ఈ ఫోన్లలో వాట్సాప్‌ బంద్‌! | WhatsApp to stop working on older smartphones in 2020 | Sakshi
Sakshi News home page

ఈ ఫోన్లలో వాట్సాప్‌ బంద్‌!

Published Thu, Dec 12 2019 2:12 AM | Last Updated on Thu, Dec 12 2019 11:40 AM

WhatsApp to stop working on older smartphones in 2020 - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి పలు పాత స్మార్ట్‌ఫోన్లలో ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌ పనిచేయదు. ఈ విషయాన్ని తన ఎఫ్‌ఏక్యూ సెక్షన్‌లో వాట్సాప్‌ పేర్కొంది. ఆండ్రాయిడ్‌ 2.3.7, అంతకు ముందు ఉన్న పాత వర్షన్‌లపై నడిచే ఫోన్లు, ఐవోఎస్‌ 8, దానికి ముందరి ఓఎస్‌లపై నడిచే ఐఫోన్లలో వచ్చే ఏడాది నుంచి వాట్సాప్‌ పని చేయదు. ఈ పాత ఫోన్లలో ఫిబ్రవరి 1 తర్వాత వాట్సాప్‌ ఖాతాను క్రియేట్‌ చేసుకోవడం కానీ, ఉన్న ఖాతాను పునరుద్ధరించుకోవడం కానీ కుదరదు. అన్ని రకాల విండోస్‌ ఫోన్లకు కూడా 2019 డిసెంబర్‌ 31 నుంచి తమ సేవలు ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. అదే నెలలో మైక్రోసాఫ్ట్‌ కంపెనీ కూడా విండోస్‌ 10 మొబైల్‌ ఓఎస్‌ సేవలు కూడా నిలిపేయనుంది. ఫేస్‌బుక్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న వాట్సాప్‌ ఎప్పటికప్పుడు తన యాప్‌ను అప్‌డేట్‌ చేస్తూ ఉంది. ఫోన్‌ బ్యాటరీ వాడకం తగ్గేలా ‘డార్క్‌ మోడ్‌’ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ ఫోన్లలో పనిచేయదు..
► ఆండ్రాయిడ్‌ 2.3.7 ఆపరేటింగ్‌ సిస్టం
►   ఐవోఎస్‌ 8 ఆపరేటింగ్‌ సిస్టం ఐఫోన్లు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement