windows 10
-
టెక్ దిగ్గజం ఒక్క నిర్ణయం.. చెత్తలోకి 24 కోట్ల కంప్యూటర్లు!
మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్-10నేనా? అయితే వెంటనే జాగ్రత్త పడండి. వేలు పోసి కొనుక్కున్న ఆ కంప్యూటర్/ల్యాప్‌టాప్ నిరుపయోగంగా మారే అవకాశాలున్నాయి. ఎందుకంటారా.. విండోస్-10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఇప్పటివరకూ ఇస్తున్న సపోర్ట్‌ను నిలిపివేసే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 24 కోట్ల కంప్యూటర్లు నిరుపయోగంగా మారతాయని 'కెనాలిస్ రీసెర్చ్' తాజా నివేదికలో వెల్లడించింది. మరిన్ని వివరాలు... మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ 10కు సపోర్ట్ చేయడం నిలిపేస్తే.. చాలా మంది అలాంటి కంప్యూటర్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపరు. దీంతో ఇవన్నీ పనికిరాని వస్తువులుగా మిగిలిపోవాల్సి వస్తుంది, తద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ వ్యర్దాల బరువు సుమారు 3.20 లక్షల కార్ల బరువుకు సమానంగా ఉండొచ్చని, దీన్ని బట్టి చూస్తే ఎలక్ట్రిక్ స్క్రాప్ భవిష్యత్తులో ఏ స్థాయిలో పెరుగుతాయనేది ఇప్పుడే అర్థమైపోతోంది. విండోస్ 10కు సపోర్టు నిలిచిపోయినప్పటికీ కంప్యూటర్లను మరికొన్నేళ్ల పాటు వాడుకోవడానికి అవకాశం ఉంది, కానీ సేఫ్టీ అప్డేట్స్ లేని కారణంగా ఎక్కువమంది కొత్త కంప్యూటర్లను కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో.. ఇవన్నీ నిరుపయోగమే అవుతాయి. ఇదీ చదవండి: భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్ - కారణం ఇదే! నిజానికి మైక్రోసాఫ్ట్ గతంలోనే ఓ సందర్భంలో.. 2025 నాటికి విండోస్ 10కు సపోర్ట్ నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పుడు సెక్యూరిటీ అప్డేట్స్ 2028 వరకు వార్షిక ఫీజుతో అందించనున్నట్లు సమాచారం, ఈ వార్షిక ఫీజు చెల్లించడానికి బదులు అప్డేటెడ్ కంప్యూటర్లను కొనుగోలు చేయొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో స్క్రాప్‌కు వెళ్లే పాత కంప్యూటర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని కెనాలిస్ రిపోర్ట్ వెల్లడించింది. -
ల్యాప్‌టాప్ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి!
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విద్యార్థులు స్కూల్, కాలేజీ వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం క్లాస్ లు అన్నీ ఇంట్లో నుంచే ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రస్తుతం డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్దులకు ల్యాప్‌టాప్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ మీరు కొత్తగా ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలని చూస్తుంటే, కొనే ముందు ఒకసారి ఈ విషయాలను గుర్తుంచుకోండి. బడ్జెట్ రూ.50,000 లోపు ఉండాలి కేవలం స్కూల్ లేదా కాలేజీ విద్యార్దుల కోసం విండోస్ ల్యాప్‌టాప్ తీసుకోవాలని అనుకుంటే దానిపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. హెచ్ పీ, డెల్, ఏసర్, ఆసుస్ వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు రూ.30,000-రూ.50,000 ధరలో బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ లు తీసుకొస్తున్నాయి. ఫుల్హెచ్డీ డిస్ప్లే సరిపోతుంది ల్యాప్‌టాప్ అధిక రిజల్యూషన్ డిస్ ప్లే ప్యానెల్ వల్ల భారీగా ధర పెరుగుతుంది కనుక అలాంటి డిస్ ప్లే గల ల్యాప్‌టాప్ అవసరం లేదు. ఫుల్ హెచ్ డీ(1920 8 1080 పీక్సెల్స్) డిస్ ప్లే గల ల్యాప్‌టాప్ తీసుకున్న సరిపోతుంది. ఇంకా తక్కువ ధరకు ల్యాప్‌టాప్ తీసుకోవాలి అనుకుంటే 1366 * 768 పీక్సెల్స్ ల్యాపీ తీసుకోవచ్చు. ప్రాసెసర్ ముఖ్యమే ఇంటెల్ కోర్ ఐ3 వంటి ల్యాప్‌టాప్ లు ఇంకా మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ మరికొన్ని సంవత్సరాల పాటు మీరు వాడుతారు కాబట్టి కోర్ ఐ5 ప్రాసెసర్ గల ల్యాప్‌టాప్ తీసుకుంటే మంచిది. ర్యామ్ ఎంత అవసరం మీ ల్యాప్‌టాప్ లో కనీసం 8జీబీ ర్యామ్ ఉండేలా చూసుకోండి. ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలకు మీకు ఇది మంచిగా సరిపోతుంది. 4 జీబీ ర్యామ్ మాత్రం తీసుకోకండి. హార్డ్ డ్రైవ్ ఎంత ఉండాలి మీ అవసరాల కోసం 512జీబీ హెచ్ డీడీ లేదా 256జీబీ ఎస్ఎస్ డీ గల ల్యాప్‌టాప్ సరిపోతుంది. మీ దగ్గర కనుక కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే 512జీబీ ఎస్ఎస్ డీ గల ల్యాప్‌టాప్ తీసుకోండి. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఓఎస్ మీ ల్యాప్‌టాప్ లో ఒరిజినల్ విండోస్ 10 ఓఎస్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు చాలా కంపెనీ ఉచితంగా విండోస్ 10 ఓఎస్ ను అందిస్తున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడం మంచిది. దీని వల్ల మీరు సైబర్ బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే, మైక్రోసాఫ్ట్ ఆఫీసు 365 ఉంటే మంచిది. చదవండి: సైబర్ పవర్లో ఇజ్రాయిల్ కంటే వెనుకనే భారత్! -
ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్ గేమింగ్ ల్యాప్‌టాప్ విడుదల
తైవాన్‌కు చెందిన ఎల్రక్టానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ ఆసుస్.. ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్ గేమింగ్ ల్యాప్‌టాప్ ‘ఆర్ఓజీ ఫ్లో ఎక్స్ 13’ను అభివృద్ధి చేసింది. దీంతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడిన జిఫిరస్ సిరీస్‌లో మూడు కొత్త శ్రేణి ల్యాప్‌టాప్‌లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. 13 అంగుళాలతో ఏఎండీ రైజెన్ 5900హెచ్ఎస్, 5900హెచ్ఎక్స్ ప్రాసెసర్లతో కూడిన ఆర్ఓజీ ఫ్లో ఎక్స్ 13 ల్యాప్‌టాప్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్ఓజీ జెఫిరస్ డ్యూయో 15 ఎస్ఈ, జీ14, జీ15 మూడు కొత్త శ్రేణి ల్యాప్‌టాప్‌ల ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యమవుతాయని పేర్కొంది. ఆసుస్ ఆర్ఓజీ ఫ్లో ఎక్స్ 13 విండోస్ 10 ల్యాప్‌టాప్ మీ రోజువారీ అవసరాల కోసం 13.4 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో ఏఎమ్ డీ ఆక్టా కోర్ రైజెన్ 9 5900 హెచ్ఎస్ ప్రాసెసర్ ఉంది, దీనితో పాటు 16 జిబి ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డి స్టోరేజ్ ఉంది. గ్రాఫిక్స్ కార్డ్ విషయానికొస్తే, ఇందులో ఎన్విడియా జిఫోర్స్ ఆర్టిఎక్స్ 1650 గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. ఇది 1.3 కిలోల బరువు ఉంటుంది. దీని ధర భారతదేశంలో 1,19,990 రూపాయలు. చదవండి: వ్యాక్సిన్ వేసుకున్న వారికి బ్యాంకుల బంపర్ ఆఫర్! -
ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి పలు పాత స్మార్ట్ఫోన్లలో ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ పనిచేయదు. ఈ విషయాన్ని తన ఎఫ్ఏక్యూ సెక్షన్లో వాట్సాప్ పేర్కొంది. ఆండ్రాయిడ్ 2.3.7, అంతకు ముందు ఉన్న పాత వర్షన్లపై నడిచే ఫోన్లు, ఐవోఎస్ 8, దానికి ముందరి ఓఎస్‌లపై నడిచే ఐఫోన్లలో వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ పని చేయదు. ఈ పాత ఫోన్లలో ఫిబ్రవరి 1 తర్వాత వాట్సాప్ ఖాతాను క్రియేట్ చేసుకోవడం కానీ, ఉన్న ఖాతాను పునరుద్ధరించుకోవడం కానీ కుదరదు. అన్ని రకాల విండోస్ ఫోన్లకు కూడా 2019 డిసెంబర్ 31 నుంచి తమ సేవలు ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. అదే నెలలో మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా విండోస్ 10 మొబైల్ ఓఎస్ సేవలు కూడా నిలిపేయనుంది. ఫేస్బుక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యాప్‌ను అప్డేట్ చేస్తూ ఉంది. ఫోన్ బ్యాటరీ వాడకం తగ్గేలా ‘డార్క్ మోడ్’ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఫోన్లలో పనిచేయదు.. ► ఆండ్రాయిడ్ 2.3.7 ఆపరేటింగ్ సిస్టం ► ఐవోఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం ఐఫోన్లు.. -
రూ.14వేలకే ల్యాప్‌టాప్
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల్లో ల్యాప్‌టాప్ లను అందించే ఐబాల్ సంస్థ తాజాగా మరో నూతన ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. కాంప్బుక్ మెరిట్ జీ9 పేరుతో విండోస్ 10 ల్యాప్‌టాప్‌ను తాజాగా విడుదల చేసింది. కేవలం రూ.13,999 ధరకే ఈ ల్యాప్‌టాప్ వినియోగదారులకు లభిస్తున్నది. 1.1కేజీల అతి తేలికపాటి బరువుతో తమ ల్యాప్‌టాప్‌లో సెల్రాన్ ఎన్3350 ప్రాసెసర్ , మల్టీ ఫంక్షనల్ టచ్ ప్యాడ్, ఆరు గంటల బ్యాటరీ లైఫ్ ప్రధాన ఫీచర్లుగా కంపెనీ చెబుతోంది. గత ఫిబ్రవరిలో తక్కువ ధరలో లాంచ్ చేసిన ప్రీమియో వి2.0 ధరకంటే కూడా చవకగా ధరలో దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. మంచి ఫీచర్లు, బడ్జెట్ ధర, రీజనబుల్ మెమొరీతో చూడటానికి ఆకట్టుకునేలా దీన్ని రూపొందించింది. ఐబాల్ కాంప్బుక్ మెరిట్ జీ9 11.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1366x768 పిక్సెల్స్ రిజల్యూషన్ 2.4గిగాహెడ్జ్ ఇంటెల్ సెల్రాన్ ఎన్ 3350 ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీ ద్వారా ఒక టీబీ దాకా దాకా కూడా విస్తరించుకునే అవకాశం కూడా కల్పించింది. 5000 ఎంఏహెచ్ లి-పాలిమర్ బ్యాటరీ 0.3 మెగాపిక్సెల్ వెబ్ కెమెరా డ్యుయల్ బ్యాండ్ వైర్లెస్ ఏసీ3165, బ్లూటూత్ 4.0, మినీ హెచ్డీఎంఐ 4.1పోర్ట్, 2.0.+ 3.0 యూఎస్బీ పోర్ట్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఐబాల్ కాంప్బుక్ మెరిట్ జీ9 రోజువారీ కస్టమర్ల కంప్యూటింగ్ అవసరాలను తీర్చడంకోసం ప్రీమియం డిజైన్‌తో ఆల్-ఇన్-వన్ ల్యాప్ట్యాప్కు రూపకల్పన చేశామని ఐబాల్ డైరెక్టర్, సీఈఓ సందీప్ పరశాంపురియా ఒక ప్రకటనలో తెలిపారు. -
లావా తొలి ల్యాప్‌ట్యాప్..ధరెంతో తెలుసా?
మొబైల్, టాబ్లెట్ల తయారీలో దేశీయంగా ఎంతో పేరు సంపాదించుకున్న లావా తన మొట్టమొదటి ల్యాప్‌ట్యాప్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మైక్రోసాఫ్ట్, ఇంటెల్ భాగస్వామ్యంతో తన తొలి ల్యాప్‌ట్యాప్ హీలియం 14ను రూపొందించింది. ఎంతో తేలికైనదిగా రూపొందించిన ఈ ల్యాప్‌ట్యాప్ ధర రూ.14,999గా కంపెనీ పేర్కొంది. హీలియం 14 ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపికచేసిన రిటైల్ స్టోర్లు, ఢిల్లీ ఎన్సీఆర్, కోయంబత్తూరు, హైదరాబాద్, బెంగళూరుల మల్టి-బ్రాండు అవుట్ లెట్లలో జూలై తొలివారం నుంచి విక్రయానికి తీసుకురానున్నట్టు కంపెనీ పేర్కొంది. లావా హీలియం 14 పేరు ప్రకారమే 14.1 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేను కలిగి ఉంది. విండోస్ 10 హోమ్ ఎడిషన్ దీనిలో ప్రీలోడెడ్‌గా వస్తోంది. ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్‌ను ఇది అందిస్తోంది. 2జీబీ ర్యామ్, 32జీబీ బిల్ట్-ఇన్ స్టోరేజ్‌తో వచ్చిన ఈ ల్యాపీలో ఎస్డీ కార్డు ద్వారా 128జీబీ వరకు విస్తరణ మెమరీకి అవకాశముంది. రోజంతా వాడుకోవడానికి వీలుగా 10,000ఎంఏహెచ్ బ్యాటరీని ఇది అందిస్తోంది. ఈ ల్యాపీ 1.4కేజీల బరువు కలిగిఉంది. సిల్వర్, పర్పుల్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది. డిజిటల్ ఇండియాలో భాగస్వాములుగా చేయడానికి సరసమైన ధరలో పర్సనల్ కంప్యూటింగ్ డివైజ్‌లను తమ పార్టనర్స్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ఇండియా కన్జ్యూమర్ అండ్ డివైజెస్ సేల్స్ దేశీయ జనరల్ మేనేజర్ ప్రియదర్శి మోహపాత్ర చెప్పారు. లావాతో కలిసి వీటిని రూపొందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. -
విండోస్ 10లోకి మారతారా.. లేదా?
మీ దగ్గర అధునాతన కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉందా? దాంట్లో ఓఎస్ ఏం వాడుతున్నారు? విండోస్ 7 గానీ, 8 గానీ వాడుతుంటే.. వెంటనే విండోస్ 10కు అప్‌గ్రేడ్ కావాలట. అందుకోసం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ విండోస్ యూజర్లను బలవంతపెడుతోంది. కోర్ ఐ3, ఐ5, క్వాల్కామ్ 8996 లాంటి ప్రాసెసర్లు ఉన్న యూజర్లందరూ తమ సిస్టంలను విండోస్ 10కు అప్‌గ్రేడ్ చేసుకోవాలని పదే పదే సందేశాలు వస్తున్నాయి. యూజర్లు విండోస్ అప్డేట్ను రన్ చేయడానికి ప్రయత్నిస్తే, కొత్త అప్డేట్లు రావడం లేదని, దానికి బదులు "కోడ్ 80240037 విండోస్ అప్డేట్ ఎన్కౌంటర్డ్ యాన్ అన్నోన్ ఎర్రర్'' అనే ఎర్రర్ సందేశం చూపిస్తోందని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త సాఫ్ట్వేర్లు, అప్లికేషన్లు వస్తుండటంతో వాటికి విండోస్ లేటెస్ట్ వెర్షన్ ఉంటేనే సపోర్ట్ చేస్తున్నాయని, అందువల్ల యూజర్లంతా వీలైనంత వరకు విండోస్ 10కు మారితేనే మంచిదని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు అన్నారు. పాత వెర్షన్లకు సపోర్ట్ ఇచ్చుకుంటూ పోవడం కంటే కొత్త వెర్షన్లో అయితే ఇప్పటికే సపోర్ట్ ఉన్నందున దానికి మారితే మేలని చెప్పారు. ఇప్పటికే ఎక్స్‌పీకి పూర్తిగా సపోర్ట్ తీసేసిన మైక్రోసాఫ్ట్.. ఇండోస్ 7కు కూడా కొంతకాలం తర్వాత సపోర్ట్ తీసేస్తామని ప్రకటించింది. ఈలోపే ఇప్పుడు విండోస్ 10కు మారాలంటూ చెబుతోంది. ఇంటెల్ స్కైలేక్ ప్రాసెసర్లు కూడా జూలై తర్వాత విండోస్ 7, 8ల మీద పనిచేయబోవని, అందువల్ల తప్పనిసరిగా యూజర్లు తమ ఆపరేటింగ్ సిస్టమ్‌ను మార్చుకోవాలని చెబుతున్నారు. -
విండోస్ 10కు కొత్త ఫేస్ బుక్, మెసెంజర్ యాప్స్
న్యూయార్క్ : ఎన్నో నెలల బీటా టెస్టింగ్ అనంతరం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, విజయవంతంగా కొత్త ఫేస్ బుక్, మెసెంజర్ యాప్ లను విండోస్ 10 లో ప్రవేశపెట్టింది. అదేవిధంగా విండోస్ 10లో ఫోటో షేరింగ్ ఇన్ స్టాగ్రామ్ యాప్ ను కూడా అప్ డేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ యాప్ లను కేవలం విండోస్ 10 డెస్క్ టాప్ పైనే ప్రవేశపెట్టింది. విండోస్ 10 మొబైల్ ఫోన్లకు ఇవి సపోర్టు చేయవని ఫేస్ బుక్ పేర్కొంది. విండోస్ 10 ఫోన్లకి ఈ ఏడాది చివరిలో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ వర్సన్ లకు సమానంగా, అన్నీ రకాలైన ఫీచర్లతో (కామెంట్లకు ప్రతిస్పందనలు తెలపడం, స్టికర్లను యాడ్ చేసుకోవడం, ఈవెంట్ రిమైండర్లు, బర్త్ డేలకు కాలమ్) విండోస్ 10 వినియోగదారుల ముందుకు ఈ యాప్ లను తీసుకొచ్చింది. యాజర్లు న్యూస్ ఫీడ్ కు ఆర్టికల్స్ ను షేర్ చేసుకోవడానికి కూడా వీలుగా ఈ యాప్ ఉంటుందని కంపెనీ చెప్పింది. కానీ లైవ్ వీడియో బ్రాండ్ కాస్టింగ్ కు మాత్రం ఇది సపోర్టు చేయదని, త్వరలో దాన్ని కూడా ప్రవేశపెడతామని తెలిపింది. ఫేస్ బుక్ యాప్ మాదిరిగానే మెసెంజర్ యాప్ కూడా అన్నింటికీ వీలుగా ఉంటుందని పేర్కొంది. ఫోటోలు, వీడియోలు, చెల్లింపులు, వీడియో, వాయిస్ కాలింగ్ లకు మాత్రం మెసెంజర్ యాప్ ఇప్పట్లో సపోర్టు చేయదని, కొద్ది కాలం అనంతరం దాన్ని అప్ డేట్ చేస్తామని ఫేస్ బుక్ వెల్లడించింది. -
విండోస్ 10 ఉచిత ట్రయల్ ప్యాకేజీ
శాన్ఫ్రాన్సిస్కో: కార్యాలయాల్లో పెద్ద మొత్తంలో వాడే కంప్యూటర్లకు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ని 90 రోజుల పాటు ఉచిత ట్రయల్ వెర్షన్ ఇచ్చేందుకు మైక్రోసాప్ట్ ముందుకొచ్చింది. ఈ సంస్థ బుధవారం విండోస్ 10ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లకు ఉచిత అప్‌గ్రేడ్‌ని ఇచ్చిన ఆ సంస్థ కార్యాలయాల్లో వినియోగానికి మాత్రం ఉచిత అప్‌గ్రేడ్‌ని ఇవ్వలేదు. లెసైన్స్ ఫీజు చెల్లించి ఎంటర్ప్రెన్యూర్వర్షన్ను కోనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సంస్థల కోసం 90 రోజుల పాటు ఉచిత ట్రయల్ ప్యాకేజీని ప్రకటించింది. మళ్లీ స్టార్ట్ మెనూ... వాయిస్ ఆధారిత స్మార్ట్ అసిస్టెంట్ కోర్టానా, గేమింగ్ కోసం ఎక్స్‌బాక్స్ యాప్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్థానంలో కొత్త వెబ్ బ్రౌజర్ 'మైక్రోసాఫ్ట్ ఎడ్జ్' మొదలైనవి కొత్త వెర్షన్లో ఉండే ఫీచర్లు. విండోస్ 7, అంతకు పూర్వపు వెర్షన్ల తరహాలోనే విండోస్ 10లో మళ్లీ స్టార్ట్ మెనూకి చోటు కల్పించారు. అలాగే ఫోటోలు, మ్యాప్స్, మ్యూజిక్, సినిమాల కోసం ప్రత్యేకంగా బిల్టిన్ యాప్స్ ఇందులో ఉన్నాయి. కోర్టానా ఫీచర్ మాత్రం భారత్‌లో అందుబాటులోకి రావడానికి మరికాస్త సమయం పడుతుంది. -
విండోస్ 10 వచ్చేసింది..
-
విండోస్ 10 వచ్చేసింది..
♦ భారత్ సహా 190 దేశాల్లో అందుబాటులోకి ♦ నమోదు చేసుకుంటే ఉచిత అప్‌గ్రేడేషన్ న్యూఢిల్లీ : సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ బుధవారం తమ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 10’ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఢిల్లీ సహా ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో దీన్ని ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్.. సుమారు 190 దేశాల్లో విండోస్ 10ను బుధవారం నుంచే అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ఆవిష్కరణగా కెన్యాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. 50 లక్షల మంది పైగా యూజర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ప్రకారం దీన్ని తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. ‘‘విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లలోకెల్లా ఇది అత్యంత సురక్షితమైన వెర్షన్. పీసీల నుంచి ట్యాబ్లెట్లు, ఫోన్లు, ఎక్స్‌బాక్స్ మొదలైన అన్నిటికీ ఇది అనుకూలంగా ఉంటుంది’’ అని చెప్పారాయన. సిసలైన విండోస్ 7 లేదా విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్న వారికి విండోస్ 10 అప్‌గ్రేడింగ్ ఉచితంగా అందిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ (విండోస్ అండ్ డివెజైస్ గ్రూప్) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టెర్రీ మయర్సన్ తెలిపారు. ఇందుకోసం నమోదు చేసుకున్న వారికి అప్‌గ్రేడ్ ఎప్పుడు అందించేదీ నోటిఫై చేస్తామని ఆయన తెలియజేశారు. భారత మార్కెట్లో యూజర్లకు ఉపయోగపడేలా యాప్స్ తయారీ కోసం కంపెనీ పలువురు డెవలపర్లతో కలసి పనిచేస్తోంది. ఇప్పటికే జొమాటో, బుక్ మై షో, జబాంగ్, మొబిక్విక్, గానా వంటి సంస్థలతో చేతులు కలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల పైచిలుకు విండోస్ యూజర్లు ఉన్నారని అంచనా. మళ్లీ స్టార్ట్ మెనూ... వాయిస్ ఆధారిత స్మార్ట్ అసిస్టెంట్ కోర్టానా, గేమింగ్ కోసం ఎక్స్‌బాక్స్ యాప్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్థానంలో కొత్త వెబ్ బ్రౌజర్ ‘మైక్రోసాఫ్ట్ ఎడ్జ్’ మొదలైనవి కొత్త వెర్షన్లో ఉండే ఫీచర్లు. విండోస్ 7, అంతకు పూర్వపు వెర్షన్ల తరహాలోనే విండోస్ 10లో మళ్లీ స్టార్ట్ మెనూకి చోటు కల్పించారు. అలాగే ఫోటోలు, మ్యాప్స్, మ్యూజిక్, సినిమాల కోసం ప్రత్యేకంగా బిల్టిన్ యాప్స్ ఇందులో ఉన్నాయి. కోర్టానా ఫీచర్ మాత్రం భారత్‌లో అందుబాటులోకి రావడానికి మరికాస్త సమయం పడుతుందని మైక్రోసాప్ట్ ఇండియా డెరైక్టర్ (విండోస్ బిజినెస్ గ్రూప్) వినీత్ దురాని తెలిపారు. -
ఈ నెల 29న విండోస్ 10 ఆవిష్కరణ
న్యూఢిల్లీ సహా 13 నగరాల్లో రిలీజ్ ఉచితంగా అప్‌గ్రేడ్ పరిమిత కాలానికే న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఆపరేటింగ్ సిస్టమ్‌లో లేటెస్ట్ వెర్షన్, విండోస్ 10ను జులై 29న ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో ఆవిష్కరించనుంది. న్యూయార్క్ సిటీ, సిడ్నీ, టోక్యో, బీజింగ్ తదితర ఇతర నగరాలతో పాటు న్యూఢిల్లీ కూడా ఈ జాబితాలో ఉంది. ఇప్పటిదాకా ఉన్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్న వారు కొత్త వెర్షన్‌కు ఉచితంగా అప్‌గ్రేడ్ అయ్యేందుకు పరిమిత కాలం పాటు మైక్రోసాఫ్ట్ ఆఫర్ ఇస్తోంది. విండోస్ 8/8.1 లేదా 7 వెర్షన్‌ను ఉపయోగిస్తున్న డివైజ్‌లకు ఉచిత అప్‌గ్రేడ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. పర్సనల్ కంప్యూటర్స్, ట్యాబ్లెట్స్, స్మార్ట్‌ఫోన్స్, ఇతర గ్యాడ్జెట్స్‌ను ఒకదానితో మరొకటి అనుసంధానించుకుని ఉపయోగించుకునేందుకు కొత్త వెర్షన్ ఉపయోగపడుతుంది. కొత్త శకానికి నాంది... పర్సనల్ కంప్యూటింగ్‌కు సంబంధించి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం కొత్త శకానికి నాంది పలకగలదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. ఫోన్స్ నుంచి మైక్రోసాఫ్ట్ తొలి హోలోగ్రాఫిక్ కంప్యూటర్ దాకా ప్రతి డివైజ్ పైనా ఇది పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ వరల్డ్‌వైడ్ పార్ట్నర్ కాన్ఫరెన్స్ 2015లో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. పర్సనల్ కంప్యూటింగ్, ఉత్పాదకతను పెంచుకోవడం, మరింత మెరుగైన క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడమనే మూడు అంశాలపై మైక్రోసాఫ్ట్ ప్రధానంగా దృష్టి సారిస్తోందని నాదెళ్ల పేర్కొన్నారు. కంపెనీపరమైన కొత్త ప్రణాళికల గురించి వ్యాపార భాగస్వాములకు వివరించేందుకు మైక్రోసాఫ్ట్ ఏటా పార్ట్నర్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. -
2015లో అందుబాటులోకి రానున్న విండోస్ 10
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను మైక్రోసాప్ట్ లాంఛ్ చేసింది. శాన్ఫ్రాన్సిస్కోలో గత నెల 30న ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా కార్యక్రమంలో దీనిని విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. విండోస్ 8ని 2012లో విడుదల చేశారు. దీనికి అంతగా ఆదరణ లభించలేదు. దీని తరువాత విండోస్ 9 వస్తుందని అందరూ ఎదురుచూస్తుండగా అనూహ్యంగా మైక్రోసాప్ట్ ఏకంగా విండోస్ 10ను విడుదల చేసింది. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎంటర్ప్రైజ్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని తయారు చేసినట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వెర్షన్ 2015లో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. ఒకప్పుడు విండోస్‌లో కొత్త వెర్షన్ వస్తోందంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొనేది. ఆండ్రాయిడ్, ఐఫోన్, ఐప్యాడ్ కారణంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై వినియోగదారులకు ఆసక్తి తగ్గింది. కంపెనీలు, ప్రభుత్వాలు తప్పితే ఇతరులు విండోస్ వాడకాన్ని బాగా తగ్గించారు. ఈ పరిస్థితుల్లో మైక్రోసాప్ట్ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఎక్కువగా దృష్టి పెడుతోంది. విండోస్‌ను కూడా మొబైల్ కంపెనీలకు ఉచితంగా ఇస్తూ విండోస్ మార్కెట్ వాటాను పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఎన్ని చేసినా విండోస్‌కు పూర్వ వైభవం దక్కే అవకాశం లేదని పరిశీలకుల అంచనా. అయితే క్లౌడ్ కంప్యూటింగ్‌లో మాత్రం మైక్రోసాప్ట్కు మంచి పట్టు లభిస్తుందని భావిస్తున్నారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కంప్యూటర్లు, టాబ్లెట్స్, ఫోన్లు... అన్నింటికీ ఉపయోగపడుతుందని మైక్రోసాప్ట్ సంస్థ తెలిపింది. ఇప్పటి వరకు తాము విడదల చేసిన ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అత్యుత్తమంగా నిలుస్తుందని మైక్రోసాప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ హెడ్ టెర్రీ మైర్సన్ చెప్పారు. ** -
వచ్చేస్తోంది విండోస్ 10!
మైక్రోసాఫ్ట్ ఒక నంబర్‌ను తప్పించింది. విండోస్ 8 సీరిస్ నుంచి ఒకేసారి విండోస్ 10కు అప్‌గ్రేడ్ అవుతున్నట్టుగా ప్రకటించింది. విండోస్ ఎయిట్ విషయంలో తీవ్రంగా నిరాశచెందామని.. విండోస్ టెన్ మాత్రం తమ గొప్ప ఎంటర్ప్రైజ్ ప్లాట్‌ఫారమ్ అవుతుందని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో కంప్యూటర్లను వాడుతున్న వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. విండోస్ ఎక్స్పీ, విండోస్ 7, విండోస్ 8 సీరిస్‌లోని వివిధ వెర్షన్లపై కొన్ని కోట్ల కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. అయితే విండోస్8 విషయంలో మైక్రోసాఫ్ట్ ప్రభ మందగించింది. ఇది యూజర్లను అంతగా ఆకట్టుకోలేకపోయింది. మైక్రోసాఫ్ట్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకొంటోంది. చాలా తక్కువమంది వినియోగదారులు మాత్రమే విండోస్ ఎయిట్‌కు అప్డేట్ అయ్యారని ఆ సంస్థ ధ్రువీకరించింది. అనేకమంది టెక్ పండితులు కూడా విండోస్ ఎయిట్‌ను ఒక