ఐబాల్ కాంప్‌బుక్ మెరిట్ జీ 9
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల్లో ల్యాప్‌టాప్ లను అందించే ఐబాల్ సంస్థ తాజాగా మరో నూతన ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. కాంప్‌బుక్ మెరిట్ జీ9 పేరుతో విండోస్ 10 ల్యాప్‌టాప్‌ను తాజాగా విడుదల చేసింది. కేవలం రూ.13,999 ధరకే ఈ ల్యాప్‌టాప్ వినియోగదారులకు లభిస్తున్నది. 1.1కేజీల అతి తేలికపాటి బరువుతో తమ ల్యాప్‌టాప్‌లో సెల్‌రాన్ ఎన్3350 ప్రాసెసర్ , మల్టీ ఫంక్షనల్ టచ్ ప్యాడ్, ఆరు గంటల బ్యాటరీ లైఫ్ ప్రధాన ఫీచర్లుగా కంపెనీ చెబుతోంది. గత ఫిబ్రవరిలో తక్కువ ధరలో లాంచ్ చేసిన ప్రీమియో వి2.0 ధరకంటే కూడా చవకగా ధరలో దీన్ని దేశవ్యాప‍్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. మంచి ఫీచర్లు, బడ్జెట్ ధర, రీజనబుల్ మెమొరీతో చూడటానికి ఆకట్టుకునేలా దీన్ని రూపొందించింది.
ఐబాల్ కాంప్‌బుక్ మెరిట్ జీ9
11.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1366x768 పిక్సెల్స్ రిజల్యూషన్
2.4గిగాహెడ్జ్ ఇంటెల్ సెల్‌రాన్ ఎన్ 3350 ప్రాసెసర్
2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఎక్స్‌టర్నల్ ఎస్‌ఎస్‌డీ ద్వారా ఒక టీబీ దాకా దాకా కూడా విస్తరించుకునే అవకాశం కూడా కల్పించింది.
5000 ఎంఏహెచ్ లి-పాలిమర్ బ్యాటరీ
0.3 మెగాపిక్సెల్ వెబ్ కెమెరా
డ్యుయల్ బ్యాండ్ వైర్‌లెస్ ఏసీ3165, బ్లూటూత్ 4.0, మినీ హెచ్‌డీఎంఐ 4.1పోర్ట్, 2.0.+ 3.0 యూఎస్‌బీ పోర్ట్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఐబాల్ కాంప్‌బుక్ మెరిట్ జీ9 రోజువారీ కస్టమర్ల కంప్యూటింగ్ అవసరాలను తీర్చడంకోసం ప్రీమియం డిజైన్‌తో ఆల్-ఇన్-వన్ ల్యాప్‌ట్యాప్కు రూపకల్పన చేశామని ఐబాల్ డైరెక్టర్, సీఈఓ సందీప్ పరశాంపురియా ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment