంది. మీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ OS వెర్షన్ చెక్ చేయడం ఎలా? మీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ OS వెర్షన్ 4.1 లేదా అంతకంటే పాత మొబైల్ అవునా కాదా అని చెక్ చేయాలంటే మీ మొబైల్లో సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి, అబౌట్ ఫోన్ (About Phone) క్లిక్ చేసి అందులో సాఫ్ట్వేర్ వివరాలు చూడవచ్చు. దీన్ని బట్టి మీ మొబైల్ వాట్సాప్ వినియోగానికి ఉపయోగపడుతుందా.. లేదా అనేది తెలిసిపోతుంది. -
లాంగ్ కోవిడ్‌తో అవయవాలకు ముప్పు
లండన్: కోవిడ్–19 మహమ్మా రి బారినపడి, ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగైన వారిలో కూడా అవయవాలు దెబ్బతింటున్నట్లు యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో వివిధ యూనివర్సిటీల సైంటిస్టులు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. లాంగ్ కోవిడ్‌తో శరీరంలోని కొన్ని ప్రధాన అవయవాలు క్రమంగా పనిచేయడం ఆగిపోతున్నట్లు గుర్తించామని పరిశోధకులు చెప్పారు. కరోనా బాధితుల మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) స్కానింగ్లతో ఈ విషయం కనిపెట్టినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, మెదడు, మూత్రపిండాలకు లాంగ్ కోవిడ్ ముప్పు మూడు రెట్లు అధికంగా పొంచి ఉందని అన్నారు. మనిషిపై దాడి చేసిన కరోనా వైరస్ తీవ్రతను బట్టి ముప్పు తీవ్ర కూడా పెరుగుతున్నట్లు తెలియజేశారు. ఈ అధ్యయనం వివరాలను ‘లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్’ పత్రికలో ప్రచురించారు. 259 మంది కరోనా బాధితులపై అధ్యయనం నిర్వహించారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యాక 5 నెలల తర్వాత వారి ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్టులను క్షుణ్నంగా పరిశీలించారు. కరోనా సోకని వారితో పోలిస్తే వారి శరీరంలోని ప్రధాన అవయవాల్లో కొన్ని వ్యత్యాసాలను గుర్తించారు. అన్నింటికంటే ఊపరితిత్తులే అధికంగా ప్రభావితం అవుతున్నట్లు తేల్చారు. గుండె, కాలేయం ఏమాత్రం దెబ్బతినడం లేదని గమనించారు. లాంగ్ కోవిడ్‌కు మరింత ప్రభావవంతమైన చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. -
ఏడాది క్రితం సరిగ్గా అదే రోజు ఇది RR కాదు CSK
-
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక
న్యూఢిల్లీ: ఎస్బీఐ ఆన్లైన్ సేవలు 3 రోజల పాటు పనిచేయవని బ్యాంకు తెలిపింది. రేపట్నుంచి వరుసగా 3 రోజులు మే 21, 22, 23 రోజుల్లో మెయింటెనెన్స్ కారణంగా ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ వెల్లడించింది. మే 21న 22.45 గంటల నుంచి మే 22న 1.15 గంటల వరకు, అలాగే మే 23న 2.40 గంటల నుంచి 6.10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఎస్బీఐ ట్వీట్లో తెలిపింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతున్న కారణంగా బ్యాంకింగ్ పని వేళల్లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్యాంకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేస్తున్నాయి. మే 31 వరకు ఇది అమలులో ఉండనుంది. చదవండి: Paytm: ఎల్పీజీపై రూ.800 వరకు క్యాష్‌బ్యాక్ We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#SBI #StateBankOfIndia #ImportantNotice #InternetBanking #OnlineSBI pic.twitter.com/LNMnKjORMR— State Bank of India (@TheOfficialSBI) May 20, 2021 -
