అక్టోబర్ నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎందుకంటే! | WhatsApp To Stop Working On These 18 Android Phones From October 24; Check Full List Here - Sakshi
Sakshi News home page

WhatsApp: అక్టోబర్ 24 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎందుకంటే!

Published Mon, Sep 25 2023 6:29 PM | Last Updated on Mon, Sep 25 2023 6:48 PM

Whatsapp Stop Working On These Android Phones From October 24th - Sakshi

ఆధునిక కాలంలో వాట్సాప్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ యాప్ ఆధునిక అవసరాలను అనుకూలంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. ఇందులో వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తూ.. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో బహుశా కొన్ని పాత మొబైల్స్‌లో వాట్సాప్ యాప్ పనిచేయక పోవచ్చు. ఈ కథనంలో ఏ ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2023 అక్టోబర్ 24 తరువాత ఆండ్రాయిడ్ OS వెర్షన్ 4.1, అంతకంటే అంతకు ముందు వెర్షన్‌లతో కూడిన ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదని కంపెనీ తెలిపింది. ఈ జాబితాలో ఏకంగా 20 కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌లు ఉండటం గమనార్హం.

  • సోనీ ఎక్స్‌పీరియా జెడ్
  • ఎల్‌జీ ఆప్టిమస్ జీ ప్రో
  • శాంసంగ్ గ్యాలక్సీ ఎస్2
  • శాంసంగ్ గ్యాలక్సీ నెక్సస్
  • హెచ్‌టీసీ సెన్సేషన్
  • మోటోరోలా డ్రోయిడ్ రేజర్ (Motorola Droid Razr)
  • సోనీ ఎక్స్‌పీరియా ఎస్2
  • మోటోరోలా జూమ్ 
  • శాంసంగ్ గ్యాలక్సీ టాబ్ 10.1
  • ఆసుస్ ఈ ప్యాడ్ ట్రాన్స్‌ఫార్మర్ (Asus Eee Pad Transformer)
  • ఏసర్ ఐకానియా ట్యాబ్ ఏ5003
  • శాంసంగ్ గ్యాలక్సీ ఎస్
  • హెచ్‌టీసీ డిజైర్ హెచ్‌డీ
  • ఎల్‌జీ ఆప్టిమస్ 2ఎక్స్
  • సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా Arc3
  • నెక్సస్ 7 (ఆండ్రాయిడ్ 4.2కి అప్‌గ్రేడబుల్)
  • శాంసంగ్ గ్యాలక్సీ నోట్ 2
  • హెచ్‌టీసీ వన్

ఇదీ చదవండి: వందే భారత్‌లో 6 నెలలు అవన్నీ బ్యాన్.. ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!

ఈ జాబితాలోని మొబైల్స్ అన్నీ దాదాపు పాత మోడల్స్. కావున ఇవి చాలా తక్కువమంది వద్ద మాత్రమే ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే వాట్సాప్ వినియోగిస్తున్న వారు దీన్ని అప్డేట్ చేసుకోవాలి, లేకుంటే వాట్సాప్ ఆపరేటింగ్ సిస్టం ఆగిపోతుంది. 

మీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ OS వెర్షన్ చెక్ చేయడం ఎలా?
మీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ OS వెర్షన్ 4.1 లేదా అంతకంటే పాత మొబైల్ అవునా కాదా అని చెక్ చేయాలంటే మీ మొబైల్‌లో సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి, అబౌట్ ఫోన్ (About Phone) క్లిక్ చేసి అందులో సాఫ్ట్‌వేర్ వివరాలు చూడవచ్చు. దీన్ని బట్టి మీ మొబైల్ వాట్సాప్ వినియోగానికి ఉపయోగపడుతుందా.. లేదా అనేది తెలిసిపోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement