iBall
-
రూ.14వేలకే ల్యాప్‌టాప్
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల్లో ల్యాప్‌టాప్ లను అందించే ఐబాల్ సంస్థ తాజాగా మరో నూతన ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. కాంప్బుక్ మెరిట్ జీ9 పేరుతో విండోస్ 10 ల్యాప్‌టాప్‌ను తాజాగా విడుదల చేసింది. కేవలం రూ.13,999 ధరకే ఈ ల్యాప్‌టాప్ వినియోగదారులకు లభిస్తున్నది. 1.1కేజీల అతి తేలికపాటి బరువుతో తమ ల్యాప్‌టాప్‌లో సెల్రాన్ ఎన్3350 ప్రాసెసర్ , మల్టీ ఫంక్షనల్ టచ్ ప్యాడ్, ఆరు గంటల బ్యాటరీ లైఫ్ ప్రధాన ఫీచర్లుగా కంపెనీ చెబుతోంది. గత ఫిబ్రవరిలో తక్కువ ధరలో లాంచ్ చేసిన ప్రీమియో వి2.0 ధరకంటే కూడా చవకగా ధరలో దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. మంచి ఫీచర్లు, బడ్జెట్ ధర, రీజనబుల్ మెమొరీతో చూడటానికి ఆకట్టుకునేలా దీన్ని రూపొందించింది. ఐబాల్ కాంప్బుక్ మెరిట్ జీ9 11.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1366x768 పిక్సెల్స్ రిజల్యూషన్ 2.4గిగాహెడ్జ్ ఇంటెల్ సెల్రాన్ ఎన్ 3350 ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీ ద్వారా ఒక టీబీ దాకా దాకా కూడా విస్తరించుకునే అవకాశం కూడా కల్పించింది. 5000 ఎంఏహెచ్ లి-పాలిమర్ బ్యాటరీ 0.3 మెగాపిక్సెల్ వెబ్ కెమెరా డ్యుయల్ బ్యాండ్ వైర్లెస్ ఏసీ3165, బ్లూటూత్ 4.0, మినీ హెచ్డీఎంఐ 4.1పోర్ట్, 2.0.+ 3.0 యూఎస్బీ పోర్ట్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఐబాల్ కాంప్బుక్ మెరిట్ జీ9 రోజువారీ కస్టమర్ల కంప్యూటింగ్ అవసరాలను తీర్చడంకోసం ప్రీమియం డిజైన్‌తో ఆల్-ఇన్-వన్ ల్యాప్ట్యాప్కు రూపకల్పన చేశామని ఐబాల్ డైరెక్టర్, సీఈఓ సందీప్ పరశాంపురియా ఒక ప్రకటనలో తెలిపారు. -
జియో సపోర్ట్‌తో ఐ-బాల్ కొత్త ట్యాబ్లెట్
ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ ఐ-బాల్ సరికొత్త ట్యాబ్ ను మార్కెట్ లో లాంచ్ చేసింది. రిలయన్స్ జియో సపోర్ట్ చేసే 4 జీ ట్యాబ్లెట్ ను 'స్లైడ్ క్యూ 27' పేరుతో విడుదల చేసింది. దీని ధరను రూ.12,799 గా కంపెనీ నిర్ణయించింది. ఈ టాబ్లెట్ లు ఇప్పటికే మార్కెట్ లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. స్లైడ్ క్యూ 27' ఫీచర్స్ 10.10 అంగుళాల డిస్ ప్లే 1.3గిగా హెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 800x1280పిక్సెల్స్ రిజల్యూషన్ 2ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5ఎంపి రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజ్ 32జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ 5500ఎంఏహెచ్ బ్యాటరీ -
రూ.9,999లకే ఐబాల్ ల్యాప్‌టాప్ ‘కాంప్ బుక్’
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ఐబాల్ తాజాగా ‘కాంప్బుక్’ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటెల్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి తదితర ప్రత్యేకతలున్న ఈ ల్యాప్‌టాప్ రెండు వేరియంట్లలో లభ్యంకానున్నది. 11.6 అంగుళాల స్క్రీన్ ఉన్న ‘కాంప్బుక్ ఎక్స్లాన్స్’ ల్యాప్‌టాప్ ధర రూ.9,999గా, 14 అంగుళాల స్క్రీన్ ఉన్న ‘కాంప్బుక్ ఎక్జెంపులర్’ ల్యాప్‌టాప్ ధర రూ.13,999గా ఉందని కంపెనీ పేర్కొంది. ‘కాంప్బుక్’ తయారీ కోసం టెక్నాలజీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, ఇంటెల్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపింది. కాగా కంపెనీ పోర్ట్‌ఫోలియో విస్తరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం తన ఆదాయంలో 30 శాతం వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
ఐబాల్ నుంచి కోబాల్ట్4
- ఫోన్‌తోపాటు 4 డిటాచబుల్ లె న్స్ - ధర రూ.8,499 ముంబై: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఐబాల్ తన కోబాల్ట్ సిరీస్‌లో ‘ఎంఎస్ఎల్ఆర్ కోబాల్ట్4’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.8,499. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టాకోర్ ప్రాసెసర్, 5 అంగుళాల హెచ్డీ తెర, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 ప్రాంతీయ భాషల సపోర్ట్, ఫ్లాష్‌తో కూడిన 8 ఎంపీ రియర్ కెమెరా, ఫ్లాష్ ఉన్న 3.2 ఫ్రంట్ కెమెరా, 8 జీబీ మెమరి, డ్యూయెల్ సిమ్, 3జీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా ఫిష్ఐ లెన్స్, మైక్రో లెన్స్ (10ఎక్స్ జూమ్) వైడ్ యాంగిల్ లెన్స్, 8ఎక్స్ జూమ్ లెన్స్ అనే నాలుగు డిటాచబుల్ లెన్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇవి ఫోన్‌తోపాటు వస్తాయి. వీటి వల్ల మంచి నాణ్యత గల ఫొటోలను తీసుకోవడం వీలవుతుంది. -
ట్యాబ్‌ల విక్రయంలో శామ్సంగ్ను దాటేసిన ఐబాల్
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు అత్యధిక ట్యాబ్‌లు విక్రయించిన సంస్థగా ఐబాల్ నిలిచిందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలి పింది. శామ్సంగ్ను తోసిరాజని, ఐబాల్ ఈ స్థానాన్ని సాధించిందని ఐడీసీ పేర్కొంది. డిసెంబర్ క్వార్టర్‌కు భారత్‌లో మొత్తం 9.6 లక్షల ట్యాబ్‌లు విక్రయమయ్యాయని పేర్కొంది. మొత్తం ట్యాబ్‌ల విక్రయాల్లో ఐబాల్ వాటా 15.6 శాతంగా ఉందని తెలిపింది.2013 క్యూ4లో ఐబాల్ మార్కెట్ వాటా 4.5% మాత్రమేనని వివరించింది. 2013, 3వ క్వార్టర్లో 22 శాతంగా ఉన్న శామ్సంగ్ వాటా 2014 క్యూ4లో 12.9 శాతానికి పడిపోయిందని తెలిపింది. 2014సెప్టెంబర్ క్వార్టర్‌కు భారత ట్యాబ్‌ల మార్కెట్లో శామ్సంగ్, మైక్రోమ్యాక్స్‌ల తర్వాత 3వ స్థానంలో ఐబాల్ ఉందని పేర్కొంది. తక్కువ ధరలకే ట్యాబ్‌లను అందించడం ఐబాల్‌కు లాభించిందంది. కాగా భారత ట్యా బ్ల మార్కెట్లో తమదే అగ్రస్థానమని శామ్సంగ్ ప్రతినిధి పేర్కొన్నారు. -
కొత్తసరుకు
ఐబాల్ ఆండీ ఫ్రిస్బీ... దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐబాల్ తాజాగా ఫ్రిస్బీ, స్టాలియన్ పేర్లతో రెండు స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్రిస్బీ రూ.5799, స్టాలియన్ రూ.6999లకు ఈకామర్స్ సైట్ల ద్వారా లభిస్తున్నాయి. ఫ్రిస్బీ ఫీచర్ల విషయానికొస్తే... ఇది లేటెస్ట్ ఓఎస్ కిట్‌క్యాట్‌తో నడుస్తుంది. నాలుగు అంగుళాల స్క్రీన్సైజున్న ఈ ఫోన్లో 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను వాడారు. ఒక జీబీ ర్యామ్, 4జీబీల ప్రధాన మెమరీ ఉన్నాయి. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 8 ఎంపీ, సెల్ఫీ కెమెరా రెజల్యూషన్ 0.3 ఎంపీ మాత్రమే. బ్యాటరీ సామర్థ్యం 1600 ఎంఏహెచ్ మాత్రమే. ఇక స్టాలియన్ ఫీచర్లను పరిశీలిస్తే... దీని స్క్రీన్ సైజు అయిదు అంగుళాలు కాగా, బ్యాటరీ సామర్థ్యం 1700 ఎంఏహెచ్. మిగిలిన ఫీచర్లన్నీ ఫ్రిస్బీతో సమానంగా ఉన్నాయి. రెండు ఫోన్లకూ త్రీజీ, ఎడ్జ్,జీపీఆర్ఎస్, వైఫై 802.11.బీ/జీ/ఎన్, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్లున్నాయి. జోల్లా సెయిల్ఫిష్... స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో సరికొత్త ఎంట్రీ ఈ జోలా సెయిల్ఫిష్ ఓఎస్. ఆండ్రాయిడ్, విండోస్, ఆపిల్ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల తరువాత ఫైర్ఫాక్స్ ఓఎస్ అందుబాటులోకి రాగా తాజాగా ఈ సరికొత్త ఓఎస్ సెయిల్ఫిష్ మార్కెట్లోకి వచ్చింది. మాజీ నోకియా ఉద్యోగులు కొందరు ఏర్పాటు చేసిన కంపెనీ ద్వారా విడుదలైన సరికొత్త స్మార్ట్‌ఫోన్ అనేక ఆసక్తికరమైన ఫీచర్లు కలిగి ఉంది. ఇటీవలే భారతీయ మార్కెట్లో విడుదలై ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ.16,499. సెయిల్ఫిష్ ఓఎస్ ప్రత్యేకత దాని యూజర్ ఇంటర్ఫేస్, మల్టీటాస్కింగ్ సామర్థ్యాల్లో ఉందని నిపుణులు అంటున్నారు. స్క్రీన్‌సైజు 4.5 అంగుళాలు కాగా, దీంట్లో 1.4 గిగాహెర్ట్జ్డ్యుయెల్కోర్ స్నాప్‌డ్రాగన్ ఫోన్‌ను ఉపయోగించారు. రామ్ ఒక జీబీ, ఇంటర్నల్ స్టోరేజీ 16 జీబీ. మైక్రోఎస్డీ కార్డు ద్వారా మెమరీని మరింత పెంచుకోవచ్చు. ప్రధాన కెమెరా 8 ఎంపీ రెజల్యూషన్‌తో, సెల్ఫీ కెమెరా 2ఎంపీ రెజల్యూషన్‌తో పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌లోని చాలావరకూ అప్లికేషన్లను సపోర్ట్ చేయడం మరో విశేషం. ఎస్ఎంఎస్, ఫేస్బుక్, వాట్సప్ వంటి అన్ని రకాల మెసేజింగ్‌లు ఒకేచోట ఉండటం మరో ఆసక్తికరమైన ఫీచర్. -
బటన్ నొక్కితే చాలు.. హెచ్చరిస్తుంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న ఐబాల్ తాజా గా ఎస్‌వోఎస్ బటన్ తో కూడిన స్మార్ట్‌ఫోన్ ‘ఆండీ ఉద్దాన్’ను ఆవిష్కరించింది. ఆపదలో ఉన్నవారు ఫోన్‌కు వెనుక వైపున్న ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కితే చాలు. అది వెంటనే పెద్దగా శబ్దం చేస్తూ చుట్టుపక్కల వారిని హెచ్చరిస్తుంది. అంతేగాక ముందుగా నిర్దేశించిన అయిదు నంబర్లకు ఫోన్ కాల్ వెళ్తుంది. అత్యవసర పరిస్థితిని తెలియజేస్తూ ఎస్ఎంఎస్ పంపిస్తుంది. జియోకోడ్స్ ఆధారంగా ప్రమాదంలో చిక్కుకున్నవారు ఎక్కడున్నారో ఎస్ఎంఎస్లో ఉంటుంది. ఫేస్బుక్ కు సైతం అప్డేట్ను పంపుతుంది. మహిళల కోసం దేశంలో తయారైన మొట్టమొదటి సేఫ్టీ స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ అంటోంది. ఇందులోని ‘ఐస్’ అప్లికేషన్లో బ్లడ్ గ్రూపు, వైద్య చరిత్ర, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన నంబర్లలను జోడించవచ్చు. ధర రూ.8,999. ఆన్‌డ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఓఎస్, 5 అంగుళాల క్యూహెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే ఉన్నాయి. 1.3 గిగాహెర్ట్జ్ప్రాసెసర్, 8 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 512 ఎంబీ ర్యామ్, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.