పనిచేయని పీఎం కేర్ వెంటిలేటర్లు: ఆస్పత్రుల్లో వృథాగా
చండీఘడ్: కరోనా బాధితుల కోసం ప్రధానమంత్రి కేర్ నిధుల నుంచి తీసుకొచ్చిన వెంటిలేటర్లు వృథాగా పడి ఉన్నాయి. అవి సక్రమంగా పని చేయడం లేదని మూలకు పడేశారు. దీంతో పీఎం కేర్ నిధుల నుంచి తీసుకొచ్చిన వెంటిలేటర్లపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాసిరకం వెంటిలేటర్లు ఇస్తే ఏం ప్రయోజనమని మండిపడ్డారు. పీఎం కేర్ నిధుల నుంచి అగ్వా హెల్త్ కేర్ కార్యక్రమంలో భాగంగా పంజాబ్ రాష్ట్రానికి గతేడాది 250 వెంటిలేటర్స్ పంపించారు. వాటిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. అయితే పంపించిన వాటిలో చాలా వరకు పని చేయడం లేదని పక్కకు పడేశారు. గురు గోబింద్ సింగ్ వైద్య కళాశాల, ఆస్పత్రికి 80 వెంటిలేటర్స్ పంపించాల్సి ఉండగా 71 పంపారు. ఆ పంపిన వాటిలో ఒక్కటీ కూడా పని చేయడం లేదని ఆ కళాశాల వీసీ ఆరోపించారు. గంటా రెండు గంటలు పని చేయగానే మొరాయిస్తాయని తెలిపారు. దీంతో వాటిని పక్కన పడేసినట్లు తెలిపారు. పంపిన వెంటిలేటర్లు నాసిరకమైనవని.. అవి కొంత సేపు పని చేసి ఆగిపోతున్నాయని పలు ఆస్పత్రులు ఫిర్యాదు చేశాయి. నాణ్యమైన వెంటిలేటర్లు పంపలేదని అనస్థిషియా వైద్యులు చెబుతున్నారు. తరచూ మొరాయిస్తున్నాయని అని బాబా ఫరీద్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ రాజ్ బహదూర్ వాపోయారు. ‘82 వెంటిలేటర్లు ఇవ్వగా వాటిలో 62 పని చేయడం లేదని ఫొటోతో సహా తెలిపారు. అవి తీసుకు వచ్చినప్పటి నుంచి పని చేయడం లేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో 42 వెంటిలేటర్లతో రోగులకు సేవలు అందిస్తున్నాం. రోగులకు వాటిని అందుబాటులో ఉంచలేం’ అని పేర్కొన్నారు. These r the ventilators fm #PMCaresFund lying unused in GGSMC Faridkot. @CMOPb pls make them work for the needy #COVID19 patients....I shall be Obliged..and Appreciate....@ChitleenKSethi @ANI @AAPPunjab @CsPunjab pic.twitter.com/GV9lUZBlox — Kultar Singh Sandhwan (@Sandhwan) May 11, 2021 ఇదే విషయాన్ని పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే కుల్తార్ సింగ్ సంద్వాన్ ట్వీట్ చేశారు. ఆ వెంటిలేటర్ల దుస్థితిని ఫొటో పంచుకున్నారు. ఫరీద్‌కోట్‌లోని ఆస్పత్రిలో నిరుపయోగంగా వెంటిలేటర్లు పడి ఉన్నాయి. కరోనా రోగుల కోసం వాటిని వినియోగించేలా చర్యలు తీసుకోండి.’ అని కుల్తార్ సింగ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రికి ట్యాగ్ చేశారు. ఈ విమర్శలు రావడంతో వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్లను మరమ్మతు చేసేందుకు మెకానిక్‌లను పంపించింది. ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు ప్రస్తుతం ఎంతో అవసరం కావడంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద వాటిని బాగు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇవి పని చేస్తాయో.. లేదా మళ్లీ కొన్నాళ్లకు మొరాయిస్తాయోనని ప్రతిపక్షాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ చదవండి: ఆవు పేడతో కరోనా అస్సలు తగ్గదు.. వేరే సమస్యలు వస్తాయి -
అంబులెన్స్ దోపిడీ
-
ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి పలు పాత స్మార్ట్ఫోన్లలో ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ పనిచేయదు. ఈ విషయాన్ని తన ఎఫ్ఏక్యూ సెక్షన్లో వాట్సాప్ పేర్కొంది. ఆండ్రాయిడ్ 2.3.7, అంతకు ముందు ఉన్న పాత వర్షన్లపై నడిచే ఫోన్లు, ఐవోఎస్ 8, దానికి ముందరి ఓఎస్‌లపై నడిచే ఐఫోన్లలో వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ పని చేయదు. ఈ పాత ఫోన్లలో ఫిబ్రవరి 1 తర్వాత వాట్సాప్ ఖాతాను క్రియేట్ చేసుకోవడం కానీ, ఉన్న ఖాతాను పునరుద్ధరించుకోవడం కానీ కుదరదు. అన్ని రకాల విండోస్ ఫోన్లకు కూడా 2019 డిసెంబర్ 31 నుంచి తమ సేవలు ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. అదే నెలలో మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా విండోస్ 10 మొబైల్ ఓఎస్ సేవలు కూడా నిలిపేయనుంది. ఫేస్బుక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యాప్‌ను అప్డేట్ చేస్తూ ఉంది. ఫోన్ బ్యాటరీ వాడకం తగ్గేలా ‘డార్క్ మోడ్’ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఫోన్లలో పనిచేయదు.. ► ఆండ్రాయిడ్ 2.3.7 ఆపరేటింగ్ సిస్టం ► ఐవోఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం ఐఫోన్లు.. -
గుక్కెడు నీటికి గంపెడు కష్టాలు
సాక్షి, కొండపి(ప్రకాశం): మండలంలోని చోడవరం గ్రామస్తులకు రక్షిత మంచినీటి సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఓవర్‌హెడ్ ట్యాంకులతో పాటు మూసి నుంచి ఓవర్‌హెడ్ ట్యాంకుకు మంచినీటి సరఫరాకు పైప్‌లైన్ ఉంది. దీంతో పాటు ఇటీవల రామతీర్థం రిజర్వాయర్ నుంచి మంచినీరు గ్రామస్తులకు అందిస్తున్నామని అధికారులు పాలకులు చెబున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. గ్రామస్తులకు గుక్కెడు మంచినీరు సరఫరా కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో వెయ్యి మంది జనాభాతో పాటు మరో 500 మందికి పైగా కాలనీవాసులు ఉన్నారు. మంచినీరు అందించటం కోసం 50వేల లీటర్ల సామర్థ్యంతో గ్రామంలో ఒక ఓవర్‌హెడ్ ట్యాంకును నిర్మించారు. గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న మూసిలో బోర్లు వేసి బావికి నీరు సరఫరా చేసి అక్కడి నుంచి గ్రామానికి మంచినీరు వచ్చేలా పథకం రూపొందించారు. దీంతో పాటు రామతీర్థం రిజర్వాయర్ నుంచి సైతం మంచినీరు గ్రామానికి మంచినీరు సరఫరా చేయటం కోసం పైప్‌లైన్ ట్యాంకుకు సైతం అనుసంధానం చేశారు. అంత వరకు బాగానే ఉన్నా రామతీర్థం రిజర్వాయర్ నుంచి ఒక్కరోజు సైతం గ్రామానికి మంచినీరు సరిగా సరఫరా చేయలేదని గ్రామస్తులు వాపోతున్నారు. కాగా అంతకు ముందు గ్రామంలోని రక్షిత పథకం నుంచి మంచినీరు అందడం లేదని గ్రామస్తులు తెలిపారు. అదే విధంగా గ్రామంలో 20 కుటుంబాలకు నీరు ఆధారంగా ఉన్న చేతిపంపు మరమ్మతులకు గురైనా ఇంత వరకు పట్టించుకోకపోవడంతో వాడుకనీరు సైతం ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. అలంకారప్రాయంగా ఓవర్‌హెడ్‌ట్యాంకు పట్టించుకోని అధికారులు గ్రామంలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. పంచాయతీ కార్యదర్శి గానీ ప్రత్యేకాధికారి గానీ మంచినీరు సరఫరా విషయమై పట్టించుకున్న పాపాన పోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. గ్రామస్తులకు పక్షం రోజులు పైగా మంచినీరు అందక నానా ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. రామతీర్థం నుంచి సరఫరా చేసే రక్షిత మంచినీరు పథకం పైపులైన్లో సమస్య ఉండి నీరు ట్యాంకుకు ఎక్కటం లేదని, పైప్‌లైన్ పగిలిందనే విషయం పథకం సిబ్బందికి తెలిపినా స్పందన లేదని గ్రామస్తులు తెలిపారు. పొరుగు గ్రామాలకు పరుగు.. గ్రామంలో మంచినీరు అందుబాటులో లేకపోవడంతో పక్కన ఉన్న వెన్నూరు, దేవిరెడ్డిపాలెం గ్రామాలకు ద్విచక్రవాహనాలతో వెళ్లి తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. వృద్ధులు పొరుగు గ్రామాలకు వెళ్లి మంచినీరు తెచ్చుకోలేక ఇక్కట్లు పడుతున్నారు. కొంతమంది గ్రామానికి వచ్చే బబుల్వాటర్ వ్యాన్ల నుంచి మంచినీరు కొనుక్కోని తాగుతున్నట్లు తెలిపారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై గ్రామ కార్యదర్శి కిరణ్‌ను ఫోన్లో వివరణ కోరగా..విషయం తన దృష్టికి వచ్చిందని రామతీర్థం పైప్‌లైన్ పగిలిందని, పైప్ జాయింట్ మిషన్‌తో వేయాలని అప్పటి లోగా గ్రామంలోని రక్షితపథకం నీరు అందిస్తాన్నారు. ప్రత్యేక అధికారి సురేఖను వివరణ కోరగా మంచినీరు సమస్య ఎవ్వరు తనదృష్టికి తీసుకరాలేదని, సమస్య ఉంటే ట్యాంకర్ల ద్వారా అయినా తొలిస్తామని, ఎన్నికల పనుల్లో తీరికలేకున్నామని తెలిపారు. పది రోజులుగా మంచినీరు సరఫరాలేదు గ్రామానికి పక్షం రోజులుగా మంచినీరు సరఫరా లేదు. దీంతో గ్రామస్తులు మంచినీరు కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పట్టించుకోవటంలేదు. రామతీర్థం మంచినీరు సైతం రావడం లేదు. – ఆర్ వెంకటనారాయణ, చోడవరం పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది మంచినీరు కోసం పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. వయస్సు మళ్లిన వారు మంచినీటి కోసం పక్క గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. రెండు పథకాలు ఉన్నా మంచినీరు అందించలేకపోవటం దారుణం. మున్ముందు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం కావడం లేదు. – ఎన్ రమణయ్య, చోడవరం -
రెండో రోజే మూత!