అన్‌పాపులర్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో విండోస్ ఎయిట్ విషయంలో కూడా మైక్రోసాఫ్ట్ కూడా భారీ ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. కానీ పెద్దగా ప్రయోజనం కనపడినట్టు లేదు. కేవలం 20 శాతం సంస్థలు మాత్రమే విండోస్ 8కి మారాయని మైక్రోసాఫ్ట్ గణాంకాలు చెబుతున్నాయి. చాలామంది విండోస్ ఎయిట్‌ను ఇష్టపడలేదని.. టచ్ ఇన్పుట్ కోసం రూపొందించిన ఈ ఓఎస్‌ను వారు స్వీకరించలేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. పర్సనల్కంప్యూటర్లు, విండోస్ ఓఎస్‌పై పనిచేసే స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లకు విండోస్ 10 మంచి ఆపరేటింగ్ సిస్టమ్ అవుతుందని మైక్రోసాఫ్ట్ సంస్థ హామీ ఇస్తోంది. మరోవైపు ఈ విండోస్ 10 అనేది మైక్రోసాఫ్ట్‌కు అత్యంత కీలకమైనదని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మైక్రోసాఫ్ట్ తన సత్తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఒకవైపు స్మార్ట్ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్ విషయంలో ఆండ్రాయిడ్, ఐఓస్‌లు దూసుకుపోతున్నాయి. మెజారిటీ స్మార్ట్ఫోన్లు ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీదే పనిచేస్తున్నాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా స్మార్ట్ఫోన్లపై ఉనికిలో ఉన్నప్పటికీ అది మరీ ప్రభావాత్మకమైన స్థాయిలో అయితే లేదు. ఈ నేపథ్యంలో విండోస్ 10 ద్వారానైనా మైక్రోసాఫ్ట్ స్మార్ట్ఫోన్లపై తన ముద్రను వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి విండోస్ 10 ఎప్పుడు విడుదల అవుతుంది... ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయం గురించి మైక్రోసాఫ్ట్ స్పష్టమైన ప్రకటన చేయలేదు. 2015 వసంత రుతువు కళ్లా ఈ కొత్త ఓఎస్ అందుబాటులోకి వస్తుందని మాత్రం హామీ ఇస్తోంది. విండోస్ యూజర్లు అయితే ఎక్స్పీ, విండోస్ 7లతోనే కంఫర్ట్‌గా ఉన్నారు. అలాంటి వారిని మైక్రోసాఫ్ట్ విండోస్ 10తో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి! -
విండోస్ 9 కాదు.. 10 వచ్చేసింది!
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ యూజర్లను ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తింది. విండోస్ 9 వెర్షన్‌ను ప్రకటిస్తుందని అంతా ఎదురు చూస్తుంటే దాన్ని వదిలేసి ఏకంగా విండోస్ 10ను విడుదల చేసింది. ప్రజలకు ఏమాత్రం నచ్చని విండోస్ 8 స్థానంలో దాన్ని మరింత అప్‌గ్రేడ్ చేసేందుకు సెప్టెంబర్ 30వ తేదీన విండోస్ 9ను విడుదల చేస్తుందని అంతా ఎదురుచూస్తున్న తరుణంలో అనూహ్యంగా ఈ నిర్ణయం బయటకు వచ్చింది. టాబ్లెట్లు, ఫోన్లు, సాధారణ కంప్యూటర్లు.. అన్నింటికీ ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. విండోస్ 10 ఇప్పటివరకు తాము విడుదల చేసిన వాటిలో అత్యుత్తమం అవుతుందని మైక్రోసాఫ్ట్ హెడ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ టెర్రీ మయర్సన్ అన్నారు. రెండేళ్ల క్రితం విడుదలైన విండోస్ 8ను కేవలం 20 శాతం సంస్థలు మాత్రమే ఉపయోగిస్తున్నాయని సాంకేతిక అంశాల పరిశోధన సంస్థ ఫారెస్టర్ తెలిపింది. చాలామంది పీసీ యూజర్లు ఈ ఇంటర్ఫేస్ను ఏమాత్రం ఇష్టపడలేదు. ఇంతకాలం ఉన్న స్టార్ట్ బటన్ పాపప్ మెనూ లేకపోవడం వాళ్లకు లోటుగా కనిపించింది. ఎక్స్‌బాక్స్ నుంచి పీసీ వరకు, ఫోన్ల నుంచి టాబ్లెట్ల వరకు, చిన్న చిన్న గాడ్జెట్లకు కూడా విండోస్ 10 సరిగ్గా సరిపోతుందని మయర్సన్ అంటున్నారు. యాపిల్ సంస్థ ఐఫోన్, ఐప్యాడ్లను విడుదల చేయడం, మరోవైపు గూగుల్ ఆండ్రాయిడ్ ఉత్పత్తులను విడుదల చేయడంతో విండోస్ పెద్దగా ఆదరణ పొందకపోవడం మైక్రోసాఫ్ట్‌ను కలవరపరుస్తోంది. దానికితోడు ఎక్స్పీ తర్వాత వచ్చిన ఉత్పత్తులేవీ పెద్దగా జనంలోకి వెళ్లలేదు. పదేళ్ల క్రితం పర్సనల్ కంప్యూటర్ల రంగంలో రారాజుగా ఉన్న విండోస్.. ఇప్పుడు కేవలం 14 శాతానికి మాత్రమే పరిమితమైందని గార్ట్నర్ సంస్థ తెలిపింది.