లావా తొలి ల్యాప్‌ట్యాప్..ధరెంతో తెలుసా?
లావా తొలి ల్యాప్‌ట్యాప్..ధరెంతో తెలుసా?
Published Thu, Jun 29 2017 11:22 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM
మొబైల్, టాబ్లెట్ల తయారీలో దేశీయంగా ఎంతో పేరు సంపాదించుకున్న లావా తన మొట్టమొదటి ల్యాప్‌ట్యాప్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మైక్రోసాఫ్ట్, ఇంటెల్ భాగస్వామ్యంతో తన తొలి ల్యాప్‌ట్యాప్ హీలియం 14ను రూపొందించింది. ఎంతో తేలికైనదిగా రూపొందించిన ఈ ల్యాప్‌ట్యాప్ ధర రూ.14,999గా కంపెనీ పేర్కొంది. హీలియం 14 ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపికచేసిన రిటైల్ స్టోర్లు, ఢిల్లీ ఎన్‌సీఆర్, కోయంబత్తూరు, హైదరాబాద్, బెంగళూరుల మల్టి-బ్రాండు అవుట్ లెట్లలో జూలై తొలివారం నుంచి విక్రయానికి తీసుకురానున్నట్టు కంపెనీ పేర్కొంది. లావా హీలియం 14 పేరు ప్రకారమే 14.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. విండోస్ 10 హోమ్ ఎడిషన్ దీనిలో ప్రీలోడెడ్‌గా వస్తోంది. ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్‌ను ఇది అందిస్తోంది.
2జీబీ ర్యామ్, 32జీబీ బిల్ట్-ఇన్ స్టోరేజ్‌తో వచ్చిన ఈ ల్యాపీలో ఎస్డీ కార్డు ద్వారా 128జీబీ వరకు విస్తరణ మెమరీకి అవకాశముంది. రోజంతా వాడుకోవడానికి వీలుగా 10,000ఎంఏహెచ్ బ్యాటరీని ఇది అందిస్తోంది. ఈ ల్యాపీ 1.4కేజీల బరువు కలిగిఉంది. సిల్వర్, పర్‌పుల్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది. డిజిటల్ ఇండియాలో భాగస్వాములుగా చేయడానికి సరసమైన ధరలో పర్సనల్ కంప్యూటింగ్ డివైజ్‌లను తమ పార్టనర్స్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ఇండియా కన్జ్యూమర్ అండ్ డివైజెస్ సేల్స్ దేశీయ జనరల్ మేనేజర్ ప్రియదర్శి మోహపాత్ర చెప్పారు. లావాతో కలిసి వీటిని రూపొందించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
Advertisement
Advertisement