అన్న క్యాంటీన్లు కాస్తా అన్నమో రామచంద్ర..అన్నట్టుగా తయారయ్యాయి. ఆర్భాటంగా ప్రారంభించిన ఈ క్యాంటీన్లు తొలిరోజు మధ్యాహ్నమే మూతపడ్డాయి. ఇక రెండో రోజైనా పూర్తి స్థాయిలో తెరుచుకుంటాయన్న ఆశతో వెళ్లిన సామాన్యులు నిరాశతో వెనక్కి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. అల్పాహారం, భోజనం కోసం ప్రజలు బారులు తీరారు. తీరా క్యాంటీన్ సిబ్బంది, సెక్యుక్యూరిటీ గార్డులను లేవని చెప్పడంతో వారిని నిలదీయడం కన్పించింది. సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నాలుగేళ్ల తర్వాత అన్న క్యాంటీన్లు కొలువు దీరాయి. రూ.5కే అల్పాహారం, రూ.5 ఆహారం అంటూ గొప్పలు చెబుతూ జీవీఎంసీ పరిధిలో బుధవారం అట్టహాసంగా 13 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రారంభించారు. అయితే బుధవారం ప్రారంభించిన వాటిలో గురువారం సగానికి పైగా తెరుచుకోలేదు.మరికొన్ని చోట్ల కేవలం మధ్యాహ్నం కొద్దిసేపు భోజనం పెట్టి మూసేశారు. మరికొన్ని వాటిల్లో ఉదయం అల్పాహారంతో సరిపెట్టేశారు.తెరిచిన క్యాంటీన్లు కూడా మధ్యాహ్నం 1 గంటకే మూసేసారు. విశాఖ తూర్పు నియోజకవర్గం 3వ వార్డు పందులఫాం ఏరియాలోని క్యాంటీన్ అసలు తెరవనేలేదు. మరో చోట భోజం కోసం చేరుకున్న సామాన్యులకు అక్కడి సిబ్బంది చెప్పిన సమాధానం కాకపుట్టింది. క్యాంటిన్ టైం అయిపోయింది..300 మందికి భోజనం పెట్టేశాం అని చెప్పడంతో సామాన్యుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. సిబ్బందిని చెడామడా తిట్లదండకంతో ఉతికిఆరేశారు. దొడ్డిదారిన క్యారేజీలు పంపించి ఉంటారంటూ మండిపడ్డారు. లోనికి వెళ్లేందుకు యత్నించారు. సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చినవాల్తేరులోనూ అదే పరిస్థితి చిన వాల్తేరులో ప్రారంభిన క్యాంటీన్ పరిస్థితి కూడా ఇదే. ట్రయల్‌రన్ అంటూ బుధవారం ఉచితంగా మధ్యాహ్నం భోజనాలు అందజేసిన నిర్వాహకులు గురువారం ముఖం చాటేశారు. అదేమిటంటే క్యాంటీన్లో ఇంకా పనులు జరుగుతున్నాయని..త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభిస్తాం అంటూ చెప్పడం విస్మయానికి గురిచేసింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు రూ.5కే అందజేస్తామని చెప్పడంతో అధికసంఖ్యలో వచ్చిన భవన నిర్మాణ కార్మికులు, తోపుడు బండి వ్యాపారులు వెనుదిరిగారు. -
లేజీఎస్!
రాయికోడ్(అందోల్): ఈజీఎస్ (ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీం) పనులు జిల్లాలోని ఆయా మండలాల్లో నత్తనడకన సాగుతున్నాయి. చేసిన పనులకు సంబంధించి కూలీల వేతనాలు, మెటీరియల్ కాంపోనెంట్ నిధులు సక్రమంగా విడుదల కావడం లేదు. నాడెం కంపోస్టు పిట్స్, పాఠశాలల కిచెన్ షెడ్స్, ఇంకుడు గుంతలు, పశువుల పాకలు, సేద్యపు నీటి గుంతలు, డంపింగ్ యార్డులు తదితర పనులు మందకొడిగా సాగుతున్నాయి. 2016 నుంచి ఆయా రకాల పనులు మంజూరైనా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేక, గ్రామీణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అవగాహన లేక, బిల్లులు సకాలంలో అందుతాయనే భరోసా లేక మంజూరైన పనులు నిదానంగా నడుస్తున్నాయి. సేద్యపు నీటి గుంతలు.. జిల్లాలో 3,031 సేద్యపు నీటి గుంతలకు 777 గుంతలే వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే సేద్యపు నీటి గుంతలను నిర్మింపజేసి పంటల సాగులో రైతులు ఎదుర్కొనే నీటి ఇబ్బందులను తీర్చాల్సి ఉండగా పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడంలేదు. పూర్తికాని పశువుల పాకలు.. జిల్లాలోని ఆయా మండలాల్లో 558 నిర్మించాల్సి ఉండగా 55 పశువుల పాకలు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. పశువుల పాకలు లేక పోషకులు తాము పోషిస్తున్న పశువులను ఆరుబయట కట్టేస్తున్నారు. ఈ దశలో పశువులు, పోషకుల ప్రయోజనం కోసం మంజూరు చేసిన పాకలు పూర్తి చేయడంలో క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు, సిబ్బందికి చిత్తశుద్ధి కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. 306 మాత్రమే పూర్తయిన కంపోస్ట్ పిట్స్.. 1,333 నాడెం కంపోస్టు పిట్స్ మంజూరు కాగా 306 మాత్రమే ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇంకుడు గుంతలు అంతంతే.. 53,138 ఇంకుడు గుంతలు మంజూరవగా ఇప్పటివరకు 22,013 ఇంకుడుగుంతలు మాత్రమే పూర్తి చేశారు. ప్రస్తుతం ఎక్కడా ఇంకుడుగుంతల నిర్మాణం చురుగ్గా సాగుతున్న పరిస్థితులు లేవు. ఇంకుడుగుంతలు నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఈ పనులు చేపట్టడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. పూర్తికాని డంపింగ్ యార్డులు.. జిల్లాకు 330 డంపింగ్ యార్డులు మంజూరయ్యాయి. ఇందులో 142 డంపింగ్ యార్డులు మాత్రమే ప్రారంభమయ్యాయి. డంపింగ్ యార్డుల నిర్మాణంలో అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదనే వాదనలు వినవస్తున్నాయి. పూర్తయిన కిచెన్ షెడ్లు 128 మాత్రమే.. ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు 539 కిచెన్ షెడ్లు మంజూరు చేయగా 128 మాత్రమే పూర్తయినట్లు ఈజీఎస్ అధికారులు వెల్లడించారు. శ్మశాన వాటికల అభివృద్ధి పనులు సైతం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. వివిధ రకాల పనులు మంజూరవుతున్నా వాటిని పూర్తి చేయడంలోనే లోపాలు కనిపిస్తున్నాయి. కొరవడిన పర్యవేక్షణ.. ఈజీఎస్ పనులపై పర్యవేక్షణ లేక ఆశించిన స్థాయి లో పనుల్లో పురోగతి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా, మండల స్థాయిలోని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ప్రాధాన్యతనిచ్చి ప్రజల్లో ఈజీఎస్ పనులపై సరైన అవగాహన కల్పిస్తే ఆశిం చిన లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా గ్రామాల్లో పనుల పురోగతి అందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పటికైనా పటిష్ట ప్రణాళికలు వేసి మంజూరైన అన్నిరకాల ఈజీఎస్ పనులను పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. -
జియో సిమ్‌లిచ్చారు.. సిగ్నల్ లేదు
కొత్తగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న డిజిటల్ తరగతుల్లో అంతరాయాలను నిరోధించేందుకు ప్రభుత్వం జియో హాట్‌స్పాట్‌కు చెందిన రూటర్, సిమ్‌లను పంపిణీ చేసింది. జిల్లాలో తొలి విడతగా 95 ప్రభుత్వ, 8 కస్తూర్బా పాఠశాలలకు అందించింది. కానీ కొన్ని మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో జియో నెట్వర్క్ సేవలు అందటం లేదు. కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి, దుమ్ముగూడెం, చర్ల తదితర మండలాల్లో అసలు జియో నెట్ వర్క్‌ను ఆ కంపెనీ ఇంకా ప్రారంభించలేదు. ములకలపల్లి, దమ్మపేట, పినపాక, టేకులపల్లి, అన్నపురెడ్డిపల్లి వంటి చోట్ల మండల కేంద్రాల్లో తప్ప ఇతర గ్రామాల్లో జియో ఊసే లేదు. ఈ క్రమంలో జియో సిమ్, హాట్స్పాట్లను పంపిణీ చేసినా ఉపయోగంలేకుండా పోయింది. జియో సిగ్నల్స్ లేని చోట ఇతర నెట్వర్క్ సిమ్‌లను ఉపయోగించే అవకాశం లేకపోవడంతో ఇవి వృథాగా మారనున్నాయి. ప్రజాధనమూ ఖర్చయిపోయింది. సమయమూ వృథా.. జిల్లాలోని కొన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే డిజిటల్ తరగతులు నడుస్తున్నాయి. ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగ్గా అందకపోవడంతో డిజిటల్ పాఠాల్లో అంతరాయం కలుగుతోంది. పాఠశాలల సమాచారం కూడా ఆన్లైన్లోనే ఎంఈవో, డీఈఓ కార్యాలయాలకు అందజేస్తున్నారు. పాఠశాలల్లో ఇంటర్నెట్ సేవలు అందకపోవడంతో సమాచారం పంపేందుకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు మండల కేంద్రాలకు రావాల్సి వస్తోంది. దీంతో విలువైన బోధన సమయం వృథా అవుతోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం రిలయన్స్ నెట్‌వర్క్‌కు చెందిన జియో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని వైపై హాట్‌స్పాట్ రూటర్‌ను, జియో నానో సిమ్‌లను జిల్లా కేంద్రాలకు పంపిణీ చేసింది. పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్‌లకు అనుసంధానం చేసి ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చని ఆదేశాలను జారీ చేసింది. కానీ సిగ్నల్స్ లేనికారణంగా మళ్లీ అదే సమస్య ఏర్పడింది. సిగ్నల్స్ ఉంటే ఉపయోగమే.. పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. మిగిలిన కొద్దిరోజులు విద్యార్థులకు చాలా అమూల్యమైనవి. మోడల్ టెస్టుల అనంతరం వెనుకబడిన సబ్జెక్టులలో పునశ్చరణ, ముఖ్యమైన పాయింట్లు, బిట్లు, ఇతర సబ్జెక్టు వివరాలను బోధించేందుకు డిజిటల్ తరగతులు చాలా ఉపయోగపడతాయి. సైన్స్, మ్యాథ్స్ ఇతర సబ్జెక్టులను ప్రాక్టికల్‌గా, యానిమేషన్ చిత్రాల ద్వారా సులభరీతిలో బోధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందచేసిన వైఫై సేవలు కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఉపయోగపడుతుండగా, మరికొన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఉపయోగపపడం లేదు. జిల్లాలో వైఫై సేవలు పాక్షికంగానే మిగిలిపోనున్నాయి. వైఫై సామగ్రిఅందచేసిన పాఠశాలలు ఇవే: కరకగూడెం – 02 కొత్తగూడెం –06 పినపాక –04 లక్ష్మీదేవిపల్లి –04 చర్ల –04 పాల్వంచ –10 దుమ్ముగూడెం –03 బూర్గంపాడు –07 అశ్వాపురం –04 భద్రాచలం –03 మణుగూరు –02 ములకలపల్లి –03 గుండాల –01 దమ్మపేట –07 ఆళ్లపల్లి –01 అశ్వారావుపేట –06 ఇల్లెందు –06 టేకులపల్లి –06 జూలూరుపాడు –04 చండ్రుగొండ –03 అన్నపురెడ్డిపల్లి –02 చుంచుపల్లి –04 సుజాతనగర్ –03 -
31 నుంచి వాట్సాప్ పనిచేయదు
శాన్ఫ్రాన్సిస్కో: ఈ నెల 31 నుంచి మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలను కొన్ని మొబైల్ ప్లాట్‌ఫాంలకు నిలిపేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో బ్లాక్‌బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, అంతకంటే పాత ప్లాట్‌ఫాంలకు వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్డేట్స్ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా ఆగిపోవచ్చని పేర్కొంది. ఈ ఓఎస్‌లు వాడుతున్న వారు కొత్త ఓఎస్ వెర్షన్ (ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0+, ఐఫోన్ ఓఎస్ 7+, విండోస్ ఫోన్ 8.1+)లోకి అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా వాట్సాప్ సేవలను పొందవచ్చని తెలిపింది. అలాగే నోకియా ఎస్40 ఫోన్లలో వాట్సాప్ ఈ నెల 31 తర్వాత పనిచేయదని పేర్కొంది. -
పర్యవేక్షణ లోపమే
- ఆనాడే స్పందించి ఉంటే ముప్పు తప్పేది - 8 నెలల కిందటే పీఏబీఆర్‌లో పనిచేయని విద్యుత్ మోటార్ - ప్రత్యామ్నాయ మోటార్ సైతం 3 రోజులుగా మొరాయింపు - 834 గ్రామాలకు ఆగిన ‘శ్రీరామరెడ్డి’ తాగునీటి సరఫరా అధికారులు, పాలకుల నిర్లక్ష్యంపై మండిపడుతున్న ప్రజలు అనంతపురం సిటీ : శ్రీరామరెడ్డి తాగునీటి పథకం నిర్వహణపై అధికారుల్లో చిత్తశుద్ధి లోపించింది. జిల్లాలో వందలాది గ్రామాలకు నీటిని అందించే ఈ పథకం పట్ల నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నుంచి శ్రీరామరెడ్డి పథకం ద్వారా 834 గ్రామాలకు, హిందూపురం, కళ్యాణదుర్గం, మడకశిర మునిసిపాలిటీలకు తాగునీరు ఇస్తున్నారు. ఎనిమిది నెలల క్రితమే పీఏబీఆర్‌లో విద్యుత్ మోటార్ చెడిపోయింది. ప్రత్యామ్నాయ మోటార్‌తో నీటిని పంపింగ్ చేస్తూ వచ్చారు. అయితే.. చెడిపోయిన మోటారును రిపేరీ చేయించలేదు. మూడు రోజుల కిందట ‘ప్రత్యామ్నాయ’ మోటారు కూడా చెడిపోయి.. నీటి సరఫరాకు బ్రేక్ పడింది. గ్రామాలు దాహంతో అల్లాడుతున్నాయి. నీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో అధికారులు నిద్రమత్తు నుంచి తేరుకున్నారు. హడావుడిగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. మోటారు మరమ్మతుకు రంగంలోకి దిగారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చాలాసార్లు పీఏబీఆర్‌ను సందర్శించినప్పటికీ అక్కడి సమస్యలను గుర్తించడంలో విఫలమయ్యారు. ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నిలదీసేసరికి చలనం వచ్చింది. యావత్ జిల్లా యంత్రాంగం శనివారం అర్ధరాత్రి దాకా పీఏబీఆర్ వద్దే తిష్టవేసింది. అయితే..ఆదివారం రాత్రికి గానీ మరమ్మతు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. మూలనపడ్డ మొదటి మోటార్ రిపేరీ కోసం పది రోజుల కిందటే రూ.20లక్షల నిధులు మంజూరయ్యాయి. వాటిని వినియోగించి మోటారును సరిచేసి ఉంటే.. నేడు నీటి సరఫరాకు ఆటంకం కలిగేది కాదు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల చిత్తశుద్ధిలోపం వల్లే ఇంతటి సమస్యకు దారి తీసిందని ప్రజలు మండిపడుతున్నారు. పంప్‌హౌస్‌లో మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ను అందుబాటులో ఉంచి, ఎప్పటికప్పుడు మోటార్లను పర్యవేక్షిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. -
మీరు ఎందుకు తెలివిగా ప్రవర్తించడం లేదు..?
-
ఖానాపూర్ బూత్ నెం.73లో పనిచేయని ఫ్యాన్ గుర్తు బటన్